🌹. 15. ధర్మము - ధర్మాచరణమున మరణించిననూ తనకిష్టమే ననియు, అధర్మా చరణమున జీవించుట హేయమనియు నిష్కర్షగ గీతోపనిషత్తు బోధించుచున్నది. 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 33 - 37 📚
ఈ ప్రపంచమున నిరపాయముగ జీవించుటకు, నశింప కుండుటకు ధర్మ మొక్కటే పట్టుకొమ్మ. భారతీయ వాఙ్మయము సమస్తమునూ ధర్మాచరణనే బోధించును.
అథం చేత్త్వ మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతó స్వధర్మం కీర్తిం చ హిత్వా పాప మవాప్స్యసి || 33
అకీర్తిం చాపి భూతాని కథంయిష్యంతి తే-వ్యయామ్ |
సంభావితస్య చాకీర్తి ర్మరణా దతిరిచ్యతే || 34
భయాద్రణా దుపరతం మన్యంతే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||35
అవాచ్యవాదాంశ్చ బప˙న్ వదిష్యంతి తవాహితాః |
నిందంత స్తవ సామర్థ్యం తతో దుóఖతరం ను కిమ్ || 36
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మా దుత్తిషస కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయó || 37
గీతోపనిషత్తు కూడ ధర్మపరిపాలనముననే పరిపూర్ణముగ సమర్థించును. ఎవరి ధర్మము వారు పరిపాలించినపుడు సంఘము సుభిక్షమగును.
'కలి' ప్రభావమున ప్రతియొక్కరు స్వధర్మమును నిర్లక్ష్యము చేయుట జరుగుచున్నది. ఎవరు ఏ పనినైననూ చేయవచ్చునను అవగాహన కలిప్రభావమే.
కుక్క పని గాడిద చేయరాదు. గాడిద పని గుర్రము చేయరాదు. ఏనుగు పని ఎలుక చేయరాదు. ఆవు పని పిల్లి చేయరాదు - అని ఎవరునూ తెలుపనక్కరలేదు కదా!
అట్లే క్షత్రియుడు బ్రాహ్మణుని పని, బ్రాహ్మణుడు వైశ్యుల పని, వైశ్యులు క్షత్రియుల పని యిట్లు కలగాపులకముగా అందరునూ అన్ని పనులూ చేయుట ధర్మమును వెక్కిరించుటయే.
అర్జునుడు క్షత్రియుడగుట వలన ధర్మ రక్షణకై యుద్ధము చేయుట అతని కర్తవ్యము. వేదాంతివలె తత్త్వమును పలుకుట అసమంజసము. అతని తత్త్వము కూడ మిడిమిడి జ్ఞానమే.
తాను చేయవలసిన పని చేయుటకు అసళిలికర్యముగ నుండుట వలన మరియొక మార్గమును చూసుకొనువాడు, అపకీర్తి పాలగుటయేగాక, పాపమును పొంది నశింపగలడు.
ధర్మ ప్రవర్తనమున మరణించిననూ, జయించి బ్రతికిననూ అట్టి జీవుడు ముక్తుడై యుండును. అధర్మమును ఆచరించువాడు, ఆచరించుచూ జీవించువాడు శవము కన్నా హీనమని ధర్మము బోధించుచున్నది.
ధర్మాచరణమున మరణించిననూ తనకిష్టమే ననియు, అధర్మా చరణమున జీవించుట హేయమనియు నిష్కర్షగ గీతోపనిషత్తు బోధించుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
28 Aug 2020
No comments:
Post a Comment