శ్రీ శివ మహా పురాణము - 208
🌹 . శ్రీ శివ మహా పురాణము - 208 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
46. అధ్యాయము - 1
🌻. సంక్షేప సతీచరిత్రము - 1 🌻
అథ ప్రథమోధ్యాయః
శ్రీ గణేశాయ నమః | అథ సతీఖండో ద్వితీయః ప్రారభ్యతే ||
నారద ఉవాచ |
విధే సర్వం విజానాపి కృపయా శంకరస్య చ | త్వయాsద్భుతా హి కథితాః కథా మే శివయోశ్శుభాః || 1
త్వన్ముఖాంభోజ సంవృత్తాం శ్రుత్వా శివకథాం పరామ్ | అతృప్తో హి పునస్తాం వై శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో || 2
పూర్ణాంశశ్శంకరసై#్యవ యో రుద్రో వర్ణతః పురా | విధే త్వయా మహేశానః కైలాసనిలయో వశీ || 3
స యోగీ సర్వవిష్ణ్వాది సురసేవ్యస్సతాం గతిః | నిర్ద్వంద్వః క్రీడతి సదా నిర్వికారీ మహాప్రభుః || 4
శ్రీ గణేశునకు నమస్కరించి, రెండవది యగు సతీఖండము ఆరంభింపబడుచున్నది.
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్ ! శంకరుని కృపచే నీకు సర్వము దెలియును. నీవు నాకు అద్భుతములైన, శుభకములైన పార్వతీ పరమేశ్వరుల గాథలను చెప్పియుంటివి (1).
హే ప్రభో! నీ ముఖపద్మము నుండి వెలువడే శ్రేష్ఠమగు శివకథను వినినాను. కాని నాకు ఇంకనూ తృప్తి కలుగలేదు. మరల శివకథను వినగోరుచున్నాను (2).
హే బ్రహ్మన్! శంకరుని పూర్ణాంశావతారమగు రుద్రుని తమరు ఇదివరలో వర్ణించియుంటిరి. జితేంద్రియుడు, కైలాసవాసి, మహేశ్వరుడు (3),
యోగి, విష్ణ్వాది దేవతలచే సేవింపబడువాడు, సత్పురుషులకు శరణము, సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడు, వికారరహితుడు, మహా ప్రభువు అగు రుద్రుడు సర్వదా క్రీడించుచున్నాడు (4).
సోsభూత్పునర్గృహస్థశ్చ వివాహ్య పరమాం స్త్రియమ్ | హరి ప్రార్థనయా ప్రీత్యా మంగలాం స్వతపస్వినీమ్ || 5
ప్రథమం దక్ష పుత్రీ సా పశ్చాత్సా పర్వతాత్మజా | కథ మేక శరీరేణ ద్వయో రప్యాత్మజా మతా || 6
కథం సతీ పార్వతీ సా పునశ్శివముపాగతా | ఏతత్సర్వం తథాన్యచ్చ బ్రహ్మన్ గదితుమర్హసి || 7
ఆయన విష్ణువు ప్రార్థననంగీకరించి, తన గురించి, తపస్సు చేసిన పతివ్రతారత్నమగు సర్వమంగళను ప్రీతితో వివాహమాడి గృహస్థుడాయెను (5).
ఆమె ముందుగా దక్షుని కుమార్తె, తరువాత హిమవంతుని కుమార్తె. ఇది ఎట్లు పొసగును? ఒకే శరీరముతో ఇద్దరికీ కుమార్తె ఎట్లు కాగలదు? (6)
సతి పార్వతియై మరల శివుని పొందిన విధమెట్టిది? హె బ్రహ్మన్! నీవీ గాథను, ఇతర గాథలను పూర్తిగా చెప్పదగుదువు (7).
సూత ఉవాచ |
ఇతి తస్య వచశ్ర్శుత్వా సురర్షే శ్శంకరాత్మనః | ప్రసన్న మానసో భూత్వా బ్రహ్మా వచనమబ్రవీత్ || 8
బ్రహ్మోవాచ |
శృణుతాత మునిశ్రేష్ఠ కథయామి కథాం శుభామ్ | యాం శ్రుత్వా సఫలం జన్మ భవిష్యతి న సంశయః || 9
పురాహం స్వసుతాం దృష్ట్వా సంధ్యాహ్వాం తనయైస్సహ |అభవం వికృతస్తాత కామబాణ ప్రపీడితః || 10
ధర్మ స్మృతస్తదా రుద్రో మహాయోగీ పరః ప్రభుః | ధిక్కృత్య మాం సుతైస్తాత స్వస్థానం గతవానయమ్ || 11
యన్మాయా మోహితశ్చాహం వేదవక్తా చ మూఢధీః | తేనాకార్షం సహాకార్యం పరమేశేన శంభునా || 12
తదీర్ష్య యాహమకార్షం బహూ పాయాన్సుతైస్సహ | కర్తుం తన్మోహనం మూఢశ్శివమాయా విమోహితః || 13
బ్రహ్మ ఇట్లు పలికెను -
వత్సా! మహర్షీ! వినుము. శుభకరమగు కథను చెప్పెదను. ఈకథను విన్నవారి జన్మ సార్థకమగుననుటలో సందేహము లేదు (9).
వత్సా! పూర్వమునేను నాకుమారులతో గూడి యుండగా, నా కుమార్తె యగు సంధ్య కనబడెను. అపుడు నేను మన్మథ బాణములచే పీడితుడనై, వికారమును పొందితిని (10).
అపుడు ధర్మునిచే స్మరింపబడి, మహాయోగి, మహాప్రభువునగు రుద్రుడు కుమారులతో కూడిన నన్ను నిందించెను. వత్సా! ఆయన అట్లు నన్ను నిందించి తన ధామకు వెళ్లెను (11).
నేను వేదములను లోకములకందజేసిన వాడనే అయినా, శివుని మాయచే మోహితుడనై, మూర్ఖుడనైతిని. అందువలన పరమేశ్వరుడగు శంభుని విషయములో దోషము నాచరించితిని (12).
శివమాయచే మోహితుడనై మూర్ఖుడనైన నేను ఆయన యందలి ఈర్ష్యచే, కుమారులతో గూడి ఆయనను మోహింపజేయుటకు అనేక యత్నములను చేసితిని (13).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
28 Aug 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment