🌹. శివగీత - 45 / The Siva-Gita - 45 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
షష్ట మాధ్యాయము
🌻. విభూతి యోగము - 9 🌻
ఏవం మా యే ధ్యాయమానా భజన్తే
తేషాం శాంతి శ్సాశ్వతీ నేత రేషామ్,
యతో వాచో నివర్తంతే - అప్రాప్య మనసా సహా
అనందం బ్రహ్మ మాం జ్ఞాత్వా - న బిభేతి కుతశ్చన 51
శ్రుత్వేతి దేవా మాద్వాక్యం - కైవల్యం జ్ఞాన ముత్తమమ్
జపంతో మమ నామాని - జపధ్యాన పరాయణాః 52
సర్వేతే స్వస్వదే హంతే - మత్సాయుజ్యం గతాః పురా
త తోయే పరదృశ్యన్తే - పదార్ధా మద్వి భూతయః 53
మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్టితమ్,
మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వయ మస్మ్యహమ్ 54
అణో రణీయా సహమేవ తద్వ
న్మహా నహం విశ్వమహం విశుద్ధ
పురాతనో హం పురుషోహ విశుద్ధ
హిరణ్య యోహం శివరూపమస్మి 55
అపాణి పాదో హమచింత్య శక్తి:
పశ్యామ్య చక్షుశ్చ శ్రుణోమ్య కర్ణః
అహం విజానామి వివక్త రూపో
నచాస్తి నేత్తా మమ చిత్సదాహమ్ 56
వాజ్మాన సాగో చరుండనై యాన్మడ బ్రహ్మమగు నన్ను గుర్తించిన పండితుడు ఎందువలన భయపడడు.
ఇట్లు నా వాక్యములను విని కైవల్యజ్ఞానము నెరింగి యమరులు నాయొక్క నామములనే ధ్యానించుచు జపధ్యాన పరాయణాసక్తులై వారి వారి శరీరావ సానకాలమున ణా సాయుజ్యమునే బడసిరి. అందుచేత నే యే వస్తువు దృగ్గో చరమగు చున్నవో అవియన్నియు నాయంశములే.
సమస్తం నాలోనే బుట్టి, నాలోనే ఉండి, నాలోనే లయమగుచున్నవి. ఆ కారణమున నేనే అద్వితీయ బ్రహ్మనైతిని, సూక్ష్మ పదార్ధములలో సూక్ష్మ రూపుడనై మహాత్పదార్ధములో మహానీయుడనై, పురాణ పురుషుడనై నిత్యుండనై హిరణ్యకుండ నై శివరూపుడనై యున్నాను.
హస్త పాదములు లేకుండానే నిరవధిక శక్తి పరిపూర్ణుడనై నేత్ర రహితుడనయి సమస్తమును చూచుచు, కర్ణములు లెకుండానే సర్వమున్బు వింటూ నాకాశ స్వరూపుడనై చిత్స్వ రూపుడనై సమస్తమును తెలుసుకొందును. కాని ఇట్టి నన్ను గుర్తించు వారొక్కరును లేరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 45 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 06 :
🌻 Vibhooti Yoga - 9 🌻
The wise man who realizes me as the Satchidananda Brahman never fears anything.
In this way the gods listened to my words and realized the path towards Kaivalyam, and thereafter they remained devoted to me through Japa of my names, through meditation and at the end of their lifespan they got Sayujyam (merged) in me.
That's why whatever things are visible to your eyes all those are my forms only.
Everything takes birth in me, in me only everything survives and in me only everything gets dissolved; that's the reason why I am called as Advitiya Brahman (secondless supreme Brahman).
I remain in atomic form in micro elements, I remain in gross form in macro elements I am the Puranapurusha (primordial person), I am eternal, I am hiranmaya (of golden hue), I am Shiva.
I don't have hands and feet but still I can grasp anything, I do not have eyes but I see everything, devoid of ears I hear everything, I remain as the ether, I am of the form of consciousness (chit), and i am the knower of everything.
However there is no one who knows me in reality.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita
28 Aug 2020
No comments:
Post a Comment