🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 79 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 31
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻.అథ కుశాపామార్జన విధానమ్ - 4 🌻
తేన సత్యేన దుష్టాని శమమస్య ప్రజన్తువై | యథా విష్ణౌ స్మృతే సద్యః సంక్షయం యాన్తి పాతకాః. 42
సత్యేన తేన సకలం దుష్టమస్య ప్రశామ్యతు | యథా యజ్ఞేశ్వరో విష్ణుర్దేవేష్వపి హి గీయతే. 43
సత్యేన తేన సకలం యన్మయోక్తం తథాస్తు తత్ | శాన్తిరస్తు శివం చాస్తు దుష్టమస్య ప్రశామ్యతు. 44
వాసుదేవశరీరోత్థైః కుశైర్నిర్ణాశితం మయా | అపామార్జతు గోవిన్దో నరో నారాయణస్తథా. 45
తథాస్తు సర్వదుఃఖానాం ప్రళయో వచనాద్దరేః | అపామార్జనకం శస్తం సర్వరోగాదివారణమ్. 46
అహం హరిః కుశా విష్ణుర్హతా రోగా మయా తవ. 47
ఇత్యాగ్నేయే మహాపురాణ కుశాపామార్జనవర్ణనం నామ ఏకత్రింశో7ధ్యాయః.
''విష్ణువును స్మరింపగనే సర్వపాపములును వెంటనే తొలగిపోవును'' అను సత్యముయొక్క ప్రభావముచే వీని దుష్టరోగము లన్నియు శాంతించుగాక.
''యజ్ఞేశ్వరుడైన విష్ణువు దేవతలచే ప్రశంసించబడుచున్నాడు'' అనెడు సత్యముయొక్క ప్రభావముచే నా మాట సత్య మగుగాక. శాంతి కలుగుగాక. మంగల మగుగాక.
ఈతని దుష్టరోగములు నశించుగాక. భగవంతు డైన వాసుదేవుని శరీరమునుండి పుట్టిన కుశలచే నేను ఈతని రోగములను తొలగించితిని. నరనారాయణులు, గోవిందుడును వీనికి అపామార్జనము చేయుగాక.
శ్రీహరి వచనము ప్రకారము ఈతని సంపూర్ణదుఃఖములు శమించుగాక. సమప్తరోగాదులను నివారించుటకు అపామార్జనస్తోత్రము ప్రశస్త మైనది. నేను శ్రీహరిని. నేను నీ రోగములను నశింపచేసితిని.
అగ్నిమహాపురాణమునందలి కేశాపామార్జనస్తోత్రవర్ణన మను ముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం
28 Aug 2020
No comments:
Post a Comment