భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 95


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 95  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శంఖలిఖిత మహర్షులు - 1 🌻

బోధనలు/గ్రంధాలు: లఘు శంఖస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, శంఖలిఖితస్మృతి

🌻.. జ్ఞానం:

1. ప్రతీవ్యక్తి ఋషులలోని ఎవరోఒకరి గోత్రంలో ఉన్నవాడేకాబట్టి, ఋషుల చరిత్రలు మన అందరి తండ్రుల చరిత్రలు. వాళ్ళందరికీ మనం సేవచేయలేము. వాళ్ళ స్మరణచేసి వాళ్ళకు మనసులో నంస్కారము చేయటం కూడా వాళ్ళా ప్రసన్నతకు హేతువవుతుంది.

2. మరి ఈ ఋషులదృష్టి మనమీద ఎందుకు పడటంలేదని సందేహం. అది మనం కోరుతున్నామా? అని ప్రశ్న. ఆ ఋషులు లోకహితంకోసం సంకల్పంచేసి, అఖండమైన తపస్సుచేసి జీవన్ముక్తులయ్యారు, తపోలోకానికి వెళ్ళిపోయారు.

3. ఈ భరతవర్షంలో వాళ్ళ సంతానమైనటువంటి భారతీయులు వాళ్ళ బోధలు విని, ఆ ప్రకారంగా జీవించి తరించాలని వారి ఆకాంక్ష. అందుకు కాకపోతే మరెందుకు, ఎవరి కోసం ఈ స్మృతులువ్రాసారు? మనకోసమేకదా!

4. ఆ స్మృతులు ఉన్నాయో లేవో తెలియని స్థితిలో నేడు మనం ఉండి, వాళ్ళు ఎలాగ జీవించమని శాసనములు మనకు వ్రాసిపెట్టారో వాటిని విస్మరించి, అప్పుడప్పుడు వాళ్ళ పేర్లు మాత్రం వింటున్నాం. ఆ ఋషుల సంప్రదాయాన్ని విస్మరించడం అంటే(స్మృతిని విస్మరిస్తే) విష్ణువును విస్మరించినట్లే.

5. కాబట్టి ఋషులు లోకహితం కోసమనే ధర్మశాసనం చేసివెళ్ళారు. అంటే మనం ఈ లోకంలో సుఖంగా ఉండడానికీ, అలాగే ఇక్కడ ఏయే ధర్మాలను మనం పరిపాలిస్తే ఆముష్మికమైన ఉత్తమమార్గాలలో మనం ఉత్తరగతికి వెళతామో, ఆ మార్గాన్నీ చెప్పినవి వారి స్మృతులు. ఈ ఋషి గోత్రాలు, ఈ సంప్రదాయాలు లేకపోతే భారతీయత ఏమిటి? భారతీయ సంప్రదాయాలంటే కేవలం వర్ణధర్మమే కాదు.

6. సమస్తవర్ణాలకు, సమస్త ఆశ్రమాలకు ధర్మాలుచెప్పి మానవజాతి యావత్తు క్షేమాన్నీ కోరినవారు మహర్షులు. అట్టివాతి స్మృతిని మనం విస్మరిస్తే వాళ్ళ అనుగ్రహం మనకు ఎలా కలుగుతుంది?

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

28 Aug 2020

No comments:

Post a Comment