🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 84 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. అథ పవిత్రారోపణ విధానమ్ - 4 🌻
శోషణాద్యైర్దేహశుద్ధిం కుర్యాదేవ క్రమాత్తతః |
శుష్కం కలేవరం ధ్యాయేత్పాదాద్యం చ శిఖాన్తకమ్. 29
యం బీజేన వం బీజేన జ్వాలామాలాసమాయుతమ్ |
దేహం రమిత్యనేనైన బ్రహ్మరన్ధ్రాద్వినిర్గతమ్. 30
బిన్దుం ధ్యాత్వా చామృతస్య తేన భస్మ కలేవరమ్ |
సంస్థాపయేల్లమిత్యస్మాద్దేహం సంపాద్య దివ్యకమ్. 31
న్యాసం కృత్వా కరే దేహే మానసం యాగమాచరేత్ |
విష్ణుం సాఙ్గం హృది పద్మే మనసైః కుసుమాదిభిః. 32
మూలమన్త్రేణ దేవేశం ప్రార్థయేద్భుక్తి ముక్తిదమ్ |
స్వాగతం దేవదేవేశ సన్నిధౌ భవ కేశవ. 33
గృహాణ మానసీం పూజాం యథార్థం పరిభావితమ్ |
ఆధారశక్తః కూర్మోథ పూజ్యోనన్తో మహీ తతః. 34
మధ్యే7గ్న్యాదౌ చ ధర్మాద్యా అధర్మాద్యాశ్చ ముఖ్యగాః |
సత్త్వాదిమధ్యే పద్మ చ మాయావిద్యాఖ్యతత్త్వకే. 35
కాలతత్త్వం చ సూర్యాదిమణ్డలం పక్షిరాజకః |
మధ్యే తతశ్చ వాయవ్యాదీశాన్తా గురుపఙ్త్కికా. 36
పిమ్మట శోషణాదుల ద్వారా దేహశుద్ధి చేసుకొనవలెను. పాదమునంచి శిఖవరకును దేహము 'యం' అను వాయుబీజముచే ఎండుపోయినట్లు భావన చయవలెను. పిమ్మట 'రం' అను బీజము ద్వారా అగ్నిని ప్రకటించి సమస్తశరీరము అగ్నిజ్వాలలచే దగ్ధ మై భస్మ మైనట్లు భావన చేయవలెను.
పిమ్మట 'వం' బిందువును ఉచ్చరించుచు బ్రహ్మరంధ్రమునుండి అమృతబిందువు ఆవిర్భవించినట్లు భావన చేయవలెను. దాని నుండి ప్రవహించిన అమృతధారచే శరీరము నంతను ముంచెత్తివేయవలెను.
పిమ్మట 'లం' అను బీజమును ఉచ్చరించుచు ఆ భస్మమునుండి దివ్యదేహము ఆవిర్భివించి నట్లు భావన చేయవలెను. ఈ విధముగ దివ్యదేహభావన చేసి అంగన్యాసకరన్యాసములు చేయవలెను. పిమ్మట మానసయాగానుష్ఠానము చేయవలెను.
హృదయకమలముపై అంగదేవతాసహితు డగు మహావిష్ణువును నిలిపి, మానసిక వుష్పాద్యుపచారములు చేయుచు, మూలమంత్రము లుచ్చరించుచు పూజింపవలెను. ఆ భగవంతుడు భోగమోక్షముల నిచ్చువాడు. మానసిక పూజలను స్వీకరింపు మని భగవంతుని ఈ విధముగ ప్రార్థింపవలెను.
''దేవా! దేవాధిదేవా! కేశవా! నీకు స్వాగతము. నా సమీపమున సన్నిహితుడవై నేను అర్పించు మానసికపూజను కైకొనుము.'' పీఠము మధ్యభాగమునందు, యోగపీఠమును ధరించు ఆధారశక్తియైన కూర్మమును, అనంతుని, పృథివిని పూజింపవలెను.
ఆగ్నేయకోణము మొదలగు నాలుగు కోణములందును క్రమముగ ధర్మ-జ్ఞాన-వైరాగ్య-ఐశ్వర్యములను పూజింపవలెను. తూర్పమొదలగు ప్రధానదిక్కులందు అధర్మ-అజ్ఞాన-అవైరాగ్య-అనైశ్వర్యములను పూజింపవలెను.
పీఠమధ్యమునందు సత్త్వాదిగుణత్రయమును, కమలమును, మాయను, అవిద్యను, కాలతత్త్వమును, సూర్యాదిమండలములను, పక్షిరా జైన గరుత్మంతుని పూజింపవలెను. పీఠము వాయవ్యకోణమునుండి ఈశాన్యకోణము వరకు గురుపంక్తిని పూజింపవలెను.
గణః సరస్వతీ పూజ్య నారదో నలకూబరః |
గురుర్గురోః పాదుకా చ పరో గురుశ్చ పాదుకా. 37
పూర్వసిద్ధాః పరసిద్ధాః కేసరేషు చ శక్తయః |
లక్ష్మీః సరస్వతీ ప్రీతి కీర్తిః శాన్తిశ్చ కాన్తికా. 38
పుష్టిస్తుష్టిర్మ హేన్ద్రాద్యా మధ్యేచావాహితో హరిః |
ధృతిశ్రీరతికాన్త్యాద్యా మూలేన స్థాపితోచ్యుతః. 39
ఓం అభిముఖో భ##వేతి ప్రార్థ్య ప్రాచ్యాం సన్నిహితో భవః
విన్యస్యార్ఘ్యాదికం దత్వా గన్ధాద్యైర్మూలతో యజేత్. 40
ఓం భీషయ భీషయ హృచ్ఛిరస్త్రాసయ వై పునః |
మర్దయ మర్దయ శిఖా అగ్న్యాదౌ శస్త్రతో7స్త్రకమ్. 41
రక్ష రక్ష ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమస్తతః |
ఓం హ్రూం ఫట్ అస్త్రాయ నమో మూలబీజేన చాఙ్గకమ్. 42
పూర్వదక్షాప్యసౌమ్యేషు మూర్త్యావరణమర్చయేత్ |
గణములు, సరస్వతి, నారదుడు, నలకూబరుడు, గురువు, గురుపాదుక. పరమగురువు, ఆతని పాదుక-వీటి పూజయే గురుపంక్తిపూజ. పూర్వసిద్ధ-పరసిద్ధ శక్తులను కేసరములపై పూజింపవలెను.
లక్ష్మి, సరస్వతి, ప్రీతి, కీర్తి, శాంతి, కాంతి, పుష్టి-; తుష్టి-వీరు పూర్వసిద్ధశక్తులు, పూర్వాది దిక్కులలో క్రమముగ ఈ శక్తుల పూజ చేయవలెను. ఇంద్రాదిదిక్పాలకులను గూడ వారి వారి దిక్కులందు పూజింపవలెను. వీరందరి మధ్యయందు శ్రీహరి విరాజిల్లుచుండును.
ధృతి, శ్రీ రతి, కాంత్యాదులు పరసిద్ధశక్తులు. మూలమంత్రముచే అచ్యుతుని స్థాపింపవలెను. పూజాప్రారంభమున- ''ఓం అభిముఖో భవ'' పూర్వదిక్కున నా సమీపమున నుండు అని భగవంతుని ప్రార్థింపవలెను.
ఈ విధముగ ప్రార్థించి స్థాపించిన పిమ్మట అర్ఘ్యపాద్యాదులను సమర్పించి, గంధాద్యుపచారముల ద్వారా మూలమంత్రముతో అచ్యుతుని పూజింపవలెను.
''భీషయ భీషయ హృదయాయ నమః'' ''ఓం త్రాసయ త్రాసయ శిరసే నమః'' ''ఓం మర్దయ మర్దయ శిఖాయై నమః ''ఓం రక్ష రక్ష నేత్రత్రయాయ నమః '' ''ఓం ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమః'' ఓం హూం ఫట్ అస్త్రాయ నమః''
ఈ విధముగ ఆగ్నేయాదివిదిశలయందు క్రమముగా, మూలబీజములతో అంగముల పూజ చేయవలెను. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము ఈ దిక్కులందు మూర్త్యాత్మక ఆవరణముల పూజ చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం
02 Sep 2020
No comments:
Post a Comment