శివగీత - 50 / 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪-𝓖𝓲𝓽𝓪 - 50




🌹.  శివగీత - 50 / The Siva-Gita - 50  🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
ఏడవ అధ్యాయము

🌻. విశ్వరూప సందర్శన యోగము - 4 🌻

దేవ! ప్రపన్నార్తి హర! ప్రసీద
ప్రసీద విశ్వేశ్వర! విశవ్వంద్య !
ప్రసీద గంగాధర! చంద్ర మౌళే!
మాంత్రాహి సంసార భయా దనాథమ్ 22

త్వత్తో హాయ్ జాతం జగ దేత దీశ
త్వయ్యేవ భూతాని వసంతి నిత్యమ్
త్వయ్యేవ శంభో ! నిలయం ప్రయాంతి
భూమౌ యథా వృక్ష లతాద యోపి 23

బ్రహ్మేంద్ర రుద్రాశ్చ మరుద్గ ణాశ్చ
గంధర్వయాక్షా సురసిద్ధ సంఘా:,
గంగాది నద్యో వరుణాలయాశ్చ
వసంత శూలిం స్తవ వక్త్ర మధ్యే 24

త్వన్మాయయా కల్పిత మిందుమౌళే
త్వయ్యేవ దృశ్యత్వము పైతి విశ్వమ్
భ్రాంత్యా జనః పశ్యతి సర్వమేత
చ్చుక్తౌ యథా రూపయ మాహిం చ రజ్జౌ 25

ఓ ప్రభూ! ప్రసన్నార్తి హర! విశ్వేశ్వర ! విశ్వవింధ్య గంగాధర! చందరమౌళి! ప్రసన్నుడవు కమ్ము. అనాథుడనైన నన్ను సంసార భయమునుండి రక్షింపుము ఈశ్వరా!

భూమిపై వృక్షములు, లతలు, మొదలగునవి యుద్భవించి నశించునట్లు ఈ జగమంతయు నీ నుండే బుట్టినది. నీయందే నివసించుచున్నది. హే శివా! నీలోనే లయమగుచున్నది.

ఓయీ త్రిశూలధారీ! బ్రహ్మ, ఇంద్రుడు, మరుద్గణము, గంధర్వులు, యక్షులు, అసుర, సిద్ధ సమూహములును గంగా మున్నగు నదులును సమస్త సముద్రములు నీ యొక్క వదన మధ్యమందు నివసించుచున్నవి.

ఓ చంద్రశేఖరా! ఈ జగత్తు నీ మాయచేత సృష్టింపబడినది. నీ యందే దృశ్యత్వము బొంద నని జనుభ్రాంతితో ముత్యపుచిప్ప (కౌచిప్ప) లో రజతమును, త్రాటియందు సర్పమును చూచినట్లుగా చూచి భ్రాంతి చెందుచున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  The Siva-Gita - 50  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 07 :
🌻 Vishwaroopa Sandarshana Yoga - 4
🌻

O supreme God! O lord who takes away the sufferings when pleased (Prasannartihara)! O lord of the

universe (Vishweshwara)! O one who is worshiped by the world (Vishwavandhya)! O lord who holds

goddess Ganga on the head (Gangadhara)! O wearer of crescent moon (Chandramouli)! kindly be pleased with me. I'm like an orphan now, please protect me from the fear of Samsaara.

O Eswara! As like as trees take birth and die on earth; in the same way these entire universes took birth from you, reside in you and hey Shiva! they get dissolved in you alone! O holder of Trident (trishuladhari)! Brahma, Indra, and groups of Maruts, gandharvas, Yakshas, Demons, Siddhas; Ganga and other mighty river groups; seven great oceans; all reside inside your face.

O wearer of crescent moon! This entire universe is created by your Maya (illusion). it became visible also inside you only, but out of ignorance humans are getting illusioned by not realizing these facts.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

02 Sep 2020

No comments:

Post a Comment