2-September-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 477 / Bhagavad-Gita - 477🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 265🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 145🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 167🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 81 / Sri Lalita Sahasranamavali - Meaning - 81🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 84🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 54🌹
8) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 40 / Gajanan Maharaj Life History  - 40🌹
8) 🌹. శివగీత - 50 / The Shiva-Gita - 50🌹
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 32🌹
10) 🌹. సౌందర్య లహరి - 92 / Soundarya Lahari - 92 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 392 / Bhagavad-Gita - 392🌹

12) 🌹. శివ మహా పురాణము - 213🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 89 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 84 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 100 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 31🌹
17) శ్రీ విష్ణు సహస్ర నామములు - 2 / Sri Vishnu Sahasranama - 2 🌹 
18) 🌹. అద్భుత సృష్టి - 21 🌹
19) 🌹 Seeds Of Consciousness - 164🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 43🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 20 📚
22) 🌹 AGENTS OF THE FUTURE 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 477 / Bhagavad-Gita - 477 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 22 🌴*

22. పురుష: ప్రకృతిస్థో హి భుఙ్త్కే ప్రకృతిజాన్ గుణాన్ |
కారణం గుణసఙ్గో(స్య సదసద్యోనిజజన్మసు ||

🌷. తాత్పర్యం : 
భౌతికప్రకృతి యందు త్రిగుణముల ననుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతికప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ, అధమజన్మలను పొందుచుండును.

🌷. భాష్యము :
జీవుడు ఏ విధముగా ఒక దేహము నుండి వేరొక దేహమును పొందుననెడి విషయమును అవగాహనము చేసికొనుటకు ఈ శ్లోకము అత్యంత ముఖ్యమైనది. 

మనుజుడు వస్త్రములను మార్చిన చందమున జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు చేరునని ద్వితీయాధ్యాయమున వివరింపబడినది. ఇట్టి వస్త్రముల వంటి దేహముల మార్పునకు భౌతికస్థితితో అతని తాదాత్మ్యయే కారణము. 

అట్టి మిథ్యాభావనచే అతడు ప్రభావితుడై యుండునంతవరకు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పుచెందవలసియే యుండును. అనగా ప్రకృతిపై అధికారము చలాయించవలెననెడి అతని కోరికయే అతనిని అట్టి అవాంచిత పరిస్థితుల యందు నిలుపుచున్నది. 

కోరిక కారణముగనే అతడు కొన్నిమార్లు దేవతారూపమును, కొన్నిమార్లు మానవదేహమును, కొన్నిమార్లు జంతుదేహమును, కొన్నిమార్లు పక్షిదేహమును, కొన్నిమార్లు, కీటకదేహమును, కొన్నిమార్లు జలచరదేహమును, కొన్నిమార్లు సాధుజన్మను, కొన్నిమార్లు నల్లిదేహమును పొందుచుండును. ఇది అనంతముగా సాగుచున్నది. 

ఈ అన్ని స్థితుల యందును జీవుడు తనను తాను ప్రభువునని తలచుచుండును. కాని వాస్తవమునకు అతడు ప్రకృతి ప్రభావమునకు లోబడియే యుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 477 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 22 🌴*

22. puruṣaḥ prakṛti-stho hi
bhuṅkte prakṛti-jān guṇān
kāraṇaṁ guṇa-saṅgo ’sya
sad-asad-yoni-janmasu

🌷 Translation : 
The living entity in material nature thus follows the ways of life, enjoying the three modes of nature. This is due to his association with that material nature. Thus he meets with good and evil among various species.

🌹 Purport :
This verse is very important for an understanding of how the living entities transmigrate from one body to another. 

It is explained in the Second Chapter that the living entity is transmigrating from one body to another just as one changes dress. This change of dress is due to his attachment to material existence. 

As long as he is captivated by this false manifestation, he has to continue transmigrating from one body to another. Due to his desire to lord it over material nature, he is put into such undesirable circumstances. 

Under the influence of material desire, the entity is born sometimes as a demigod, sometimes as a man, sometimes as a beast, as a bird, as a worm, as an aquatic, as a saintly man, as a bug. 

This is going on. And in all cases the living entity thinks himself to be the master of his circumstances, yet he is under the influence of material nature.

How he is put into such different bodies is explained here. It is due to association with the different modes of nature. 

One has to rise, therefore, above the three material modes and become situated in the transcendental position. That is called Kṛṣṇa consciousness. 

Unless one is situated in Kṛṣṇa consciousness, his material consciousness will oblige him to transfer from one body to another because he has material desires since time immemorial. But he has to change that conception. 

That change can be effected only by hearing from authoritative sources. The best example is here: Arjuna is hearing the science of God from Kṛṣṇa. 

The living entity, if he submits to this hearing process, will lose his long-cherished desire to dominate material nature, and gradually and proportionately, as he reduces his long desire to dominate, he comes to enjoy spiritual happiness. 

In a Vedic mantra it is said that as he becomes learned in association with the Supreme Personality of Godhead, he proportionately relishes his eternal blissful life.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 265 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 32
*🌴 Description of Nava Nadhas 🌴*
*🌻 The story of Nava Nadhas - 1 🌻*

After touching the divine Sri Lotus feet of Sripada Srivallabha, I asked, ‘Maha Prabhu! I have heard that there are siddha yogis who have become famous as Nava Nadhas and all of them are partial manifestations of Sri Datta Prabhu, Sri Guru Charana may please let me know about them.‘ 

Hearing about Navanadhas, I felt that the nectarine looks of Srivallabha started flowing like a stream from Srivallabha’s eyes on to the external creation. He was pleased and said. ‘

My Dear! Matsyendra, Gorakshaka, Jaalandhara, Gahani, Adbhanga, Chouranga, Bharthari, Charpata, Naaganadha are Navanadhas. Merely remembering them will give auspicious results. 

Datta Prabhu’s grace will be there on those who remember Navanadhas. 

Few years before the start of Kali Yugam, Sri Krishna surrounded by Uddhava and other devotees and all yadavas, remembered Navanarayanas (now being called Navanadhas).  

Rushabha Chakravarthi had one hundred sons. Among them nine were born with ‘amsa’ of Narayana.  

They are (1) Kavi (2) Hari (3) Antharikshudu (4) Prabudhudu (5) Pippalayanudu (6) Avirhothrudu (7) Drumeeludu (8) Chamasudu and (9) Karabhajanudu.  

All of them are Siddapurushas who stay in the state of ‘Avadhoota’.  

On my order and in accordance with the promise made during the avathar of Krishna, they were born on this earth again as Navanadhas to establish dharma. Kavi was born as Matsyendra. As his disciple, ‘Hari’ was born with the name Gorakshak. Antariksha was born as ‘Jalandhara’.  

Prabuddha was born as his disciple with the name ‘Kaaneepha’. Pippalayana was born with the name Charpatanadha. Avirhothra was born with the name Nagesha Nadha.  

Drumeeludu was born as Bhartarinadha and Chamasa with the name Revananadha. Karabhaajana was born with the name Gahaninadha. In the beginning of creation, for some reason Brahmandeva ‘veeryam’ fell.  

Vyasa Maharshi had said in ‘Bhavishya Puranam’ that many Rishis would be born from that sperm in many places. There is one Vasuvu called Uparichara. He fell in love with Urvasi.  

His sperm got liquified and fell in Yamuna River. A fish drank it. From the fish, Matsyendranadha was born. When Siva burnt Manmadha with fire from His third eye, Manmadha’s atma remained in subtle form in that ‘Bhasma’ (ashes).  

When Bruhadradha was doing ‘yajna’, jaalandhara emerged from that yajna kundam. From the Brahma ‘veeryam’, which fell in Reva River (Narmada) Revana Siddha was born. 

 A part of Brahma Veeryam felt on the head of a snake. Thinking it to be an eatable, it ate it and became pregnant. Janamejaya was doing ‘sarpa yagam’. 

 Astheeka Maharshi protected that snake. She was Padmini, the daughter of Takshaka. She was hidden in a nitch in a Banyan tree. From her, Avirhotra was to be born.  

Thakshaka’s daughter left that egg in the Banyan tree only and went to her place. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 144 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. ప్రకృతి - జీవనము 🌻*

ప్రకృతిని గమనించుకొనుచు జీవితమును నడిపించినచో మార్పులను ఏ విధముగా అర్థము చేసికొనవలెనో తెలియును. 

ఆకలి పుట్టినపుడు అన్నము తినవలెనని తెలియును. వెంటనే అన్నము తిన్నచో కర్తవ్య నిర్వహణము అనబడును. 

లేక వేదాంతమో వాణిజ్యమో అంతకన్నా ముఖ్యమని ఆలస్యము చేసినచో, మనము ఏర్పరచుకొనిన‌ కార్యక్రమము కర్తవ్యము‌ కాకపోవును. 

మన ఇష్టము, అభిమానము వేరు. మనతో పనిచేయుచున్న‌ ప్రకృతి వేరు. ప్రకృతిలో పొరపాటుండదు. ఇష్టాఇష్టములలో పొరపాట్లుండును. వేదాంతము‌ ఎంత గొప్పదియైనను, ఆహారమునకు‌గల వేళలు అంతకన్నా గొప్పవి కాకపోవచ్చును గాని అంతకన్నా సత్యములు. 

అయితే ఒకమారు సర్వాంతర్యామి స్మరణము కలిగించు కథలను ఆత్మతో గ్రోలుటకు అలవాటు పడినవాడు లోకవృత్తాంతములైన ఇతర కథలను గ్రోలుటకు యత్నము చేయడు. అవి వానికి గరళము గ్రోలుట వలె నుండును.
........✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 165 🌹*
*🌴 The Bridge - 1 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻. Student and Teacher - 1 🌻*

There is a saying that you can lead a horse to a drinking trough, but you cannot force it to drink water. The horse only drinks when it is thirsty. It is the same with people who seek wisdom. 

Some are particularly thirsty, others are just curious and inquisitive, but not so thirsty that they would jump into the pool of wisdom.

Among many students there are only a few who are thirsty enough to penetrate into deeper wisdom through their sincere practice of the teachings. 

They are full of fiery aspiration and ready to work with the teachings in their lives and to transform themselves. 

This creates a true relationship between them and the teacher. During their prayers, meditations and sleep they receive much more information and teaching from the teacher. 

The teacher can supply them greater energy for they are fit to receive the energies. 

For the other students, such a supply of energy is neither permitted nor is it possible.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Uranus. Notes from seminars. Master Dr. E. Krishnamacharya: Spiritual Astrology.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 81 / Sri Lalita Sahasranamavali - Meaning - 81 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్లోకం 155*

*బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా* 
*ప్రసవిత్రీ ప్రచండాఙ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి:*  

820. బ్రహ్మాణీ : 
సరస్వతీ దేవి (బ్రహ్మదేవుని భార్య) 

821. బ్రహ్మజననీ :
 బ్రహ్మడేవుడిని సృస్టించినది 

822. బహురూపా : 
సమస్త రూపములు తానై ఉన్నది 

823. బుధార్చితా : 
ఙ్ఞానులచే పూజింపబదునది 

824. ప్రసవిత్రీ : 
జగజ్జనని 

825. ప్రచండాఙ్ఞా : 
తీవ్రమైన ఆఙ్ఞ కలది 

826. ప్రతిష్టా : 
కీర్తియే రూపముగా కలిగినది 

827. ప్రకటాకృతి: :
 బహిరంగమైన ఆకారము కలిగినది  

*🌻. శ్లోకం 156*

*ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ*
*విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూ:*  

828. ప్రాణేశ్వరీ :
 ప్రాణములకు అధీశ్వరి 

829. ప్రాణదాత్రీ : 
ప్రాణములు ఇచ్చునది 

830. పంచాశత్పీఠరూపిణీ :
 శక్తిపీఠముల రూపమున వెలసినది 

831. విశృంఖలా : 
యధేచ్ఛగా ఉండునది 

832. వివిక్తస్థా :
 ఏకాంతముగా ఉండునది 

833. వీరమాతా : 
వీరులకు తల్లి 

834. వియత్ప్రసూ: :
 ఆకాశమును సృష్టించినది  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 81 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 81 🌻*

820 ) Sathee -   
She who is Sathee the daughter of Daksha

821 ) Brahmani -   
She who is the strength behind creator

822 ) Brahmaa -   
She who is the creator

823 ) Janani -   
She who is the mother

824 ) Bahu roopa -   
She who has several forms

825 ) Budharchitha -   
She who is being worshipped by the enlightened

826 ) Prasavithri -   
She who has given birth to everything

827 ) Prachanda -   
She who is very angry

828 ) Aagna -   
She who is the order

829 ) Prathishta -   
She who has been installed

830 ) Prakata Krithi -   
She who is clearly visible

831 ) Praneshwari -   
She who is goddess to the soul

832 ) Prana Dhatri -   
She who gives the soul

833 ) Panchast peeta roopini -   
She who is in fifty Shakthi peethas like Kama ropa, Varanasi. Ujjain etc

834 ) Vishungala -   
She who is not chained.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 84 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
చతుర్ధాధ్యాయం - సూత్రము - 51, 52

*🌻 51. అనిర్వచనీయం ప్రేమ స్వరూపమ్‌ | 🌻* 
 
భగవత్రేమ స్వరూపం ఇట్టిదని నిర్వచించడానికి వీలు కాదు. అది హృదయపూర్వకం, అవాజ్నానస గోచరం. బుద్దికి అతీతం. 
 
గత అధ్యాయాలలో వివరించినది బాహ్య భక్తి లేక గొణభక్తి. అది క్రమంగా సాధన దశలలో పెంపొందించుకునేదిగా చెప్పబడింది. 

పరాకాష్టగా ముఖ్యభక్తి కలుగగా భక్తుడు తన ముఖ్యభక్తిలోగాని, పరాభక్తిలో గాని తన భక్తి అనుభవాన్ని ఇల్టది అని వివరించలేడు. అది అతడి ఆంతరంగిక అనుభవం మాత్రమె. 

ఈ ముఖ్యభక్తి లేక పరాభక్తిని అతడి బాహ్య నడవడికను బల్బ ఇతరులు అంచనా వేస్తే అది తప్పవుతుంది. అనిర్వచనీయమైన భగవత్రైేమానుభవాన్ని భక్తుడు కూడా 
చెప్పలేడు. 
 
🌻 52 మూకాస్వాదనవత్‌ ॥ 🌻 
 
పదార్ధ రుచిని చూచిన మూగవాడు ఆ రుచిని మాటలలో చెప్పలేడు. అలాగే తన ముఖ్యభక్తి లక్షణాన్ని అనగా భక్తుడి ఆంతరిక అనుభవాన్ని అతడు కూడా మాటలలో చెప్పలెదు.

 భగవత్రేమ ఎప్పుడు హృదయాంత రాళంలో స్థిరపడుతుందో అప్పుడు ఆ భక్తుడికి అవగతమౌతుంది. అట్టి ఇతర భక్తుడు కూడా తెలుసుకోగలడు. కాని వారు మాటలలో చెప్పలేరు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 53 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj

Sloka: 
Durlabham trisu lokesu tacchrnu pravada myaham Gurum brahma vina nanyat satyam satyam varanane 

Siva says to Parvati to hear Him say the secret that no one in the three worlds knows.   

Guru is verily Parabrahman and there is nothing else besides this. This is an absolute truth. Here, the three worlds also indicate Brahma loka, Vaikuntha and Kailasa. 

 Let’s talk about the story of Matsya Narayana, who is Parabrahman, and a Guru to the Gurus. Eons ago, there used to be a king called Vaivasvata who ruled the earth. During his reign, there was a great deluge.  

Once, when the king was offering his prayers by the river, Sri Hari appeared in the form of a little fish and slipped into the water that the king had cupped in his hands. Let’s talk about the ways of the divine. The fish implored the king to save its life. The king kept the fish in his sacred water pot.

 Soon, the little fish grew too large for the pot, so the king moved the fish to a little pond. The fish quickly outgrew the pond and asked the king to take it to another place. The king moved the fish to a big lake. The fish soon grew too big for the lake as well. 

 Vaivasvata then released the fish in to the ocean. He realized that the fish was none other than Sri Hari and prayed to the Lord. Vaivasvata was also called Satyavrata (for his adherence to truth). 

At the time of the deluge, Vaivasvata welcomed the Lord in the form of a Guru and diligently followed his commands. By the grace of Matsya Narayana (Lord Sri Hari in the form of a Sankhya Yoga and the Puranas as blessings.  

He realized the absolute truth that Guru is Parabrahman and there is nothing else. He beautifully praised the Lord who appeared to him as a Guru.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 50 / The Siva-Gita - 50 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ఏడవ అధ్యాయము
*🌻. విశ్వరూప సందర్శన యోగము - 4 🌻*

దేవ! ప్రపన్నార్తి హర! ప్రసీద
ప్రసీద విశ్వేశ్వర! విశవ్వంద్య !
ప్రసీద గంగాధర! చంద్ర మౌళే!

మాంత్రాహి సంసార భయా దనాథమ్ 22
త్వత్తో హాయ్ జాతం జగ దేత దీశ
త్వయ్యేవ భూతాని వసంతి నిత్యమ్
త్వయ్యేవ శంభో ! నిలయం ప్రయాంతి
భూమౌ యథా వృక్ష లతాద యోపి 23
బ్రహ్మేంద్ర రుద్రాశ్చ మరుద్గ ణాశ్చ
గంధర్వయాక్షా సురసిద్ధ సంఘా:,
గంగాది నద్యో వరుణాలయాశ్చ
వసంత శూలిం స్తవ వక్త్ర మధ్యే 24
త్వన్మాయయా కల్పిత మిందుమౌళే
త్వయ్యేవ దృశ్యత్వము పైతి విశ్వమ్
భ్రాంత్యా జనః పశ్యతి సర్వమేత
చ్చుక్తౌ యథా రూపయ మాహిం చ రజ్జౌ 25

ఓ ప్రభూ! ప్రసన్నార్తి హర! విశ్వేశ్వర ! విశ్వవింధ్య గంగాధర! చందరమౌళి! ప్రసన్నుడవు కమ్ము. అనాథుడనైన నన్ను సంసార భయమునుండి రక్షింపుము ఈశ్వరా! 

భూమిపై వృక్షములు, లతలు, మొదలగునవి యుద్భవించి నశించునట్లు ఈ జగమంతయు నీ నుండే బుట్టినది. నీయందే నివసించుచున్నది. హే శివా! నీలోనే లయమగుచున్నది.

 ఓయీ త్రిశూలధారీ! బ్రహ్మ, ఇంద్రుడు, మరుద్గణము, గంధర్వులు, యక్షులు, అసుర, సిద్ధ సమూహములును గంగా మున్నగు నదులును సమస్త సముద్రములు నీ యొక్క వదన మధ్యమందు నివసించుచున్నవి.  

ఓ చంద్రశేఖరా! ఈ జగత్తు నీ మాయచేత సృష్టింపబడినది. నీ యందే దృశ్యత్వము బొంద నని జనుభ్రాంతితో ముత్యపుచిప్ప (కౌచిప్ప) లో రజతమును, త్రాటియందు సర్పమును చూచినట్లుగా చూచి భ్రాంతి చెందుచున్నారు.   

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 50 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 07 :
*🌻 Vishwaroopa Sandarshana Yoga - 4 🌻*

O supreme God! O lord who takes away the sufferings when pleased (Prasannartihara)! O lord of the
universe (Vishweshwara)! O one who is worshiped by the world (Vishwavandhya)! O lord who holds
goddess Ganga on the head (Gangadhara)! O wearer of crescent moon (Chandramouli)! kindly be pleased with me. I'm like an orphan now, please protect me from the fear of Samsaara. 

O Eswara! As like as trees take birth and die on earth; in the same way these entire universes took birth from you, reside in you and hey Shiva! they get dissolved in you alone! O holder of Trident (trishuladhari)! Brahma, Indra, and groups of Maruts, gandharvas, Yakshas, Demons, Siddhas; Ganga and other mighty river groups; seven great oceans; all reside inside your face. 

O wearer of crescent moon! This entire universe is created by your Maya (illusion). it became visible also inside you only, but out of ignorance humans are getting illusioned by not realizing these facts.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 41 / Sri Gajanan Maharaj Life History - 41 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 8వ అధ్యాయము - 6 🌻*

కాని భాస్కరు అది లక్ష్య పెట్టకుండా ఈడ్చి అతనిని శ్రీమహారాజు దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు నైనందహతి పావకహః అని నిరూపించు అని శ్రీమహారాజు అన్నారు. దానికి బ్రహ్మగిరి భయపడి, నిజం చెప్పాలంటే, మంచి తిండికోసమే నేను ఆస్తికుడను అయ్యాను, కనుక నన్ను క్షమించు. 

నేను నిష్ఫలితంగా గీతను నేర్చుకుందుకు ప్రయత్నంచేస్తూ మిమ్మల్ని పిచ్చివాడని అన్నాను, కాని దీని కంతటకి నేను చింతిస్తూ మీకు లొంగిపోతున్నాను, దయచేసి క్షమించండి అని అన్నాడు. షేగాం ప్రజలు, ఆయనను ఆవిధంగా మంటలలో కాలిపోతారేమో అని భయపడి కాలుతున్న మంచంమీద నుండి దిగిరమ్మని అర్ధించారు. 

బ్రహ్మగిరి సిగ్గుతో తలవంచుకుని ఏమీ అనలేదు. ప్రజల మాటలు గౌరవిస్తూ శ్రీమహారాజు మంచం దిగి వస్తారు. వెంటనే ఆమండుతున్న మంచం కుప్పకూలిపోతోంది. మొత్తం మంచం అంతా కాలిపోయింది. కాని కొద్ది భాగం అయినా, మిగిలిన ప్రజలకు చూపించ వచ్చునని, నీళ్ళుపోసి ఆమంటలను ఆపుతారు. 

బ్రహ్మగిరి మొత్తం తన గర్వం వదలి శ్రీమహరాజు ముందు వంగి నమస్కరిస్తాడు. గంగనీళ్ళని తాకిన తరువాత పాపాలు మిగలడం అనేది జరగదు. తరువాత శ్రీమహారాజు అర్ధరాత్రి, ఈ కపటి తనం అంతా వదులు, ఆస్తికుడనేవాడు ఈ ప్రాపంచిక సుఖాలను పూర్తిగా త్యజించాలి. 

స్వయంగా బ్రహ్మజ్ఞానం పొందితేగాని ఇతరులకు భోధించరాదు. మాటల నిజమయిన అర్ధాన్ని తెలుసుకొని, పాటించకుండా, ఒత్తిగా మాటలు తెలుసుకోవడం వ్యర్ధం. మన సంస్కృతి కాపాడడానికి మనం నేర్చుకుంటున్న విషయాల వెనుక గూడార్ధం తెలుసుకోవడం అవసరం. మచ్ఛింద్ర, జలంధర్, ఘోరక్, గహిణినాధ్ మరియు జ్ఞాణేశ్వర్ వంటి యోగులు గొప్ప అధికారం కలిగినవారు. 

శ్రీశంకరాచార్య ఆత్మసిద్ధి పొందిన ఒక యోగి. సంసారిక జీవనం గడిపిన ఏకనాధ్ కూడా బ్రహ్మజ్ఞానం పొందారు. స్వామిసమర్ధ బ్రహ్మచారి కూడా ఆత్మసిద్ధి పొందారు. ఈగొప్ప యోగులను నీవు గుర్తు చేసుకుంటూ ఉండి, పనికిరాని, ఫలితంలేని ఈ పూరీలు షీరా కోసం తిరగడం మానాలి అని శ్రీమహారాజు అన్నారు. 

శాంతంగా ఇవి విన్న బ్రహ్మగిరి, నిజంగా ఈ ప్రాపంచిక అవసరాలు త్యజించాలి అని అనుకున్నాడు. మరి ఎవరిని కలవకుండా మరుసటి రోజు ఉదయాన్నే తన శిష్యులతో ఆచోటు వదిలి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఈ ప్రకరణ విన్న ప్రజలు ఆకాలిన మంచం చూసేందుకు తోటకు వచ్చారు. అందరిని ఈ ప్రాపంచిక బంధనాలనుండి ఈ గజానన్ విజయ గ్రంధం ముక్తులను చెయ్యాలని దాసగణు కోరిక. హరి మరియు హరకి నమస్కారములు. పవిత్రత అందరిలో రాగాక 
 శుభం భవతు 

8. అధ్యాయము సంపూర్ణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 41 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 8 - part 6 🌻*

When Bhaskar caught hold of Brahmagiri to take him to Maharaj, Brahmagiri started praying to Bhaskar to let him go by saying, Please do not take me to the burning cot. I accept that I failed to appreciate the authority and greatness of Shri Gajanan Maharaj. 

But Bhaskar, not paying any heed to Brahmagiri’s requests, dragged and brought him before Shri Gajanan Maharaj. Shri Gajanan Maharaj said Now prove that ‘Nainam Dahti Pawak’! 

At this, Brahmagiri got frightened and said, To tell Yout the truth, I became an ascetic to enjoy good food only, so excuse me. I fruitlessly tried to learn the Geeta and called you mad, but now I regret all this and surrender before you. 

Please forgive me. People of Shegaon begged Shri Gajanan Maharaj to leave the burning cot for their sake, as they were afraid to see Him engulfed in flames. Brahmagiri hung his head in shame and said nothing. 

Shri Gajanan Maharaj got down from the cot to respect the public sentiments and immediately thereafter the burning cot collapsed. Practically all of the cot was burnt, but people poured water and extinguished it, thereby salvaging a portion of it as evidence to demonstrate Maharaj’s greatness to other people. 

After this incidence, Brahmagiri shed away his entire ego and prostrated before Shri Gajanan Maharaj . The objects that Ganga water touches cannot remain impure. Then at midnight Shri Gajanan Maharaj advised Brahmagiri and said Leave all your hypocrisy; an ascetic has to denounce all worldly attachments. 

Without self-realization one should not preach anything to others. Learning of words without understanding or practicing the spirit behind is useless. To save our culture from destruction it is necessary to understand the spirit behind the things we learn. Saints like Macchindra, Jalander, Gorakh Gahaninath and Dnyaneshwar were of great authority. 

Shri Shankaracharya was a saint who had attained self-realization and Eknatha, though a man of family had attained Brahmapada. Swami Samarth Brahmachari too had attained selfrealization. 

You should remember all these great sages and stop wandering for Shira Puri, as it will be a useless and fruitless wandering.” Brahmagiri calmly listened to all this advice and felt real detachment for the material things. 

Early next morning he left the place along with his disciples without meeting anybody. Next day, when people heard of the happenings in the garden, they came to see the burnt cot. 

||SHUBHAM BHAVATU||

 Here ends Chapter Eight

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 32 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని శరీరి : నాల్గవ పాత్ర (రూపధారణము) - 4 🌻*

122. రూపము లేనిదే అనుభవము రాదు.

123. సమస్త అనుభవములకు సంస్కారములే కారణము.

124. భగవంతుడు రూపముతో తాదాత్మ్యత చెందుటకు సంస్కారములే కారణము.

125. రూపముల ద్వారా ప్రపంచానుభావమును పొందుచున్నది చైతన్యమే గాని ఆత్మకాదు.రూపముతో సహచరించి, ఆరూపమే తానని తాదాత్మ్యత చెందుచున్నది కూడా చైతన్యమే.

126. ఓం,బిందువు ద్వారా ఆవిర్భవించిన భగవంతుని అనంత దివ్య అంతశ్చైతన్యము (Gods Infinite and Divine sub consciousness) దివ్యస్వప్న(సృష్టి) స్థితిలో వేగము ప్రారంభమై పరిణామమందుచు ముందుకు సాగినది.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 92 Soundarya Lahari - 92 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

92 వ శ్లోకము

*🌴. రాజ్య లాభం పొందుటకు, పోయిన ఆస్తులు తిరిగి పొందుటకు 🌴*

శ్లో: 92. గతాస్తే మఞ్చత్వం ద్రుహిణహరి రుద్రేశ్వరభృతః
శివస్స్వచ్ఛచ్చాయా కపటఘటిత ప్రచ్ఛదపటః
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృజ్గారో రస ఇవ దృశాం దోగ్ధికుతుకమ్.ll

🌷. తాత్పర్యం : 
అమ్మా! దేవీ ! బ్రహ్మ విష్ణువురుద్ర ఈశ్వరులుఅను వేల్పులు నీకు మంచత్వమును పొంది యుండగా కప్పుకొను దుప్పటి లాగున ఉన్న సదాశివ తత్వము తెల్లని కాంతులు కలిగి నీకు ఆనందము కలుగ జేయుచున్నది .కదా!

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 4000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ, రకరకములైన అన్నము నివేదించినచో రాజ్య లాభము, రాజ్యమును పరిపాలన చేయగల సత్తా, పోయిన ఆస్తులు తిరిగి లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹Soundarya Lahari - 92 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 92

*🌴 Getting ability to Rule, Recovering lost property 🌴*

92. Gataas the mancathvam Druhina-Hari-Rudr'eshavara-bhrutah Sivah svacchac- chaya-ghatita-kapata-pracchada-pata; Tvadhiyanam bhasaam prati-phalana-rag'arunathaya Sariri srungaro rasa iva dhrisam dhogdhi kuthukam.
 
🌻 Translation : 
Brahma, Vishnu, Rudhra and Easwara, who are the gods who rule the world, become the four legs of your cot, so that they are able to serve you always Sada Shiva who is white in colour becomes the bed spread on which you sleep, and appears red, because he reflects your colour.and to your eyes which are the personification, of the feelings of love, he gives lot of happiness.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :  
If one chants this verse 4000 times a day for 30 days, offering variety rice as prasadam, it is believed that one will get opportunities to conquer kingdom and the ability to rule and Recovery of lost property

🌻 BENEFICIAL RESULTS: 
Recovery of lost property, getting large estates and vast knowledge.

🌻 Literal Results: 
Support and patronage in high circles. Easy and lucky life.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 392 / Bhagavad-Gita - 392 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 41 🌴

41. యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్చ త్వం మమ తేజోంశసంభవమ్ ||

🌷. తాత్పర్యం : 
సంపన్నములును, సుందరములును, వైభవోపేతములును అగు సమస్తసృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినదిగా తెలిసికొనుము.

🌷. భాష్యము : 
భౌతిక, ఆధ్యాత్మికజగముల యందలి ఎట్టి వైభవోపేతము లేదా సుందరసృష్టియైనను శ్రీకృష్ణుని విభూతి యొక్క అంశమాత్ర వ్యక్తీకరణమే యని సర్వులు ఎరుగవలెను. కనుక విశేషవైభవముతో కూడినదేడైనను శ్రీకృష్ణుని విభూతికి ప్రాతినిధ్యముగా భావింపవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 392 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 41 🌴

41. yad yad vibhūtimat sattvaṁ
śrīmad ūrjitam eva vā
tat tad evāvagaccha tvaṁ
mama tejo-’ṁśa-sambhavam

🌷 Translation : 
Know that all opulent, beautiful and glorious creations spring from but a spark of My splendor.

🌹 Purport :
Any glorious or beautiful existence should be understood to be but a fragmental manifestation of Kṛṣṇa’s opulence, whether it be in the spiritual or material world. Anything extraordinarily opulent should be considered to represent Kṛṣṇa’s opulence.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 213 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
47. అధ్యాయము - 2

*🌻. కామప్రాదుర్భావము - 2 🌻*

పురా యదా శివో దేవో నిర్గుణో నిర్వికల్పకః | అరూపశ్శక్తిరహితశ్చిన్మాత్రస్సదసత్పరః || 12

అభవత్స గుణస్సోsపి ద్విరూపశ్శక్తిమాన్‌ ప్రభుః | సోమో దివ్యాకృతిర్విప్ర నిర్వికారీ పరాత్పరః || 13

తస్య వామాంగజో విష్ణుర్బ్రహ్మాం దక్షిణాంగజః | రుద్రో హృదయతో జాతోsభవచ్చు మునిసత్తమ || 14

సృష్టి కర్తాsభవం బ్రహ్మా విష్ణుః పాలనకారకః | లయకర్తా స్వయం రుద్రస్త్రిధా భూతస్సదాశివః || 15

శివదేవునకు రెండు రుపములు గలవు. ఒక రూపములో ఆయన నిర్గుణుడు, నిర్వికల్పుడు, రూపము లేని వాడు, శక్తి భేదము లేనివాడు, చైతన్యఘనుడు, మరియు కార్యకారణభావాతీతుడు (12).

ఆయనయే రెండవ రూపములో సగుణుడు, శక్తి భేదమము గలవాడు, జగత్ర్పభువు, ఉమాసహితుడు, దివ్యమగు ఆకారము గలవాడు. ఓ విప్రా! ఆయన వికారములు లేనివాడు, సర్వోత్కృష్టుడు (13). 

విష్ణువు ఆయన ఎడమ భాగము నుండి పుట్టెను. బ్రహ్మనగు నేను ఆయన కుడి భాగము నుండి పుట్టితిని. ఓ మునిశ్రేష్ఠా! రుద్రుడు హృదయము నుండి పుట్టెను (14). 

బ్రహ్మనగు నేను సృష్టిని చేసితిని. విష్ణువు పాలించుచున్నాడు. రుద్రుడు లయమును చేయును. సదాశివుడు ఈ త్రిమూర్తుల రూపములో స్వయముగా నున్నాడు (15).

తమేవాహం సమారాధ్య బ్రహ్మ లో కపితామహః | ప్రజాస్ససర్జ సర్వాస్తా స్సురాసుర నరాదికాః || 16

సృష్ట్వా ప్రజాపతీన్‌ దక్షప్రముఖాన్‌ సురసత్తమాన్‌ | అమన్యం సుప్రసన్నోsహం నిజం సర్వమహోన్నతమ్‌ || 17

మరీచిమత్రిం పులహం పులస్త్యాంగిరసౌ క్రతుమ్‌ | వసిష్ఠం నారదం దక్షం భృగుం చేతి మహాప్రభూన్‌ || 18

బ్రహ్మాహం మానసాన్‌ పుత్రానసర్జం చ యదా మునే | తదా మన్మనసో జాతా చారురూపా వరాంగనా || 19

లోకపితా మహుడు, బ్రహ్మ అగునేను ఆ సదాశివుని ఆరాధించి, దేవతలు, రాక్షసులు, మానవులు మొదలగు సంతతిని సృష్టించితిని (16). 

దక్షుడు మొదలగు దేవ శ్రేష్ఠులగు ప్రజా పతులను సృష్టించి, నేను చాల ప్రసన్నుడనై నన్ను నేను చాల గొప్ప వానినిగా తలపోసితిని (17). 

ఓ మహర్షీ! బ్రహ్మనగు నేను మరచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగిరసుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలగు గొప్ప సమర్థులైన (18) 

మానసపుత్రులను సృష్టించిన తరువాత నా మనస్సునుండి సుందరమగు రూపము, శ్రేష్ఠమగు అవయమములు గల ఒక యువతి జన్మించెను (19).

నామ్నా సంధ్యా దివః క్షాంతా సాయం సంధ్యా జవంతికా | అతీవ సుందరీ సుభ్రూర్ముని చేతో విమోహినీ || 20

న తాదృశీ దేవలోకే న మర్త్యే న రసాతలే | కాలత్రయేsపి వై నారీ సంపూర్ణ గుణశాలినీ || 21

దృష్ట్వా హం తాం సముత్థాయ చింతయన్‌ హృది హృద్గతమ్‌ | దక్షాదయశ్చ స్రష్టారో మరీచ్యా ద్యాశ్చ మత్సుతాః || 22

ఏవం చింతయతో మే హి బ్రహ్మణో మునిసత్తమ | మానసః పురుషో మంజురావిర్భూతో మహాద్భుతః || 23

ఆమె పేరు సంధ్య. ఆమె పగలు క్షీణించి యుండును. సాయంకాలము సుందరముగా ప్రకాశించును. ఆమె మిక్కిలి సుందరి. చక్కని కనుబొమలు గలది. మహర్షుల మనస్సులను వ్యామోహపెట్టునది (20). 

సంపూర్ణ గుణములతో విరాజిల్లే అట్టి సుందరి మూడు కాలముల యందు దేవలోక, మనుష్యలోక, పాతాళ లోకములయందు లేదు (21).

ఆమెను చూచి నేను లేచి నిలబడి, నా మనస్సులో నా కుమారులైన దక్షాది ప్రజాపతులను, మరీచి మొదలగు ఋషులను స్మరించుచుండగా (22), 

అట్టి నానుండి ఒక పురుషుడు ఉదయించెను. ఓమునిశ్రేష్ఠా! ఆతడు గొప్ప సౌందర్యము గలవాడై, మహాద్భుతముగా నుండెను (23).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 89 🌹*
Chapter 28
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 What A Miracle 🌻*

God has created the innumerable universes with his INFINITE UNCONSCIOUS￾NESS, and though he is eternally free with INFINITE CONSCIOUSNESS, he has bound himself with the responsibility of making each one free from the bondage of illusion. 

So God comes in human form age after age as the Avatar, who becomes everyone and everything.

 Is it not his miracle to let himself be bound so he can free others from bondage? Is it not his miracle that he becomes everyone and everything so he can work for one and all? 

What a miracle this is! He suffers infinitely as the Avatar to give a universal push to every level of consciousness. He suffers only in order to liberate others from the bondage of illusion.  

The Sun of the manifestation of Avatar Meher Baba has begun to rise, and when the Sun is shining overhead, every level of consciousness will be seen facing the Sun in worship. 

A universal push will be felt by every level of consciousness and a great awakening will be experienced by mankind. 

The gateway to the path of Truth will open and a new humanity will emerge with the rising of the Sun. There will be love instead of hatred, brotherhood instead of envy and greed, and peace instead of wars. 

This will allow Avatar Meher Baba, the Sun, to shine in the world. This will be Meher Baba's miracle and what a miracle! Every conscious being win sing his glory.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 84🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 4 🌻*

శోషణాద్యైర్దేహశుద్ధిం కుర్యాదేవ క్రమాత్తతః | శుష్కం కలేవరం ధ్యాయేత్పాదాద్యం చ శిఖాన్తకమ్‌. 29

యం బీజేన వం బీజేన జ్వాలామాలాసమాయుతమ్‌ | దేహం రమిత్యనేనైన బ్రహ్మరన్ధ్రాద్వినిర్గతమ్‌. 30

బిన్దుం ధ్యాత్వా చామృతస్య తేన భస్మ కలేవరమ్‌ | సంస్థాపయేల్లమిత్యస్మాద్దేహం సంపాద్య దివ్యకమ్‌. 31

న్యాసం కృత్వా కరే దేహే మానసం యాగమాచరేత్‌ |

విష్ణుం సాఙ్గం హృది పద్మే మనసైః కుసుమాదిభిః. 32

మూలమన్త్రేణ దేవేశం ప్రార్థయేద్భుక్తి ముక్తిదమ్‌ | స్వాగతం దేవదేవేశ సన్నిధౌ భవ కేశవ. 33

గృహాణ మానసీం పూజాం యథార్థం పరిభావితమ్‌ | ఆధారశక్తః కూర్మోథ పూజ్యోనన్తో మహీ తతః. 34

మధ్యే7గ్న్యాదౌ చ ధర్మాద్యా అధర్మాద్యాశ్చ ముఖ్యగాః |

సత్త్వాదిమధ్యే పద్మ చ మాయావిద్యాఖ్యతత్త్వకే. 35

కాలతత్త్వం చ సూర్యాదిమణ్డలం పక్షిరాజకః | మధ్యే తతశ్చ వాయవ్యాదీశాన్తా గురుపఙ్త్కికా. 36

పిమ్మట శోషణాదుల ద్వారా దేహశుద్ధి చేసుకొనవలెను. పాదమునంచి శిఖవరకును దేహము 'యం' అను వాయుబీజముచే ఎండుపోయినట్లు భావన చయవలెను. పిమ్మట 'రం' అను బీజము ద్వారా అగ్నిని ప్రకటించి సమస్తశరీరము అగ్నిజ్వాలలచే దగ్ధ మై భస్మ మైనట్లు భావన చేయవలెను. 

పిమ్మట 'వం' బిందువును ఉచ్చరించుచు బ్రహ్మరంధ్రమునుండి అమృతబిందువు ఆవిర్భవించినట్లు భావన చేయవలెను. దాని నుండి ప్రవహించిన అమృతధారచే శరీరము నంతను ముంచెత్తివేయవలెను.

 పిమ్మట 'లం' అను బీజమును ఉచ్చరించుచు ఆ భస్మమునుండి దివ్యదేహము ఆవిర్భివించి నట్లు భావన చేయవలెను. ఈ విధముగ దివ్యదేహభావన చేసి అంగన్యాసకరన్యాసములు చేయవలెను. పిమ్మట మానసయాగానుష్ఠానము చేయవలెను. 

హృదయకమలముపై అంగదేవతాసహితు డగు మహావిష్ణువును నిలిపి, మానసిక వుష్పాద్యుపచారములు చేయుచు, మూలమంత్రము లుచ్చరించుచు పూజింపవలెను. ఆ భగవంతుడు భోగమోక్షముల నిచ్చువాడు. మానసిక పూజలను స్వీకరింపు మని భగవంతుని ఈ విధముగ ప్రార్థింపవలెను. 

''దేవా! దేవాధిదేవా! కేశవా! నీకు స్వాగతము. నా సమీపమున సన్నిహితుడవై నేను అర్పించు మానసికపూజను కైకొనుము.'' పీఠము మధ్యభాగమునందు, యోగపీఠమును ధరించు ఆధారశక్తియైన కూర్మమును, అనంతుని, పృథివిని పూజింపవలెను.

 ఆగ్నేయకోణము మొదలగు నాలుగు కోణములందును క్రమముగ ధర్మ-జ్ఞాన-వైరాగ్య-ఐశ్వర్యములను పూజింపవలెను. తూర్పమొదలగు ప్రధానదిక్కులందు అధర్మ-అజ్ఞాన-అవైరాగ్య-అనైశ్వర్యములను పూజింపవలెను.

 పీఠమధ్యమునందు సత్త్వాదిగుణత్రయమును, కమలమును, మాయను, అవిద్యను, కాలతత్త్వమును, సూర్యాదిమండలములను, పక్షిరా జైన గరుత్మంతుని పూజింపవలెను. పీఠము వాయవ్యకోణమునుండి ఈశాన్యకోణము వరకు గురుపంక్తిని పూజింపవలెను.

గణః సరస్వతీ పూజ్య నారదో నలకూబరః | గురుర్గురోః పాదుకా చ పరో గురుశ్చ పాదుకా. 37

పూర్వసిద్ధాః పరసిద్ధాః కేసరేషు చ శక్తయః | లక్ష్మీః సరస్వతీ ప్రీతి కీర్తిః శాన్తిశ్చ కాన్తికా. 38

పుష్టిస్తుష్టిర్మ హేన్ద్రాద్యా మధ్యేచావాహితో హరిః | ధృతిశ్రీరతికాన్త్యాద్యా మూలేన స్థాపితోచ్యుతః. 39

ఓం అభిముఖో భ##వేతి ప్రార్థ్య ప్రాచ్యాం సన్నిహితో భవః

విన్యస్యార్ఘ్యాదికం దత్వా గన్ధాద్యైర్మూలతో యజేత్‌. 40

ఓం భీషయ భీషయ హృచ్ఛిరస్త్రాసయ వై పునః | మర్దయ మర్దయ శిఖా అగ్న్యాదౌ శస్త్రతో7స్త్రకమ్‌. 41

రక్ష రక్ష ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమస్తతః |

ఓం హ్రూం ఫట్‌ అస్త్రాయ నమో మూలబీజేన చాఙ్గకమ్‌. 42

పూర్వదక్షాప్యసౌమ్యేషు మూర్త్యావరణమర్చయేత్‌ |

గణములు, సరస్వతి, నారదుడు, నలకూబరుడు, గురువు, గురుపాదుక. పరమగురువు, ఆతని పాదుక-వీటి పూజయే గురుపంక్తిపూజ. పూర్వసిద్ధ-పరసిద్ధ శక్తులను కేసరములపై పూజింపవలెను. 

లక్ష్మి, సరస్వతి, ప్రీతి, కీర్తి, శాంతి, కాంతి, పుష్టి-; తుష్టి-వీరు పూర్వసిద్ధశక్తులు, పూర్వాది దిక్కులలో క్రమముగ ఈ శక్తుల పూజ చేయవలెను. ఇంద్రాదిదిక్పాలకులను గూడ వారి వారి దిక్కులందు పూజింపవలెను. వీరందరి మధ్యయందు శ్రీహరి విరాజిల్లుచుండును.

 ధృతి, శ్రీ రతి, కాంత్యాదులు పరసిద్ధశక్తులు. మూలమంత్రముచే అచ్యుతుని స్థాపింపవలెను. పూజాప్రారంభమున- ''ఓం అభిముఖో భవ'' పూర్వదిక్కున నా సమీపమున నుండు అని భగవంతుని ప్రార్థింపవలెను. 

ఈ విధముగ ప్రార్థించి స్థాపించిన పిమ్మట అర్ఘ్యపాద్యాదులను సమర్పించి, గంధాద్యుపచారముల ద్వారా మూలమంత్రముతో అచ్యుతుని పూజింపవలెను. 

''భీషయ భీషయ హృదయాయ నమః'' ''ఓం త్రాసయ త్రాసయ శిరసే నమః'' ''ఓం మర్దయ మర్దయ శిఖాయై నమః ''ఓం రక్ష రక్ష నేత్రత్రయాయ నమః '' ''ఓం ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమః'' ఓం హూం ఫట్‌ అస్త్రాయ నమః'' 

ఈ విధముగ ఆగ్నేయాదివిదిశలయందు క్రమముగా, మూలబీజములతో అంగముల పూజ చేయవలెను. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము ఈ దిక్కులందు మూర్త్యాత్మక ఆవరణముల పూజ చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 100 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. పిప్పలాద మహర్షి - 2 🌻*

7. పరీక్షించాలనే బుద్ధి దేవతలకు ఎందుకు పుడుతుందని సందేహం కలుగవచ్చు. పరీక్షించబడనటువంటి గుణమేదైనా, అది ఋజువు కానట్లే అర్థం. ఉదాహరణకు పతివ్రత ఒకరున్నారు. ఒక పరీక్ష తర్వాతే ఆమే మహత్తు ఈ లోకానికి తెలుస్తుంది. 

8. అటువంటప్పుడు ధర్మదేవతకు ప్రమాదం(శాపం) కలిగి, మరి ధర్మదేవత క్షీణిస్తున్నది కదా, దానివల్ల లోకానికేం లాభం! అన్న సందేహం కూడా కలుగవచ్చు. అది విధిలోని యుగధర్మం. ఈ సంఘటన నిమిత్తమాత్రం. 

9. ప్రతి ఋషిచరిత్రలో ఈ పరీక్షలో వాళ్ళు గెలిచినట్లు, వాళ్ళ మహిమలు ఋజువయినట్లు గాథలతో చెపుటున్నారు. సామాన్యుడికి పరీక్ష ఉండదు. గొప్పవాళ్ళకే ఈ పరీక్షలన్నీ ఉంటాయి.

10. ధర్మదేవత అంటే సృష్టిలో లోకాలను పరిపాలించి పోషిస్తున్నటువంటి శక్తి. సమస్త దేవతలలోనూ, యక్ష, కిన్నేర, కింపురుషాది దేవతలందరిలో కూడా ధర్మము అనే భావన్-అలాంటి ఒక శక్తి-ఉంది. దేంట్లో ధర్మభావన ఉంటుందో అదే ఈ జగత్తుకు క్షేమంగా ఉండటానికి కారణమౌతోంది.

11. జగత్కల్యాణం కోసం పుణ్యం సంపాదిస్తుంటారు. పుణ్యానికి ముందు ధర్మభావన ఉండాలి.ధర్మమందు నిష్ఠ కలిగిన వాడే పుణ్యం చేస్తాడు. అంటే ధర్మమే లోకలో క్షేమము. ధర్మం ఏం చెబుతుంది? పుణ్యం చేయమని చెబుతుంది. పుణ్యము, తపస్సు, దానము, అన్నీకూడా ధర్మం ఆధీనంలోనే ఉంటాయి.

12. మిగతా దేవతలందరినీ బ్రహ్మ సృష్టించారు కదా! మరి ధర్మదేవతను ఎవరు సృష్టించారు? అంటే, సృష్టి అలాగే ఉంది. దేవతలందరినీ ఈశ్వరుడే సృష్టించారు. అయితే ధర్మదేవతను మాత్రం ఆయన సృష్టించలేదు. 

13. ప్రత్యేకంగా ధర్మదేవత అని ఎవరూ సృష్టింపబడలేదు. యముడున్నాడు. ఆయనను ధర్మదేవత అంటాం. యముడి యొక్క అధికారం ఏమిటి? క్రింది లోకాలలోని జీవుల యొక్క పాపపుణ్యాల విచారణ జరిపి వాళ్ళకు ఉత్తరగతులను నిర్ణయించడం ఆయన పని. అంతవరకు మాత్రమే ధర్మదేవత. అతడిని ధర్ముడని, ధర్మదేవత అని అంటారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 2 / Sri Vishnu Sahasra Namavali - 2 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻* 

*పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |*
*అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ‖ 2 ‖*

10) పూతాత్మా - 
పవిత్రాత్ముడు.

11) పరమాత్మ - 
నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.

12) ముక్తానాం పరమాగతి: - 
ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.

13) అవ్యయ: - 
వినాశము కానివాడు. వినాశము లేని వాడు.

14) పురుష: - 
నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు.

15) సాక్షీ - 
చక్కగా సమస్తమును దర్శించువాడు.

16) క్షేత్రజ్ఞ: - 
శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.

17) అక్షర: - 
నాశరహితుడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 2 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*pūtātmā paramātmā ca muktānāṁ paramā gatiḥ |*
*avyayaḥ puruṣaḥ sākṣī kṣetrajñōkṣara eva ca || 2 ||* 

10) Pootatma – 
The Lord With an Extremely Pure Essence

11) Paramatma – 
The Supreme Soul

12) Muktanam Parama Gatih – 
The Ultimate Range of the Liberated

13) Avyayah – 
The Lord Who is Always Same

14) Purushah – 
The Lord Who is Inside Every Body

15) Sakshi – 
The Lord Who is the Witness of Everything that Happens

16) Kshetragyah – 
The Knower of the Field

17) Akshara – 
The Undecaying

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 30 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

STANZA VII
*🌻 The Fiery Baptism - 1 🌻*

61. Time was passing. Rapidly gaining speed, it pushed urgently forward. With each new turn, Time was leading earthlings on a new Spiral of Ascent. Human Hearts were already capable of peering into the Future. 

And the Future reached out to them, drawing them ever closer to itself. Anxiously looking back, human beings feared the return of the past. Their Hearts recognized those who were trying to ensnare them in the thoughtlessness of bygone ages.
 
62. Solar activity was starting to approach the limits of the possible. Glowing white-hot from the new currents, the Sun was releasing from his Fiery-White Core a sheaf of rays, which swiftly disappeared from view, thrusting themselves into the bowels of Earth. 

The Sun was knocking at the Earth’s Heart, calling upon it to let in a sheaf of Fires of the New Sound. The Earth opened up.
 
63. Now the Earth was being enveloped by a Light hitherto unseen. She was once again renewing herself, permeating all spheres of Life with the stamp of newness. Once again earthly shapes were changing, mainly in the realm of Colour... 

Nature was attempting to heal the wounds that had been inflicted on her by humanity, and to cover her gaping black holes with luxuriant blossoms.
 
All living things refused to clothe themselves in old dark, gloomy colours. 

As before, the darkness was threatening to grind everything into dust and to cover the fragments of the planet with a layer of thick black-grey ash. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 21 🌹*
 ✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
*🌟. 6. చైతన్య విస్తరణ 🌟*

మూల ప్రకృతి (భగవంతుని చైతన్యం) ఎన్నో ప్రపంచాలుగా విభజన పొందింది. అందులో తన యొక్క చైతన్యమైన DNA ని (మూల చైతన్య బీజ జ్ఞానాన్ని) నిలిపి, తాను వీటి ద్వారా విస్తరిస్తూ పరిణామం చెందుతుంది.

మూల చైతన్యం తనని తాను మూడు ప్రపంచాలుగా విస్తరించింది. ఈ మూడు ప్రపంచాలు, ఏడు పరిధులుగా (7 ప్లైన్స్ లేక తలాలుగా) విభజించబడుతుంది.

🔹. *విశ్వంలోని మూడు ప్రపంచాలు*:-

*1. Physical world- భౌతిక ప్రపంచం*

*2. Astral world- సూక్ష్మలోకం, కారణలోకం, మహాకారణలోకం*

*3. Angelic world- దేవతా రాజ్యాలు, ఫెయిరీస్ లోకాలు*

💠. *Physical world (భౌతిక ప్రపంచం)*

ఈ భౌతిక ప్రపంచాన్ని తిరిగి నాలుగు మహా రాజ్యాలు (kingdoms) క్రింద విభజించారు.

🔺. *1. మినరల్ కింగ్ డమ్ - ఖనిజ సామ్రాజ్యం*
🔺. *2. ప్లాంట్ కింగ్ డమ్ - వృక్ష సామ్రాజ్యం*
🔺. *3. యానిమల్ కింగ్ డమ్ -జంతు సామ్రాజ్యం*
🔺. *4. హ్యూమన్ కింగ్ డమ్ - మానవ సామ్రాజ్యం*

💠. *ఆస్ట్రల్ వరల్డ్స్* - ఇవి మూడు:-

🔺. *1. సూక్ష్మ లోకాలు* - ఇక్కడ సూక్ష్మ శరీరధారులు, సూక్ష్మజీవులు ఉంటాయి. (మన సూక్ష్మశరీరయానం లో మొదట దీనినే "టచ్" చేస్తాం)
ఈ సూక్ష్మ తలాలు లేక లోకాలు రెండు రకాలు.

🌀. *లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్*(దిగువ జ్యోతి ప్రపంచాలు)-
ఇక్కడ లోయర్ ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. వీటిని *"లోయర్ ఆస్ట్రల్ ఎంటిటీస్"* అంటారు. ఇవి ఇతర జీవులపైన ఆధారపడి బ్రతుకుతాయి. మనలో ఉన్న లోయర్ చైతన్యాలను ఆహారంగా తీసుకుంటూ బ్రతుకుతాయి. (అరిషడ్వర్గాలు)

🌀. *హైయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్* - (ఉన్నత జ్యోతి ప్రపంచాలు) -హైయ్యర్ ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. ఇవి ఉన్నత చైతన్యాలను తయారు చేస్తాయి.

🔺. *కారణ లోకాలు* -ఇక్కడ కారణశరీరధారులు, కారణశరీరజీవులు (కాజల్ బీయింగ్స్, కాజల్ మాస్టర్స్) ఉంటారు. ఇది జీవి యొక్క జన్మకారణ లోకం,ఈ కారణాలను తీసుకునే ఆత్మ తన ప్రయాణాన్ని భూమికి మళ్ళిస్తుంది.

🔺. *మహా కారణ లోకాలు*-ఇక్కడ మహా కారణ శరీరంధారులు, మహా కారణ జీవులు ఉంటాయి. ఈ మహా కారణ శరీరధారులనే *"మాస్టర్స్", గ్రాండ్ మాస్టర్స్"* అంటారు. అలాగే ఇక్కడ ఉన్న జీవులను *"గ్రాండ్ బీయింగ్స్* అంటారు. ఇక్కడ ఉన్నవారిని మహాత్మలు, విశ్వాత్మలు, బ్రహ్మాత్మలు అంటారు. ఇది మహా అద్భుత ప్రపంచం, దీనిని *"జ్ఞాన"* లేక *"కాంతి ప్రపంచం"* అంటారు. మూలచైతన్యం యొక్క మహా కారణం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్న వారు అంతా ఆ మూల చైతన్యము యొక్క మహాకారణం కోసం పని చేస్తారు. 

💠. *ఏంజెలిక్ వరల్డ్ -(దేవతా ప్రపంచం)* ఇక్కడ దేవతలు, దేవదూతలు (వీరినే మెస్సెంజర్స్) అంటారు. భగవంతునికి జీవాత్మ కు మధ్య వార్తాహరులు. మూల ఆత్మ యొక్క మహాన్ కారణాన్ని ఆత్మకు (జీవునికి) అందజేసి ఆ విధంగా పనిచేసేలా చేస్తారు. వీరినే *"ఏంజెల్స్"* మరి *"ఆర్కేంజల్స్"* అంటారు.
ఇంకా ఇక్కడ ప్రకృతి దేవతలు(ఫైయిరీస్) ప్రకృతి ఆత్మలు (పంచభూతాలు) ప్రకృతి జీవులు (చేపలు, పక్షులు, సరీసృపాలు, కీటకాలు) ఉంటాయి. ఇది దైవం యొక్క గొప్ప ప్రపంచం.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 165 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 12. The ‘I am’ has brought you in, the ‘I am’ will take you out, the ‘I am’ is the door, stay at it! It’s open! 🌻*

The feeling ‘I am’ very clearly qualifies as the port of entry or doorway through which you came into this world and thus it also qualifies as the way out. 

And, there is no other way out! Stay at it and you shall see that this door is always open it was never closed. 

Unless you revert and stay in the ‘I am’ for a sufficiently long time you won’t come to know this fact.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 43 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 7 🌻*

ఎంతకాలమైతే తర్కిస్తూ వుంటామో, అది బుద్ధి పరిధి వరకే పనిచేస్తుంది.

 “బుద్ధిగ్రాహ్యమతీంద్రియం” ఈ బుద్ధిని ఎంతగా పెంచాలయ్యా, ఎంతగా ఓడించాలయ్యా - రెండు పనులు చేయాలి - దీన్ని బాగా పెంచాలి మొదటి దశలో. రెండవ దశలో ఏం చేయాలిట? ఓడించాలి. నీ బుద్ధిని నీవే ఓడించాలి. 

నీ బుద్ధియొక్క కర్మ ప్రేరితంగా ఏర్పడుతున్నవాటిని నీవే నిరసించాలి. నీవే అధిగమించాలి. అలా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే బుద్ధి ఓడిపోయి సాక్షిత్వ స్థితియందు నిలకడ చెందుతుంది. 

మనోబుద్ధులు సాక్షిత్వస్థితియందు ఎవరికైతే నిలకడ చెందినాయో అట్టి సాక్షిత్వ జ్ఞానం చేత మాత్రమే ఆత్మను నిర్ణయించడానికి వీలవుతుంది. తర్కము కంటే భిన్నమైనటువంటి ఆత్మవిదుల ఉపదేశం వలన కలిగిన జ్ఞానమే సరియైనటువంటిది. ఇది చాలా ముఖ్యం. ఎవరిదగ్గరికైతే వెళితే నీకు తర్కాన్ని ఉపదేశిస్తారో వాళ్ల వలన నీవు ఆత్మోపదేశాన్ని పొందలేవు. 

ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అదెలా కుదురుతుందీ, ఇదెలా కుదురుతుందీ, అలా ఎలా కుదురుతుందీ, ఇలా ఎలా కుదురుతుందీ అనే బుద్ధిప్రచోదనం చేత జరిగేటటువంటి చర్చల వల్ల ఆత్మ యొక్క నిర్ణయం జరుగదు.

         ఆత్మ నిర్ణయం జరగాలి అంటే మనోబుద్ధులు ఆగిపోయినటువంటి స్థితిలో, మనోబుద్ధులు హృదయస్థానంలో సంయమించబడినటువంటి స్థితిలో, నిర్వాణ ప్రజ్ఞా స్థితిలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అటువంటి నిర్వాణ ప్రజ్ఞను ప్రతిఒక్కరూ పొందాలి అనేటటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని చెప్తున్నారు.   

         నీవెట్టి దృఢ సంకల్పముతో ప్రలోభములకు లోనుగాక ఆత్మ జ్ఞానము నొందుటకు ధీరచిత్తముతో నుంటివో, అట్టి సత్యధృతివైన నీవంటి శిష్యులు మా దగ్గరకువచ్చి ఆత్మజ్ఞానమును పొందుదురుగాక!
         
ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. ధీరచిత్తము అంటే చిత్తములో ఏర్పడేటటువంటి వృత్తులు ఏవైతే వున్నాయో , ఆ చిత వృత్తులను నీవు అధిగమించినటువంటి వాడవైనప్పుడు మాత్రమే నీవు ఆత్మ జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తావు. 

నీవు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఉత్తమమైనటువంటి స్థితికి అర్హత సంపాదించాలీ అంటే నీకు అడ్డమైనటువంటి అంశము ఏమిటంటే చిత్తవృత్తి. కాబట్టి యోగమార్గము యొక్క లక్ష్యము ఏమిటంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. “యోగాః చిత్తవృత్తి నిరోధకః” అనే సూత్రం ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానమ్మ్ దృష్ట్యానే, ఆ లక్ష్యం దృష్ట్యానే ఏర్పరచబడింది. 

ఎవరైతే వారివారి చిత్తవృత్తులను బాగుగా, నిశ్శేషముగా నిరోధించి చిత్త ఉపశాంతి, చిత్తశుద్ధి, నిర్మలమైనటువంటి చిత్తము ఎవరైతే సాధిస్తారో, వాళ్ళు మాత్రమే సరియైనటువంటి ఆచార్యుడిని ఆశ్రయించి వాళ్ళు ఆత్మజ్ఞానమును పొందెదరుగాక! అనేటటువంటి ఆశీఃపూర్వకమైన వాక్యమును ఇక్కడ వేశారనమాట. చూడండి ఎంత దృఢంగా చెప్తున్నారో.
“అట్టి సత్యధృతివైన నీవంటి శిష్యులు మా దగ్గరకువచ్చి ఆత్మజ్ఞానమును పొందుదురుగాక!”

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 20. గీతోపనిషత్తు - ఆచరణ - ఆచరణము లేని జిజ్ఞాస జీవుని భ్రష్టుని చేయగలదు. ఆచరణములోనే సమస్తమూ అనుభవమునకు వచ్చును. 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 46 📚*

*వేదమపారము. జ్ఞానమునూ అపారమే. తెలియవలసినది ఎప్పుడునూ యుండును. తెలిసిన దానిని ఆచరించుట అను మార్గమున మరికొంత తెలియుట యుండును.*  

*యావానర్థ ఉదపానే సర్వత: సంప్లుతోదకే |*
*తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత: || 46*

ఈ మార్గమున తెలియుటలో అనుభవము వుండును. అనుభూతి యుండును. మరియూ తెలిసినది అక్కరకు వచ్చును. ఊరికే తెలుసుకొనుట వలన ఉపయోగము లేదు. అది అక్కరకు రాదు. అనుభూతి నీయదు. అనుభవమూ కలుగదు. ఆచరణము లేని జిజ్ఞాస జీవుని భ్రష్టుని చేయగలదు. ఆచరణములోనే సమస్తమూ అనుభవమునకు వచ్చును.

ఊరకే తెలుసు కొనుట వలన మెదడు వాచి, తెలిసిన వాడనను అహంకారము బలిసి జీవుడు భ్రష్టుడగును. బ్రహ్మమును తెలిసిన వారందరూ ఆచరణ పూర్వకముగా నెగ్గిన వారే. బోధనలను వినుట వలన, గ్రంథంములను పఠించుట వలన, తెలియునది పుస్తక విజ్ఞానమే. 

ఆచరించు వారిదే అసలు విజ్ఞానము. తెలుసుకొనుట, తెలిసినది ఆచరించుట అనునవి అనుశ్యాతముగ ఉఛ్వాస నిశ్వాసములవలె సాగుట క్షేమము. అది తెలిసిన వారే తెలిసినవారని, యితరులు మిధ్యాచారులని
భగవంతుడు బోధించి యున్నాడు.
భారతీయులకిదియే ప్రస్తుత కర్తవ్యము. 

ఉదాహరణకు, దాహము కలిగిన వానికి బావి కనపి నప్పుడు, అందుండి తనకు వలసిన జలములను గ్రోలి తృప్తి చెందుట క్షేమము. 

అంతియేకాని, అసలా బావియందు ఎంత నీరున్నది? దినమున కెంత ఊరుచున్నది? ఎంతమంది ప్రతి దినమూ త్రాగినచో బావి ఎండక యుండును? అను జిజ్ఞాసలో పినచో, గొంతెండి చనిపోవుటయేయుండును. చదివిన వారందరూ తెలిసినవారు కారనియు, రామకృష్ణ - వివేకానందుల వలె ఆచరించినవారే తెలిసినవారని తెలియవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AGENTS OF THE FUTURE 🌹*
*✍️. Prasad Bharadwaj*

*All who love and serve their fellow humans are agents of a spiritual future – one where the human spirit is evolving towards ever greater cooperation, sharing and unity.*

*In every interaction, these servers ask one simple question of themselves – how can I bring this future closer? When asked sincerely, and motivated by pure goodwill, it can impact any and every situation.*

*Every moment, every event, every conversation becomes meaningful and significant. The magnetic power of the future is drawn into the present, and service of all kinds is energised.*

*The future depends on the willingness of more and more people to recognise their responsibility for creating it, and to commit themselves to asking this question.*

*They then become agents of the future, and accelerate its birth.*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment