నారద భక్తి సూత్రాలు - 84


🌹.  నారద భక్తి సూత్రాలు - 84  🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్ధాధ్యాయం - సూత్రము - 51, 52

🌻 51. అనిర్వచనీయం ప్రేమ స్వరూపమ్‌ | 🌻

భగవత్రేమ స్వరూపం ఇట్టిదని నిర్వచించడానికి వీలు కాదు. అది హృదయపూర్వకం, అవాజ్నానస గోచరం. బుద్దికి అతీతం.

గత అధ్యాయాలలో వివరించినది బాహ్య భక్తి లేక గొణభక్తి. అది క్రమంగా సాధన దశలలో పెంపొందించుకునేదిగా చెప్పబడింది.

పరాకాష్టగా ముఖ్యభక్తి కలుగగా భక్తుడు తన ముఖ్యభక్తిలోగాని, పరాభక్తిలో గాని తన భక్తి అనుభవాన్ని ఇల్టది అని వివరించలేడు. అది అతడి ఆంతరంగిక అనుభవం మాత్రమె.

ఈ ముఖ్యభక్తి లేక పరాభక్తిని అతడి బాహ్య నడవడికను బల్బ ఇతరులు అంచనా వేస్తే అది తప్పవుతుంది. అనిర్వచనీయమైన భగవత్రైేమానుభవాన్ని భక్తుడు కూడా

చెప్పలేడు.

🌻 52 మూకాస్వాదనవత్‌ ॥ 🌻

పదార్ధ రుచిని చూచిన మూగవాడు ఆ రుచిని మాటలలో చెప్పలేడు. అలాగే తన ముఖ్యభక్తి లక్షణాన్ని అనగా భక్తుడి ఆంతరిక అనుభవాన్ని అతడు కూడా మాటలలో చెప్పలెదు.

భగవత్రేమ ఎప్పుడు హృదయాంత రాళంలో స్థిరపడుతుందో అప్పుడు ఆ భక్తుడికి అవగతమౌతుంది. అట్టి ఇతర భక్తుడు కూడా తెలుసుకోగలడు. కాని వారు మాటలలో చెప్పలేరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment