ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 100, 101 / Sri Lalitha Chaitanya Vijnanam - 100, 101 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ‖ 38 ‖
🌻 100. 'బ్రహ్మగ్రంథి విభేదినీ' 🌻
బ్రహ్మగ్రంథిని భేదించునది శ్రీదేవి అని అర్థము.
షట్చక్రములందు మొదలు, చివర గ్రంథులు గలవు. చక్రము పైని గ్రంథి, పై నున్న చక్రమును అనుసంధానించును. చక్రము క్రింది. గ్రంథి, ఆ చక్రము యొక్క క్రింది వ్యూహమే. వీటినన్నిటిని అనుసంధానించి నప్పుడు అది కమలములై విచ్చుకొని జీవులకు స్వస్వరూపము దర్శనమగును.
బ్రహ్మగ్రంథి భౌతిక సృష్టియందు జీవులను బంధించును. భౌతికమగు విషయముల చుట్టును జీవుని మనస్సు పరిభ్రమించు చుండును. ధనము, ఆస్తులు, ఆభరణములు, విలువైన వస్తువులు - ఇత్యాది విషయములపై చేతన ఆసక్తి పొంది యుండును. భౌతికముగ తాను పొందిన దేదియు తనవెంట రాదని తెలిసియు మాయచే భౌతిక సృష్టి యందు జీవులు బంధింపబడి యున్నారు. పదార్థము జడమనియు, అచేతన మనియు, అశాశ్వత మనియు, అనిత్య మనియు తెలిసియు కోరుచు నుందురు.
మానవుని భౌతికదేహము పై తెలుపబడిన పదార్థ లక్షణములు కలిగి యున్నవి. దేహమునకు తగుమాత్రము పోషణ గావించి విధులను నిర్వర్తించుటయే ఆరమార్గము. దేహ పోషణమే ఆశయము కారాదు. దేహాభిమానము జీవుని మిక్కిలిగ బంధించును.
పలు ధర్మములను సాధించుటకే దేహము. అది జీవునికి వాహనము వంటిది. అది చక్కగ పనిచేయవలెను. అపుడు దానిని ఆధారముగ గొని జీవుడు తన పనులను చక్కబెట్టు కొనవలెను. వాహనము సద్వినియోగమునకే కాని అభిమానపడుటకు కాదు. సద్వినియోగము ముఖ్యము.
సరియగు పోషణము ముఖ్యము. అది తామే అనుకొనుట అజ్ఞానము. తాము తమ వాహనము కాదు కదా! ఈ జ్ఞానము నందించునది శ్రీదేవియే. ఆమె మాయ వలననే రూపాత్మకమగు జగత్తునందు జీవుడు బంధింప బడి యున్నాడు. ఆమె అనుగ్రహము వలన దీనిని భేదింపవచ్చును.
ఆమెయే 'భేదినీ' శక్తి. మాయ ఆమె వలననే కలుగు చున్నది. అది రహితమగుట కూడ ఆమె అనుగ్రహముగనే జరుగును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 100 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Brahmagranthi-vibhedini ब्रह्मग्रन्थि-विभेदिनी (100) 🌻
She pierces the brahma granthi. There are three knots called granthi-s in three places in the path of Kuṇḍalinī. These granthi-s are to be pierced to make the Kuṇḍalinī ascend to the higher cakra-s.
First of such granthi-s is found above the mūlādhāra cakra and below the svādhiṣṭhāna cakra. Kuṇḍalinī has to pierce the brahma granthi to reach the svādhiṣṭhāna cakra.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹.
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 101 / Sri Lalitha Chaitanya Vijnanam - 101 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ‖ 38 ‖
🌻 101. 'మణిపూరాంత రుదితా' 🌻
మణిపూరక చక్రమందు ఉత్పత్తి యగునది శ్రీదేవి అని అర్థము.
స్వాధిష్ఠానమును భేదించుకొని మణిపూరకము చేరిన కుండలినీ చైతన్యము అచట భావమయ ప్రపంచమున ఉపాసకుని ఆరాధనా రూపమగు దేవిగ మొదట దర్శనమిచ్చును. దేవి రూపము నారాధించుట ద్వారా రూపాతీత స్థితిని చేరుట క్షేమకరమని ఋషులభిప్రాయము.
ఆరాధకుడు దేహాస్థుడగుటచే రూపస్థుడు. అందువలన భావనా ప్రపంచమున దైవమును తనకు నచ్చిన రూపమున ఆరాధించుట క్షేమకరము. అవ్యక్తారాధనము దుఃఖము కలిగించునని శ్రీకృష్ణ భగవానుడు గీతయందు తెలిపియున్నాడు. సమయాచార పూజ యందు దేవిని సర్వాలంకార భూషితగ ఆరాధించుట కద్దు.
దశ దళ పద్మము నూహించుకొని అందు రత్నములచే అలంకరింపబడిన శ్రీదేవిని దర్శించుచూ ఆరాధించుట వలన మణిపూరక చక్రము భేదింపబడి పద్మము నందు శ్రీదేవి దర్శనమిచ్చును. ఇది భావమయ దర్శనము.
ఆరాధకుని మనస్సున ఏర్పరచుకొనిన మూర్తి రూపమున మనస్సున ఈ దర్శన మగును. మణిపూరక చక్రము భావ పరంపరలకు పుట్టినిల్లు. మానవుడు మనోభావముల నాధారముగ చేసుకొనియే జీవించు చుండును. మనస్సు నందు ప్రాపంచిక భావనలే మెండుగ యుండును. తన ఆలోచనా సరళిని బట్టి మాటచేత యుండును. మాట చేత సరళిని బట్టి మరల అవే భావములు పుట్టుచుండును. ఇది యొక భావనామయ చక్రము.
ఈ చక్రమునందు ప్రాపంచిక వాసనలతో కూడిన మనస్సు వలదన్నను ప్రాపంచిక విషయములనే గుర్తుచేయు చుండును. దీని తర్ముఖము గావింపవలెనన్నచో చక్రము స్థానమున దశదళ పద్మమును, పద్మము నందు ఆసీనయైన సర్వాలంకార భూషితయైన శ్రీదేవిని ప్రతిపాదించుకొని ఆరాధించుకొన వలెను. ఆరాధన యొక్క ముఖ్య ఆశయ మిదియే. ప్రపంచమున తగులుకొన్న మనసును దైవతత్త్వము వైపునకు మళ్ళించుటకు ఆకర్షణీయమగు మూర్తి ఆరాధన ఈయబడి నది.
అట్లారాధించుట వలన అత్యంత సౌందర్యమగు దేవి మూర్తి యందు లగ్నమైన మనస్సు ప్రాపంచిక విషయములను క్షణకాలము మరచును. క్రమముగ నిరంత రారాధనా మార్గమున మనస్సు శ్రీదేవి పై లగ్నమైనపుడు మణిపూరక చక్రము భేదింపబడి పద్మము వికసించి ఆరాధకుని దివ్యభావనయందు స్థిరపరచును.
దివ్యభావముల యందు రుచి కలిగిన మనస్సు ప్రాపంచిక విషయములపై నిక నారాటపడదు. ప్రపంచమునందు ఆరాధకు డున్నప్పటికిని ప్రాపంచిక విషయములు అంతగ బాధింపవు. అట్లు మణిపూరక చక్ర అంతరమున నుండి జీవుడు బాహ్యము నుండి అంతరమున ప్రవేశించి అందుండి బయల్పడును. అనగా అంతర్ముఖుడగుటకు అర్హతను పొందును.
బహిర్గతము నుండి అంతర్గత మగుట అందలి సాధన. బహిర్ముఖమగు మనస్సు అంతర్ముఖమై అటు పైన ఆరాధన సాగించును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 101 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Maṇipūrāntha-ruditā मणिपूरान्थ-रुदिता (101) 🌻
She appears in the navel cakra. It was seen in nāma 98, that She is well decorated and sits on the throne in the navel cakra. Saundarya Laharī (verse 40) beautifully describes maṇipūraka cakra.
“I worship that redoubtable dark-blue cloud, abiding forever in you maṇipūraka cakra, endowed with lightning in the form of Śaktī, whose lustre controverts darkness, with a rainbow caused by the sparkling variegated gems set in the jewels (of the Kuṇḍalinī ) and showering rain over the worlds scorched by Hara (fire) and Mihira (sun; certain dictionaries say moon).”
In deep stage of meditation, one will be able to see bright light in the form of a bow. A detailed study of this cakra is made from nāma-s 495 to 503.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 Nov 2020
No comments:
Post a Comment