శివగీత - 119 / The Siva-Gita - 119


🌹. శివగీత - 119 / The Siva-Gita - 119 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 16

🌻. మొక్షాదికారి నిరూపణము - 1
🌻


శ్రీరామ ఉవాచ :-

భగవన్! మోక్ష మార్గోయ - స్త్వయా సమ్య గుదాహ్రుతః,

తత్రాధి కారిణం బ్రూహి - తత్ర మే సంశయో మహాన్ 1


బ్రహ్మక్షత్త్ర విశ శ్శూద్రా - స్త్స్రియశ్చా త్రాధి కారిణః,

బ్రహ్మచారీ గృహస్తో వారను పనీతో ధవా ద్విజః 2


వనస్థో వావన స్థోవా -యతి: పాశుపత వ్రతీ,

బహునాత్రకి ముక్తేన - యస్య భక్తి శ్శివార్చనే . 3


స ఏవాత్రాధి కారీస్యా - న్నాన్య చిత్తః కధంచన,

జడన్దో బధిరో మూకో - నిశ్శౌచః కర్మ వర్జితః 4


అజ్నోప హాసా భక్తాశ్చ - భూతి రుద్రాక్ష ధారిణః,

లింగినో యశ్చ వాద్వేష్టి - తేనైవా త్రాధి కారిణై 5



శ్రీరాముడు ప్రశ్నించు చున్నాడు: ఓ పరమేశ్వరా ! మోక్ష మార్గమును గురించి సవిస్తారముగా నుపదేశించితివి. అట్టి మోక్షమున కధి కారమును కర్హులెవరో ఎటువంటి వారికది లభ్యమగునో, ఆ మార్గము నాదేశించుము. అందులో నాకు గొప్ప సంవయ మేర్పడినది. అది విని భగవంతుడు (శివుడు) చెప్పుచున్నాడు:

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య -శూద్రులును, స్త్రీలును మోక్షమున కధి కారులే. బ్రహ్మచారి యైనను, గృహస్తుడైనను, ఉపనయనము గాని వాడైనను, బ్రాహ్మణుడైనను వనస్తుడైనను వనస్తుడు గాక పోయినను పాశుపత వ్రత దీక్ష బూనిన యతికి గాని ఎక్కువ చెప్పనేటికి శివార్చన యందు భక్తి కలిగిన వారందరును ఇందధికారులే .

జడుడు , చెవిటివాడు , అంధుడు , మూడవాడు, అపవిత్రుడు, కర్మ శూన్యుడు, అజ్ఞుడు, అపహాస్య భక్తుడు, విభూతి రుద్రాక్ష లింగములను ధరించిన వారిని ద్వేషించు వారు మాత్రము మోక్షమున కదికారులు కాజాలరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 119 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 16

🌻 Mokshadhikari Nirupanam - 1
🌻

Sri Rama said: O Parameshwara! You have explained in very detail the path to liberation. Hence now kindly explain which kind of people become eligible for attaining such salvation. I have great doubts on that matter.

Sri Bhagawan said:

Brahmana, Kshatriya, vaishya, Shudra, stree, everyone is eligible for attaining salvation. Either one is a celibate or a householder or has become a forest dweller, or without going to forest also follows Pashupata Vrata Deeksha, or one who worships Shiva (me) regularly and is my devotee, every such category of people are eligible for attaining salvation.

However, a Jada (atheist), deaf, blind, dumb, of uncleansed heart, who doesn't perform any virtuous deeds, ignorant, a fake devotee, one who insults / hates people wearing Rudraksha ash and lingas such categories of people would not attain to salvation.

N.B:Here Blind, Dumb, Deaf refers to spiritual blindness, spiritual deafness, and spiritual dumbness which are the qualities of atheists.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


21 Nov 2020

No comments:

Post a Comment