భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 166


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 166 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. కణ్వమహర్షి - 1
🌻

జ్ఞానం:

01. కణ్వమహర్షి సామవేదంలో అనేక మంత్రాలకు ఆయన ద్రష్ట. కాణ్వులు, కాణ్వశాఖ అనేది ఉంది మనకు. దానికి ఆయన మూలపురుషుడాయన.

02. ధర్మం ఎప్పుడుకూడా, దానిని ఎవరు గౌరవిస్తారో వాళ్ళ్ను రక్షిస్తూ వాళ్ళదగ్గరే ఉంటుంది. ధర్మాన్ని గోవుతో పోల్చారు. గొవును సేవించినవాడిని వదలదు అది. వాడికి కుంభవృష్టిగా పాలు ఇస్తుంది. వాడు దానికి పెట్టేది ఏమీలేదు. ఆవుకు మనం ఏమి పెడతాం! మనకెందుకూ పనికిరాని గడ్డినిపెడతాం దానికి. ఆ గడ్డితిని ఆవు అంత రుచికరమైన పాలను మనకు ఇస్తుంది. ధర్మంకూడా అలాంటిదే. అది మన దగ్గరనుంచి ఏమీ ఆశించడు.

03. అయితే ధర్మం గౌరవాన్ని, రక్షణనుమాత్రం ఆశిస్తుంది. వాటిని మనం దానికి ఇస్తే. అది మనను పోషిస్తుంది. ఎవరయితే ధర్మాన్ని వదిలిపెడతారో అది వాళ్ళను విసర్జించి మరొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. తాను వదిలిన ధర్మం, మరోచోటుకు వెళ్ళిపోతుంది. సమస్త ఆర్యధర్మములూకూడా అనేక అంశలలో అనేకచోట్లకు, అనేకనాగరికతలలోకి వెళ్ళిపోయాయి.

04. ఈ స్మృతులలో పరస్పర భేదాలు ఎందుకున్నయంటే, ఋషుల వలన. ఉదాహరణకు ఋగ్వేదంలో కొన్ని మంత్రములకు ఒక ఋషి ద్రష్ట. సామవెదములో కొన్ని మంత్రములకు మరొక ఋషి ద్రష్ట. యజుర్వేదంలో కొన్ని మంత్రములకు, బ్రాహ్మణములకు కర్త అయినవాడు మరొక ఋషి.

05. కాబట్టి అనంతమయిన వేదములలో ఒక్కొక్క శాఖ, ఒక్కొక్క మంత్రము, మంత్రసమూహములకు ద్రష్టలైన ఋషులు, వాళ్ళ స్మృతులు వాళ్ళ జ్ఞానంలోంచి, వాళ్ళు తెలుసుకున్న విధానంలోంచీ వాళ్ళ దృక్పథంలో వ్రాయడం జరిగింది. స్వల్పభేదాలు ఉంటాయి. కానీ అందరికీ ధ్యేయం ఏమిటంటే పురుషార్థం.

06. నాలుగో మురుషార్థమయినటువంటి ముక్తికొరకు ఏ ప్రకారం ధర్మాన్ని ఆచరించాలనేది చెప్పడమే వాళ్ళ భావం. ఋషులందరికీ ధ్యేయమ్మాత్రం అది ఒక్కటే. అయితే స్మృతివాక్యాలలో తేడాలున్నాయి. కాబట్టి ఆ శాఖను అనుసరించేవాళ్ళకు ఆ స్మృతి వర్తిస్తుంది. ఆ శాఖకు ఆ స్మృతిని తీసుకోవాలి.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


21 Nov 2020

No comments:

Post a Comment