✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 21వ అధ్యాయము - 1 🌻
చివరి అధ్యాయం
శ్రీగణేశాయనమః ! ఓ అనంతవేషా జై, ఓ అవినాశా జై, ఓబ్రహ్మాండదిశా నేను మీకు నమస్కరిస్తున్నాను. ఓ భగవంతుడా మిమ్మల్ని మీరు పతిత పావనుడనని పిలుచుకుంటారు అన్నది గుర్తుంచుకోండి. మీకు నిజంగా పాపులంటేనే ఆత్మీయత ఎక్కువ, ఓ కృపాలూ వాళ్ళేమీకు ప్రాముఖ్యత తెస్తారు. కావున దయచేసి, నాపాపాలను చూడకండి. మురికి బట్టలు, శుభ్రం అవడంకోసం మంచి నీళ్ళదగ్గరకు వస్తాయి.
కావున భగవంతుడా దిగజారిన వాళ్ళని విశ్మరించకండి. భూదేవి ఎప్పుడయినా ముళ్ళ మొక్కలను తిరస్కరించిందా ? మీరు ఎపులను, పుణ్యాత్ములనూ ఇద్దరినీ కాపాడే వారు, అయినా వీరద్దరి స్పర్శనుండి దూరంగా ఉంటారు. సూర్యునికి, చీకటిని నాశనం చేయడానికి ఏవిధమయిన ప్రయత్నం అవసరంలేదు. సూర్యోదయం అవుతూనే, చీకటి మాయం అవుతుంది.
పాపం, పుణం అనే పరిస్థితులు మీరు సృష్టించినవే, మీరు మీగొప్పతనం నిభాయించడంకోసం, పాపులనుకూడా మీరే సృష్టిస్తారు. ఏది ఏమయినా సరే, మీ ఆశీర్వచనాలద్వారా నన్ను అన్ని చింతలనుండి స్వతంత్రుడిని చెయ్యమని నేను మిమ్మల్ని అర్ధించాలి. ఓ పాండురంగా మీరు సర్వశక్తి సంపన్నులు, నాకు మీరుతప్ప వేరెవరూ ఆధారం లేరు. ఓ భక్తులారా ఇప్పుడు చివరి అధ్యాయం వినండి.
ఒక మహాయోగి యొక్క ఈజీవిత చరిత్ర వినడానికి మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. శ్రీగజానన్ మహారాజులో ఎవరికయితే పూర్తి విశ్వాసం ఉందో, వారు జీవితంలోని బాధలనుండి, కష్టాలనుండి రక్షించబడతారు.
మందిర నిర్మాణం సమయంలో ఒక పనివాడు మందిరం మీద తాపీమే స్త్రీ తో పనిచేస్తున్నాడు. అతను రాళ్ళను ఆమే స్త్రీ కి అందిస్తూఉండగా, సంతులం తప్పి 30 అడుగుల ఎత్తునుండి క్రింద రాళ్ళగుట్టమీద పడ్డాడు. ప్రజలు అతను పడుతూ ఉండడంచూసి, అతనిచావు తధ్యంఅని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
అతను ఒక బంతిని చేతిలో సురక్షితంగా పట్టుకున్నట్టు, లేదా ఎవరయినా మెట్లు దిగివస్తున్నట్టుగా ఒక చమత్కారం జరిగింది. తను సంతులం తప్పినప్పుడు, ఎవరో తన చెయ్యిగట్టిగా పట్టుకుని, తన కాళ్ళునేలను తాకాక చెయ్యి విడిచి పెట్టారు అని ఆపని వాడు చెప్పాడు. కానీ చుట్టుప్రక్కల అయితే ఎవరూ కనిపించలేదు. శ్రీగజానన్ మహారాజే ఆ పని వాడిని రక్షించారని తెలిసి ప్రజలు అమిత ఆనందం పొందారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 113 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 21 - part 1 🌻
Shri Ganeshayanmaha! O Anantvesha Jai to you. O Avinasha Jai to you. Brahmindadhisha I bow before you. O God, remember that you always call yourself 'Patit pavan' i.e. the saviour of the fallen. You really have more affection for the sinners, and, O graceful one, it is they who have brought importance to you.
So, kindly don't look at my sins. Dirty clothes come to water for getting clean. O God, so don't ignore the fallen. Has the earth ever discarded a thorny plant? You are the Savior of both, the sinners and the righteous, and are still away from their touch.
The sun needs no efforts to destroy darkness. Sun's arrival, itself, vanishes the darkness. The conceptions sins and righteousness are your creations, and you create sinners to maintain your greatness.Whatever it may be, I have to request you to free me from all worries by your blessings.
O Panduranga, you are all powerful, and I have nobody else I support me other than you. O devotees, now listen to the climax chapter. You are really most fortunate to hear this biography of a great saint. Those who have full faith in Shri Gajanan Maharaj are saved from all the pain and miseries of life.
While building the temple, there was one laborer working at the top with the mason. As he was passing stones to the mason, he lost the balance and fell down from the height of 30 feet down onto a heap of stones. People saw him falling and presumed his death as certain.
But No, a miracle happened, and he was unhurt like a ball safely caught in hands, or like one coming down a staircase. The laborer said that, when he lost the balance, somebody held his arm firmly, and left it when his feet touched the ground. But nobody was seen around him.
People rejoiced to hear and know that it was Shri Gajanan Maharaj who saved the laborer. Shri Gajanan Maharaj would not let anybody be hurt in the construction of His temple. The laborer was very lucky to get the touch of Shri Gajanan Maharaj by this incident.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 Nov 2020
No comments:
Post a Comment