భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 105


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 105 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 10
🌻

437. ఇతడు భగవంతునితో ఏకత్వ మొందవలెననెడి రాసానుభూతిని, లాలసను, వియోగ విరహ వేదనను కలిగియుండును.

438. భావోత్పాదక మనస్సు (హృదయము) తో గల తాదాత్మ్యతయే దివ్యా ప్రేమయొక్క ప్రబల లక్షణము. ఇది చివరకు భగవంతునిలో ఏకత్వమునకు దారి తీయును.

439. ఇతనికి ఆలోచనలుండవు. స్థూల సూక్ష్మ చైతన్య స్థితులు కల్గినవారి అందరి భావములను హృదయములను పాలించును.

440. ఆరవ భూమికను దాటినప్పుడే మాయ అదృశ్యమగును.

సంస్కారముల అంతిమజాడ కూడా చేరిగిపోవును. సత్యానుభూతి కలుగును.

441. అంతర్ముఖ చైతన్యము సప్తమ భూమికను చేరువరకు ద్వైతము వ్రేలాడుచునే యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Nov 2020

No comments:

Post a Comment