కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 103


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 103 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -33 🌻

నీవు ఏ వ్యవహారాన్ని చేసినప్పటికి, ఇవాళ ఇడ్లీ వేశావు, దోశలు వేశావు, తినేశావు. అంతా ఇంద్రియ వ్యవహారమే కదా! కానీ, ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించావు. అక్కడ ఏమి తిన్నావు అనే దానికి విశేషం ఏమీ లేదన్నమాట! ఎందుకని అంటే, ‘అంతా ఈశ్వర ప్రసాదమే’ - అనేటటువంటి సామాన్య భావన ఉండాలి.

అట్లాగే, వ్యవహరించేటప్పుడు శ్రద్ధ కలిగి వ్యవహరించాలి. సాత్వికమైన శ్రద్ధను కలిగి వ్యవహరించాలి. రాజసిక, తామసిక శ్రద్ధను దూరం చేయాలి. అహాన్ని బలపరిచేటటువంటి విధానాన్ని మనం విడనాడాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.

కాబట్టి, పూర్వము అందరూ కూడా, మానవులు అందరూ కూడా భారతీయ సనాతన ధర్మం ఎప్పుడూ కూడా అహాన్ని నిరసించేటటువంటి విధానాన్నే మనకు ప్రతిపాదిస్తూ వచ్చింది. ప్రతీ ఒక్కరి ఇంట్లో కూడా అరటి చెట్టు ఉండేది. ఎందుకు ఉండేది అంటే? అరటి ఆకులో భోజనం చేయడం, అరటి ఆకులో టిఫెన్‌ చేయడం, ఆహారం వినియోగించడానికి, ఆహార సేవనానికి అరటి ఆకును వినియోగించేవారు.

తద్వారా సామాన్యమైనటువంటి జీవితం ఉండేది. సులభమైన జీవితం ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో మనము ఏమి చేశాము. విశేషమైనటువంటి కంచాలు తెచ్చుకున్నాము. విశేషమైనటువంటిది రీ-యూజబుల్ [reusable]. ఇప్పుడంతా యూజ్‌ అండ్‌ త్రో ఒక భాగమైతే, మరొక సమస్య రీ యూజబిలిటీ. తిరిగి తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడే వస్తువులన్నిటినీ సమీకరించుకోవడం మొదలు పెట్టాము. ఒక రకమైనటువంటి సమస్య ఎలా ఏర్పడిందయ్యా అంటే, ఇది ఒక సౌకర్యమూ, ఒక సమస్య కూడా!

మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా మనము, రోజూ ఉపయోగిస్తున్నాము, శుభ్రపరుస్తున్నాము, మరలా ఉపయోగిస్తున్నాము. అట్లాగే, మన ఇంట్లో వస్తువులను కూడా రోజూ ఉపయోగిస్తున్నాము, శుభ్రపరుస్తున్నాము, మరలా ఉపయోగిస్తున్నాము. ఏమి తేడా ఉంది? అక్కడికి, ఇక్కడికి? కాబట్టి, నువ్వు నివసిస్తున్నది ఎక్కడ అని అడిగితే, సాధకులందరూ శరీరంలోనే నేను నివసిస్తున్నాను, అనేటటువంటి మౌళికమైనటువంటి అవగాహనకు రావలసినటువంటి అసవరం ఉన్నది. శరీరమే నా ఇల్లు, నేను శరీరిని. దేహమే నా ఇల్లు, నేను దేహిని అనేటటువంటి నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది.

అలా ఎవరైతే, నిర్ణయాన్ని పొంది, శరీర త్రయ విలక్షణః, అనేటటువంటి సూత్రాన్ని, మనం లక్షణాన్ని పొందాలి.

ఆత్మయొక్క లక్షణాలలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది కూడా ఇదే! ‘శరీర త్రయ విలక్షణః’ ఎన్ని శరీరాలు ఉన్నాయి? స్థూలశరీరము వున్నది, సూక్ష్మశరీరము వున్నది, కారణ శరీరము వున్నది, మహాకారణ శరీరము కూడా ఉన్నది. మన కళ్ళకు కనపడుతన్నటువంటి, మనకు అనుభూతమౌతున్నటువంటి, మనకు సంవేదనలు ఇస్తున్నటువంటి, ఈ గోళకములు, నీకు పనిముట్లు.

కంటి ద్వారా చూస్తున్నావు, చెవి ద్వారా వింటున్నావు, ముక్కు ద్వారా వాసన చూస్తున్నావు, నోటి ద్వారా తింటున్నావు, స్పర్శేంద్రియము ద్వారా స్పర్శిస్తున్నావు, ఇవన్నీ కూడా ఆ యా పనిముట్లు. గోళకములు, ఇంద్రియములు. నరాల వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ వ్యవస్థ ద్వారా నీకు అనుభూత మొనరుస్తున్నటువంటి, సూక్ష్మమైనటువంటి అనుభూతి, పరిజ్ఞానం.

ఎందుకని అంటే, ఏమండీ! తీయగా ఉండడం అంటే ఏమిటి చెప్పగలరా? ఎవరైనా అని ప్రశ్నిచామే అనుకో, ఎంత సేపు ఉపన్యసించినా తీయగా అంటే ఏమిటో తెలుస్తుందా ఎప్పటికైనా? మీ అబ్బాయో మనుమడో అడిగాడు. ఇది తింటే ఎలా వుంటుంది? తియ్యగా ఉంటుంది.

తియ్యగా ఉంటుంది అంటే అన్నాడు, ‘తియ్యగా ఉంటుంది’ అంటే గురించి ఎంతసేపు ఉపన్యాసం చెప్పడం ఎందుకు? తిని చూస్తే తెలిసిపోతుంది. తిన్నాడు. తిని చూస్తే ఏం తెలిసింది? అనుభూతమయ్యింది. కాబట్టి, అనుభూటి మరలా ద్వివిధంబులు. ప్రత్యక్షానుభూతి, పరోక్షానుభూతి. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


14 Nov 2020

No comments:

Post a Comment