భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 99


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 99 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మానసిక గోళము - మనోభువనము - 4 🌻

411. సూక్ష్మ, మానసిక, గోళముల ద్వారా పొందుచున్న ఆధ్యాత్మిక ప్రగతి, కేవలము ఊహ మాత్రమే.

412. ఆత్మ, మనస్సు ద్వారా, మనోమయ గోళమందు ఎరుకను పొందుచున్నప్పుడు మానసిక శరీరముతో తాదాత్మ్యతను చెందుచున్నది.

413. నాల్గవ భూమికను దాటి అయిదవ భూమికలో ప్రవేశించుట యనగా-స్వర్గ ద్వారమును చేరుటయని అర్థము.

414. ఆత్మ మానసిక సంస్కారములను కలిగి ఉండి, మనస్సు యొక్క చైతన్యమునే కలిగి, మానసిక లోకానుభవమును పొందుచుండును.

415. మానసిక లోకానుభవము :-

(అంతర్దృష్టి, దివ్యదృష్టి) కేవలము చుచుటే భగవద్దర్శనము.

416. ఆత్మ, మానసిక సంస్కారములను కలిగివుండి, మానసిక శరీరంతో తాదాత్మ్యము చెంది, మనస్సే తానని భావించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


14 Nov 2020

No comments:

Post a Comment