🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 107 / Sri Gajanan Maharaj Life History - 107 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 20వ అధ్యాయము - 2 🌻
గణపత్ రావుకు తనభార్య యొక్క ఈవిధమయిన సలహా ఏమాత్రం నచ్చక, తను సామాజిక జీవితంకంటే పరమార్ధం గొప్పదిగా భావిస్తానని ఆమెతో అన్నాడు. అదేరోజు రాత్రి శ్రీమహారాజు అతని భార్యకలలో కనబడి, నీభర్తను ఏమాత్రం ఇకహింసించకు. అతనికి ఇష్టమయినట్టు చెయ్యనీ, దానివల్ల నువ్వు నష్టపోయేది ఏమీలేదు.
ఈ అశాశ్వతమయిన వస్తువుల కోసం ప్రేమ, మక్కువ ఉంచుకోకు. చివరికి ఈడబ్బు అంతా ఇక్కడే ఉండి, చేసిన మంచి చెడుపనులు మాత్రమే నీకుతోడుగా వస్తాయి. అభిషేకం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం అనేది చాలా మంచి పని ఎందుకంటే ఇందులో త్యాగం ఉంది, మరియు ఇతరుల కొరకు ఏదో చెయ్యబడుతోంది. దీనికోసం ఖర్చుపెట్టిన ధనం ఎప్పటికీ వృధాకాదు. ఇది భూమిలో విత్తనం నాటినట్టు, కాబట్టి అతనిని అటకాయించవద్దుని నేను చెపుతున్నాను అని అన్నారు.
మరుసటి రోజు ఉదయం ఆమె ఈస్వప్నం గురించి తనభర్తకు చెప్పగా అతను అదివిని చాలా సంతోషించాడు. అప్పుడు అతను షేగాంలో శ్రీమహారాజు ఇప్పటికీ ఉన్నారన్న పూర్తివిశ్వాసం ఉంచమని ఆమెకు ఉపదేశించాడు, మరియు ఈపిల్లలు, డబ్బు ప్రతీదీ శ్రీమహారాజుకు చెందినవి అని నమ్ముతూ వాటిగురించి చింతించడం మానమనికూడా చెప్పాడు. తరువాత చాలా సంతోషంగా గణపతిరావు దసరా రోజున శ్రీమహారాజుకు పూజలు అర్పించి దానికోసం ధారాళంగా ఖర్చుపెట్టాడు. అప్పటినుండి గణపతిరావుకు శ్రీమహారాజు పట్ల విశ్వాసం ఇంకా పటిష్టం అయింది.
ఇప్పుడు శ్రీలక్ష్మణ హరిజంజల్ అనుభవం వినండి. శ్రీగజానన్ మహారాజు భక్తుడయిన లక్ష్మణ వ్యాపారం పనిరీత్యా బొంబాయి వెళ్ళాడు. తన ఇంటివ్యవహారాలలోని కొన్ని ఇబ్బందులవల్ల అతను కలతచెందిన మనసులో ఉన్నాడు. అతను బొంబాయి స్టేషను తనతిరుగు ప్రయాణానికి వెళ్ళినపుడు, ఒక ఆజానుబాహుడు, కళ్ళునాశికాగ్రంపై కేంద్రీకృతమయి, భగవన్నామస్మరణ చేస్తున్న ఒక మునిని చూసాడు.
అతను లక్ష్మణునితో, శ్రీగజానన్ మహారాజు భక్తుడవు అయి కూడా అంత విసిగి పోయినట్టు ఎందుకు కనిపిస్తున్నావు ? అమరావతిలో పుణ్యతిధి జరిపేందుకు తయారీ చేస్తూ 400 మందికొరకు వంటకాలు తయారు చేయించినప్పుడు ఏమయిందో గుర్తుచేసుకో, ఆసమయంలో బాపట్ తనకుమారుడు చనిపోయినప్పటికీ, శ్రీపాటుర్కరుతో కలసి నీదగ్గరకు వచ్చి ప్రసాదం తీసుకున్నాడు, ఇదంతా శ్రీగజానన్ మహారాజు వాళ్ళకలలో కనబడి నీదగ్గరకు ప్రసాదం కొరకు వెళ్ళమని సలహా ఇచ్చిన కారణంగానే. ఇవన్నీ మర్చిపోయావా ? అన్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 107 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 20 - part 2 🌻
Ganapatrao did not like this sort of advice from his wife and told her that he treated divine truth (Parmarth) to be superior to domestic life. The same night Shri Gajanan Maharaj appeared in the dream of his wife and told her, Don't harass your husband any more. Let him do what he likes, and you are not going to be at a loss by that. Don't have love and attachment for the transient things. At the end all this money and clothes will stay here and only the good and bad deeds will accompany you.
Abhisheka and feeding of Brahmins is a good deed as it involves sacrifice, and is something that is done for others. Money spent on it is never wasted. It is like a seed sowed in the earth. So I tell you not to obstruct him. Next morning, she told about this dream to her husband who was very happy to know it.
He then advised her to have full faith about the continuing existence of Shri Gajanan Maharaj in Shegaon, and also to believe that all these children, money and everything belonged to Shri Gajanan Maharaj and therefore, to stop worrying about them.
Then Ganpatrao very happily offered the Puja to Shri Gajanan Maharaj on the Dashera day and spent generously on it. Since then Shri Ganpatrao's faith in Shri Gajanan Maharaj became more firm.
Now listen to the experience of Shri Laxman Hari Janjal. Laxman was a devotee of Shri Gajanan Maharaj and had gone to Bombay for some work in connection with his business. He was in disturbed mood due to certain domestic problems. When he went to Boribunder railway station for his return journey, he saw a tall sage with arms reaching his knees, eyes concentrated at the tip of nose and lips chanting the name of God.
He said to Laxman, Being a devotee of Shri Gajanan Maharaj, why are you looking frustrated? Remember what happened when you had made preparations to celebrate Punya Thithi (Death anniversary) at Amravati and had got food cooked for about 400 people; at that time Bapat had lost his son and, even then, he had come to you with Shri Pethkar to take prasad.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
14 Nov 2020
No comments:
Post a Comment