🌹. గీతోపనిషత్తు - 75 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 13. కర్తవ్యాచరణము - నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు. జీవుని పేరుకూడ 'నేను'యే . నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు." ఇది అనునిత్యము ధ్యానము చేయుచు కర్మలాచరించు వానిని కూడ కర్మలు బంధింపవు. 🍀
📚. 4. జ్ఞానయోగము - 14 📚
న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యో జానాతి కర్మభి ర స బధ్యతే || 14
“నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు. శ్రీకృష్ణుడు పలికిన ఈ వాక్యములో రెండు విధములగు అవగాహన గోచరించును. దైవము నిర్లిప్తుడని, కోరికల కతీతుడని, కావున అతడిచే నిర్వర్తింపబడుచున్న సృష్టి కర్మఫలము, అతనిని అంటదని ఒక అవగాహన.
దైవము పేరు 'నేను'. జీవుని పేరుకూడ 'నేను'యే. జీవుడు కూడ పై తెలిపిన వాక్యమును మరల మరల జ్ఞాపకము చేసుకొనవచ్చును. అది యేమనగా “నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు." ఇది అనునిత్యము ధ్యానము చేయుచు కర్మలాచరించు వానిని కూడ కర్మలు బంధింపవు.
కోరిక యున్నచోట బంధముండును. కోరిక లేనిచోట బంధముండదు. కావున ఫలము కోరక, కర్తవ్య మాచరించుట కర్మబంధము నుండి బయల్పడుటకు మార్గము. ఇది గీత బోధించు ప్రధాన సూత్రము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
14 Nov 2020
No comments:
Post a Comment