ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 90 / Sri Lalitha Chaitanya Vijnanam - 90 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా |
కుళామృతై
క రసికా, కుళసంకేత పాలినీ ‖ 36 ‖
🌻 90. 'కుళామృతైక రసికా'🌻
కుళామృతము నందు పరితృప్తి చెందినది అమ్మ యని అర్థము.
'కు?' అన భూమి. అది ఎచట లీనమగుచున్నదో అది కులం. భూతత్త్వము లీనమైనప్పుడు అమృతవర్షము కలుగుట కవకాశమేర్పడెను. మానవ శరీరమందు భూతత్త్వము లీనమగు కేంద్రము మూలాధారము. అందుండియే సుషుమ్న మార్గము కలదు. సుషుమ్న మార్గమే కులం. దాని ముఖద్వారమే మూలాధార కేంద్రము.
భూతత్త్వము లీనమై సాధకునికి కుండలినీ చైతన్యము మూలాధారము నుండి ప్రచోదనమై సుషుమ్న మార్గమున బ్రహ్మరంధ్రమును చేరును. అనగా సహస్రారము చేరును. అప్పుడు అమృతము స్రవించును. ఇదియే కుళామృతము. ఈ కుళామృతమున నున్నది అమ్మయే. దాని యందు వసించి, రమించుచుండును. అట్లు కులమందలి అమృతము నందు రమించునది. వసించునది శ్రీదేవి అని ఈ నామార్థము. కుండలినీ మార్గమున ఊర్ధ్వగతి చెందుట, అమృతమును పొందుట, అమరత్వమున వసించి రమించుట ఈ నామము సూచించుచున్నది.
1. జీవస్థితి
2. ముముక్షు
3. అమృత వర్షము
ప్రక్క పేజీలోని రేఖా చిత్రములను గమనింపుడు. మొదటి చిత్రము నందు జీవుడు త్రిగుణములకు లోబడి భూతత్త్వమున నివసించుచున్న నాల్గవవానిగ గుర్తింపవచ్చును. సమస్త భూమ్యాకర్షణల నుండి విముక్తు డైనచో అధోబిందువు త్రిభుజములోనికి చేరును. త్రిభుజములోనికి చేరనపుడు చతుర్భుజముగ నున్నది. చేరినపుడు త్రిభుజమైనది. త్రిభుజమందలి కేంద్రబిందువు సుషుమ్నకు ముఖ ద్వారము. అందుండి ఊర్ధ్వగతి చెంది సహస్రారము చేరుట మూడవ చిత్రమున చూడవచ్చును.
భూమ్యాకర్షణల నుండి విముక్తుడైన జీవుడు అంతర్ముఖుడై దేహాత్మభావన నుండి విముక్తుడగును. అనగా స్థూలము నుండి సూక్ష్మమునకు చేరును. సూక్ష్మమునుండి సూక్ష్మతరము, సూక్ష్మతమమునగు స్థితులను చేరును. అట్టివానికి కలుగునదే మధురానుభూతి. అతనికి సృష్టి మధురా నగరముగను, శ్రీదేవి ఆ నగర మహారాజ్జిగను గోచరించును. అట్టివానికి బహిరంతరము లంతయు మధురమే.
'మధురాధిపతే అఖిలం మధురం' అను స్తోత్రమున ఈ సత్యమే ఆవిష్కరింపబడినది. 'కు:' అనగా భూమి యని, అది లీనమగు చోటు 'కులం' అని ముందు తెలుపబడినది. కులమనగా సజాతీయ సమూహము అని కూడ అర్థము. సజాతీయ సమూహ మనగా ఒక చోటునుండి పుట్టి ఏర్పడిన గుంపు అని అర్థము.
త్రిగుణములు చైతన్యము నుండి ఉద్భవింపగ వాటినుండి జీవులు, పంచభూతాత్మక సృష్టి ఏర్పడినది. అన్నిటికిని మూల మొక్కటియే. కావున సృష్టి మొత్తము సజాతీయమే గాని విజాతీయము కాదు. చూడబడునది, చూచువాడు, చూచుట మూడింటికిని ఆధార మొకటియే. దీనినే జ్ఞానరూపమైన 'త్రిపుటి' అందురు.
త్రిపుటిని కూడ కులమనే పిలుతురు. త్రిపుటిగా సృష్టి నేర్పరచి ఆనందించు దేవి కనుక ఆమె 'రసిక' అయినది. సృష్టి వైవిధ్యమును జ్ఞానమార్గమున నెదిగినవారికి సృష్టి వైభవము ఆనందము కలిగించును. 'కుళం' అనగా శరీరము అని కూడ మరియొక అర్థము. రూపములను, శరీరములను ఏర్పరచి అందు శ్రీదేవి రమించుచున్నది. బంధనము లేక శరీరమున జీవించు పూర్ణ యోగులకిది అనుభవైకము.
మానవ శరీరము సర్వశక్తిమయము. అందులేనిది సృష్టియందు లేదు. అట్టి శరీరమందు జీవించుట అమితానందము నిచ్చును. శరీరముననే అమృతత్త్వమును అనుభూతి చెందవచ్చును. శరీరము లేనిచో దీని ననుభవించుటకు వీలుకాదు. శరీరము నందలి అమృతము ననుభూతి చెందవలెనన్నచో మథనము సాధింపవలెను.
మథనముననే అమృతము పుట్టినది కదా! అమృతము పుట్టుటకు ముందు దివ్యోపేతమగు ఎన్నియో సృష్టి విభూతులు పుట్టినవి కదా! అట్లే యోగాభ్యాసము కారణముగ సాగు సాధనయందు దివ్యానుభూతులు, కలుగుట అటుపైన అమృతత్త్వము నందు వుండుట జరుగును. ఈ రెండింటికిని ముందు అంతర్హితముగ నున్న విషము కూడ బయల్పడునని తెలియవలెను.
యోగమార్గమున షట్చక్రములను భేదించుకొనుచు కుండలిని చైతన్యము సహస్రార కమలమును చేరినపుడు అమృతము స్రవించును. ఇట్లు శరీరమందలి అమృతము స్రవించినచో కలుగునది బ్రహ్మానందము. దీని నందించునది కుండలినీ స్వరూపమగు శ్రీదేవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 90 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 90. Kulāmṛtaika-rasikā कुलामृतैक-रसिका (90) 🌻
From this nāma onwards till 111, the subtlest form of Lalitāmbikā will be discussed. Her subtle form is mantra form, either Pañcadaśī or ṣodaśī, Her subtler form is kāmakalā form and Her subtlest form is kuṇḍalinī.
Apart from these twenty two nāma-s, detailed descriptions of each cakra-s are mentioned in nāma-s from 475 to 534. But these nāma-s are classified under the head yogini nyāsa and more to do with physical description of the cakra-s.
She likes the taste of kulā. Kulā means the nectar or the ambrosial essence that flows from the sahasrāra. When kuṇḍalinī reaches the crown cakra and conjoins with Śiva a few drops of nectar like fluid, ambrosia will flow into the throat. This is also called amṛta varśini. She likes this kulā, not because of its taste, but because of her union with Śiva.
This kulā will flow only if kuṇḍalinī reaches sahasrārā. She would never like to move away from Śiva. That is why is she is also called mahā suvāsini (nāma 970) meaning the supreme amongst women of class (supreme sumaṅgali). kulā also means absorption of earth. It indicates mūlādhāra cakra. Mūlādhāra cakra is connected to earth element.
The path of kuṇḍalinī from the mūlādhāra cakra to the sahasrāra is also called kulā. Saundarya Laharī (verse 10) says ‘kulakuṇḍe kuhariṇi’ which means, a small orifice in the perineum. Through this orifice, kuṇḍalinī ascends to the higher cakras. Sages live only on this ambrosial essence, which never causes death even to the physical body.
There is yet another interpretation. Kulā also means a triad (it is called triputi, meaning three words that leads to a single goal.) In this case knower, known and knowledge are known as a triad. Knower is the sādhaka, knowledge is the path that leads the sādhaka to the known and known is Lalitāmbikā.
There should be no difference between these three and this knowledge alone leads to self-realization. At this stage, the duality ceases to exist and non-duality dawns.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
14 Nov 2020
No comments:
Post a Comment