వగీత - 114 / The Siva-Gita - 114




🌹. శివగీత - 114 / The Siva-Gita - 114 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 15

🌻. భక్తి యోగము - 3 🌻


అన్యత్ర భూతాద్భ వ్యాచ్చ - యత్ప్ర వక్ష్యామి తచ్చ్రుణు,

వదంతి యత్పదం వేదా - శ్శాస్త్రాణి వివిదానిచ 11


సర్వోప నిషదాం సారం -దద్నో ఘ్రుత మినోద్ద్రుతమ్,

యదిచ్చంతో బ్రహ్మ చర్యం - చరంతి మున యస్సదా. 12


తత్తే పదం సంగ్రహేణ - బ్రవీ మ్యోమితి యత్పదమ్ ,

ఏత దేవాక్షరం బ్రహ్మ - ఏత దేవాక్షరం పరమ్ 13


ఏత దేవాక్షరం జ్ఞాత్వా -బ్రహ్మ లోకే మహీయతే,

ఏత దాలంబనం శ్రేష్ఠ - మేత దాలంబనం పరమ్ 14


ఛందసాం యస్తు దేనూనా - మృత భత్వేన చోదితః,

ఇదమే వావధి స్సేతు- రమృత స్యచ ధారణాత్ 15


ఎటువంటి పరమ పదమును కలుగ చేయు వస్తువు పెరుగు నుండి దీయబడిన వెన్నవలె సమస్త శాస్త్రముల చేతను వేదములతోడను దీయబడినదో -ఏ వస్తువు కోరబడిన దై మునులచేత బ్రహ్మచర్య మాచరించ బడు చుండెనో అట్టి దానిని నీకు సంక్షిప్తముగా వివరింతును.

అదేమి టందువా ఓం కారము, అదే నాశరహిత మగు పరబ్రహ్మము. దానిని తెలసి కొనియే బ్రహ్మలోకమును పొందుదురు. ఇదే అక్షరము, ఇదే పరము.

ఛందస్సు లనెడు గోవుల కేది ఋషభ స్థానము పొందెనో (ప్రదానత్వ మనుట )అట్టిదే అక్షరము అవధి ( నియామకమనుట) మోక్ష ధారణ వలన సంసార సాగరమునకు దీరము వంటి దగును ( అజ్ఞాన నాశకమై మోక్షమును ప్రాపిం చేయు ).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 114 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 15

🌻 Bhakthi Yoga - 3
🌻

The kind of supreme state (parama padam), which is the message of the vedas obtained as like as butter is obtained from the curd.

That Paramapadam to obtain which the sages follow the path of Brahmacharya, such a paramapadam related details I would tell you in short now. That is the Omkara.

That is the indestructible Parabrahman. People attain to Brahman after knowing the Omkara. That is imperishable.

That is Param. Among all the chhandas when compared to cows this Omkara is like the Bull. This is the one which liberates one from the Samsaara.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


14 Nov 2020

No comments:

Post a Comment