శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 34 / Sri Devi Mahatyam - Durga Saptasati - 34


🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 34 / Sri Devi Mahatyam - Durga Saptasati - 34 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ


అధ్యాయము 10

🌻. శుంభ వధ - 1 🌻

1-3. ఋషి పలికెను : ప్రాణసమానుడైన తమ్ముడు నిశుంభుడు వధింపబడడం, సైన్యం రూపుమాప బడడం చూసి శుంభుడు క్రోధంతో ఇట్లనెను : "ఓ దుర్గా! బలగర్వంతో క్రొవ్విన నీవు ఆ గర్వాన్ని (నా వద్ద) చూపకు, ఎంత గొప్పదానవని అనుకున్నా నీవు ఇతరుల బలంపై ఆధారపడి యుద్ధం చేస్తున్నావు.

4-5. దేవి పలికెను : నేను ఈ లోకంలో ఒంటరి దాననే అయి ఉన్నాను. నేను కాక మటెవ్వరు ఉన్నారు? ఓ దుష్టుడా! నాశకులైన వీరు నాలోనికి ప్రవేశించడాన్ని చూడు.

6. అంతట బ్రహ్మాణి మొదలైనవారు (మాతృకలు) అందరూ దేవి శరీరంలో లీనమయ్యారు. అంబిక ఒక్కరిత మాత్రమే ఉంది.

7–8. అంతట దేవి పలికెను : నా శక్తిచే నేనిక్కడ నా నుండి వ్యక్తమైన రూపాల నన్నింటిని నేను మళ్ళీ ఉపసంహరించుకున్నాను. నేను ఒక్కదానిని మాత్రమే నిలిచివున్నాను. యుద్ధంలో స్థిరంగా ఉండు.

9-10. ఋషి పలికెను : ఆ ఇరువురికీ (దేవీశుంభులకు) ఘోర యుద్ధం ప్రారంభించారు. దేవాసురులందరూ చూస్తున్నారు.

11. బాణవర్షం కురిపిస్తూ, వాడి శస్త్రాలను, దారుణాస్త్రాలను ప్రయోగించుకుంటూ, వారిరువురూ మళ్ళీ సర్వలోక భయంకరంగా యద్ధం చేసారు.

12. అంబిక వందల కొద్దీ వేసిన దివ్యాస్త్రాలను ఆ రక్కసుల తేడు వాటికి మారుదెబ్బవైయగల అస్త్రాలతో త్రుంచివేసాడు.

13. అతడు ప్రయోగించిన దివ్యాస్త్రాలను భయంకరంగా హుంకరించడం మొదలైన కార్యాలచే పరమేశ్వరి అవలీలగా ఖండించింది.

14. అంతట ఆ రాక్షసుడు వందల కొద్దీ బాణాలతో దేవిని కప్పివేసాడు. దేవి కినుక పూని తన బాణాలతో అతని వింటిని ఛేదించింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 34 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


CHAPTER 10

🌻 The Slaying of Shumbha - 1
🌻

The Rishi said:

1-3. Seeing his brother Nisumbha slain, who was dear to him as his life, and his army being slaughter, Shumbha angrily said. 'O Durga who are puffed up with pride of strength, don't show your pride (here). Though you are exceedingly haughty, you, resorting to the strength of others, fight.' The Devi said:

4-5. 'I am all alone in the world here. Who else is there besides me? See, O vile one, these Goddesses, who are but my own powers, entering into my own self!'

6. Then all those, Brahmani and the rest, were absorbed in the body of the Devi. Ambika alone then remained. The Devi said:

7-8. ' The numerous forms which I projected by my power here - those have been withdrawn by me, and (now) I stand alone. Be steadfast in combat.' The Rishi said:

9-10. Then began a dreadful battle between them both, the Devi and Shumbha, while all the devas and asuras looked on.

11. With showers of arrows, with sharp weapons and frightful missiles, both engaged again in a combat that frightened all the worlds.

12. Then the lord of daityas broke the divine missiles, which Ambika discharged in hundreds, with (weapons) that repulsed them.

13. With fierce shout of hum and the like, the Paramesvari playfully broke the excellent missiles that he discharged.

14. Then the asura covered the Devi with hundreds of arrows, and the Devi in wrath split his bow with her arrows.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


14 Nov 2020

No comments:

Post a Comment