శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 84, 85 / Sri Lalitha Chaitanya Vijnanam - 84, 85

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 46 / Sri Lalitha Sahasra Nama Stotram - 46 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 84, 85 / Sri Lalitha Chaitanya Vijnanam - 84, 85 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :


హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః |

శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ‖ 34 ‖


🌻 84. 'హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధిః' 🌻

శివుని మూడవ కంటియందలి అగ్నిచే బూడిద చేయబడిన మన్మథుని పునర్జీవింపచేయు ఔషధము శ్రీమాత.

మన్మథు డహంకారుడై కామేశ్వరుని సైతము కామమున నిలుపవలెనని ప్రయత్నించెను. అహంకారుని చేష్టలకు మితి లేదు. అత నెవరిపైన నైనను కాలు దువ్వును. మహాకాలునిపై కాలుదువ్విన కాముని, కామేశ్వరుని నేత్రాగ్ని దగ్ధము చేసెను.

శివుని మూడవ కన్ను త్రిగుణాత్మక సృష్టికి మూలము. అది తెరచుకొన్నచో సమస్త సృష్టి అందులోనికి లయమగును. అది కాలాగ్ని స్వరూపము. ఆ అగ్నికి దగ్ధము కాని దేమియు లేదు. నిజమునకు అగ్ని స్వరూపము కూడ అమ్మయే. పరమశివుని నుండి ఉద్భవించు ప్రేరణ అగ్నిగ వ్యక్తమై వెలుగై నిలచును.

కాముడు శివునికి గురిపెట్టెను. అనగా అహంకారముతో నైనను ఆత్మ తత్త్వమునకే గురిపెట్టెను. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, కంసుడు శిశుపాల దంతవక్తులు అహంకారముతో నారాయణ తత్త్వము నెదిరించి ఆ తత్త్వమును చేరి శాశ్వతత్వమును పొందిరి. అట్లే కాముడు కూడ దగ్ధమై శివుని చేరి శాశ్వతుడయ్యెను.

ఇచట రహస్యమేమన కాముడు జీవుడుగ శాశ్వతుడే కదా! అతనికి మరణము లేదు. కాని అతని చేష్ట వలన అతని అహంకారము మరణించినది. అహంకారము మరణించిన కాముడు ఆత్మస్వరూపుడై నిలచినాడు. ఇది అనుగ్రహ కార్యమేకాని ఆగ్రహము కాదు. దైవము, కాలము, ప్రకృతి యొక్క ఆగ్రహము అనుగ్రహమునకే అని తెలియవలెను.

ఆగ్రహించినట్లు గోచరించినను దాని పర్యవసానము ఆనుగ్రహమే. ఔషధము చేదుగ నున్నప్పటికిని దాని పర్యవసానము శుభప్రదమే కదా! జీవుని మరణము మూడు దశలలో నుండును, ఒకటి భౌతిక దేహమున మరణించుట, సూక్ష్మ శరీరమున జీవించుట. రెండు సూక్ష్మదేహమున మరణించుట లింగదేహమున జీవించుట.

మూడు లింగదేహమున మరణించుట, ఆత్మస్వరూపుడై ప్రకాశించుట. ఇట్లు మూడుసార్లు మరణించి, మూడుసార్లు మరల జీవించి నిజస్థితి యందు నిలచుట జీవునికి ఆరోహణ క్రమమున జరుగును. వీని నన్నింటిని నిర్వర్తించినది శ్రీదేవియే.

హరుని నేత్రాగ్నికి భస్మమైన కాముని అహంకారము నుండి నిర్మూలించి ఆత్మ తత్త్వమున నిలిపినది ఆమె సంకల్పమే. కాముని యందు ఇచ్చారూపిణియై ప్రవేశించి కామునిచే చేష్టను గావించి శివుని నేత్రమునుండి అహంకారుమును దహించి, కాముని ఉద్ధరించిన 'సంజీవని' ఔషధముగ అమ్మను తెలియవలెను.

అపరిమితముగ దూషించిన అహంకార స్వరూపుడగు శిశుపాలుని శిరమును సుదర్శన చక్రముచే ఖండించి హృదయమునకు చేర్చుకొన్న శ్రీ కృష్ణుని చర్య కూడ యిట్టిదే. అతడు లలితా స్వరూపమే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 84 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻Haranetrāgni- sandagdha- kāmasaṃjīvanauṣadhīḥ हरनेत्राग्नि-सन्दग्ध-कामसंजीवनौषधीः (84) 🌻

Manmatha, the god of love was burnt by the third eye of Śiva. Śaktī resurrected Manmatha. Sañjīvana is an herbal medicine that causes resurrection. Therefore She is praised as sañjīvana for Manmatha. The motherly nature of Lalitai is highlighted here. Manmatha is the son of Śiva and Śaktī. When father is angry with his child, only the mother comes to its rescue. When Śiva was angry with Manmatha, Lalitai came to his rescue. Śiva is a strict disciplinarian.

There is a saying that when Śiva is angry, Guru can save a person and if Guru is angry Śiva cannot and will not save that person. Here Lalitai is in the form of a Guru which is substantiated in nāma 603. Śiva was angry with Manmatha and burnt him. But as a Guru, Lalitai saved Manmatha. But this explanation contradicts the general statement that Paramaśiva is the Supreme Guru or āti guru (the first Guru). Śiva is worshiped in Śrī Cakra in guru maṇḍala as Paramaśiva-anandanāda,

Hara also means the real nature of the self. Neta means showing the way. Agni, the fire exists everywhere and also causes destruction (one of the acts of agni is destruction, apart from creation). Śiva Sūtra ends by saying that that consciousness of a yogi exists both inwardly and outwardly. Agni also exists both inwardly and out worldly. Agni is used in the all the three acts of God.Therefore, haranetrāgni means that which shows the path to the supreme Self, causing the destruction of desires (kāma) etc which acts as blockades to realisation. The existence of agni everywhere could also mean the existence of ignorance everywhere (because of the presence of ignorance, agni has to exist to dispel ignorance). Ignorance is compared to darkness and the darkness is removed by the presence of agni.

The secretive meaning is that liberation means knowing the inner self which is possible only by eradication of ignorance or avidyā. When ignorance is removed, what remains is knowledge or vidyā. That is why the worship of Lalitai is called Śrī Vidyā. Burning of Manmatha is the removal of avidyā and his resurrection is vidyā. Manmatha before his killing was an embodiment of avidyā that mainly comprises of ego and resurrected Manmatha was with pure knowledge. His ego was burnt by Śiva and knowledge was given to him by Śaktī.

This nāma possibly could mean the power of the third eye or ājñā cakra wherein the Supreme Guru Śiva gives His commands, either directly or through great sages and saints to His devotees towards Self-realization. If one attaches importance to the usage of netra (eye), it could mean the third eye or ājñā cakra. In ājñā cakra the two nāḍi-s iḍā and piṅgala meet the suṣumna. Suṣumna is considered as the Brahma nāḍi. Iḍā and piṅgala could mean jīva or soul. The merger of soul with the Brahman is called Self-realization. Self-realization is conveyed here.

Saundarya Laharī begins by saying “Śiva becomes capable of creating the universe, only when united with Śaktī, but otherwise, He is incapable of even a throb.” (verse 1).

With this nāma, the verses about war with Bhandāsura ends.

The mantra form of Lalitai begins from the next nāma.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 85 / Sri Lalitha Chaitanya Vijnanam - 85 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :


హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః |

శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ‖ 34 ‖


🌻 85.85. 'శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా' 🌻

జ్ఞానము నొసగు మహిమతో కూడిన వాక్కుల పుట్టుక కల తామరము వంటి ముఖము కలది శ్రీదేవి అని అర్థము.

శ్రీమత్ అనగా జ్ఞానము నొసగు మహిమతో కూడినది అర్థము. జ్ఞానపూరితమగు వాక్కు అమ్మ ముఖమునుండి వ్యక్తమగుచున్నది. అమ్మ ముఖము యొక్క అందము ముందు నామములలో వివరింపబడినది. ఆమె ముంగురులు, ఫాలభాగము, కనుబొమలు, బొట్టు, నాసిక, చెక్కిళ్ళు, కపోలములు, పెదవులు, దంత పంక్తి, చుబుకము, చెవులు, ముఖమున ధరించిన ఆభరణములు అన్నియు

వివరముగ వర్ణింపబడినవి. అట్లే పాదముల వరకు కూడ వర్ణింప బడినవి. ఆమె చిరునవ్వు వర్ణింపబడినది. 14 నామము నుండి 51వ నామము వరకు అమ్మ రూప లావణ్య విశేషములు అందింపబడినవి.

ఇది అంతయూ స్థూలరూప ధ్యానము. ఇప్పుడు సూక్ష్మరూప ధ్యానము అందింపబడుచున్నది. ఆరాధన యందుగాని, సాధన యందుగాని దైవమును స్థూల రూపముగను, సూక్ష్మ రూపముగను ఆరాధించుట గలదు. ముందు స్థూలరూప ఆరాధన, అటుపైన సూక్ష్మరూప ఆరాధన, సూక్ష్మరూపము కూడ మూడు స్థితులలో నుండును. సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మ తమము. అమ్మ పంచదశీ మంత్రమున సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము ఇమిడియున్నవి. అది వరుసగ ఐదు గుంపులుగ నున్నవి.

అందు మొదటి ఐదు అక్షరములు సూక్ష్మరూపమును, రెండవ ఐదు అక్షరములు సూక్ష్మతర రూపమును, మూడవ ఐదు అక్షరములు సూక్ష్మతమమును తెలుపుచున్నవి. సూక్ష్మరూప మనగా మంత్రరూపము అని అర్థము. అందు మొదటి ఐదు అక్షరముల మంత్రరూపము 'శ్రీమత్' అని పిలుతురు. అది వాగ్రూపము. ఒక జీవుని మహిమ, జ్ఞానము అతని వాక్కు నుండియే తెలియును. జ్ఞానము కలిగిన వాక్కు మహిమతో కూడి యుండును. అట్టి వాక్కు గలవారినే శ్రీమంతులందురు. శ్రీమంతులనగా వాగ్వైభవము కలవారు. సృష్టి అంతయు వాగ్రూపమే. వాక్కుతోనే నిర్మింపబడినది.

అది శ్రీదేవి ముఖపంకజము నుండి పుట్టుచు నున్నది. అందువలన జ్ఞానమునకు, మహిమకు, శ్రీమంతమునకు ఆమెయే ఆధారము. ఈ నామమును ఉచ్చరించువారు, వాజ్నియమమును పాటించినచో క్రమముగ మహిమాన్వితులు కాగలరు. భగవంతుని ఆరాధన చేయుట, ప్రశంసచేయుట, గోష్టి చేయుట, జ్ఞాన యజ్ఞములు చేయుట- ఇత్యాదులకు వాడబడిన వాక్కు క్రమముగ మహిమను పొందును.

ఇట్టి సంస్కారము వాక్కునకు కలగవలె నన్నచో పంచదశీ మంత్రమున గల మొదటి ఐదు అక్షరములను ఉపాసించ వలెను. 'క, ఏ, ఈ, ల, హ్రీం' అనునవి మొదటి పంచాక్షరములు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 85 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


Śrīmadvāgbhava-kūṭaika-svarūpa-mukha-paṅkajā श्रीमद्वाग्भव-कूटैक-स्वरूप-मुख-पङ्कजा (85)

Beginning this nāma, Her Pañcadaśī mantra is being explained. Pañcadaśī mantra has been explicated in detail in the introductory chapter.

Now, the description of Her subtle form begins. Her subtle form comprises of three divisions viz. subtle, subtler and the subtlest. Subtle form is Pañcadaśī mantra. Her subtler form is kāma-kalā, nāma 322. kāmakalā-rūpā.

Her subtlest form is kuṇḍalinī śaktī (nāma 110). In this nāma, Her face is compared to the first kūṭa viz. vāgbhava-kūṭa of Pañcadaśī mantra, which gives knowledge and wisdom.

The prefix Śrīmad is used here to indicate the power of Pañcadaśī mantra as a whole. Śrīmad also indicates the respect given to the mantra. Since this kūṭa is described first, this prefix is added to this nāma.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



11 Nov 2020

No comments:

Post a Comment