🌹. శివగీత - 111 / The Siva-Gita - 111 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 14
🌻. పంచ కోశో పాసన - 7 🌻
ఏవం మనస్సమాదాయ - సంయతో మనసి ద్విజః,
అధ ప్రవర్త యేచ్చిత్తం - నిరాకారే పరమాత్మని .32
తతో మనః ప్ర గృ హ్ణాతి - పరాత్మానం హాయ్ కేవలమ్,
యత్తద ద్రేశ్యమ గ్రాహ్య - మస్థూలా ద్యుక్తి గోచరమ్ 33
భగవన్ శ్రవణే నైవ - ప్రవర్తంతే జనాః కధమ్ ,
వేద శాస్త్రార్ద సంపన్నా - యజ్వాన స్సత్య వాదినః 34
శృణ్వంతో పిత దాత్మానాం - జానంతే నైవ కేచన,
జ్ఞాత్వాపి మన్యతే మిధ్యా - కిమేత త్తవ మాయయా 35
ఎవ మేవ మహా బాహొ - నాత్ర కార్య విచారణా,
దైవీ హ్యేషా గుణ మయీ- మామ మాయా దురత్యయా 36
మామేవ యే ప్రపద్యంతే - మాయా మేతాం తరం తితే,
అభాక్తాయే మహాబాహొ - మమ శ్రద్దా విర్జితాః 37
ఫలం కామయ మానాస్తే - చైహి కాముష్మి కాదికమ్,
క్షయి ష్ణల్పం సాతి శయం - తతః కర్మ ఫలం మతమ్ 38
తద విజ్ఞాయ కర్మాణి - యే కుర్వంతి నరాధమా: ,
మాతు: పతంతితే గర్భే - మృత్యో ర్వక్త్రే పునః పునః 39
నాన యోనిషు జాతస్య - దేహినో యస్య కస్యచిత్,
కోటి జన్మార్జి తై: ర్మయి భక్తి: ప్రజాయతే. 40
మహా బాహులు గల ఓ రామా ! ఇది యింతే, ఈ విషయమున ఏ మాత్రము చింతింప వలదు, సత్వ రజ తమో గుణాత్మ మగు నా యీ దైవ మాయను దాస శక్యము గానిది. నిన్నెవరు సంపూర్ణముగా శరణుబొందు చున్నారో అట్టి వారు ఈ మాయను దాటగలరు.
ఓ మాహాబాహొ! నా యందు శ్రద్దా సక్తులు లేక, నన్నారాధింపక, ఇహ పరలోక కామ్య ఫలము నాసించుచు సంచరించే వారు నశించు స్వభావము గల స్వాతి శయ మైన కర్మ ఫలమును పొందుదురు.
ఆ విషయమును తెలియకయే నపరాధములు కర్మ ఫలము నాచరింతురో అట్టివారు మాటిమాటికి మాతృ గర్భము నుండి పుట్టుచు ,మృత్యువు ముఖమున బడి మరణిస్తూ పలు బాధలను అనుభవిన్తురు.
నానా యోనులందు జన్మించు జీవులలో నెవ్వరికో ఒక్కరికి మాత్రము అనేక జన్మముల పుణ్యా ర్జితము వలన నా యందు భక్తి కలుగు చున్నది.
స ఏవ లభతే జ్ఞానం - మద్భక్త శ్శ్రద్ద యాన్వితః ,
నాన్య కర్మాణి కుర్వాణో - జన్మ కోటి శతై రపి. 41
తత స్సర్వం పర విత్యజ్య - మద్భక్తిం సముదాహార,
సర్వ ధర్మా స్సరిత్యజ్య - మామేకం శరణం వ్రజ 42
అహంత్వా సర్వ పాపేభ్యో- మోక్ష యిష్యామి మాశచు:,
యత్కరోషి యదశ్నాసి - యజ్ఞుహో పిద దాసియత్ 43
యత్తవ స్యసి రామ ! త్వం - తత్కురు ష్వమ దర్పణమ్,
తతః పరతరా నాస్తి - భక్తర్మయి రఘూత్తమ ! 44
ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయ చతుర్ధ శో ధ్యాయః
నాపై శ్రద్ధ భక్తులు కలిగి నన్ను పూజించు వాడే జ్ఞానమును పొందును. శతకోటి కామ్య కర్మలు చేసినప్పటికిన్ని యిట్టి జ్ఞానమును పొంద నేరడు. కనుక సర్వమును బరిత్యజించి నా యందలి భక్తిని సాధించుము.
సమస్త ధర్మములను పరిత్యజించి నన్నొక్కడినే శరణు పొందుము. నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తిని కలుగ చేసెదను. దుఃఖించకుము. ఓయీ రామా! నీవు చేయునది, భుజించునది, హోమము చేయునది, దాని మొనర్చునది, నీవు తపస్సు చేయున దంతయు నునా కర్పించుము. నా యందలి భక్తి కలిగి యుండుటే సర్వోత్కృష్ట మైనది. ఇంతకంటెను సర్వోత్కృష్ట మైనది . మరోకటేదియును లేదు.
ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణ మందలి శివ గీతలో నుపషత్తు బ్రహ్మ విద్య యందు యోగ శాస్త్రము శ్రీ శివ రామ సంవాదమున పంచ కోశ నిరాకరణము యోగము చతుర్దశాధ్యాయము పరి సమాప్తము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 111 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 14
🌻 Panchakoshopasana - 7 🌻
Lord Shiva said:
O Rama of mighty arms! This is it. No need to worry about these things. This Maya which comprises of Satwa, rajo and Tamo qualities; cannot be sailed across by anyone. Only those who surrendering themselves totally take my refuge, such humans only get ferried from this maya.
O Rama! People devoid of devotion and faith in me, do Kamyakarmas (karmas expecting returns), and get the decaying fruition of their karmas.
Ignorant people who run after the enjoyments to gain temporary happiness, they take birth again and again from the wombs of mothers. and again repeatedly keeps going inside the mouth of the death and experience innumerable sorrows in lives.
After taking billions of births from many wombs there exists one in a billion who due to his accumulated virtues over his billions of births gains interest in me and gets devoted to me. And that fortunate one who gains interest and devotion in me, gains the divine knowledge. One cannot gain this knowledge by performing billions of any other Karmas.
Therefore discard everything and get focussed only on me. Rejecting everything else, take my refuge, I would deliver you from all sins and give you liberation. Do not feel sorrowful of anything.
Therefore O Rama! Whatever you do, whatever you eat, whatever you offer to the sacrificial fire, whatever you give as donation, whatever austerities you perform, everything offer to me. To remain devoted to me is the best thing to do. There is nothing superior to that.
Here ends the chapter 14 of Shiva Gita from padma Purana Uttara Khanda
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
11 Nov 2020
No comments:
Post a Comment