🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 96 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక గోళము - మనోభువనము - 1 🌻
403. మనో భువనము
ఇది కేవలము భౌతిక, సూక్ష్మగోళముపై స్వతంత్రమైనది. దివ్యత్వము వలన స్వతంత్రముగా పోషింప బడుచున్నది.
404. వ్యక్తిగత మనస్సునకు, సామూహిక మనస్సునకు సార్వభౌమిక (విశ్వ) మనస్సునకు మానసిక గోళము నిలయము.
405. మానసికగోళము భౌతిక, సూక్ష్మగోళములను మొదటి నుండియు అభివ్యాప్తమై యున్నది.
406. మానసిక గోళము బుద్ధికి, ప్రజ్ఞకు, అంతర్దర్శనమునకు, ఆత్మప్రకాశమునకు సంబంధించినది.
407. మానసిక గోళము ఎన్నడును సత్యగోళమును స్పృశించలేదు. సత్యగోళము స్వయంరక్షకము స్వయం పోషకమైనది. శాశ్వతములో "అహం బ్రహ్మాస్మి" యనెడు భగవంతుని స్థితి యందు ఎరుక కలిగియున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Nov 2020
No comments:
Post a Comment