🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 104 / Sri Gajanan Maharaj Life History - 104 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 19వ అధ్యాయము - 12 🌻
హరిపాటిల్ నుండి వేరు అవుతాననే ఆలోచనతో కళ్ళు నీళ్ళతో నిండాయి. ఓగురుదేవా మీ ఈకళ్ళలో నీళ్ళు ఎందుకు ? నేను ఏవిధంగానయినా మిమ్మల్ని నొప్పించానా ? దయచేసి వెంటనే చెప్పండి అని హరిపాటిల్ చేతులు కట్టుకుని అన్నాడు. నేను దీనికి కారణం చెప్పినా నువ్వు బహుశ అర్ధం చేసుకోలేవు. ఇది చాలాగూఢమయిన జ్ఞానం. దానిగురించి తెలుసుకుందుకు నువ్వు ఇప్పుడు చితించనవసరంలేదు.
మన సాంగత్యం ఇక పూర్తి అవవచ్చింది అన్నది ఒక్కటే నేను చెప్పగలను, పద మనం షేగాం వెనక్కి వెళదాం, నీకు నీతరువాత కుటుంబీకులకి ఎప్పటికీ ఏవస్తువుకి కొరతరాదు అని శ్రీమహారాజు జవాబు ఇచ్చారు.
పండరపూరు నుండి తిరిగి వచ్చాక, దైవిక విధులు అన్నీ జరపబడ్డాయి, కానీ హరిపాటిల్ మాత్రం ఆదుర్దాతో ఉన్నాడు.
తనసాంగత్యం అంతం అయ్యేసమయం వచ్చిందని శ్రీమహారాజు తనతో అన్న విషయం మిగిలిన వారందరితో అతను చెప్పాడు. శ్రావణమాసం పూర్తి అయింది. శ్రీమహారాజు రోజురోజుకీ నీరసిస్తున్నారు. తరువాత భాద్రపదమాసం వచ్చింది.ఇకవినండి ఏమయిందో......... ఆరోజు వినాయకచవితి, మీరందరూకూడా గణపతి విసర్జనానికి మఠానికి రావాలి. చవితినాడు మట్టితో గణపతినిచేసి పూజలుచేసి మిఠాయిలు ఇచ్చిన తరువాత, ఆయనను మరుసటిరోజు నీళ్ళలో నిమర్జనం చెయ్యాలిఅని గణేశపురాణంలో చెప్పబడింది.
ఆరోజు ఇప్పుడు వచ్చింది, ఆఉత్సవాన్ని నా ఈశరీరాన్ని నీళ్ళలో నిమర్జనం చెయ్యడంద్వారా జరుపుకోవాలి. అసలు ఎవరు ఏడవకూడదు, నేను ఎప్పుడూ ఇక్కడే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటానని మరువకండి. నేను మిమ్మల్ని ఎప్పటికీ మరువలేను. బట్టలు మార్చినవిధంగా శరీరాన్ని మారుస్తూ ఉండాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడుకి చెప్పారు.
బ్రహ్మవేత్తలు అందరూకూడా ఇదేపని చేసారు అని గుర్తుంచుకోండి. వాళ్ళు ఉత్త శరీరాన్ని మాత్రమే మార్చారు అని శ్రీమహారాజు అన్నారు. చవితినాడు రోజంతా శ్రీమహారాజు చాలా ఆహ్లాదకరమయిన మనసుతో బాలాభవ్తో గడిపారు. మరుసటిరోజు బాలాభవ్ చెయ్యిపట్టుకుని తనప్రక్కన కూర్చుండబెట్టి, నేను నిన్ను విడిచి వెళ్ళిపోయాను అని అనుకోకు, నీభక్తిని ఎదావిధిగా ఉంచి, నన్ను ఎప్పటికీ మర్చిపోకు, నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను అని అన్నారు. అలా అంటూ ఆ మహాయోగి ప్రాణాయామం ద్వారా తన శ్వాశను ఆపివేసి తలలోకి తీసుకు పోయారు.
ఆరోజు శక సం. 1832 సాధారణ నామసంవత్సరం, భాద్రపద శుద్ధపంచమి గురువారం మధ్యాహ్న సమయం. ఆవిధంగా శ్వాశ నిలబెడుతూ జైగజానన్ అనే మాటలు అంటూ షేగాంలో అతీతుడయిన బ్రహ్మలో తనని విలీనం చేసుకున్నారు. ఆయన కదలికలన్నీ ఆగిపోయాయి. శ్రీమహారాజు సమాధిని చూసి దుఖంతో అందరూ కళ్ళనీళ్ళు కార్చారు. తరువాత శ్రీమహారాజు సమాధి పొందినట్టు షేగాంలో బహిరంగపరిచారు.
ఈ వార్త తెలియగానే ప్రజలు దుఖంతో ఛాతీకొట్టుకోడం మొదలెట్టారు. వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు మన జీవంతమైన భగవంతుడు. ఎల్లప్పటికి రానివిధంగా వెళ్ళిపోయారు. పేదలని, దిగజారినవారిని కాపాడేవారు వెళ్ళిపోయారు. కాలం అనే గాలి జ్ఞానం అనే ఈ మంటను ఆపివేసింది. ఓగజాననా మమ్మల్ని ఇప్పుడు ఎవరు రక్షిస్తారు ? ఇంత త్వరగా మమ్మల్ని వదలి ఎందుకు వెళ్ళిపోయారు ? అని వాళ్ళు అన్నారు. శ్రీమహారాజు భక్తులు మార్తాండపాటిల్, హరిపాటిల్, విష్ణుసా, బనకటలాల్, తారాచంద్, శ్రీపతిరావు, కులకర్ణి మఠానికి చేరారు.
ఆరోజు పంచమి. శ్రీమహారాజును మరుసటిరోజు సమాధిలో కప్పి ఉంచేందుకు అందరూ నిశ్చయించారు. శ్రీమహారాజు ఇక ఎన్నటికీ కనిపించరు కనుక, సాయంత్రం వరకూ భక్తులుచివరి దర్శనం చేసుకునేందుకు వేచి ఉండేందుకు సలహాఇచ్చారు. అదృష్ట వంతులకు దర్శనం దొరుకుతుంది అనివాళ్ళు అన్నారు. కాబట్టి దూరప్రదేశాలకు శ్రీమహారాజు సమాధి విషయంగూర్చి వార్త పంపించారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 104 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 19 - part 12 🌻
After their return from Pandharpur, all the religious rituals (Mavanda) were performed, but Hari Patil was full of anxiety. He told other people about what Shri Gajanan Maharaj had said about their association coming to an end. Shravana month passed and Shri Gajanan Maharaj was getting weak every day. The Bhadrapada came.
Now listen to what happened. On Ganesh Chathurti day Shri Gajanan Maharaj said, Now all of you should come to the Math for immersion of Ganapati. It is said in Ganesh Purana, that an idol of earth Ganapati be made on Chathurti and after offering Puja and sweets, should be immersed in water the following day.
That day has now dawned, and it should be celebrated by immersing my earthly body in water. Don't weep at all. Do not forget that I shall ever be here to protect and guide you. I can never forget you. Shrikrishna has told Arjuna in Geeta that, this body has to be changed like clothes.
Remember that all the Brahmavetta (Saints) did the same thing, i.e. they only changed their body.” Shri Gajanan Maharaj passed the whole day of Chathurti in a happy mood along with Balabhau. Next day he held Balabhau's hand and made him sit beside Him. Then He said, Don't think that I have left you, keep up your Bhakti, and never forget me.
I am always here. Saying so, that great saint stopped His breath, and pulled it up to His head by Pranayam. It was the noon of Thursday, Bhadrapada Shudha Panchami, Sadharan-nam - Sanvatsar, shak 1832. While holding up His breath, He uttered the words Jai Gajanan, and merged Himself with the Supreme Brahma at Shegaon.
All His movements stopped. Looking to the Samadhi of Shri Gajanan Maharaj all shed tears of sorrow. Then it was publicly announced in Shegaon that Shri Gajanan Maharaj had attained Samadhi. With the spread of this news, people started beating their chest with grief. They said, Gone, Gone is our living God - Gone for ever.
Gone is the saviour of the poor and the fallen. Gone is our nest of happiness. The wind of time has extinguished the flame of knowledge. O Gajanan, who will protect us now? Why have you left us so soon? All the devotees of Shri Gajanan Maharaj , namely Martand Patil, Hari Patil, Vishnusa, Bankatlal, Tarachand, Shripatrao Kulkarni gathered in the Math.
It was the day of Panchami, and all of them decided to close Shri Gajanan Maharaj in Samadhi the next day. Since Shri Gajanan Maharaj was now to disappear forever, they proposed to wait till evening for the devotees to come for the last Darshan. They said that those who were fortunate would get the Darshan. So the message was sent to outside places about Shri Swamiji's Samadhi.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
11 Nov 2020
No comments:
Post a Comment