2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 176, 177 / Vishnu Sahasranama Contemplation - 176, 177🌹
3) 🌹 Daily Wisdom - 2🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 136🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 10 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 157 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 81 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 153 / Sri Lalita Chaitanya Vijnanam - 153 🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 494 / Bhagavad-Gita - 494 🌹
10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 102 📚
11) 🌹. శివ మహా పురాణము - 300 🌹
12) 🌹 Light On The Path - 55 🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 187 🌹
14) 🌹 Seeds Of Consciousness - 251 🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 126 🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 90 / Sri Vishnu Sahasranama - 90🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 583 / Bhagavad-Gita - 583 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 28 🌴*
28. ఆశ్రద్దయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థ! పరమపురుషుని యందు శ్రద్ధలేకుండా ఒనర్చునటువంటి యజ్ఞము, దానము లేదా తపస్సనునది ఆశాశ్వతమైనది. “అసత్” అని పిలువబడు అట్టి కర్మ ప్రస్తుతజన్మము నందును, రాబోవు జన్మము నందును నిరుపయోగమే.
🌷. భాష్యము :
ఆధ్యాత్మిక లక్ష్యమనునది లేకుండా ఒనర్చుబడునదేదైనను వాస్తవమునకు వ్యర్థమైనదే. అట్టి కర్మ యజ్ఞమైనను, దానమైనను లేదా తపమైనను నిరుపయోగమే కాగలదు. కనుకనే అట్టి కర్మలు హేయములని ఈ శ్లోకమున ప్రకటింపబడినది. వాస్తవమునకు ప్రతికర్మయు శ్రీకృష్ణభగవానుని నిమిత్తమై కృష్ణభక్తిభావనలో ఒనరింపవలసియున్నది.
అటువంటి శ్రద్ధ మరియు తగిన నిర్దేశము లేనిచో ఎట్టి ఫలమును లభింపబోదు. సమస్త వేదవాజ్మయమున పరమపురుషుని యందలి శ్రద్ధయే ఉపదేశింపబడినది. వేదోపదేశముల అనుసరణము యొక్క ముఖ్యలక్ష్యము శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుటయే.
ఈ విషయమును మరియు నియమమును పాటించకుండా ఎవ్వరును జయమును పొందలేరు. కనుక ఆధ్యాత్మికగురువు నేతృత్వమున తొలినుండియే కృష్ణభక్తిభావనలో కర్మ నొనరించుట ఉత్తమోత్తమ మార్గము. సర్వమును విజయవంతమొనర్చుటకు ఇదియే ఉత్తమమార్గము.
బద్దజీవనమునందు జనులు దేవతలను, భూతప్రేతములను లేదా కుబేరుడు వంటి యక్షులను పూజించుటకు ఆకర్షితులగుదురు.
సత్త్వగుణము రజస్తమోగుణముల కన్నను మెరుగైనదైనను, కృష్ణభక్తి యందు ప్రత్యక్షముగా నిలిచినవాడు త్రిగుణములకు అతీతుడు కాగలడు. గుణములందు క్రమముగా ఉన్నతిని పొందు మార్గమొకటున్నను భక్తుల సాంగత్యమున ప్రత్యక్షముగా కృష్ణభక్తిలో మనుజుడు నిలువగలిగినచో అది ఉత్తమమార్గము కాగలదు.
అదియే ఈ అధ్యాయమున ఉపదేశింపబడినది. ఈ విధానమున జయమును సాధింపగోరినచో మనుజుడు తొలుత సరియైన గురువును పొంది ఆయన నిర్దేశమునందు శిక్షణను బడయవలసియుండును. పిదప అతడు శ్రీకృష్ణభగవానుని యందు శ్రద్ధను పొందగలడు.
కాలక్రమమున అట్టి శ్రద్ధ పరిపక్వమైనపుడు కృష్ణప్రేమగా పిలువబడును. ఆ ప్రేమయే సర్వజీవుల అంతిమలక్ష్యము. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావనను ప్రత్యక్షముగా స్వీకరింపవలెననుట ఈ సప్తదశాధ్యాయపు సందేశమై యున్నది.
శ్రీమద్భగవద్గీత యందలి “శ్రద్ధాత్రయవిభాగములు” అను సప్తదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 583 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 17 - The Divisions of Faith - 28 🌴*
28. aśraddhayā hutaṁ dattaṁ
tapas taptaṁ kṛtaṁ ca yat
asad ity ucyate pārtha
na ca tat pretya no iha
🌷 Translation :
Anything done as sacrifice, charity or penance without faith in the Supreme, O son of Pṛthā, is impermanent. It is called asat and is useless both in this life and the next.
🌹 Purport :
Anything done without the transcendental objective – whether it be sacrifice, charity or penance – is useless.
Therefore in this verse it is declared that such activities are abominable. Everything should be done for the Supreme in Kṛṣṇa consciousness. Without such faith, and without the proper guidance, there can never be any fruit. In all the Vedic scriptures, faith in the Supreme is advised. In the pursuit of all Vedic instructions, the ultimate goal is the understanding of Kṛṣṇa.
No one can obtain success without following this principle. Therefore, the best course is to work from the very beginning in Kṛṣṇa consciousness under the guidance of a bona fide spiritual master. That is the way to make everything successful.
Although there is a process of gradual elevation, if one, by the association of pure devotees, takes directly to Kṛṣṇa consciousness, that is the best way. And that is recommended in this chapter. To achieve success in this way, one must first find the proper spiritual master and receive training under his direction.
Then one can achieve faith in the Supreme. When that faith matures, in course of time, it is called love of God. This love is the ultimate goal of the living entities. One should therefore take to Kṛṣṇa consciousness directly. That is the message of this Seventeenth Chapter.
Thus end the Bhaktivedanta Purports to the Seventeenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Divisions of Faith.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 176, 177 / Vishnu Sahasranama Contemplation - 176, 177 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻176. మహాద్యుతిః, महाद्युतिः, Mahādyutiḥ🌻*
*ఓం మహాద్యుతయే నమః | ॐ महाद्युतये नमः | OM Mahādyutaye namaḥ*
మహాద్యుతిః, महाद्युतिः, Mahādyutiḥ
మహతీ ద్యుతిః బాహ్యా అభ్యంతరా చ అస్య బాహ్యము అనగా వెలుపలగా కనబడునదీ, అభ్యంతరా అనగా లోపలగా జ్ఞాన రూపమగునదీ అగు గొప్ప ద్యుతి లేదా కాంతి లేదా తేజము ఇతనికి కలదు.
:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
మ. ఒక వేయర్కులు గూడిగట్టి కరువై యుద్యత్ప్రభాభూతితో
నొకరూపై చనుదెంచు మాడ్కి హరి దా నొప్పారె; నా వేలుపుల్
వికలాలోకనులై, విషణ్ణమతులై; విభ్రాంతులై మ్రోలఁ గా
నక శంకించిరి కొంత ప్రొద్దు; విభుఁ గానం బోలునే వారికిన్? (159)
మహావిష్ణువు వేయ్యిసూర్యుల తేజస్సు ఒకటిగా పోతపోసిన కాంతివైభవంతో ప్రకాశించినాడు. దేవతల చూపులు చెదిరిపోయినాయి. ధ్యానిస్తూ వారు స్వామిని చూడగానే కొంతసేపు భయపడినారు. ప్రభువును చూడటం వారికి సాధ్యం కాదు కదా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 176🌹*
📚 Prasad Bharadwaj
*🌻176. Mahādyutiḥ🌻*
*OM Mahādyutaye namaḥ*
Mahatī dyutiḥ bāhyā abhyaṃtarā ca asya / महती द्युतिः बाह्या अभ्यंतरा च अस्य One who is intensely brilliant both within and without. Here brilliance also indicates blissful knowledge.
Śrīmad Bhāgavata - Canto 8, Chapter 6
Evaṃ stutaḥ suragaṇairbhagavānharirīśvaraḥ,
Teṣāmāvirabūdrājansahastrārkodayadyutiḥ. (1)
:: श्रीमद्भागवते अष्टम स्कन्धे प्रथमोऽध्यायः ::
एवं स्तुतः सुरगणैर्भगवान्हरिरीश्वरः ।
तेषामाविरबूद्राजन्सहस्त्रार्कोदयद्युतिः ॥ १ ॥
Lord Hari, being thus worshiped with prayers by the gods and Lord Brahmā, appeared before them. His bodily effulgence resembled the simultaneous rising of thousands of suns.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः ।अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥
Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ ।Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 177 / Vishnu Sahasranama Contemplation - 177 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻177. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ🌻*
*ఓం అనిర్దేశ్యవపుషే నమః | ॐ अनिर्देश्यवपुषे नमः | OM Anirdeśyavapuṣe namaḥ*
అనిర్దేశ్యం ఇదం తత్ ఇతి పరస్మై నిర్దేష్టుం అశక్యం స్వసంవేద్యత్వాత్ వపుః అస్య పరమాత్ముని శరీరము లేదా స్వరూపము సాధకునకు తనచే మాత్రమే తెలియ దగినది లేదా అనుభవగోచరము కాదగినది యగుటచేత ఇతరులకు ఆతని స్వరూపము ఇది, అది, అట్టిది అని నిర్దేశించబడుటకు శక్యముకాని స్వరూపము ఇతనికి కలదు.
:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ. ఇట్లు సర్వాత్మకంబై యిట్టి దట్టి దని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణునియందుఁ జిత్తంబుఁ జేర్చి తన్మయుండయి పరమానందంబునం బొంది యున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుడు దన కింకరుల చేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబులైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం జూచి. (196)
ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. మనస్సు మహావిష్ణునియందు నిల్పి తనను తానే మరిచిపోయాడు. దివ్యమైన ఆనందంతో పరవశించి పోయాడు. పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలం అవుతాయో అదే విధంగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పెట్టే భయంకర బాధలన్నీ విఫలమై పోయాయి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 177🌹*
📚 Prasad Bharadwaj
*🌻177. Anirdeśyavapuḥ🌻*
*OM Anirdeśyavapuṣe namaḥ*
Anirdeśyaṃ idaṃ tat iti parasmai nirdeṣṭuṃ aśakyaṃ svasaṃvedyatvāt vapuḥ asya / अनिर्देश्यं इदं तत् इति परस्मै निर्देष्टुं अशक्यं स्वसंवेद्यत्वात् वपुः अस्य As He cannot be indicated to others by saying "This is His form." Because He is to be known by oneself. He has a body or nature which cannot be so indicated in a generic form. So He is Anirdeśyavapuḥ.
Śrīmad Bhāgavata - Canto 7, Chapter 6
Pratyagātmasvarūpeṇa dr̥śyarūpeṇa ca svayam,
Vyāpyavyāpakanirdeśyo hyanirdeśyo’vikalpitaḥ. (22)
:: श्रीमद्भागवते - सप्तमस्कन्धे, षष्टोऽध्यायः ::
प्रत्यगात्मस्वरूपेण दृश्यरूपेण च स्वयम् ।
व्याप्यव्यापकनिर्देश्यो ह्यनिर्देश्योऽविकल्पितः ॥ २२ ॥
He is indicated as that which is pervaded and as the all-pervading Supersoul, but actually He cannot be indicated. He is changeless and undivided. He is simply perceived as the supreme sac-cid-ānanda. Being covered by the curtain of the external energy, to the atheist He appears nonexistent.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः ।अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥
Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ ।Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 2 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 The Upanishads are Thoroughly Spiritual 🌻*
The Upanishads are thoroughly spiritual and, hence, advocate the most catholic doctrine of the yoga of Truth-realisation. Their teachings are not the product of an intellectual wonder or curiosity, but the effect of an intense and irresistible pressure of a practical need arising from the evil of attachment to individual existence.
The task of the Seers was to remedy this defect in life, which, they realised, was due to the consciousness of separateness of being and the desire to acquire and become what one is not. The remedy lies in acquiring and becoming everything, expressed all too imperfectly by the words ‘Infinity’, ‘Immortality’, and the like.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 136 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 66 🌻*
అయితే, ఈ విచారణ క్రమానికి బలం, సమర్థత, సాధన - అంటే నాలుగు సంధ్యలలో నువ్వు చేసేటటువంటి సాధన. జప తప సాధనలు ఏవైతే ఉంటాయో, ధ్యానసాధనలు ఏవైతే ఉన్నాయో, ప్రాణాయామ, ఆసన శుద్ధులు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా కలిగిన చిత్తశుద్ధి యొక్క బలం చేత, వాటి ద్వారా ఈశ్వరుని యందు కలిగిన విశ్వాసం చేత, దైవ విశ్వాసం చేత, దైవ బలాన్ని అందుకున్నటువంటి వాడై, ఈశ్వరానుగ్రహాన్ని అందుకున్నవాడవై, ఈ అభిమానాన్ని సులభంగా తొలగించుకోగలుగుతావు. ఇదీ ఈశ్వరానుగ్రహం అంటే.
ఈశ్వరానుగ్రహం అని అందరూ అంటూ ఉంటారు. ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటంటే, ఈ కర్తృత్వ భోక్తృత్వ అభిమానం అనేటటువంటి తెర సులభంగా తొలగిపోయి, ఈశ్వర సాక్షాత్కారం కలగడమే ఈశ్వరానుగ్రహం. ఇలా మనమందరం, సాధకులందరం తప్పక సాధించాలి. సాధన సాధ్యమిది.
మరియు తపస్సులన్నిటికంటెను, జలము మొదలగు పంచభూతముల ఉత్పత్తి కంటెను, పూర్వమే ఏదియున్నదో, అది బుద్ధి రూప హృదయాకాశమును ప్రవేశించి భూతములతో కూడా ప్రకాశించుచున్నదో, దానిని జ్ఞానులు చూతురు. అదే ఇది. నీవడిగిన ఆత్మ తత్త్వమిదియే.
ఈ రకంగా ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం పొందిన తరువాత, ఆ ఈశ్వర సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత, సదా నేను ఈశ్వరుడననే నిర్ణయంలో నిమగ్నమై పోయి ఉండడం చేత, సత్వగుణం శుద్ధ సాత్వికమై ప్రకాశించడం మొదలౌతుంది. అట్టి శుద్ధ సాత్విక స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆత్మనిష్ఠులు అవుతారు. వాళ్ళకి ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఈశ్వర సాక్షాత్కారం తరువాతే, ఆత్మసాక్షాత్కర జ్ఞానం కలుగుతుంది. ఇది తప్పక నిర్ణయం అన్నమాట.
కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో, మొదట ఈశ్వర సాక్షాత్కారాన్ని మానవులందరూ పొందాలి. సగుణ సాకార పద్ధతిగా కాని, నిర్గుణ నిరాకార పద్ధతిగా కాని, ఈ ఈశ్వర సాక్షాత్కారం జరుగుతూ ఉంది. సాధారణంగా 99శాతం అందరికీ కూడా సగుణ సాకార పద్ధతిగానే, ఈశ్వర సాక్షాత్కారం, ఇష్ట దేవతా సాక్షాత్కారం జరుగుతుంది. ప్రథమంగా ఆ దైవం తన కళ్ళ ఎదుట మూడు అవస్థలలోనూ ఉన్నటువంటి పరిస్థితిని దర్శనవిధిగా సాధిస్తాడు. ఈ దర్శనం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి.
ఈ దర్శనం మూడు అవస్థలలో చెదిరిపోనిదన్నమాట. అది భావయుక్తమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, మనోభావ రూప, బుద్ధి చలన రూప, చిత్త ప్రవృత్తి రూప, దృశ్యములు కావన్నమాట. యథార్థ దర్శనం, ఎవరికైతే సాక్షాత్కార జ్ఞానం కలుగుతుందో, అది మూడు అవస్థలలో చెదిరిపోదు. సదా తన కళ్ళముందు నిలచే ఉంటుంది.
అలా పొందినటువంటి దర్శనాన్ని అనుగమించగా, అనుగమించగా, అనుగమించగా, అనుసరించగా క్రమేపి ఆ దర్శన స్థితితో నీకు సంభాషించే శక్తి కలుగుతుంది. సదా దానితో సంభాషిస్తూ ఉంటాడు. సదా దానితో**** ఉంటాడు. ఆ దర్శన స్థితిలో ఉన్నటువంటి దైవతము కూడా నీతో సంభాషిస్తూ ఉంటుంది. ఆ శక్తి నీ చైతన్యమే. ఆ దైవము నీ చైతన్యమే. ఆ ఈశ్వరుడు కూడా నీ చైతన్యమే. అది ‘నా చైతన్యమే’ - చైతన్యమే ఆదిదైవతముగా ఉన్నది, చైతన్యమే అధ్యాత్మముగా కూడా ఉన్నది.
కాబట్టి, నేను చైతన్యమే, ఈశ్వరుడు కూడా చైతన్యమే. అనేటటువంటి స్ఫురణ కలగగానే దైవం ఇక బయట ఉండడు. దర్శనంగా ఉండడు. తానైపోతాడు ఇంక. తనకి ఆ దర్శనానికి అభేద స్థితి కలుగుతుంది. ఇట్టి అభేద స్థితి యందు, అంతటా దైవాన్నే చూస్తాడు. అంతటా తన ఇష్టదైవాన్నే చూస్తాడు. అంతటా ఈశ్వరుడినే చూస్తాడు. అంతటా ఈశ్వరీయమైనటువంటి విభూతిని దర్శిస్తాడు. అంతటా ఈశ్వర చిద్విలాసాన్ని గమనిస్తాడు.
సర్వాన్ని ఈశ్వరుని యొక్క భావ ప్రతిభా పాటవ విశేషములతో ఈ సృష్టిని అంతాకూడా, ఈశ్వరుడే తనకు తాను ప్రత్యక్షమయ్యేటట్లుగా తాను ప్రకృతి ద్వారా వ్యక్తమౌతున్న విధానం ఎట్లా అవుతున్నాడో, గమనించగలుగుతాడు.అట్టి ప్రతిభావిశేషం కలుగుతుంది, ప్రజ్ఞా విశేషం కలుగుతుంది. అట్టి చైతన్యవికాసం కలుగుతుంది. ఇది కలుగ గానే, అంతటా ఉన్నది చైతన్యమే. ఒక్క చైతన్యమే, అంతటా ఉన్నది. అనేటటువంటి స్ఫురణ మనకి కలుగుతుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 10 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. అభంగ్ - 10 🍀*
త్రివేణీ సంగమీ నానా తీర్థ భ్రమీ !
చిత్ నాహీ నామీ తరి తే వ్యర్డ్!!
నామానీ విన్ముఖ్ తో నర్ పాపియా!
హరివీణ ధాయా న పవే కోణీ!!
పురాణ ప్రసిద్ధ బోలిలే వాల్మీక్! !
నామే తినీలోక్ ఉద్ధరతీ!!
జ్ఞానదేవ మణే నామ జపా హరీచే!
పరంపరా త్యాచే కుళ శుద్ది!!
భావము:
త్రివేణి సంగమములో స్నానము, నానా తీర్థాల భ్రమణము చేసినను చిత్తమందు శ్రీహరి భావము లేకపోతే అది వ్యర్ధము. నామ స్మరణ చేయడానికి విన్ముఖము అయిన వాడు పాపాత్ముడు. ఈ పాపాత్ములను కూడా పరుగున వచ్చి రక్షించుట శ్రీహరికి తప్ప ఎవరికి సాధ్యము కాదు.
పురాణ ప్రసిద్ధుడైన వాల్మికి చెప్పుచున్నారు, నామ జపము చేసేవారు ముల్లోకాలలో ఉద్దరించగలరని. నామ జపము చేయువారి పరంపర కులయుక్తముగ పరిశుద్ధమైనదని జ్ఞానదేవులు అంటున్నారు.
*🌻 నమ సుధ -10 🌻*
త్రివేణి సంగమమున స్నానము
నానా తీర్థాల భ్రమణము
చిత్తములో శ్రీహరి భావము
లేనిచో ఈ ప్రయత్నము వ్యర్థము
నామానికి అయినచో విముఖము
ఆ నరుడు పాపి అని అనుకొనుము
పాపిని రక్షించుట సత్వరము
హరికి తప్ప ఇతరులకసాధ్యము
పురాణ ప్రసిద్ధ వచనము
చెప్పినారు వాల్మీకి పూర్వము
నామమే మూడు లోకాలకు తారకము
అయినారు హరిభక్తులు ఉద్గారము
జ్ఞాన దేవులు చెప్పిన వచనము
జపించాలి అందరు హరినామము
పరంపర వారిది సర్వము
కుల యుక్తముగా పరిశుద్ధము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 157 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
149
We discussed that money is sinful because it is earned only when someone is tormented. Great souls don’t even touch the money with their hands. So, one may wonder if the sins get wiped away when one does Yajna with such sinful money. They do. But, only the sins from this birth get wiped away, not the sins you’ve been carrying on from previous births. This is stipulated in the scriptures. Therefore, because the sins will not be completely removed, it does not say here that all sins get wiped away. It says that ignorance is dispelled. That is the specialty of Guru Gita.
It’s an unparalleled feature of the Guru Gita.
This unparalleled Principle in the Guru Gita is pure and unknown to most. That is why, it brings merit when one reads, listens to, writes or gives the Guru Gita to others. What does giving mean? It does not mean giving the book to someone. Teaching the Guru Gita to others, enjoying the bliss oneself and enabling others to feel the bliss is what giving the Guru Gita means.
Sloka:
Anantaphalamapnoti guru gita japena tu | Anyasca vividha mantrah kalam narhanti sodasim ||
Chanting of this Guru Gita gives endless benefits. No other mantra or spell bestows even a sixteenth of the benefits.
Sloka:
Sarva papa prasamani sarva sankata nasini | Sarvasiddhikari ceyam sarvaloka vasankari ||
The Guru Gita wipes out all sins, destroys all hurdles and difficulties and bestows all supernatural powers. All worlds will be brought under his control.
There’s such great power in the Guru Gita. Here, “Sarva papa parasamani” indicates that it wipes out all sins. For some people, there’s no satisfaction unless they hear this. But, you should always pray to the Guru for knowledge of the self, not for wiping away sins. To get rid of sins, you should work hard and undertake noble deeds.
But, in the beginning of spiritual practice, the seeker is focused is on wiping away sins, on gaining the eight supernatural powers and on bringing the world under one’s control.
As the seeker graduates to higher levels, the focus changes. For one seeking complete self-realization, the focus is never on these. If it is, the seeker will fall from his yogic state. In that case, why does they talk about the attainment of these benefits? We should pay close attention to the inner meaning here.
When they say, “loka vasankari” you should understand that it reveals to you that you are in the form of all the worlds. Similarly “sarvasiddhikari” means, it gives you the feeling that you are all the supernatural powers yourself. in the same vein, “Papa prasamini” and “sankata nasini” indicate that it dispels ignorance and sorrow.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 81 / Sri Lalitha Sahasra Nama Stotram - 81 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 153 / Sri Lalitha Chaitanya Vijnanam - 153 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |*
*నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖*
*🌻153. 'నిష్కళంకా'🌻*
కళంకము లేనిది శ్రీమాత అని భావము.
శుద్ధమైన విషయము పాపరహితము. శుద్ధచైతన్యము నందు ఎట్టి కళంకములు వుండవు. అహంకారాది అష్టప్రకృతులుగ దిగి వచ్చినప్పుడు ఆయా లోకములలో ఆయా కళంకములు ఏర్పడుచున్నవి. అహంకార స్థితిలో స్వార్థము తనను తాను పరిరక్షించు కొనుటవంటి కళంకములేర్పడును. అట్లే బుద్ధి లోకమున వెలుగులకు బుద్ధిలోపము అను చీకట్లు కమ్ముచుండును. మనస్సునకు చంద్రకళల వలె హెచ్చుతగ్గులుండును. చిత్తమునకు భ్రమ, భ్రాంతి అను కళంకములు యుండును.
పంచభూతములతో కూడిన సృష్టిలో గల కళంకములు యుండును. పంచభూతములతో కూడిన సృష్టిలో గల కళంకములను గూర్చి వివరింప నవసరము లేదు. అంతఃకరణ చతుష్టయము, బహిఃకరణ పంచకములలో కళంకములు తప్పనిసరి. వీనిని ఎప్పటి కప్పుడు శుభ్రపరచుకొను చుండవలెను.
ఈ తెలిపిన తొమ్మిది ఆవరణలకు ఆవలనుండునది శ్రీమాత గనక ఆమెకు కళంకములు అంటవు. జీవులు ప్రతి నిత్యము కళంకములను నిర్మూలించుకొననిచో పాపమావరించును. అందులకే సాధన చతుష్టయము ఋషులచే నొసంగబడినది. జీవులలో నిత్యశ్రుద్ధు లెవ్వరునూ లేరు.
వారు నిష్కళంకులునూ కాదు. శ్రద్ధా భక్తులతో నిత్యము కళంకములను నిర్మూలించు కొనుటవలన శుద్దులై శ్రీదేవి సాన్నిధ్యమును పొందగలరు. "అహం బ్రహ్మాస్మి" అను బ్రహ్మవేత్త కైనను శరీరము లందున్నప్పుడిది తప్పనిసరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 153 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Niṣkalaṅkā निष्कलङ्का (153)🌻*
She is without any stains. Stains arise out of sins. That is why those who do not commit sins are considered on par with God, as such persons are extremely rare to find. Īśa upaniṣad (verse 8) uses two words to describe the Brahman without stains. The first one is śuddham which means pure. The other one is apāpaviddha meaning unblemished (no race of ignorance). The Brahman is pure and unblemished. The sense of dualism is the cause for sins. These sins cause blemishes. Blemishes could be of anything viz. anger, hatred, jealousy, etc. These blemishes are responsible for not realising the Brahman within. These are called stains and She is devoid of such stains.
{Further reading on sin: With ethicization, morally good or bad actions are systematically converted into religiously good or bad actions. In as much as any social morality must punish those who commit wrong and reward those who conform, so must a religious morality. Implicit in these notions of reward and punishment are such ideas as religious merit and sin. That is the consequences of the rights and wrongs for which one is being rewarded or punished can br conceptualised for present purposes of merit or sin. Sin is directly related to one’s karmic account.}
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 494 / Bhagavad-Gita - 494 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 4 🌴*
04. సర్వయోనిషు కౌన్తేయ మూర్తయ: సమ్భవన్తి యా: |
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రద: పితా: ||
🌷. తాత్పర్యం :
ఓ కౌంతేయా! సర్వజీవ సముదాయము భౌతికప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసికొనవలెను.
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వజీవులకు ఆది జనకుడనని ఈ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. వారు భౌతికప్రకృతి మరియు ఆధ్యాత్మికప్రకృతి యొక్క సంయోగము వంటివారు.
అట్టి జీవులు ఈ లోకమునందే గాక, ప్రతిలోకమందును ఉన్నారు. అత్యంత ఉన్నతలోకమైన బ్రహ్మలోకమునందు వారి నిలిచియున్నారు. సర్వత్రా నిలిచియున్న అట్టి జీవులు భూమి యందును, జలము నందును, అగ్ని యందును స్థితిని కలిగియున్నారు.
ఈ ఉద్భవము లన్నింటికిని ప్రకృతి మరియు శ్రీకృష్ణుని బీజప్రదానములే కారణము. సారాంశమేమనగా సృష్టి సమయమున తమ పూర్వకర్మల ననుసరించి వివిధరూపములను పొందు జీవులు భౌతికప్రకృతి గర్భమున బీజరూపమున ఉంచబడుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 494 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 04 🌴*
04. sarva-yoniṣu kaunteya
mūrtayaḥ sambhavanti yāḥ
tāsāṁ brahma mahad yonir
ahaṁ bīja-pradaḥ pitā
🌷 Translation :
It should be understood that all species of life, O son of Kuntī, are made possible by birth in this material nature, and that I am the seed-giving father.
🌹 Purport :
In this verse it is clearly explained that the Supreme Personality of Godhead, Kṛṣṇa, is the original father of all living entities. The living entities are combinations of the material nature and the spiritual nature.
Such living entities are seen not only on this planet but on every planet, even on the highest, where Brahmā is situated. Everywhere there are living entities; within the earth there are living entities, even within water and within fire.
All these appearances are due to the mother, material nature, and Kṛṣṇa’s seed-giving process.
The purport is that the material world is impregnated with living entities, who come out in various forms at the time of creation according to their past deeds.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -102 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀 30. బంధమోచనము - బంధమోచన జ్ఞానము, బంధమోచనులైన ముక్తి జీవుల వద్ద దర్శింపవచ్చును. కేవలము విషయ పరిజ్ఞానము వలన ఎవ్వడును జ్ఞాని కాలేడు. నిజమగు జ్ఞాని సాన్నిధ్యము వలననే జ్ఞాని యగుటకు వీలగును. ఇచ్చట జ్ఞాని యనగ బంధములను పరిష్కరించుకొనుచు, చేయు కర్మలవలన మరల బంధములను సృష్టించుకొనక జీవించు విధానము. ఈ విధానమున జీవుడు బంధమోచనుడై, స్వతంత్రుడై దివ్యవైభవమున నుండును. అట్టివాడే జ్ఞాని. అతని నిత్యజీవన ఆచరణమే నిజమగు దర్శన జ్ఞానము. ఈ శ్లోకము సద్గురు శుశ్రూష బంధ మోచనము కోరువానికి ఉపకరణము కాగలదని తెలుపుచున్నది. 🍀*
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శినః 34
తత్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసి, వ్యకిగతముగ వారికి సేవచేసి, వినయముగ వారిని సమయా సమయ వివేకముతో ప్రశ్నించియు, బంధమోచన జ్ఞానమును ఉపదేశపూర్వకముగ పొందుము. బంధమోచన జ్ఞానము, బంధమోచనులైన ముక్తి జీవుల వద్ద దర్శింపవచ్చును. జ్ఞాన మనగ బంధమోచన జ్ఞానమే అని తెలుపబడినది గదా! తెలిపినంత మాత్రమున తెలుసుకొనిన వాడు ఆచరింపలేడు.
ఫలాసక్తి లేక కార్యము నాశ్రయించి, కర్మను నిర్వర్తించవలెనని సర్వసామాన్యముగ అందరు వినియే యుందురు. అంతమాత్రముచేత ఆచరింప గలుగుచున్నారా? కర్మాచరణము దైవము తెలుపురీతిలో ఆచరించుట అంత సులభము కాదని అందరును అంగీకరింతురు. కోరిక ప్రధానముగ జీవించు మానవుడు, తన వ్యక్తిగత కోరిక కన్న కర్తవ్యమే ప్రధానమని భావించుటకు సంస్కారబలముగ చాల మార్పు రావలెను.
కేవలము విషయ పరిజ్ఞానము వలన ఎవ్వడును జ్ఞాని కాలేడు. నిజమగు జ్ఞాని సాన్నిధ్యము వలననే జ్ఞాని యగుటకు వీలగును. ఇచ్చట జ్ఞాని యనగ బంధములను పరిష్కరించుకొనుచు, చేయు కర్మలవలన మరల బంధములను సృష్టించుకొనక జీవించు విధానము. ఈ విధానమున జీవుడు బంధమోచనుడై, స్వతంత్రుడై దివ్యవైభవమున నుండును. అట్టివాడే జ్ఞాని. అతని నిత్యజీవన ఆచరణమే నిజమగు దర్శన జ్ఞానము. జ్ఞానుల జీవన విధానము ఆకర్షణీయమై యుండును. వారు కర్మలాచరించు తీరు, ఫలాసక్తి లేని సూటియైన కర్తవ్యాచరణము, వ్యామోహము లేని జీవనము గమనించినచో ఆచరించుటకు వలసిన స్ఫూర్తి, సంకల్పబలము కలుగును.
అట్లాచరించు బుద్ధిమంతుడు నిర్వర్తించవలసిన మరియొక కర్తవ్యము దైవమిచట బోధించు చున్నాడు. జీవన్ముక్తుడగు జ్ఞాని దరిచేరుట, అతని జీవన విధానమును అవగాహనము చేసుకొనుట, సున్నితముగ అతడు కర్మ నిర్వర్తించు విధానము తెలుసుకొనుట, స్ఫూర్తితో ఆ విధానము ననుసరించుటతో బాటు, అట్టి జ్ఞాన పురుషునికి సేవ చేయుట, సాష్టాంగ దండప్రణామము చేయుట, అనుగ్రహమున వారు తెలిపిన సుళువులను, సూత్రములను హృదయస్థము గావించుకొని, వాచాలత్వము లేక వినయముతో ఆచరించుట.
భగవద్గీత యందలి ఈ శ్లోకము సద్గురు శుశ్రూష బంధ మోచనము కోరువానికి ఉపకరణము కాగలదని తెలుపుచున్నది. స్వంతముగ తమకు తాము నిర్వర్తించుకొనుట కన్న తెలిసిన వారి సాన్నిధ్యమున నిర్వర్తించుకొనుట ఉత్తమము. తెలిసినవారి అనుగ్రహము పొందుట ఉత్తమోత్తమము.
అనుగ్రహ మనునది అయస్కాంతీకరణము వంటిది. అయస్కాంత సన్నిధిని యినుప ముక్క త్వరితగతిని అయస్కాంతము కాగలదు. ఒక మనిషికి సేవ చేయుట, అతనికి సాష్టాంగ దండ ప్రణామము చేయుట, అతనిని వినయముతో అడిగి తెలుసుకొనుట అహంకారులకు సాధ్యము కాదు. అహంకారమున్నంత కాలము బంధమోచనము కలుగదు.
సాధకుని యందు సత్త్వము పెరుగుటకు ఈ మూడు సూత్రములను దైవము సూచించినాడు. అదియే మన పాద నమస్కారము, సేవ, పరిప్రశ్నము. కృష్ణ భక్తుల విషయమున ఈ మూడును గమనింపదగును. దైవభక్తుల జీవితమున ఈ మూడును దినచర్యగ పాటింపబడును. అట్టివారే దైవానుగ్రహ పాత్రులు కాగలరు. సద్గురువు రూపమున దైవమే వారిని అనుగ్రహించు చుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 300 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
73. అధ్యాయము - 28
*🌻. సతీ యాత్ర- 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
దక్షుని యజ్ఞమునకు దేవతలు, ఋషులు వెళ్లుచున్న సమయములోనే సతీదేవి గంధమాదన పర్వతమునందుండెను (1). దక్షపుత్రియగు సతి ఎత్తైన అరుగులతో కూడిన ఈత కొలను యందు సఖురాండ్రతో గూడి చిరకాలము క్రీడించెను (2). దక్షుని పుత్రియగు సతి ఆనందముతో క్రీడించుచూ, రోహిణీతో కలిసి దక్ష యజ్ఞమునకు వెళ్లుచున్న చంద్రుని చూచెను. ఆమె వెంటనే క్రీడలనుండి సెలవు తీసుకొని (3), తనకు ప్రాణ ప్రియురాలు, తనక్షేమమును చేయునది, విజయ అను పేరు గలది అగు తన సఖి కేశాలంకారమును చేసుకొనుచుండగా చూచెను. ఆ సతీదేవి ఆమెతో నిట్లనెను (4).
సతీదేవి ఇట్లు పలికెను -
ఓ విజయా! నీవు నాకు ప్రాణసమమైన ప్రీతిగల, సఖురాండ్రలో కెల్ల శ్రేష్ఠమైన సఖివి. ఈ చంద్రుడు రోహిణితో గూడి ఎచటకు వెళ్లుచున్నాడు? వెంటనే తెలుసుకొని రమ్ము (5).
బ్రహ్మ ఇట్లు పలికెను -
సతి అట్లు ఆజ్ఞాపించగా, విజయ వెంటనే చంద్రుని వద్దకు వెళ్లి ఎచటకు వెళ్లుచుంటివి? అని మర్యాదగా ప్రశ్నించెను (6). విజయ యొక్క ప్రశ్వను విని చంద్రుడు తాను దక్షుని యజ్ఞమనే ఉత్సవమునకు వెళ్లుచున్నానని చెప్పెను. మరియు ఆదరపూర్వకముగా వివరములనన్నిటినీ చెప్పెను (7).
ఆ మాటలను విని ఆశ్చర్యమును పొందిన విజయ వేగముగా సతీదేవి వద్దకు వెళ్లి, చంద్రుడు చెప్పిన ఆ వృత్తాంతమునంతనూ చెప్పెను (8). ఆ మాటను విని నీలవర్ణముగల ఆ సతీదేవి చాల ఆశ్చర్యమును పొందెను. అట్లు జరుగుటకు గల కారణమును గూర్చి ఆలోచించిననూ, ఆమెకు తెలియలేదు. ఆమె తన మనస్సులో ఇట్లు తలపోసెను (9).
నా తండ్రియగు దక్షుడు, తల్లియగు వీరిణి మమ్ములనిద్దరినీ ఏల ఆహ్వానించలేదో! ప్రియకుమార్తెనగు నన్ను మరచినా యేమి? (10). దీనికి గల కారణమును గూర్చి శంకరుని అడిగెదను. ఇట్లు తలపోసి ఆమె ఆ యజ్ఞమునకు వెళ్లుటకై నిశ్చయించుకొనెను (11). అపుడా దాక్షాయణీ దేవి తన ప్రియ సఖియగు విజయను అచటనే యుంచి వెంటనే శివుని వద్దకు వెళ్లెను (12). సభామద్యములో అనేక గణములతో, నంది మొదలగు మహా వీరులతో, శ్రేష్ఠులగు గణాధ్యక్షులతో చుట్టు వారబడియున్న ఆ శివుని చూచెను (13).
ఆ దాక్షాయణి తన భర్తయగు ప్రభువును అచట చూచి, ఆహ్వానము రాకుండుటకు గల కారణమునడుగుటకై శంకరుని సన్నిధికి వెంటనే వెళ్లెను (14). శివుడు తన ప్రియురాలగు ఆమెను తన అంకముపై కూర్చుండబెట్టుకొని ప్రేమతో, ఆదరముతో మాటలాడగా, ఆమె చాల సంతసించెను (15). అపుడు గొప్ప లీలలను ప్రకటించువాడు, సర్వేశ్వరుడు, సత్పురుషులకు సుఖములనిచ్చువాడునగు శంభుడు గణముల మధ్య విరాజిల్లువాడై ఆదరముతో వెంటనే సతీదేవితో నిట్లనెను (16).
శంభుడిట్లు పలికెను -
ఓ సుందరీ! ఈ సభా మధ్యములోనికి విస్మయముతో గూడిన దానవై నీవు వచ్చుటకు గల కారణమును ప్రీతితో నాకు వెంటనే చెప్పుము (17).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఆ మహేశ్వరుడు అపుడిట్లు పలుకగా, శివపత్నియగు సతి చేతులు జోడించి నమస్కరించి వెంటనే ఇట్లు పలికెను (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 55 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 4 - THE 3rd RULE
*🌻 Kill out desire of comfort. - Be happy as those are who live for happiness. - 12 🌻*
233. Keep your thought hopefully on the future, not regretfully on the past. The present is very largely an illusion; so we are not really dissatisfied with what we are doing, but with what we have just done. If we want to get on we must keep our eyes in front of us.
To look behind is not the way to make progress. If that course were persisted in on the physical plane we should not go far without meeting with an accident, and the same thing is true in these higher realms also. The more we think over it the clearer it becomes that in the three aphorisms we have just been examining, viz., “Kill out ambition, kill out desire of life, and kill out desire of comfort”, all that moves the ordinary man to exertion has been absolutely cut away.
234. A man’s life is first of all directed by the desire to keep himself and his family alive, “to keep his head above water”; he has always the ambition of rising to higher levels; he wishes for greater comfort for himself and for his family. These are precisely the mainsprings which move the ordinary man, and it is obvious that if all of them should be absolutely removed from him, he would be left supine – he would be left without any reason to bestir himself at all; he would be like a log.
He would say: “If I am not to have ambition of any sort, if I am to cease to desire either life or comfort, why should I do anything? Why should I move at all?” He would be left without any adequate motive for exertion of any kind, and all progress for him would be at an end. It is obvious that for him the killing out of these things would have a bad effect.
235. Even the man who is nearly ready to tread the Path, who has ceased to feel any interest in lower things, reaches a stage when there is danger of his falling into a state of inaction. Intellectually he is absolutely convinced that all these lower things are not worth pursuing, and because they have ceased to attract him he does not feel inclined to put forth energy in any direction. That is an experience which comes to nearly every one in the course of his evolution, and is a very real trouble to numbers of people.
They have got rid of the lower and not taken on the higher. They are at a transition stage between the two; they have not sufficiently realized the unity for that to be the great motive power in life, but they have realized enough of it to know that the desires of the separated self are not worth following. So they remain in a condition of suspended animation. It is for some students a very great difficulty to rouse themselves out of this state. Nothing is worth while; nothing has any longer any interest for them. They want to die and be done with it.
236. The only way for a man to get beyond that unsatisfactory condition is to go a little further, and then he will begin to see that there is a higher and truer life which is infinitely well worth the living. He will find that when he has glimpsed the divine scheme he wants to throw himself into it – he cannot do otherwise. In identifying himself with the One Life, and acting as part of that Life, he finds the one motive which can stir him to action.
When he takes that one step further and begins to realize the Life of the Self, then instead of wanting to fall into annihilation and to be done with everything, he will long to possess more and more energy in order to throw it into this glorious work. The motive power of the One Self will stir him to far greater activity than ever before, because it is infinitely more powerful than any lower motive, and the man who works with it to fulfil the high purposes of the Deity will gain infinite happiness and infinite peace.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 187 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. విశ్వామిత్రమహర్షి - 7 🌻*
39. చాలా సంపాదించాననుకుంటే అది ఉండగా మనంపొతాం. మన పుణ్యం బాగుండకపోతే, మనముండగానే అవి పోతాయి. రెండూ దుఃఖమే. తపోధనం సంపాదించాలి. ఆ తపోధనానికి హేతువైన ఎలాంటి శరీరం ఉండాలి, ఎలాంటి మనస్సు ఉండాలి అంటే – అందుకు శౌచమే విధించారు. మితాహారంవల్ల అది వస్తుంది.
40. ఎంత బలిష్ఠుడయినా, వాడికి ఏదో రోగం వస్తే ఒక మూల పడుంటాడు. వాడిని గౌరవిస్తారా? వాడి ఆత్మగౌరవం అంతా ఏమయింది? వాడి గర్వం అంతా ఏమయింది? నశించలేదా? అతడికి కేవలం పశువుకు చేసినట్లు చికిత్స చెయ్యరా వైద్యులు? కాబట్టి ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి ప్రతిపత్తి, గౌరవము, దర్పము-వీనియందు ఆధారపడి ఉండకూడదు. ఆత్మగౌరవంతో తనను తాను గౌరవించుకునే స్థితిలో ఎప్పుడూ ఉండాలి. శౌచం చేత, గుణంచేత, “నాలో దోషం లేదు” అని తనను తాను గౌరవించుకోవాలి.
41. ఆత్మగౌరవం అంటే, “ఏ లక్షణములు నాయందు ఉన్నాయో అవి గౌరవహేతువులు. నన్ను నేను అవమానపరచుకోవలసిన ఆవశ్యకత నాకు లేదు. నా గుణములవల్ల నా యందు నాకు గౌరవమే ఉంది” అనుకోవాలి. అయితే అది అహంకారం కాదు, దర్పంకాదు. అట్టి ఆత్మగౌరవానికి యోగ్యత సంపాదించాలి. అంతేకాని ఇంకొకళ్ళు ఇచ్చేది గౌరవంకాదు. తనయందు తనకుండే గౌరవమే గౌరవం. కలియుగంలో ఈ ధర్మాలు ఎక్కువగా చెప్పారు పురాణాలలో.
42. అట్టి అపూర్వధర్మనిర్ణాయకుడు విశ్వామిత్రుడు. దీక్షకు, పట్టుదలకు మరోపేరు ఆయన. పట్టుదలలేని వాడు దానికోసం ఒకసారి విశ్వామిత్రుణ్ణి తలచుకోవాలి. బాగా ఆలోచించి ఒక నిర్ణయంతీసుకున్నాక, ఇక ఎంత కష్టం వచ్చినా దాని అంతు కనుక్కోవలసిందే! ఆ పట్టుదలే ఆర్యుల లక్షణం. ఈ పట్టుదల రజోగుణంవల్లనే వస్తుంది. ఆ రజోగుణంలేనిదే తపస్సులుకూడా ఫలించవు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 251 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 100. You have to understand that the 'I am' is even before the arising of any words, thoughts or feelings.🌻*
The importance of the knowledge 'I am' as the first or primordial principle should never be forgotten.
For this conviction to grow stronger, reversion to that moment when you first came to know that 'you are' or 'I am' is essential. When you do so, the purity of the 'I am' becomes very clear to you.
You can also very clearly see that whichever way it happened the 'I am' is the first and the last thing that brought you into this world and now can take you out of it.
Before anything else - words, thoughts or feelings - could be, the 'I am' had to be there.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 126 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 5 🌻*
520. "నేను ఎవడును?" అన్న భగవంతుని తొలిపలుకునకు ఇచ్చట విజ్ఞన్నభూమికలో "నేను భగవంతుడను"అని సమాధానము వచ్చినది.
521. ఆదిలో భగవంతుడు భగవంతునిగా నుండెను. ఇప్పుడు భగవంతుడు భగవంతుడయ్యెను.
522. భౌతిక , సూక్ష్మ, మానసిక ప్రపంచములలో యదార్థముగా, భగవంతుడు భగవంతునిగా లేకుండెను.
523. ఇచ్చట భగవంతుడు తన అనంత యదార్థ స్థితిఃని ఎఱుకతో అనుభవించుచున్నాడు, భగవంతుని దివ్య స్వప్నము ఇక్కడితో అంతమై పోయినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 90 / Sri Vishnu Sahasra Namavali - 90 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*ధనిష్ట నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*
*🍀 90. అణు ర్బృహ త్కృశః స్థూలో గుణ భృన్ని ర్గుణోమహాన్ !*
*అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశ వర్ధనః !! 90 !! 🍀*
🍀 835) అణు: -
సూక్షాతి సూక్షమైనవాడు.
🍀 836) బృహుత్ -
మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము.
🍀 837) కృశ: -
సన్ననివాడై, అస్థూలమైనవాడు.
🍀 838) స్థూల: -
స్థూల స్వరూపము కలిగియున్నవాడు.
🍀 839) గుణభృత్ -
సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.
🍀 840) నిర్గుణ: -
గుణములు తనలో లేనివాడు.
🍀 841) మహాన్ -
దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.
🍀 842) అధృత: -
సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు.
🍀 843) స్వధృత: -
తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.
🍀 844) స్వాస్య: -
విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.
🍀 845) ప్రాగ్వంశ: -
ప్రాచీనమైన వంశము కలవాడు.
🍀 846) వంశవర్థన: -
తన వంశమును వృద్ధినొందించువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 90 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Dhanishta 2nd Padam*
*🌻 90. aṇurbṛhatkṛśaḥ sthūlō guṇabhṛnnirguṇō mahān |*
*adhṛtassvadhṛtasvāsyaḥ prāgvaṁśō vaṁśavardhanaḥ || 90 || 🌻*
🌻 835. Aṇuḥ:
One who is extremely subtle.
🌻 836. Bṛhat:
The huge and mighty.
🌻 837. Kṛśaḥ:
One who is non-material.
🌻 838. Sthūlaḥ:
Being the inner pervader of all, He is figuratively described as Stula or huge.
🌻 839. Guṇa-bhṛt:
The support of the Gunas. He is so called because in the creative cycle of creation, sustentation, and dissolution, He is the support of the Gunas – Satva, Rajas and Tamas – with which these functions are performed.
🌻 840. Nirguṇaḥ:
One who is without the Gunas of Prakruti.
🌻 841. Mahān:
The great.
🌻 842. Adhṛutaḥ:
One who, being the support of all supporting agencies, like Pruthvi (Earth), is not supported by anything external to Him.
🌻 843. Svadhṛtaḥ:
One supported by oneself.
🌻 844. Svāsyaḥ:
One whose face is beautiful and slightly red like the inside of a lotus flower.
🌻 845. Prāgvaṁśaḥ:
The family lines of others are preceded by the lines of still others, but the Lord's descendent, namely, the world system, is not preceded by anything else.
🌻 846. Vaṁśavardhanaḥ:
One who augments or destroys the world-system, which is His off-spring.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment