శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 153 / Sri Lalitha Chaitanya Vijnanam - 153


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 153 / Sri Lalitha Chaitanya Vijnanam - 153 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖


🌻153. 'నిష్కళంకా'🌻

కళంకము లేనిది శ్రీమాత అని భావము.

శుద్ధమైన విషయము పాపరహితము. శుద్ధచైతన్యము నందు ఎట్టి కళంకములు వుండవు. అహంకారాది అష్టప్రకృతులుగ దిగి వచ్చినప్పుడు ఆయా లోకములలో ఆయా కళంకములు ఏర్పడుచున్నవి. అహంకార స్థితిలో స్వార్థము తనను తాను పరిరక్షించు కొనుటవంటి కళంకములేర్పడును. అట్లే బుద్ధి లోకమున వెలుగులకు బుద్ధిలోపము అను చీకట్లు కమ్ముచుండును. మనస్సునకు చంద్రకళల వలె హెచ్చుతగ్గులుండును. చిత్తమునకు భ్రమ, భ్రాంతి అను కళంకములు యుండును.

పంచభూతములతో కూడిన సృష్టిలో గల కళంకములు యుండును. పంచభూతములతో కూడిన సృష్టిలో గల కళంకములను గూర్చి వివరింప నవసరము లేదు. అంతఃకరణ చతుష్టయము, బహిఃకరణ పంచకములలో కళంకములు తప్పనిసరి. వీనిని ఎప్పటి కప్పుడు శుభ్రపరచుకొను చుండవలెను.

ఈ తెలిపిన తొమ్మిది ఆవరణలకు ఆవలనుండునది శ్రీమాత గనక ఆమెకు కళంకములు అంటవు. జీవులు ప్రతి నిత్యము కళంకములను నిర్మూలించుకొననిచో పాపమావరించును. అందులకే సాధన చతుష్టయము ఋషులచే నొసంగబడినది. జీవులలో నిత్యశ్రుద్ధు లెవ్వరునూ లేరు.

వారు నిష్కళంకులునూ కాదు. శ్రద్ధా భక్తులతో నిత్యము కళంకములను నిర్మూలించు కొనుటవలన శుద్దులై శ్రీదేవి సాన్నిధ్యమును పొందగలరు. "అహం బ్రహ్మాస్మి" అను బ్రహ్మవేత్త కైనను శరీరము లందున్నప్పుడిది తప్పనిసరి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 153 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Niṣkalaṅkā निष्कलङ्का (153)🌻

She is without any stains. Stains arise out of sins. That is why those who do not commit sins are considered on par with God, as such persons are extremely rare to find. Īśa upaniṣad (verse 8) uses two words to describe the Brahman without stains. The first one is śuddham which means pure. The other one is apāpaviddha meaning unblemished (no race of ignorance). The Brahman is pure and unblemished. The sense of dualism is the cause for sins. These sins cause blemishes. Blemishes could be of anything viz. anger, hatred, jealousy, etc. These blemishes are responsible for not realising the Brahman within. These are called stains and She is devoid of such stains.

{Further reading on sin: With ethicization, morally good or bad actions are systematically converted into religiously good or bad actions. In as much as any social morality must punish those who commit wrong and reward those who conform, so must a religious morality. Implicit in these notions of reward and punishment are such ideas as religious merit and sin. That is the consequences of the rights and wrongs for which one is being rewarded or punished can br conceptualised for present purposes of merit or sin. Sin is directly related to one’s karmic account.}

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2020

No comments:

Post a Comment