సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 10
🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 10 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 10 🍀
త్రివేణీ సంగమీ నానా తీర్థ భ్రమీ !
చిత్ నాహీ నామీ తరి తే వ్యర్డ్!!
నామానీ విన్ముఖ్ తో నర్ పాపియా!
హరివీణ ధాయా న పవే కోణీ!!
పురాణ ప్రసిద్ధ బోలిలే వాల్మీక్! !
నామే తినీలోక్ ఉద్ధరతీ!!
జ్ఞానదేవ మణే నామ జపా హరీచే!
పరంపరా త్యాచే కుళ శుద్ది!!
భావము:
త్రివేణి సంగమములో స్నానము, నానా తీర్థాల భ్రమణము చేసినను చిత్తమందు శ్రీహరి భావము లేకపోతే అది వ్యర్ధము. నామ స్మరణ చేయడానికి విన్ముఖము అయిన వాడు పాపాత్ముడు. ఈ పాపాత్ములను కూడా పరుగున వచ్చి రక్షించుట శ్రీహరికి తప్ప ఎవరికి సాధ్యము కాదు.
పురాణ ప్రసిద్ధుడైన వాల్మికి చెప్పుచున్నారు, నామ జపము చేసేవారు ముల్లోకాలలో ఉద్దరించగలరని. నామ జపము చేయువారి పరంపర కులయుక్తముగ పరిశుద్ధమైనదని జ్ఞానదేవులు అంటున్నారు.
🌻 నమ సుధ -10 🌻
త్రివేణి సంగమమున స్నానము
నానా తీర్థాల భ్రమణము
చిత్తములో శ్రీహరి భావము
లేనిచో ఈ ప్రయత్నము వ్యర్థము
నామానికి అయినచో విముఖము
ఆ నరుడు పాపి అని అనుకొనుము
పాపిని రక్షించుట సత్వరము
హరికి తప్ప ఇతరులకసాధ్యము
పురాణ ప్రసిద్ధ వచనము
చెప్పినారు వాల్మీకి పూర్వము
నామమే మూడు లోకాలకు తారకము
అయినారు హరిభక్తులు ఉద్గారము
జ్ఞాన దేవులు చెప్పిన వచనము
జపించాలి అందరు హరినామము
పరంపర వారిది సర్వము
కుల యుక్తముగా పరిశుద్ధము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment