భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 207


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 207 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. చ్యవనమహర్షి-సుకన్య - 4 🌻


18. నైమిశం (‘నిమి-శ’ అంటే, చక్రం నిలిచిన చోటు అని అర్థం). ఆ నైమిశం అప్పుడు వనములు, ఉపనయనములు, చక్కని నదులు, తీర్థములతో సుఖంగా ఉండి, జనం ఎక్కువగా లేనటువంటి చల్లని ప్రదేశంగా ఉన్నది. ఆ తరువాత అది అరణ్యం అయింది.

19. నైమిశారణ్యంలో యజ్ఞం చేయటానికి, తపస్సుచేయటానికి తేడా ఉంది. యజ్ఞానికి మంచిచోటు చూస్తారు. అరణ్యంలో యజ్ఞంచేయరు. జనపదానికి దగ్గరగా-మరీ దగ్గర్గా కూడా కాకుండా-విశాలంగా చక్కగా ఉండే చోటు ఎంచుకొని యజ్ఞం చేస్తారు.

20. అరణ్యాలలో అయితే తపస్సులు చేస్తారు. మహర్షులు అందరూ అరణ్యాలలోనే తపస్సులు చేసారు. మొట్టమొదట అది యజ్ఞభూమి. ఇప్పటి పంజాబు, హర్యానా, కురుక్షేత్రానికి దక్షిణభాగంలో ఉంది. అదంతా తరువాత నమిశారణ్యం అయింది. పూర్వం అక్కడే యాగం చేసారు.

21. ఇప్పుడు మనకున్న బ్రాహ్మణ-క్షత్రియభేదం వేదకాలంలో లేదు. సాంకర్యం అనేమాట అదికాదు. సాంకర్యం అంటే, భ్రుష్టుడిని వివాహంచేసుకోవటమే! సాంకర్యం అనేమాట అర్థం ఏమిటంటే, అసమానత్వం. ఇద్దరు అసమానులు కలవటం సాంకర్యం. అనులోమం, విలోమం, అవన్నీకూడా సాంకర్యమే – వర్ణసాంకర్యమే!

22. గుణంచేత బ్రాహ్మణుడు కానివాడు బ్రాహ్మణవంశంలో పుట్టినప్పటికీ, వాడు శూద్రస్త్రీని పెల్లీచేసుకుంటే, వాడికి సాంకర్యం ఎమీ లేదు. బహుశః ఆ శూద్రస్త్రీకి సాంకర్యం ఏర్పడుతుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


12 Jan 2021

No comments:

Post a Comment