శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 177 / Sri Lalitha Chaitanya Vijnanam - 177
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 177 / Sri Lalitha Chaitanya Vijnanam - 177 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖
🌻 177. 'నిరాబాధా'🌻
బాధారహితురాలు శ్రీమాత అని అర్థము.
సర్వబాధలకు భ్రాంతియే కారణము. భ్రాంతి లేనపుడు బాధ లేదు. సత్తుని చూచి వెండి అనుకొని భ్రాంతి. తాడుని చూచి పాము అనుకొని భ్రాంతి. చీకటిలో ఒక వస్తువు మరొక వస్తువువలె
కనిపించును. అట్లే అజ్ఞానము ఆవరించినవారికి ఒకటి ఇంకొకటివలె గోచరించును.
దాని వలన బాధ, భయము, పొరపాటు కలుగును. జ్ఞానము గలవారికిది యుండదు. శ్రీమాత జ్ఞానస్వరూపిణి అగుట వలన, అట్టి పొరబాట్లు, వాని బాధలు ఆమెకు లేవు. పొరబాటు పడనివాడే జ్ఞాని అని గ్రంథములు తెలుపుచున్నవి.
విభీషణుడు యుద్ధమునకు ముందు రాముని శరణు వేడెను. అతని విషయమున సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు వారి వారి అవగాహనను తెలిపిరి. కాని జ్ఞానియగు శ్రీరాముడు విభీషణుని ఆవేదనను సూటిగ గ్రహించెను.
అట్లే బంగారు లేడి సన్నివేశమున, లక్ష్మణుడు సత్యమును సూటిగా చూడగలిగెను. అట్లు చూడలేక జానకీదేవి బాధకు గురి అయ్యెను. లేడియందు భ్రాంతియే ఆమెనట్లు చేసినది. సీతయందలి భ్రాంతియే రాముడికి
కూడ బాధలను కలుగచేసెను.
అట్లు బాధలన్నియు భ్రాంతినుండియే కలుగును. సనకాది బ్రహ్మమానస పుత్రులే, భ్రాంతినబడుట పురాణములు పేర్కొనినవి సృష్టియందు భ్రాంతి పడనివారెవరు? త్రిమూర్తులు సహితము భ్రాంతికి లోనయినవారే. ఇక సంసారజీవుల మాట చెప్పనక్కరలేదు.
త్రిగుణములకు లోపలివారు భ్రాంతికి లోనైనవారే. త్రిగుణాతీత అయిన శ్రీమాత అట్టి భ్రాంతి కెన్నడూ లోను కాదు. భ్రాంతి ఆమె ఆయుధము. రజస్సు, తమస్సు గుణములకు లోబడిన అసురులు
భ్రాంతియందే జీవింతురు. సత్యము నందున్న సాధుజనులు కూడ భ్రాంతికి లోనగుదురు.
కేవలము గుణాతీత చైతన్యమున స్థిరపడినవారే భ్రాంతిన పడరు. గుణభ్రాంతి మహత్తరమగు భ్రాంతి. భ్రాంతివలన బాధ, బంధన ముండును. అట్టి బంధము లేనిది శ్రీమాత. ఆమెను ఆరాధిచుట వలన మాత్రమే ఆమె అనుగ్రహమున నిరాబాధ స్థితిని జీవులు కూడ పొందగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 177 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Nirābādhā निराबाधा (177) 🌻
She remains undisturbed. She is not disturbed by illusions. Illusion arises out of wrongly identifying an object.
For example, identifying in darkness a piece of rope as snake is illusion. This illusion causes fear, desire, etc. Since She Herself is the cause of such illusions (māyā), there is no question of any illusion for Her. Moreover, the Brahman does not have qualities such as illusions.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
12 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment