12-JANUARY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 607 / Bhagavad-Gita - 607🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 224, 225 / Vishnu Sahasranama Contemplation - 224, 225🌹
3) 🌹 Daily Wisdom - 26🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 160🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 181🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 105🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 177 / Sri Lalita Chaitanya Vijnanam - 177 🌹
8) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 01 / Lalitha Sahasra Namavali - 01 🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 518 / Bhagavad-Gita - 518🌹

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 122🌹 
11) 🌹. శివ మహా పురాణము - 322🌹 
12) 🌹 Light On The Path - 75🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 207🌹 
14) 🌹 Seeds Of Consciousness - 271🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 146 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 0 2 / Lalitha Sahasra Namavali - 2 🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 02 / Sri Vishnu Sahasranama - 02🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 607 / Bhagavad-Gita - 607 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 24 🌴*

24. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పున: |
క్రియతే బహులాయాసం తద్ రాజసముదాహృతమ్ ||

🌷. తాత్పర్యం : 
కాని కోరికలను ఈడేర్చుకొనవలెనని భావించువానిచే మిథ్యాహంకారభావనలో అతి ప్రయాసతో ఒనర్చబడును కర్మ రజోగుణప్రధానమైనదని చెప్పబడును.

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 607 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 24 🌴*

24. yat tu kāmepsunā karma sāhaṅkāreṇa vā punaḥ
kriyate bahulāyāsaṁ tad rājasam udāhṛtam

🌷 Translation : 
But action performed with great effort by one seeking to gratify his desires, and enacted from a sense of false ego, is called action in the mode of passion.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 224, 225 / Vishnu Sahasranama Contemplation - 224, 225 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻224. సహస్రమూర్ధా, सहस्रमूर्धा, Sahasramūrdhā🌻*

*ఓం సహస్రమూర్ధ్నే నమః | ॐ सहस्रमूर्ध्ने नमः | OM Sahasramūrdhne namaḥ*

సహస్రమూర్ధా, सहस्रमूर्धा, Sahasramūrdhā

సహస్రాణి మూర్ధానః అస్య వేలకొలది అనగా అనంతములైన శిరములు ఇతనికి కలవు.

:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::
అనేకవక్త్రనయన మనేకాద్భుతదర్శనమ్ ।
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ॥ 10 ॥
దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్ ।
సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్ ॥ 11 ॥

పెక్కుముఖములు, నేత్రములు గలదియు, అనేకములగు అద్భుతవిషయములను జూపునదియు, దివ్యములైన పెక్కు ఆభరణములతో గూడినదియు, ఎత్తబడియున్న అనేక దివ్యాయుధములుగలదియు, దివ్యమైన పుష్పమాలికలను ధరించినదియు, దివ్యమగు గంధపుపూతతో గూడియున్నదియు, అనేక ఆశ్చర్యములతో నిండియున్నదియు, ప్రకాశమానమైనదియు, అంతము లేనిదియు ఎల్లెడల ముఖములు గలదియునగు తన విశ్వరూపమును భగవానుడర్జునునకు జూపెను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 224🌹*
📚. Prasad Bharadwaj 

*🌻224. Sahasramūrdhā🌻*

*OM Sahasramūrdhne namaḥ*

Sahasrāṇi mūrdhānaḥ asya / सहस्राणि मूर्धानः अस्य One with a thousand i.e., innumerable heads.

Śrīmad Bhagavad Gīta - Chapter 11
Anekavaktranayana manekādbhutadarśanam,
Anekadivyābharaṇaṃ divyānekodyatāyudham. (10)
Divyamālyāmbaradharaṃ divyagandhānulepanam,
Sarvāścaryamayaṃ devamanantaṃ viśvatomukham. (11)

:: श्रीमद्भगवद्गीत - विश्वरूप संदर्शन योग ::
अनेकवक्त्रनयन मनेकाद्भुतदर्शनम् ।
अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥ १० ॥
दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् ।
सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥ ११ ॥

Arjuna saw the multifarious marvelous presence of the Deity - infinite in forms, shining in every direction of space, omnipotence all-pervading, adorned with countless celestial robes and garlands and ornaments, upraising heavenly weapons, fragrant with every lovely essesnce, His faces and eyes everywhere!

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 25
Mūrdhanyarpitamaṇuvatsahasramūrdhno bhūgolaṃ sagirisaritsamudrasattvam,
Ānantyādanimitavikramasya bhūmnaḥ ko vīryāṇyadhi gaṇayetsahasrajihvaḥ. (12)

:: श्रीमद्भागवते पञ्चम स्कन्धे पञ्चविंशोऽध्यायः ::
मूर्धन्यर्पितमणुवत्सहस्रमूर्ध्नो भूगोलं सगिरिसरित्समुद्रसत्त्वम् ।
आनन्त्यादनिमितविक्रमस्य भूम्नः को वीर्याण्यधि गणयेत्सहस्रजिह्वः ॥ १२ ॥

Because the Lord is unlimited, no one can estimate His power. This entire universe, filled with its many great mountains, rivers, oceans, trees and living entities, is resting just like an atom on one of His many thousands of hoods. Is there anyone, even with thousands of tongues, who can describe His glories?

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अग्रणीर्ग्रामणीश्श्रीमान्न्यायो नेता समीरणः ।
सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षस्सहस्रपात् ॥ २४ ॥

అగ్రణీర్గ్రామణీశ్శ్రీమాన్న్యాయో నేతా సమీరణః ।
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్ ॥ ౨౪ ॥

Agraṇīrgrāmaṇīśśrīmānnyāyo netā samīraṇaḥ ।
Sahasramūrdhā viśvātmā sahasrākṣassahasrapāt ॥ 24 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 225 / Vishnu Sahasranama Contemplation - 225🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻225. విశ్వాత్మా, विश्वात्मा, Viśvātmā🌻*

*ఓం విశ్వాత్మనే నమః | ॐ विश्वात्मने नमः | OM Viśvātmane namaḥ*


విశ్వాత్మా, विश्वात्मा, Viśvātmā


విశ్వం ఆత్మ యస్య విశ్వమే తన రూపము ఎవనికో అట్టివాడు. విశ్వస్య ఆత్మ విశ్వమునకంతటికిని ఆత్మభూతుడు.


:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
క. విశ్వాత్ముఁడు విశ్వేశుఁడు, విశ్వమయుం, డఖిలనేత, విష్ణుఁ, డజుం డీ
    విశ్వములోఁ దా నుండును, విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండున్‍.

విశ్వానికి ఆత్మ అయినవాడూ, విశ్వానికి ప్రభువూ, విశ్వరూపుడూ, సమస్తానికీ నాయకుడూ, పుట్టుకలేనివాడూ అయిన విష్ణువు ఈ విశ్వంలో ఉంటాడు. ఈ విశ్వం ఆయనలో మిక్కిలిగా ప్రకాశిస్తూ వుంటుంది.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 225🌹*
📚. Prasad Bharadwaj 

*🌻225. Viśvātmā🌻*

*OM Viśvātmane namaḥ*

Viśvaṃ ātma yasya / विश्वं आत्म यस्य The One with this universe as his ātma. Or Viśvasya ātma / विश्वस्य आत्म The soul of the universe.


Śrīmad Bhāgavata - Canto 1, Chapter 2
Yathā hyavahito vahnirdāruṣvekaḥ svayoniṣu,
Nāneva bhāti viśvātmā bhūteṣu ca tathā pumān. (32)

:: श्रीमद्भागवते प्रथम स्कन्धे, द्वितीयोऽध्यायः ::
यथा ह्यवहितो वह्निर्दारुष्वेकः स्वयोनिषु ।
नानेव भाति विश्वात्मा भूतेषु च तथा पुमान् ॥ ३२ ॥

The Lord, as Supersoul, pervades all things, just as fire permeates wood, and so He appears to be of many varieties, though He is the absolute one without a second.


🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अग्रणीर्ग्रामणीश्श्रीमान्न्यायो नेता समीरणः ।
सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षस्सहस्रपात् ॥ २४ ॥

అగ్రణీర్గ్రామణీశ్శ్రీమాన్న్యాయో నేతా సమీరణః ।
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్ ॥ ౨౪ ॥

Agraṇīrgrāmaṇīśśrīmānnyāyo netā samīraṇaḥ ।
Sahasramūrdhā viśvātmā sahasrākṣassahasrapāt ॥ 24 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 26 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 26. Positive Bliss is Found Only in the Self 🌻*

All actions are done for the sake of the Self, not for external persons and things. It is not the existence of joy in the object as such that brings pleasure to the individual enjoying it, but the cooling of the fire of craving that is brought about by its contact with a particular object which is specially demanded by that special mode of desire generated in the ego-consciousness. 

The satiation is caused by a temporary turning back of the mind to the Self. The whole of the happiness of the world is, thus, purely negative, an avoiding of the unpleasant, and not the acquirement of any real, positive joy. This positive bliss is found only in the Self, the root of existence. 

The bustle of life’s activity is a struggle to respond to the cry of the anxious ego which has lost itself in the wilderness of its separation from the Eternal Principle. The grieving self bound by fetters in the prison of life is ransomed by the knowledge of the non-dual nature of Existence. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 160 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 90 🌻*

అంటే, ముందు విచారణ. తదుపరి ఆలోచన. తదుపరి ఆచరణ, ఆ తదుపరి ఫలము. ఇలా ఉండాలి ఎప్పుడూ కూడ. కానీ, ఎప్పుడైతే మనో వేగానికి లోనవుతావో, ఎప్పుడైతే భ్రాంతికి లొంగుతావో, ఎప్పుడైతే భ్రమాజన్యమైనటువంటి అజ్ఞానానికి లొంగుతావో, అప్పుడు ఏమౌతామంటే, ముందు ఆచరణ, తదుపరి ఆలోచన, ఆ తదుపరి విచారణ. వ్యతిరేకమైపోతుంది. అప్పుడు ఎంత ప్రయత్నించినా దీనిని జ్ఞాన స్థాయికి తీసుకొని వెళ్ళలేము.
        
కాబట్టి, ఒక నిర్ణయము తీసుకునే ముందే, ఒక ఆలోచనని చేసే ముందే, ఒక ఆకాంక్షని అమలు పరిచేముందే, విచారణ చేయి. వస్తువును ఆశ్రయిస్తుందా? అసత్తును ఆశ్రయించిం ఉందా? బ్రహత్వానికి చేరుస్తోందా? ప్రపంచానికి చేరుస్తోందా? పంచీకరించబడినదంతా... నానాత్వముగా ఉన్నటువంటి, అనేకత్వముతో ఉన్నటువంటిది కదా! మరది మిథ్యాభూతము కదా! అది లేనిది కదా! మరి అటువంటి లేని దానిని నేను ఆశ్రయించడం సమంజసం కాదు కదా! అనేటటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహనను కలిగియుండాలి.
        
ఈ రీత్యానే మనం ధర్మశాస్త్రాలన్ని, మానవులకు ఏయే సమయాలలో ఎలా జీవించాలి అనేటటువంటి దానిని నిర్ణయంజేశాయి. బ్రహ్మచారి తప్పక బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావల్సిన విద్యను సంగ్రహించాలి. ఇప్పుడు ఆ బ్రహ్మచర్య ఆశ్రమము కాస్తా పోయింది. ఇప్పుడు ఏం చేశాడు? బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి బదులుగా, ముక్తివిద్యను సాధించడానికి బదులుగా, భుక్తి విద్యయందు మునిగిపోయాడు. 

తర్వాత ఏమైపోయింది? పాతికేళ్ళు అయిపోయింది. అయిపోయినప్పటికి ఏమైపోయింది? బ్రహ్మజ్ఞానం రాలేదు. ఇంకేం చేస్తాం బాబోయ్‌? ఇప్పటికే లేట్‌ అయిపోయింది, వివాహం చేసేయండి, వివాహం చేసేయండి. బ్రహ్మజ్ఞానం లేకుండా ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో, అవసరార్థం చేసుకున్నదే కదా అది. 

అట్టి అవసరార్థం చేయబడినటువంటి వివాహం వలన జీవితం అంతా, దేనిని తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు అంటే, అట్టి అవసరార్థమైనవి తీర్చుకునే పనిలోనే ఉంటాడు. అప్పటికికప్పుడు ఆ అవసరం వస్తూఉంటుంది. ఆయా అవసరాల చేత కొట్టుకుని పోతూ ఉంటాడు. 

ఆ కొట్టుకు పోయినటువంటి ప్రవాహ వేగంలో, జీవితం క్షణభంగురంగా అయిపోతుంది. చేసి ఇక అంతా చేసి కళ్ళు తెరిచి చూసే సరికి, పిల్లలు సంసారం అన్నీ ఏర్పడుతాయి. ఆహా ఇల్లు ఏర్పరచుకున్నాను, ఆహా భార్యను ఏర్పరచుకున్నాను, ఆహా పిల్లలను ఏర్పరచుకున్నాను, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. 

ఆహా! ఇల్లు బాగుంది. ఆహా పిల్లలు బాగున్నారు, ఆహా భార్య బాగుంది, ఆహా సంసారం బాగుంది. వీళ్ళందరూ బాగున్నారు కాబట్టి నేను కూడా బాగున్నాను అనేటటువంటి సాపేక్ష పద్ధతిగా వస్తూపలబ్ధి చేత, నేను ఇంత బంగారం కొన్నాను. నేను ఇన్ని వస్తువులు కొన్నాను, నేను ఇంత విలువైన వస్తువులు కొన్నాను, నేను అంత విలువైన వస్తువులు కొన్నాను. 

నేను ఇంత విలువైనటువంటి వాటిని దాచకున్నాను. నేను ఇంత విలువైనటువంటి వాటిని వ్యయం చేశాను. నేను ఇన్ని దేశాలు తిరిగాను. నేను ఇంత గొప్ప కులంలో పుట్టాను. నేను ఇంత గొప్ప క్షేత్రంలో పుట్టాను. నేను ఇంత వంశ వారసత్వాన్ని కలిగియున్నాను. నేను ఇంత కులగోత్రాలు కలిగియున్నాను. 

నేను ఇంత ఉత్తమమైన మతంలో పుట్టాను లేదా ఉత్తమమైన ధర్మంలో పుట్టాను లేదా ఉత్తమమైనటువంటి అపేక్షలో పుట్టాను లేదా విలువైన రత్నాది ఆభరణాలను సంగ్రహించాను. ఈ రకంగా తనను తాను ఉద్గడింప చేసుకొనేటటుంవంటి అనాత్మ వస్తూపలబ్ధిని ఆశ్రయించి, తన గురించి తాను చెబుతూఉంటాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 181 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
173

Fire. Avadhoota Swamy is teaching King Yadu what he learned from his fifth Guru. 

“Parabrahman is in the form of fire. He in the form of radiance. Our sacrificial offerings are received by the Gods through fire. That is why, our scriptures teach us to do Yajnas (ritual of offering and sublimating herbal preparations in fire accompanied by chanting of Vedic hymns) so that the country can be prosperous. 

By performing Yajnas, owing to the sacrificial offerings received through fire, Lord Varuna (the God of Rain) showers rains on us. Moon is pleased and infuses plants with medicinal qualities, due to which we get food. Fire gives us the strength to gain victory over enemies. He keeps the enemies subdued. He keeps us pure. He gives us longevity.
Fire God exists in the middle of east and south directions. 

Some people consider Fire God who has the ability to burn everything, a destroyer. But, Fire God is not a destroyer, he actually promotes growth. He increases friendship. That is why bonds of friendship are sealed in the presence of Fire. Friendships are fostered in the presence of Fire. 

We already know the story of how Rama and Sugreeva sealed their friendship in the presence of Fire. Even someone as great as Lord Rama, someone as Supreme as Rama and someone as courageous as Sugreeva had Fire God as their witness. “With Fire God as witness, I promise to help you”. “With Fire God as a witness, we are best friends from today”.

Everyone knows the qualities of Fire. Jatharagni (loosely, the biological fire energy or digestive fire) in our body digests everything that is put into the stomach. If God did not endow us with that Jatharagni that enables digestion, man cannot live. 

It digests all the food that enters the stomach, enables purified blood to be circulated to all parts of the body and helps the person live. That is why, “Agni Saakshi” (Agni=fire; Saakshi=witness) is very important. When resolving disputes, people keep a fire lit in front of them and discuss matters of morals, ethics and justice. They may use an oil lamp. 

Looking at the lamp, looking at the aura around the lamp, at the center of that fire, they use the energy at the center of that fire as witness. Truth gets protected. Fire is always at a high level. It’s sound is also at a high frequency. Fire is red in color. Fire gives light and heat. In the nights, he exists as heat. He makes the seeker adhere to truth. 

He bestows concentration on worship of the Atman. He ensures that the soul’’s objectives are fulfilled. He removes the obstacles to faith and trust. He fills us with strength, faith and courage. The amazing qualities of Fire are almost impossible to describe in words. We discussed that he ensures that the soul’s objectives are fulfilled.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 105 / Sri Lalitha Sahasra Namaavali - 105 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 177 / Sri Lalitha Chaitanya Vijnanam - 177 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |*
*నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖*

*🌻 177. 'నిరాబాధా'🌻*

బాధారహితురాలు శ్రీమాత అని అర్థము.

సర్వబాధలకు భ్రాంతియే కారణము. భ్రాంతి లేనపుడు బాధ లేదు. సత్తుని చూచి వెండి అనుకొని భ్రాంతి. తాడుని చూచి పాము అనుకొని భ్రాంతి. చీకటిలో ఒక వస్తువు మరొక వస్తువువలె
కనిపించును. అట్లే అజ్ఞానము ఆవరించినవారికి ఒకటి ఇంకొకటివలె గోచరించును. 

దాని వలన బాధ, భయము, పొరపాటు కలుగును. జ్ఞానము గలవారికిది యుండదు. శ్రీమాత జ్ఞానస్వరూపిణి అగుట వలన, అట్టి పొరబాట్లు, వాని బాధలు ఆమెకు లేవు. పొరబాటు పడనివాడే జ్ఞాని అని గ్రంథములు తెలుపుచున్నవి. 

విభీషణుడు యుద్ధమునకు ముందు రాముని శరణు వేడెను. అతని విషయమున సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు వారి వారి అవగాహనను తెలిపిరి. కాని జ్ఞానియగు శ్రీరాముడు విభీషణుని ఆవేదనను సూటిగ గ్రహించెను. 

అట్లే బంగారు లేడి సన్నివేశమున, లక్ష్మణుడు సత్యమును సూటిగా చూడగలిగెను. అట్లు చూడలేక జానకీదేవి బాధకు గురి అయ్యెను. లేడియందు భ్రాంతియే ఆమెనట్లు చేసినది. సీతయందలి భ్రాంతియే రాముడికి
కూడ బాధలను కలుగచేసెను. 

అట్లు బాధలన్నియు భ్రాంతినుండియే కలుగును. సనకాది బ్రహ్మమానస పుత్రులే, భ్రాంతినబడుట పురాణములు పేర్కొనినవి సృష్టియందు భ్రాంతి పడనివారెవరు? త్రిమూర్తులు సహితము భ్రాంతికి లోనయినవారే. ఇక సంసారజీవుల మాట చెప్పనక్కరలేదు.

 త్రిగుణములకు లోపలివారు భ్రాంతికి లోనైనవారే. త్రిగుణాతీత అయిన శ్రీమాత అట్టి భ్రాంతి కెన్నడూ లోను కాదు. భ్రాంతి ఆమె ఆయుధము. రజస్సు, తమస్సు గుణములకు లోబడిన అసురులు
భ్రాంతియందే జీవింతురు. సత్యము నందున్న సాధుజనులు కూడ భ్రాంతికి లోనగుదురు. 

కేవలము గుణాతీత చైతన్యమున స్థిరపడినవారే భ్రాంతిన పడరు. గుణభ్రాంతి మహత్తరమగు భ్రాంతి. భ్రాంతివలన బాధ, బంధన ముండును. అట్టి బంధము లేనిది శ్రీమాత. ఆమెను ఆరాధిచుట వలన మాత్రమే ఆమె అనుగ్రహమున నిరాబాధ స్థితిని జీవులు కూడ పొందగలరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 177 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Nirābādhā निराबाधा (177) 🌻*

She remains undisturbed. She is not disturbed by illusions. Illusion arises out of wrongly identifying an object.  

For example, identifying in darkness a piece of rope as snake is illusion. This illusion causes fear, desire, etc. Since She Herself is the cause of such illusions (māyā), there is no question of any illusion for Her. Moreover, the Brahman does not have qualities such as illusions.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 01 / Sri Lalita Sahasranamavali - Meaning - 01 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 1. శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ |*
*చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ‖ 1 ‖ 🍀*

1) శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి.

2) శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి.

3) శ్రీమత్సింహాసనేశ్వరీ : 
శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.

4) చిదగ్ని కుండ సంభూతా : 
చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది.

5) దేవకార్య సముద్యతా : 
దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 1 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 1 🌻*

*🌻1. oṁ śrīmātā śrīmahārājñī śrīmat-siṁhāsaneśvarī |*
*cidagni-kuṇḍa-sambhūtā devakārya-samudyatā || 1 || 🌻*

1 ) Sri matha -   
Mother who gives immeasurable wealth who removes all sorrows and gives only happiness,indicates also her role of creation

2 ) Sri maharajni -   
She who is the empress who takes care of the universe,indicates her role of protection

3 ) Sri math simasaneshwari -   
She who sits on the throne of lions-indicates her role of destruction

4 ) Chidagni Kunda Sambootha -   
She who rose from the fire of knowledge and is the ultimate truth

5 ) Deva karya samudhyatha -   
She who is interested in helping devas

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 518 / Bhagavad-Gita - 518 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 01 🌴*

01. శ్రీ భగవానువాచ
ఊర్థ్వమూలమధశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛన్దాంసి యస్య పర్ణాణి యస్తం వేద స వేదవిత్ ||

🌷. తాత్పర్యం : 
పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు పలికెను : వ్రేళ్ళు ఊర్థ్వముగను, శాఖలు క్రిందుగను, వేదఋక్కులే ఆకులుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థవృక్షమొకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగినవాడే వేదముల నెరిగినవాడు.

🌷. భాష్యము :
భక్తియోగపు ప్రాముఖ్యమును చర్చించిన పిమ్మట ఎవరైనను “వేదముల ప్రయోజనమేమిటి?” యని ప్రశ్నించవచ్చును. అందుకు సమాధానముగా వేదాధ్యయన ప్రయోజనము శ్రీకృష్ణుని ఎరుగుటయేనని ఈ అధ్యాయమున వివరింపబడినది. అనగా కృష్ణభక్తిరసభావితుడై భక్తియోగమునందు నియుక్తుడైనవాడు వేదములను ఎరిగియే యుండును.

భౌతికజగత్తు బంధము ఇచ్చట అశ్వత్థవృక్షముతో పోల్చబడినది. కామ్యకర్మల యందు రతుడైనవాడు ఈ అశ్వత్థవృక్షపు తుదిని తెలియక ఒకకొమ్మ నుండి వేరొకకొమ్మకు సదా మారుచుండును. అనగా భౌతికజగమను ఈ అశ్వత్థవృక్షమునకు అంతమనునది లేదు. అట్టి ఈ వృక్షమునందు ఆసక్తుడైనవానికి ముక్తి లభించు నవకాశమే లేదు.

 ఆత్మోద్దారమునకై ఉద్దేశింపబడిన వేదమంత్రములు ఈ వృక్షపు ఆకులుగా పేర్కొనబడినవి. విశ్వము యొక్క అత్యున్నత లోకమైన బ్రహ్మలోకము నుండి ఆరంభమగుటుచే దీని వ్రేళ్ళు ఊర్థ్వముగా నున్నవి. అవ్యయమైన ఈ మాయావృక్షమును అవగతము చేసికొనినచో మనుజుడు దాని నుండి బయటపడగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 518 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 15 - Purushothama Yoga - 01 🌴*

01. śrī-bhagavān uvāca
ūrdhva-mūlam adhaḥ-śākham aśvatthaṁ prāhur avyayam
chandāṁsi yasya parṇāni yas taṁ veda sa veda-vit

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: It is said that there is an imperishable banyan tree that has its roots upward and its branches down and whose leaves are the Vedic hymns. One who knows this tree is the knower of the Vedas.

🌹 Purport :
After the discussion of the importance of bhakti-yoga, one may question, “What about the Vedas?” It is explained in this chapter that the purpose of Vedic study is to understand Kṛṣṇa. Therefore one who is in Kṛṣṇa consciousness, who is engaged in devotional service, already knows the Vedas.

The entanglement of this material world is compared here to a banyan tree. For one who is engaged in fruitive activities, there is no end to the banyan tree. 

He wanders from one branch to another, to another, to another. The tree of this material world has no end, and for one who is attached to this tree, there is no possibility of liberation. The Vedic hymns, meant for elevating oneself, are called the leaves of this tree.

 This tree’s roots grow upward because they begin from where Brahmā is located, the topmost planet of this universe. If one can understand this indestructible tree of illusion, then one can get out of it.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share శ్రీ లలితా విష్ణు చైతన్య విజ్ఞానం
Sri Lalitha Chaitanya Vijnanam

https://www.facebook.com/groups/148277766721625/?ref=share

Join and share..... విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation  

Join and Share శ్రీ లలితా చైతన్య విజ్ఞానం
Sri Lalitha Chaitanya Vijnanam

http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation  

www.facebook.com/groups/vishnusahasranamatatwa/ 


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -122 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 6

*🍀. 5. ముని - మననము - బ్రహ్మము - శ్వాసయందు స్మరణ సాగుచుండగ, కర్తవ్యము లన్నిటిని ఉదాసీన తతో నిర్వర్తించుచు నుండుట. చిత్తము శివుని పైన, చేతులు ప్రపంచములో నుంచుట కూడ సన్న్యాసమే అని కృష్ణుని మతము.. సన్న్యాస మనగ సమ్యక్ న్యాసము. అనగ ఒడుదొడుకులు లేని స్మరణ, హృదయ మందు “సో హం' శబ్ద రూపమున వసించి యున్న దైవమునందు బుద్ధిని నిలిపి దైనందిన కార్య క్రమములను యథాలాపముగ నిర్వర్తించువాడు కూడ సన్న్యాసియే. అనన్య మననము వలననే జీవుడు బ్రహ్మమును పొందగలడు. “దైవమే నేనుగ నున్నానని” చేయవలెను. అదియే "సో హం” అను మంత్రము. 'సహ' అనగ అతడు. 'అహం' అనగ నేను. “ 🍀*

6. సన్న్యాసస్తు మహాబాహో దుఃఖ మాప్తు మయోగతః |
యోగయుక్త ముని ధృహ్మ న చిరేణాధిగచ్ఛతి |

గొప్ప బాహువులుగల ఓ అర్జునా! కర్మ సన్న్యాసము కర్మ యోగము లేకుండ పొందుట దుఃఖము కలిగించును. కర్మ యోగముతో కూడిన మననశీలుడు శీఘ్రముగ బ్రహ్మమును చేరుచున్నాడు. 

నిజమగు సన్న్యాసులు సతతము దైవస్మరణము చేయుచు నుందురు. వారి ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసలయందు దివ్యస్మరణమే సాగుచునుండును. ట్టివారు దేహమునకు ప్రాధాన్యమీయక దైవమే ప్రధానముగ, ఆధారముగ మననము చేయుచు మునివలె జీవించుచుందురు. 

వారి సంస్కారమున ప్రాపంచిక ఆకర్షణలు జారిపోవుటచే వారు కేవలము దైవస్మరణ చేయుచు, దొరికినది భుజించుచు, నిదురవచ్చినపుడు నేలపై నిద్రించుచు, నదీ తటాకముల స్నానములు గావించుచు, గృహములందు కాక ప్రకృతి యందే జీవించుచు నుందురు. ప్రపంచమున సన్న్యసించి జీవించుట సులభము కాదు. 

దేహభ్రాంతి, దేహావసరములు లేనివారే అట్లు జీవింతురు. అట్టివారు గౌరవింప
దగినవారు. కాని అట్లు జీవించుట కష్టము అని దైవము తెలుపుచున్నాడు. కష్ట మనగ అసాధ్యమని కాదు. కాని అది సాధ్యపడినవారు కొందరే యుందురు. 

కష్టతరమగు ఆ మార్గముకన్న ముందు తెలుపబడిన కర్మ జ్ఞాన యోగముల ద్వారా శీఘ్రముగ దైవమును చేరవచ్చునని దైవమే తెలుపుచున్నాడు. బుద్ధియోగముతో కర్తవ్యములను నిర్వర్తించుచు దివ్యస్మరణ యందుండుట మేలని తెలుపు చున్నాడు. 

అనగా శ్వాసయందు స్మరణ సాగుచుండగ, కర్తవ్యము లన్నిటిని ఉదాసీన తతో నిర్వర్తించుచు నుండుట. చిత్తము శివుని పైన, చేతులు ప్రపంచములో నుంచుట కూడ సన్న్యాసమే అని కృష్ణుని మతము. వశిష్టాది. బ్రహ్మర్షులు అట్లాచరించినవారే. జనకాది రాజర్షులు కూడ అట్లాచరించిన వారే. సన్న్యాస మనగ సమ్యక్ న్యాసము. 

అనగ ఒడుదొడుకులు లేని స్మరణ, హృదయమందు “సో హం' శబ్ద రూపమున వసించి యున్న దైవమునందు బుద్ధిని నిలిపి దైనందిన కార్య క్రమములను యథాలాపముగ నిర్వర్తించువాడు కూడ సన్న్యాసియే. సరళమగు మార్గముండగ దుఃఖపూరితమగు మార్గమేల? 

జీవులలోని రజస్తమస్సులు వారి నెప్పుడును ప్రపంచములోనికి నెట్టుచునే యుండును. లభించినది భుజించుట, ఏ ప్రదేశమున నైనను నిద్రించ గలుగుట, ఎప్పుడును హృదయమున స్మరణయందే యుండుట, దేహాభిమానము లేకుండుట, దేహియైన జీవునకు దుఃఖకరము. 

దేహముతో పని చేయించుచు, బుద్ధితో దైవస్మరణ యందుండుట సులభము. ఇట్లుండువారు దేహముతో చేయు పనుల ద్వారా ప్రపంచమున చిక్కుపడియుండక యుండుటకు కర్మజ్ఞాన రహస్యములను తెలిపినాడు. 

ఇచ్చటొక ముఖ్య సూత్రమున్నది. బుద్ధియోగమున చేరి, కర్మ జ్ఞాన యోగ సూత్రముల సహాయముతో చిక్కుపడక యుండుట మాత్రమే పరమావధి కాదని, మననము జరుగవలెనని దైవము బోధించు చున్నాడు. 

అనన్య మననము వలననే జీవుడు బ్రహ్మమును పొందగలడు. మననము ఎట్లు చేయవలెను ? “దైవమే నేనుగ నున్నానని” చేయవలెను. అదియే "సో హం” అను మంత్రము. 'సహ' అనగ అతడు. 'అహం' అనగ నేను. “అతడే నేను” అని హృదయము ఘోషించుచున్నది. దానియందు స్థిరపడుట సన్న్యాసము. అట్లు నిరంతరము న్యాసపూర్వక మననము ఎవని యందు జరుగునో అతడే ముని. అతడు బ్రహ్మమును అచిరకాలమున చేరగలడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 322 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
81. అధ్యాయము - 36

*🌻. విష్ణు వీర భద్ర సంవాదము - 2 🌻*

లోకపాలకులిట్లు పలికిరి -

హే గురో! బృహస్పతీ! నీవు గొప్ప బుద్ధిశాలివి. కరుణా మయుడవు. మా ప్రశ్నకు తొందరగా సమాధానము నిమ్ము. మాకు జయము లభించు ఉపాయమేది? (18).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఈ మాటను వివిన బృహస్పతి ప్రయత్న పూర్వకముగా శంభుని స్మరించి, ఆజ్ఞాని యగు మహేంద్రునితో నిట్లనెను (19).

బృహస్పతి ఇట్లు పలికెను -

పూర్వము విష్ణువు చెప్పిన దంతయూ ఇపుడు మన ఎదుట జరుగుచున్నది. ఓ ఇంద్రా ! ఆ వివరములను చెప్పెదను, సావధానముగా వినుము (20). ఓయీ! కర్మలన్నిటికీ ఫలము నిచ్చు ఈశ్వరుడొకడు గలడు. ఆయన కూడ ఫలము నిచ్చుటలో కర్త యొక్క కర్మలపై ఆధారపడును. కర్మలేని సందర్భములో ఈశ్వరుడైననూ ఫలము నీయలేడు (21).

 సర్వమంత్రములు, ఓషధులు, అభిచార కర్మలు, లౌకిక కర్మలు, వేదోక్త కర్మలు, వేదములు, పూర్వోత్తర మీమాంసలు (22), ఇతర శాస్త్రములు, మరియు నాల్గు వేదములు కూడా ఈశ్వరుని తెలుపలేవని పూర్వర్షులు చెప్పిరి (23). వేదములనన్నిటినీ పదివేలసార్లు పారాయణము చేసిననూ మహేశ్వరుడు జీవునకు సాక్షాత్కరించడు. నీవే తప్ప మరియొక గతి లేదు. అని శరణు పొందిన భక్తులకు ఆయన దర్శనమిచ్చును. మరియొక మార్గము లేదని వేదము చెప్పు వచనము గొప్ప వచనము (24).

సదాశివుని అనుగ్రహముచే శాంతము, సర్వశ్రేష్ఠము, సర్వవికార నిర్ముక్తము అగు దృష్టి లభించును. ఆ దృష్టి చేత మాత్రమే సదా శివుడు నిశ్చయముగా తెలియబడును (25). కాని, ఓ ఇంద్రా ! ఏది చేయదగిన పని, ఏది కాదు అను విషయమును చెప్పెదను. ఇది కార్యసిద్ధికి ఆవశ్యకమగు అంశము. నీవు స్వీయహితమును గోరి వినుము (6). ఓ ఇంద్రా!నీవు మూర్ఖుడవై ఈనాడు లోకపాలకులతో గూడి దక్షుని యజ్ఞమునకు విచ్చేసితివి. ఇచట ఏమి పరాక్రమమును చూపగలవు? (27). 

రుద్రుని సేవకులగు ఈ గణములు గొప్ప కోపము గలవారు. యజ్ఞమును పాడుచేయుటకై వచ్చినారు. ఆపనిని చేయుదురనుటలో సందేహము లేదు (28). సత్యమును విచారించి చెప్పుచున్నాను. ఈయజ్ఞమును రక్షించే ఉపాయము లేనే లేదు. ఈ యజ్ఞమునకు వచ్చిన విఘ్నమును తొలగించ గల సమర్థత ఎవ్వరికీ లేదు. నేను ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను (29).

బ్రహ్మ ఇట్లు పలికెను -

బృహస్పతి యొక్క ఈ మాటలను విని ఆ దేవతలు అందరు, లోకపాలకులు, ఇంద్రుడు చింతాగ్రస్తులైరి (30). అపుడు మహావీరులగు గణములతో కూడియున్న వీరభద్రుడు మనస్సులో శంకరుని స్మరించి ఇంద్రుడు మొదలగు లోకపాలకులతో నిట్లునెను (31).

వీరభద్రుడిట్లు పలికెను -

మీరందరు మూర్ఖులగుటచే యజ్ఞ భాగముల కొరకు వచ్చి యున్నారు. నేను యజ్ఞ భాగములనిచ్చెదను. నా వద్దకు రండు (32). 

హే శుక్రా! హే అగ్నీ! హేసూర్యా! ఓయీ చంద్రా! ఓయీ కబేరా! ఓయీ వరుణా! ఓయీ వాయూ! ఓయీ నిర్‌ ఋతీ! ఓయీ యమా! ఓయీ శేషా! (33)ఓదేవగణములారా! ఓ రాక్షస గణములారా! ఓ విద్వాంసులారా! మీరిక్కడకు రండు. మీకు తృప్తి కలుగు వరకు యజ్ఞ భాగములనిచ్చెదను. మీరు దుష్టులలో అగ్రగణ్యులు (34).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 75 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 5 - THE 6th RULE
*🌻 6. Kill out desire for sensation. - Learn from sensation and observe it - 6 🌻*

298. As far as lies in our power we will take steps to prevent what has been done from being done again, but we must have no sense of hatred. It is a case of noblesse oblige. 

We stand quite infinitely above the sort of person who does that kind of thing; we are ages past him in evolution and development; we stand as far removed from him as he stands from the animal kingdom, and since that is so we ought to show our higher development by not sharing that passion of hatred.

299. We can study the effects of sensation only if we dissociate ourselves from it, if we stand outside and try to control the feeling and to learn from it. We must not be swept away in any such maelstrom of popular feeling, but we must try to see where it is wrong, and do what we can to put it right. 

Many people, who are under the influence of that sensation of tremendous passion, think of us as rather apathetic, and cold; it is even possible that they sometimes think of us as lacking in patriotism if we refuse to hate. Of course that is not logical, but then people are not logical when under the influence of these great waves of hatred. 

We can explain to them that patriotism does not call on one to hate other countries, but they sometimes do not see that we can love our own country without being obliged to hate another.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 207 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. చ్యవనమహర్షి-సుకన్య - 4 🌻*

18. నైమిశం (‘నిమి-శ’ అంటే, చక్రం నిలిచిన చోటు అని అర్థం). ఆ నైమిశం అప్పుడు వనములు, ఉపనయనములు, చక్కని నదులు, తీర్థములతో సుఖంగా ఉండి, జనం ఎక్కువగా లేనటువంటి చల్లని ప్రదేశంగా ఉన్నది. ఆ తరువాత అది అరణ్యం అయింది. 

19. నైమిశారణ్యంలో యజ్ఞం చేయటానికి, తపస్సుచేయటానికి తేడా ఉంది. యజ్ఞానికి మంచిచోటు చూస్తారు. అరణ్యంలో యజ్ఞంచేయరు. జనపదానికి దగ్గరగా-మరీ దగ్గర్గా కూడా కాకుండా-విశాలంగా చక్కగా ఉండే చోటు ఎంచుకొని యజ్ఞం చేస్తారు.

 20. అరణ్యాలలో అయితే తపస్సులు చేస్తారు. మహర్షులు అందరూ అరణ్యాలలోనే తపస్సులు చేసారు. మొట్టమొదట అది యజ్ఞభూమి. ఇప్పటి పంజాబు, హర్యానా, కురుక్షేత్రానికి దక్షిణభాగంలో ఉంది. అదంతా తరువాత నమిశారణ్యం అయింది. పూర్వం అక్కడే యాగం చేసారు.

21. ఇప్పుడు మనకున్న బ్రాహ్మణ-క్షత్రియభేదం వేదకాలంలో లేదు. సాంకర్యం అనేమాట అదికాదు. సాంకర్యం అంటే, భ్రుష్టుడిని వివాహంచేసుకోవటమే! సాంకర్యం అనేమాట అర్థం ఏమిటంటే, అసమానత్వం. ఇద్దరు అసమానులు కలవటం సాంకర్యం. అనులోమం, విలోమం, అవన్నీకూడా సాంకర్యమే – వర్ణసాంకర్యమే! 

22. గుణంచేత బ్రాహ్మణుడు కానివాడు బ్రాహ్మణవంశంలో పుట్టినప్పటికీ, వాడు శూద్రస్త్రీని పెల్లీచేసుకుంటే, వాడికి సాంకర్యం ఎమీ లేదు. బహుశః ఆ శూద్రస్త్రీకి సాంకర్యం ఏర్పడుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 271 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 120. When you abide for a sufficiently long time in the 'I am', the knowledge 'I am' itself will make everything clear to you. No external knowledge will be necessary. 🌻*

To begin with, the 'I am' has to be completely understood and retraced back to its pure state when you were not aware of the body. At that time the 'I am' was wordless, formless and purely a feeling that 'you are'. 

Having caught the 'I am' you have now to abide in it for a sufficiently long time, this reversion and abidance will have to be done repeatedly. In the process the knowledge 'I am' will befriend you and reveal its secret, and then no external knowledge will be required.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 146 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 25 🌻*

588. మానవుడు తన ప్రధాన పరిమిత స్వభావత్రయమగు స్థూల-సూక్ష్మ- కారణ దేహములు పోగొట్టుకొనినను. తన దుర్భర వేదనలో సంపాదించిన పూర్ణ చైతన్యము మాత్రము ఒకసారి లభించినచో అది ఎప్పటికీ పోదు.

589. ఇక్కడ మానవుడు భగవంతునిలో ప్రవేశించెను. కానీ భగవంతుని జీవితములో మాత్రము ప్రవేశించలేదు.

590. తొలి దివ్య యానము - 
గమ్యస్థానము చేరుకొనుటకులో తొలిదివ్యయానము ముగిసెను.ఇక్కడ మానవుడు భగవంతుడడయ్యెను. ఇతడిప్పుడు భగవంతుని ఆనందమును అనుభవించు చున్నాడు. ఇది గమ్యస్థానమైనప్పటికి పరిపూర్ణము కాదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 2 / Sri Lalita Sahasranamavali - Meaning - 2 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 2. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ‖ 2 ‖ 🍀*

6) ఉద్యద్భాను సహస్రాభా : 
ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.

7) చతుర్బాహు సమన్వితా : 
నాలుగు చేతులతో కూడినది.

8) రాగస్వరూప పాశాఢ్యా : 
అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.

9) క్రోధాకారాంకుశోజ్జ్వలా : 
క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 2 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 2. udyadbhānu-sahasrābhā caturbāhu-samanvitā |*
*rāgasvarūpa-pāśāḍhyā krodhākārāṅkuśojjvalā || 2 || 🌻*

6) Udyath bhanu sahasrabha -   
She who glitters like thousand rising suns

7) Chadur bahu samanvidha -   
She who has four arms

8) Ragha Swaroopa pasadya -   
She who has love for all in the form of rope(pasa)-She has this in one of her left hands

9) Krodhakarankusojwala -   
She who glitters and has anger in the form of Anghusa – in one of her right hands.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 2 / Sri Vishnu Sahasra Namavali - 2 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷* 

*అశ్వని నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 2. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |*
*అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ‖ 2 ‖ 🍀*

🍀 10) పూతాత్మా - 
పవిత్రాత్ముడు.

🍀 11) పరమాత్మ - 
నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.

🍀 12) ముక్తానాం పరమాగతి: - 
ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.

🍀 13) అవ్యయ: - 
వినాశము కానివాడు. వినాశము లేని వాడు.

🍀 14) పురుష: - 
నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు.

🍀 15) సాక్షీ - 
చక్కగా సమస్తమును దర్శించువాడు.

🍀 16) క్షేత్రజ్ఞ: - 
శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.

🍀 17) అక్షర: - 
నాశరహితుడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 2 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka For Aswini 2nd Padam*

*🌻 2. pūtātmā paramātmā ca muktānāṁ paramā gatiḥ |* 
*avyayaḥ puruṣaḥ sākṣī kṣetrajñōkṣara eva cha || 2 || 🌻*

🌻 10) Pootatma – 
The Lord With an Extremely Pure Essence

🌻 11) Paramatma – 
The Supreme Soul

🌻 12) Muktanam Parama Gatih – 
The Ultimate Range of the Liberated

🌻 13) Avyayah – 
The Lord Who is Always Same

🌻 14) Purushah – 
The Lord Who is Inside Every Body

🌻 15) Sakshi – 
The Lord Who is the Witness of Everything that Happens

🌻 16) Kshetragyah – 
The Knower of the Field

🌻 17) Akshara – 
The Undecaying

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment