రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
50. అధ్యాయము - 5
🌻. సంధ్య యొక్క చరిత్ర - 6 🌻
స్నానం మౌనేన కర్తవ్యం మౌనేన హరపూజనమ్ | ద్వయోః పూర్ణజలాహారం ప్రథమం షష్ఠ కాలయోః || 64
తృతీయే షష్ఠకాలే తు హ్యు పవాస పరో భ##వేత్ | ఏవం తపస్సమా ప్తౌ వా షష్ఠే కాలే క్రియా భ##వేత్ || 65
ఏవం మౌనతపస్యాఖ్యా బ్రహ్మ చర్యఫలప్రదా | సర్వా భీష్ట ప్రదా దేవి సత్యం సత్యం న సంశయః || 66
ఏవం చిత్తే సముద్దిశ్య కామం చింతయ శంకరమ్ | స తే ప్రసన్న ఇష్టార్థ మచిరాదేవ దాస్యతి || 67
మౌనముగా స్నానమును చేసి, మౌనముగా శివుని పూజించవలెను. ఆరు ఘడియలు ఒక కాలము అగును.ముందుగా రెండు కాలములయందు పూర్ణముగా నీటిని ఆహారముగా తీసుకొని (64),
మూడవ కాలమునందు ఉపవాసమును చేయవలెను. ఈ తీరున తపస్సు పూర్తి యగు వరకు ఆరవకాలము నందు ఉపవాసము, లేక ఆహారము వచ్చు చుండును (65).
ఓ దేవీ! ఈ తీరున మౌనతపస్యను చేసినచో, బ్రహ్మ చర్య ఫలము లభించుటయే గాక, కోర్కెలన్నియూ ఈడేరును. ఇది ముమ్మాటికీ సత్యము. సంశయము లేదు (66).
ఇట్లు మనస్సులో నిర్ణయించుకొని, యథేచ్ఛగా శంకరుని ధ్యానింపుము. ఆయన ప్రసన్నుడై నీకు శీఘ్రముగా కోరిన ఫలమును ఈయగలడు (67).
బ్రహ్మో వాచ |
ఉపదిశ్య వసిష్ఠోsథ సంధ్యాయై తపసః క్రియామ్ | తామాభాష్య యథాన్యాయం తత్రైవాంతర్దధే మునిః || 68
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీ ఖండే సంధ్యా చరిత్ర వర్ణనం నామ పంచమోsధ్యాయః (5)
బ్రహ్మ ఇట్లు పలికెను -
వసిష్ఠుడు ఈ తీరున సంధ్యకు తపస్సును చేయవలసిన తీరున యథావిధిగా ఉపదేశించెను. అపుడా ముని అచటనే అంతర్ధనము చెందెను (68).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీ ఖండములో సంధ్యా చరిత్ర వర్ణనమనే అయిదవ అధ్యాయము ముగిసినది (5).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram Group
https://t.me/ChaitanyaVijnanam
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
23 Sep 2020
No comments:
Post a Comment