🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఔర్వ మహర్షి 🌻
జ్ఞానం:
1. ఒకసారి సగరుడు ఔర్వుడి ఆశ్రమానికివచ్చి, విష్ణువును ఆరాధిస్తే కలిగే ఫలం ఏమిటని అడిగాడు. దానికి బదులుగా ఔర్వుడు, “వర్నాశ్రమ ధర్మాలు పాటించుకుంటూ విష్ణుభక్తియందు ఏకాగ్రత ఎవరు పొందుతారో సులభంగా అట్టివారికి ఆయన అనుగ్రహం కలుగుతుంది.
2. పరస్త్రీ ధనాదులు ఆపేక్షించకుండా సహజవృత్తిని అవలంబించి ఆయన ఉపాసన చేయాలి. గురుభక్తి, బ్రాహ్మణసేవ, సర్వజీవులయందు ఆత్మభావముతో, శాస్త్రోదిక కర్మపరులై ఉండాలి. అటువంటివారంటే విష్ణువుకు అత్యంత ప్రీతి. జీవులకు ఆయన అనుగ్రహంతప్ప కోరుకునేదేమీ లేదు” అని అన్నాడు.
3. “గృహస్థుడు తపస్సుకు వెళ్ళి ఎట్టి విధులు పాటించాలి?” అని అడిగాడు సగరుడు. సగరుడికి ఆ ధర్మాలన్నీ చెప్పాడు. సంధ్యాది కృత్యములు, దేవర్షి తర్పణాలు చేసేవిధానాలు తెలిపాడు. అతిథిమర్యాద ప్రధానంగా చెప్పాడు. “అతిథి కోసమని ఆశ్రమందాటి బయటికివచ్చి గోదోహన కాలమంత(అంటే పాలుపితికే కాలమంత)వెతకాలి. ఎవరైనా అతిథి వస్తే అతడు విష్ణువే అనుకొని ఆతిథ్యమిచ్చి ఆ తరువాతే నువ్వు భోజనం చేయాలి. దీనిని విధిగా ఆచరించి వ్రతంగా పెట్టుకో!” అని భక్తి మార్గాన్ని ఉపదేశించాడు.
4. “బలవర్ధకమైన రుచికరమైన ఆహారం తీసుకో. ఆ ఆహారం జీర్ణమై ప్రాణశక్తి వృద్ధిపొందాలంటే అగస్త్యమహర్షి చెప్పిన బడబాలనస్తోత్రం చేసుకుంటూ ఉండు. తూర్పు, దక్షిణాలలో తలపెట్టుకోవాలి. జ్యేష్ఠాది నక్షత్రాలలోనే భార్యతో కాపురంచేయాలి” అని బోధచేసాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram Group
https://t.me/ChaitanyaVijnanam
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
23 Sep 2020
No comments:
Post a Comment