✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 14. కర్మ సిద్ధాంతం 🌻
ఆత్మ తన అనుభవాల కోసం కర్మలను చేస్తుంది. అనుభవసారం నుంచి కర్మ ఫలితాలను ఎంచుకుంటుంది. ఇవి అన్నీ ఆకాషిక్ రికార్డ్స్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయబడతాయి. ఈ నమోదైన కర్మ విశేషాలను విశ్లేషించి... సమగ్రపరచి జీవి యొక్క తరువాత దశ కోసం అందజేయడం జరుగుతుంది.
💫. ఈ వర్క్ కొరకు "కర్మ దేవతలు" అనే వారు పని చేస్తున్నారు. వ్యక్తి తన ఆత్మ ప్రయాణాన్ని సరిగ్గా కొనసాగించటానికి కర్మ సంబంధం ఉన్నవారికి ఆ విధమైన అనుభవాలను ఇస్తూ తాను నేర్చుకుంటూ, నేర్పుతూ తన 3వ పరిధి జీవితాన్ని ముగించుకుని ఉన్నత పరిధులకు ఎదుగవలసి ఉంటుంది.
కర్మ సిద్ధాంతం ప్రకారం "నీవు ఏ విత్తనాన్ని నాటితే అదే పంటను పొందుతావు" అని విశ్వనియమం చెబుతుంది.
ఉదా:- మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే అటువంటి ఫలితాలను ఇతరులకు ఇవ్వవలసి ఉంటుంది.
🔹. ఈ కర్మ ఫలితాలు మూడు రకాలు:-
1. సంచిత కర్మలు:-
గత ఎన్నో జన్మల యొక్క కర్మ ఫలితాలు.
2. ప్రారబ్ద కర్మలు:-
గత జన్మ యొక్క ఎన్నో కర్మ ఫలితాలు.
3. ఆగామి కర్మలు:-
ఎప్పటికప్పుడే ఫలితాలనిచ్చే కర్మలు.
💫. వీటన్నింటినీ మన జీవన ప్రయాణంలో తొలగించుకుంటేనే మనం ముందుకు (అసెన్షన్ లోకి) వెళతాం.
కర్మలు మంచి లేదా చెడు ఏవి అయినా మనం వాటిని జీరో చేయవలసి ఉంటుంది. కర్మలను జీరో చేయడం అంటే కర్మను అర్థం చేసుకోవడమే! మరి ఆచరణలో పెట్టవలసిన విషయాలను నేర్చుకోవడమే! కర్మను అనుభవించడం అంటే ఎన్ని జన్మలైనా మనం నేర్చుకోవలసిన పాఠాలు పూర్తికాలేకపోతే తిరిగి తిరిగి ఆ అనుభవ జ్ఞానం కోసం మనం జన్మ తర్వాత జన్మ తీసుకోవలసి ఉంటుంది.
ఎప్పుడైతే మన పాఠాలు మనకు వస్తాయో.. తిరిగి ఆ కర్మ కోసం కాకుండా మరొక కర్మ కోసం ప్రయాణం కొనసాగుతుంది.
ఈ కర్మ పాఠాల ద్వారా మనం ఎన్ లైటెన్ మెంట్ (దివ్యజ్ఞాన ప్రకాశం) ని పొందుతాం.
🌀. సాధన - సంకల్ప ధ్యానం 1:
నేను ఈ భూమి మీద జన్మతీసుకున్నది మొదలు ఇప్పటివరకు తెలిసి కానీ, తెలియక కానీ సకల జీవరాశిలో ఎవరికైనా కష్టాన్నీ, నష్టాన్నీ, బాధను కానీ, భయాన్ని కానీ కలిగించి ఉంటే ఆ ఆత్మ స్వరూపులందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసినదిగా కోరుకుంటున్నాను".
🌀. సాధనా సంకల్పం - 2:
"నా యొక్క గత జన్మలన్నింటిలోనూ నన్ను ఎవరైనా మానసికంగా కానీ, శారీరకంగా కానీ, బుద్ధి పరంగా కానీ, ఆత్మపరంగా గానీ హింసించి ఉంటే వారందరినీ నా అన్ని శరీరాలనుండి మనఃపూర్తిగా విడుదల చేస్తూ క్షమిస్తున్నాను."
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram Group
https://t.me/ChaitanyaVijnanam
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి
23 Sep 2020
No comments:
Post a Comment