36. గీతోపనిషత్తు - హెచ్చరిక - జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కేవలము కర్తవ్యమునకే వినియోగింపబడుటచే విషయాసక్తి గొనక అప్రమత్తములై చురుకుగ ఉండగలవు



🌹 36. గీతోపనిషత్తు - హెచ్చరిక - జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కేవలము కర్తవ్యమునకే వినియోగింపబడుటచే విషయాసక్తి గొనక అప్రమత్తములై చురుకుగ ఉండగలవు. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 68 📚

పొరబడని, హెచ్చుతగ్గులు లేని స్థిరమైన జ్ఞానము వలయునా? అట్టి జ్ఞానమును ప్రతిష్ఠింప జేయుటకు ఉత్సహించుచున్నావా? అట్లయినచో నీ పంచేంద్రియముల వినియోగము పరిశీలింపుము.

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్ణేభ్య స్తస్య ప్రజా ప్రతిష్ఠితా || 68

వాక్కు, కర్మేంద్రియముల వినియోగమును కూడ పరిశీలింపుము. వానిని కర్తవ్యమునకే వినియోగించుట, ఇతర సమయముల యందు విశ్రాంతి నిచ్చుట అను దీక్షను స్వీకరింపుము.

జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కేవలము కర్తవ్యమునకే వినియోగింపబడుటచే విషయాసక్తి గొనక అప్రమత్తములై చురుకుగ ఉండగలవు. కర్తవ్యము గోచరించినపుడెల్ల ప్రతి స్పందించగలవు. లేనిచో విశ్రమించ గలవు. విషయానురక్తి అను వ్యాధిని కర్తవ్యమను ఔషధముతో పరిపూర్ణముగ నిర్మూలించుము.

ఇట్లు ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను సర్వవిధముల

నిగ్రహించ వచ్చును. భగవంతుడు పై శ్లోకమున “సర్వశః" అను పదమును వాడినాడు, అనగా సర్వ విధముల పరిపూర్ణముగ ఒకించుక కూడ విషయాసక్తి లేకుండగ నిర్మూలించినవే జ్ఞానము స్థిరపడును.

నావ ఎంత కట్టుదిట్టముగ నున్నను చిన్న రంధ్రము కారణముగ మునిగి పోవును గదా! నీటి కుండకు ఎంత చిన్న చిల్లు పడినను నీరు కారిపోవును కదా!

అట్లే జ్ఞానము సుప్రతిష్టమై యుండవలెనన్నచో విషయాసక్తి యను రంధ్రమునకు తావీయరాదు సుమా! అని భగవానుడు హెచ్చరించు చున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹

Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

23 Sep 2020

No comments:

Post a Comment