2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 268, 269 / Vishnu Sahasranama Contemplation - 268, 269🌹
3) 🌹 Daily Wisdom - 48🌹
4) 🌹. వివేక చూడామణి - 12🌹
5) 🌹Viveka Chudamani - 12 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 22🌹
7) 🌹. ఎరుకతోనే జ్ఞానస్థితి 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 199 / Sri Lalita Chaitanya Vijnanam - 199 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 629 / Bhagavad-Gita - 629 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 46 🌴*
46. యత: ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవ: ||
🌷. తాత్పర్యం :
సర్వజీవులకు కారణమైనవాడును మరియు సర్వత్ర వ్యాపించియున్నవాడును అగు భగవానుని అర్చించును, తన విధ్యుక్తకర్మను ఒనరించుట ద్వారా మనుజుడు పూర్ణత్వమును బడయగలడు.
🌷. భాష్యము :
ఇంద్రియాధీశుడైన హృషీకేశునిచే తాము ఒకానొక విధ్యుక్తకర్మ యందు నిలిచియున్నామని ప్రతియొక్కరు భావింపవలెను. పిదప తాము నియుక్తులై యున్న కర్మ ద్వారా లభించిన ఫలములతో దేవదేవుని అర్చించవలెను. మనుజుడు ఈ రీతిగా (పూర్ణ కృష్ణభక్తిభావన యందు) సర్వదా ఆలోచించినచో కృష్ణుని కరుణచే సర్వమును అవగతము చేసికొనగలడు. జీవితమునకు పూర్ణత్వమిదియే.
“తేషామహమ్ సముద్ధర్తా” (భగవద్గీత 12.7) యని శ్రీకృష్ణుడు పలికియున్నాడు. అనగా అట్టి భక్తుని ఉద్ధరించు బాధ్యతను అతడే స్వయముగా స్వీకరించును. అదియే జీవితమందలి అత్యున్నత పూర్ణత్వము కాగలదు. అనగా మనుజుడెట్టి స్వధర్మమునందు నియుక్తుడైనను దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవించినచో అత్యున్నత పూర్ణత్వమును పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 629 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 46 🌴*
46. yataḥ pravṛttir bhūtānāṁ
yena sarvam idaṁ tatam
sva-karmaṇā tam abhyarcya
siddhiṁ vindati mānavaḥ
🌷 Translation :
By worship of the Lord, who is the source of all beings and who is all-pervading, a man can attain perfection through performing his own work.
🌹 Purport :
Everyone should think that he is engaged in a particular type of occupation by Hṛṣīkeśa, the master of the senses. And by the result of the work in which one is engaged, the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, should be worshiped. If one thinks always in this way, in full Kṛṣṇa consciousness, then, by the grace of the Lord, he becomes fully aware of everything. That is the perfection of life. The Lord says in Bhagavad-gītā (12.7), teṣām ahaṁ samuddhartā.
The Supreme Lord Himself takes charge of delivering such a devotee. That is the highest perfection of life. In whatever occupation one may be engaged, if he serves the Supreme Lord he will achieve the highest perfection.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 268, 269 / Vishnu Sahasranama Contemplation - 268, 269 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻268. మహేన్ద్రః, महेन्द्रः, Mahendraḥ🌻*
*ఓం మహేంద్రాయ నమః | ॐ महेन्द्राय नमः | OM Mahendrāya namaḥ*
మహాన్ చ అసౌ ఇంద్రః చ ఈతడు గొప్పవాడగు ఇంద్రుడు. మహానింద్రో మహేంద్ర ఇతీశ్వరాణామ్మహేశ్వరః ఇంద్రులకు ఇంద్రుడు. అట్లు ఈశ్వరులగు వారికిని ఈశ్వరుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 268🌹*
📚. Prasad Bharadwaj
*🌻268. Mahendraḥ🌻*
*OM Mahendrāya namaḥ*
Mahān ca asau indraḥ ca / महान् च असौ इंद्रः च He is the great Indra (King of Gods). Mahānindro mahendra itīśvarāṇāmmaheśvaraḥ / महानिंद्रो महेंद्र इतीश्वराणाम्महेश्वरः He is the Indra of Indras; He is God of gods.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥
Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 269 / Vishnu Sahasranama Contemplation - 269🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻269. వసుదః, वसुदः, Vasudaḥ🌻*
*ఓం వసుదాయ నమః | ॐ वसुदाय नमः | OM Vasudāya namaḥ*
దదాతియో వసు ధనం స ఏవ వసుదో హరిః ।
విద్వద్భిరుచ్యతేఽన్నాదో వసుదాన ఇతి శ్రుతేః ॥
వసు అనగా స్వర్ణాది రూప ధనము. వసువును అనగా ధనమును ఇచ్చువాడుగనుక, హరి వసుదః.
:: బృహదారణ్యకోపనిషత్ - షష్ఠాద్యాయః, చతుర్థం బ్రాహ్మణమ్ ::
స వా ఏష మహా నజ ఆత్మాన్నాదో వసుదానో విన్దతే వసు య ఏవం వేద ॥ 24 ॥
ఆ ప్రసిద్ధమగు ఆత్మ స్వరూపము, అన్నమును భక్షించు నదియును, ప్రాణులయొక్క కర్మఫలమును కూర్చునదియును అగుచున్నది. ఎవడు ఈ ప్రకారము తెలిసికొనుచున్నాడో, అతడు సర్వభూతములయందును ఆత్మస్వరూపుడై అన్నమును భక్షించుచున్నాడు. సమస్త కర్మఫలమును పొందుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 269🌹*
📚. Prasad Bharadwaj
*🌻269. Vasudaḥ🌻*
*OM Vasudāya namaḥ*
Dadātiyo vasu dhanaṃ sa eva vasudo hariḥ,
Vidvadbhirucyate’nnādo vasudāna iti śruteḥ.
ददातियो वसु धनं स एव वसुदो हरिः ।
विद्वद्भिरुच्यतेऽन्नादो वसुदान इति श्रुतेः ॥
Vasu means gold and other forms of such riches. Since Hari bestows such riches, He is Vasudaḥ.
Br̥hadāraṇyakopaniṣat - Chapter IV, Section IV
Sa vā eṣa mahā naja ātmānnādo vasudāno vindate vasu ya evaṃ veda. (24)
:: बृहदारण्यकोपनिषत् - षष्ठाद्यायः, चतुर्थं ब्राह्मणम् ::
स वा एष महा नज आत्मान्नादो वसुदानो विन्दते वसु य एवं वेद ॥ २४ ॥
That great, birthless Self is the eater of food and giver of wealth (the fruits of one's work). He who knows it as such receives wealth (those fruits).
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥
Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 48 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 17. There is no Experience without a Consciousness of It 🌻*
Our life is inseparable from our experience. What we call life is nothing but experience, and this is important to remember. And experience, whatever be the nature of it, is inseparable from a consciousness of that experience.
There is no experience without a consciousness of it. We are aware that we are undergoing a process or are in a state of experience. If the awareness is absent, we cannot be said to be in a state of any experience at all. To have no experience is to have no awareness of what is happening.
Now, our life being identical with a conscious experience, and our search for reality being observational and experimental in the scientific fashion, we have to find out how the panorama of external nature, as it stands before us from the point of view of science, is connected with our personal life.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 12 / Viveka Chudamani - 12 🌹*
✍️ రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. ప్రశ్న, జవాబు - 3 🍀*
56. హఠయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము మరియు జ్ఞాన యోగముల ద్వారా బ్రహ్మమును పొందలేము. కేవలము బ్రహ్మమునకు తనకు భేదము లేదని స్వయముగా తెలుసుకొన్నప్పుడే బంధనాల నుండి విముక్తి లభిస్తుంది.
పై యోగాలను యాంత్రికముగా అనుసరించిన బ్రహ్మమును పొందలేమని బంధనాల నుండి విముక్తి లభించదని అద్వైత సిద్ధాంతము తెలుపుచున్నది. సాంఖ్యయోగములో పురుష, ప్రకృతిలోని భేదమును స్వయముగా గ్రహించినప్పుడే విషయముల నుండి విముక్తి లభిస్తుంది.
ప్రకృతిలో ఉన్న పురుష మామూలుగా వ్యక్తము కాదు. కాని పనులన్ని ప్రకృతిలోనే జరుగుచున్నవి. పురుష లేకుండా ప్రకృతి లేదు. ప్రకృతి పురుష నుండి స్వేచ్ఛను పొందియున్నది. ఇంకను సాంఖ్య యోగము వివిధ ఆత్మలను గూర్చి నమ్ముచున్నది.
సాంఖ్య యోగానికి వేదాంత సిద్ధాంతాలకు ఇదే ముఖ్య భేదము. విషయ వాంఛలకు సంబంధించిన యజ్ఞాయాగాదుల వలన స్వర్గ సుఖాలు పొందవచ్చు గాని బ్రహ్మాన్ని చేరలేము. బ్రహ్మాన్ని పొందాలంటే బ్రహ్మాన్ని దర్శించుటయే మార్గము.
57. గిటారు వాయిద్యాలు, శృతులు కొద్ది మందికి సంతోషాన్ని కలిగించగలవే గాని ఆధ్యాత్మిక ఔన్నత్యానికి తోడ్పడవు.
58. వాక్చాతుర్యముతో కూడిన ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక గ్రంధాలలోని విషయ పరిజ్ఞానము వ్యక్తీకరించుట అనునవి కేవలము వ్యక్తిగతమైన ఆనందానికి తోడ్పడునే గాని వాటి వలన ఏ విధమైన సాంసారిక బంధనాల నుండి విముక్తి లభించదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 12 🌹*
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj
*🌻 Question and Answer - 3 🌻*
56. Neither by Yoga, nor by Sankhya, nor by work, nor by learning, but by the realisation of one's identity with Brahman is Liberation possible, and by no other means.
57. The beauty of a guitar’s form and the skill of playing on its chords serve merely to please a few persons; they do not suffice to confer sovereignty.
58. Loud speech consisting of a shower of words, the skill in expounding the Scriptures, and likewise erudition -these merely bring on a little personal enjoyment to the scholar, but are no good for Liberation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 22 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 13. నామ రహస్యము -1 🌻*
ప్రతి వ్యక్తి పేరును, ఆ వ్యక్తి స్వభావమునకు సంబంధించిన రహస్యములను విడమరచు తాళము చెవి. ప్రతి వ్యక్తి స్వభావము కాలక్రమమున ప్రత్యేకముగ నేర్పడుచుండును. వ్యక్తి సహజముగ పరమాత్మనుండి వ్యక్తమైన జీవుడే అయినప్పటికి అతని చుట్టు ఏర్పడు స్వభావము అతనికొక ప్రత్యేకత నేర్పరచును.
కాలమును, దేశమును బట్టి జన్మించిన జీవుని నామము కూడ తల్లితండ్రుల కల్పము నుండి దిగివచ్చును. తల్లితండ్రులు తాము కనితిమని, పేరు పెట్టితిమని భావింతురు. కాని జీవుడు, అతని నామము తల్లితండ్రుల నుండి కాక, వారి ద్వారా వ్యక్తమగుచున్నవి.
జీవుడు తనతోపాటు తన స్వభావమును, స్వభావమునకు అనుగుణమగు నామమును తనతోనే తెచ్చుకొనును. అతని నామమున అతనికి సంబంధించిన జీవప్రజ్ఞ స్వరూప స్వభావములు స్పష్టాస్పష్టముగ ఇమిడివున్నవి.
నామ శబ్దమునకు జీవుడు అప్రయత్నముగనే ప్రతిస్పందించును, అంతియే కాదు పిలుచువాడు, పిలువబడువాడు కూడ తద్విషయమున ప్రతిస్పందింతురు. పిలుచువాడు, పిలువబడు వాడు, పిలుచుట అను మూడింటికిని కేంద్రముగ శబ్దమున్నది.
శబ్దము యొక్క ఈ త్రిపుటిని అవగాహన చేసుకొన్న వానికి మంత్రశాస్త్ర రహస్యములు తెలియగలవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఎరుకతోనే జ్ఞాన సిద్ధి 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
విజయాలు కూడా పరాజయాలే అవుతాయి. కానీ, పరాజయాలు మాత్రం ఎప్పుడూ పరాజయాలే. అప్పుడప్పుడు లభించిన చిన్నచిన్న ఆనందాలు కేవలం మీరు పడ్డ బాధలకు లభించిన బహుమతులు మాత్రమే. మీకు లభించిన ఉల్లాసాలన్నీ కేవలం మీ కలల సామర్థ్య ఫలితమే.
మీరు వట్టి చేతులతో వెళ్ళిపోతున్నారు. జీవితం కేవలం ఒక విషవలయం లాంటిది. అందులో చిక్కుకున్న మీరు ఎక్కడికీ పోలేక అక్కడే గిరగిరా తిరుగుతున్నారు. ఎందుకంటే, వలయంలోని కేంద్రం అన్ని వైపులకు ఒకే దూరంలో ఉంటుంది. కాబట్టి, మీరు ఎక్కడున్నా వలయంలో ఉన్నట్లే. విజయాలు, పరాజయాలు, బాధలు, ఆనందాలు- ఇలా ఆ వలయంలో అన్నీ జరుగుతూ ఉంటాయి.
కానీ, అందులో మీ ఉనికి కేంద్రం ఎక్కడైనా, ఎప్పుడైనా వలయ కేంద్రానికి సమాన దూరంలోనే ఉంటుంది. ఆ వలయంలో తిరుగుతున్నప్పుడు మీకు ఏదీ కనిపించదు. ఎందుకంటే, అలా తిరగడంలో నిమగ్నమైన మీరు అందులో భాగమవుతారు. అలా తిరగడం ఆగిన వెంటనే మీరు రిక్తహస్తాలతో శూన్యంగా నిలబడతారు.
ఖలీల్ జిబ్రాన్ రచించిన ‘‘ది ప్రోఫెట్’’అనే పుస్తకంలో ‘‘ఆల్-ముస్త్ఫా’’ ప్రవక్త ‘‘ నాకు పిలుపువచ్చింది. నన్ను తీసుకెళ్ళేందుకు ఓడ కూడా సిద్ధంగా ఉంది. వెళ్ళే ముందు ఒకసారి మీ అందరినీ, మీతో గడిపిన ఇక్కడి పరిసరాలను చూడాలనిపించింది. అందుకే వచ్చాను’’ అంటాడు.
ఇంకా అందులో అతడు ‘‘నేను సముద్రంలో కలిసే నది లాంటి వాడిని. నది సముద్రంలో కలిసే ముందు తాను వచ్చిన దారిని- కొండలు, కోనలు, అడవులు, మైదానాలను- ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంది. ఎందుకంటే, ఒకసారి సముద్రంలో కలిసిన వెంటనే నది సముద్రమై పోతుంది. కాబట్టి, ఆ నదిలాగే నేను కూడా మిమ్మల్ని చూసేందుకు వచ్చాను’’ అంటాడు.
గతాన్ని పట్టుకుని వేలాడకుండా ఉన్నప్పుడే మీరు వెనక్కి తిరిగి చూడగలరు. లేకపోతే, గతాన్ని వదులుకునేందుకు మీరు చాలా భయపడతారు. పైగా, అప్పుడు మీ గత జీవిత చలనచిత్రాన్ని పూర్తిగా చూసే సమయముండదు. ఎందుకంటే, మీకున్న సమయం కేవలం అర క్షణం మాత్రమే.
పూర్తి ఎరుకతో మరణిస్తున్నప్పుడు మాత్రమే ఆ అర క్షణంలో మీ గత జీవిత చలనచిత్రాన్ని మీరు పూర్తిగా చూస్తారు. అది దానంతటదే జరిగిపోతుంది తప్ప, దాని కోసం మీరు ప్రత్యేకంగా చేసేది ఏమీ ఉండదు.
‘మీరు మీ చిన్నప్పటి నుంచే చాలా తెలివిగా, ధైర్యంగా ఉన్నారు. నేను ఇప్పటికీ మీలా ధైర్యంగా లేను’’ అని చాలామంది నాతో అంటూ ఉంటారు. దానికి కారణం గత జన్మలో మీరు మరణించిన దానికన్నా భిన్నంగా నేను మరణించాను. అందుకే మీకు, నాకు మధ్య అంత తేడా ఉంటుంది.
ఎందుకంటే, మీరు ఎలా మరణిస్తారో అలాగే జన్మిస్తారు. నాణేనికి ఒకవైపు మీ మరణం ఉంటే, అదే నాణేనికి మరొక వైపు మీ జననం ఉంటుంది. నాణేనికి ఒకవైపు దైన్యం, వేదన, గందరగోళం, కోరిక లాలసలుంటే, మరొకవైపు ధైర్యం, స్పష్టత, ఎరుక, తెలివితేటలుండే అవకాశముండదు. కాబట్టి, అలాంటి వాటిని ఆశించడం పూర్తిగా అసమంజసం.
అందువల్ల వాటిని మీరు ఆశించకూడదు. పైగా, మొదటి నుంచి చాలా తెలివితేటలతో, ధైర్యంగా ఉండేందుకు ఈ జీవితంలో నేను ప్రత్యేకంగా చేసినది ఏమీలేదు. అలాంటివి ఉంటాయని కూడా నాకు తెలియదు. అందుకే వాటి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 199 / Sri Lalitha Chaitanya Vijnanam - 199 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |*
*సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖*
*🌻 199. 'సర్వశక్తిమయీ' 🌻*
శ్రీమాత యందే సర్వశక్తులూ యిమిడి ఉన్నవి అని అర్థము.
ఈ జగత్తు అంతయూ శక్తిచేతనే నడపబడు చున్నది. చీమ, దోమ మొదలు గ్రహముల వరకూ అన్నియూ శక్తిచేతనే కదలుచున్నవి. శక్తిలేని పదార్థము జడము. అట్టి జడమేర్పడుటకు కూడ శక్తి ఆధారము. సర్వమూ శక్తిమయమే.
అచేతనములయందు, సచేతనముల యందు కూడ శక్తియే నిండి యున్నది. అణువు లోపల, అణువు బయట శక్తియే యున్నది. అన్నిటి యందలి ఎఱుక, ప్రాణము, అచ్చ, జ్ఞానము, క్రియ, శక్తివలననే నిర్వర్తింపబడుచున్నవి. శక్తిలేనిచో సృష్టియే లేదు. సృష్టియందేమియూ ఏర్పడదు.
అవరోహణ క్రమమున లోకము లేర్పడుటకు, ఆరోహణ క్రమమున మరల లయమగుటకు
శక్తియే కారణము. లోకములకు వృద్ధికూడ శక్తి ఆధారముగనే కలుగును. సృష్టియందు మార్పు సహజము.
అట్టి మార్పును అను స్యూతముగా నిర్వర్తించునది శక్తి, సృష్టి యందలి సమస్త శక్తులూ శ్రీమాతనుండియే ఉద్భవించుచున్నవి. సమస్త దేవతా శక్తులు, అసుర శక్తులు, ఆయుధములుగ నున్నది శ్రీమాత శక్తియే. “నా శక్తులే దేవతల ఆయుధములు; నాశక్తి లేశములే దేవతల శరీరములు” అని శ్రీమాత పలికినట్లుగ "లక్ష్మీ తంత్రము”న కలదు.
సృష్టియందలి స్థూల సూక్ష్మ శక్తులన్నియూ కలిపి పార్వతి అని తెలుపుదురు. సృష్టి యందలి సమస్త శక్తులను మొహరించినచో అవి దుర్గగా అవతరించును. సృష్టిలో విపత్కరములగు పరిస్థితులు ఏర్పడినపుడు తన శక్తులుగా ఉన్న దేవతలు వానిని ఎదుర్కొన లేనపుడు, సర్వశక్తులతో కూడి, సృష్టికవరోధము కలిగించు తనలోని భాగమైన అసుర శక్తిని నిర్మూలించును.
సర్వశక్తిమయి అనగా సురాసుర శక్తి అని అర్థము చేసుకొనవలెను. దేవతల శక్తి మాత్రమే ఆమె అనుకొనినచో, అసుర శక్తి ఎక్కడనుండి పుట్టినది? సమస్తమునకు పుట్టినచోటు ఒక్కటియే. అదియే శ్రీమాత.
సృష్టిపరిణామ కథయందు అతిక్రమించు శక్తులు సురులైనను, అసురులైనను దమింప బడుదురు. సురులయందు కూడ అప్పుడప్పుడు అసురభావము లేర్పడుట, అవి దండింపబడుట, పురాణములయందు పేర్కొనబడినవి.
అట్లే అసురుల యందు సుర భావము కలవారు అనుగ్రహింపబడుట కూడ జరిగినది. సురులు అతిక్రమించినపుడు తానే స్వయముగ దండించును. ఆమె దండనము గానీ, అనుగ్రహము కానీ జీవులకు మంగళప్రదమే. కనుకనే తరువాతి నామము "సర్వమంగళా” అయి ఉన్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 199 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻Sarvaśakti-mayī सर्वशक्ति-मयी (199) 🌻*
She is the power of all śaktī-s. There are two different meanings for the word śaktī. Śaktī means power. As far as She is concerned, Her power is the divine power. She uses this divine power for Her acts of creation, sustenance and dissolution.
Since Her saguṇa (form) is being discussed, it can be said that She has ministers such as Vārāhī, Śyamalā, or even Her ten forms which is popularly known as dasa mahā vidyā, who are Her śaktī-s. In this context śaktī-s mean these goddesses who function under Her control.
In literal sense, She is in the form of all such goddesses, in view of the omnipresent nature of the Brahman. Since She is the embodiment of all śaktī-s, She is known as Śaktī. This is the reason for addressing Her as Sarvaśakti-mayī.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 540 / Bhagavad-Gita - 540 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 3 🌴*
3. తేజ: క్షమా ధృతి: శౌచమద్రోహో నాతిమానితా |
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భరత ||
🌷. తాత్పర్యం :
తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయరాహిత్యము, గౌరవవాంఛ లేకుండుట అను దివ్యగుణములు దైవీస్వభావము కలిగిన దివ్యుల యందుండును.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 540 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 3 🌴*
3. tejaḥ kṣamā dhṛtiḥ śaucam
adroho nāti-mānitā
bhavanti sampadaṁ daivīm
abhijātasya bhārata
🌷 Translation :
vigor; forgiveness; fortitude; cleanliness; and freedom from envy and from the passion for honor – these transcendental qualities, O son of Bharata, belong to godly men endowed with divine nature.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment