🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 164 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 2 🌻
636. సద్గురువు మొట్టమొదట భగవంతుడై, భగవంతునిలో నివాస ఏర్పరచుకొని, భగవంతుని జీవితమును గడుపుచు సృష్టిలో దైవ ప్రతినిధిగా నుండును.
"ఆత్మ ప్రతిష్టాపన స్థితి" లో భగవంతుడు మానవ రూపంలో భగవంతునిగా తన దైవత్వమును, ఇటు మానవునిగా మానవత్వమును ఉభయ స్థితులను అనుభవించు చుండును.
638. మూడవ దివ్యయానము చివరిలో సద్గురువు ద్వంద్వ పాత్రలలో జీవించుటయే గాక, ఏకకాలమందే, తన అనంత జ్ఞాన-శక్తి-ఆనందముల ద్వారా బలమును, అజ్ఞానులైన మానవుల ద్వారా బలహీనతలను -బాధలను ప్రదర్శించును. తన అనంత స్వభావత్రయమును అన్యులకై వినియోగించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Feb 2021
No comments:
Post a Comment