శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 199 / Sri Lalitha Chaitanya Vijnanam - 199


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 199 / Sri Lalitha Chaitanya Vijnanam - 199 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖

🌻 199. 'సర్వశక్తిమయీ' 🌻

శ్రీమాత యందే సర్వశక్తులూ యిమిడి ఉన్నవి అని అర్థము.

ఈ జగత్తు అంతయూ శక్తిచేతనే నడపబడు చున్నది. చీమ, దోమ మొదలు గ్రహముల వరకూ అన్నియూ శక్తిచేతనే కదలుచున్నవి. శక్తిలేని పదార్థము జడము. అట్టి జడమేర్పడుటకు కూడ శక్తి ఆధారము. సర్వమూ శక్తిమయమే. 

అచేతనములయందు, సచేతనముల యందు కూడ శక్తియే నిండి యున్నది. అణువు లోపల, అణువు బయట శక్తియే యున్నది. అన్నిటి యందలి ఎఱుక, ప్రాణము, అచ్చ, జ్ఞానము, క్రియ, శక్తివలననే నిర్వర్తింపబడుచున్నవి. శక్తిలేనిచో సృష్టియే లేదు. సృష్టియందేమియూ ఏర్పడదు. 

అవరోహణ క్రమమున లోకము లేర్పడుటకు, ఆరోహణ క్రమమున మరల లయమగుటకు
శక్తియే కారణము. లోకములకు వృద్ధికూడ శక్తి ఆధారముగనే కలుగును. సృష్టియందు మార్పు సహజము. 

అట్టి మార్పును అను స్యూతముగా నిర్వర్తించునది శక్తి, సృష్టి యందలి సమస్త శక్తులూ శ్రీమాతనుండియే ఉద్భవించుచున్నవి. సమస్త దేవతా శక్తులు, అసుర శక్తులు, ఆయుధములుగ నున్నది శ్రీమాత శక్తియే. “నా శక్తులే దేవతల ఆయుధములు; నాశక్తి లేశములే దేవతల శరీరములు” అని శ్రీమాత పలికినట్లుగ "లక్ష్మీ తంత్రము”న కలదు. 

సృష్టియందలి స్థూల సూక్ష్మ శక్తులన్నియూ కలిపి పార్వతి అని తెలుపుదురు. సృష్టి యందలి సమస్త శక్తులను మొహరించినచో అవి దుర్గగా అవతరించును. సృష్టిలో విపత్కరములగు పరిస్థితులు ఏర్పడినపుడు తన శక్తులుగా ఉన్న దేవతలు వానిని ఎదుర్కొన లేనపుడు, సర్వశక్తులతో కూడి, సృష్టికవరోధము కలిగించు తనలోని భాగమైన అసుర శక్తిని నిర్మూలించును. 

సర్వశక్తిమయి అనగా సురాసుర శక్తి అని అర్థము చేసుకొనవలెను. దేవతల శక్తి మాత్రమే ఆమె అనుకొనినచో, అసుర శక్తి ఎక్కడనుండి పుట్టినది? సమస్తమునకు పుట్టినచోటు ఒక్కటియే. అదియే శ్రీమాత. 

సృష్టిపరిణామ కథయందు అతిక్రమించు శక్తులు సురులైనను, అసురులైనను దమింప బడుదురు. సురులయందు కూడ అప్పుడప్పుడు అసురభావము లేర్పడుట, అవి దండింపబడుట, పురాణములయందు పేర్కొనబడినవి. 

అట్లే అసురుల యందు సుర భావము కలవారు అనుగ్రహింపబడుట కూడ జరిగినది. సురులు అతిక్రమించినపుడు తానే స్వయముగ దండించును. ఆమె దండనము గానీ, అనుగ్రహము కానీ జీవులకు మంగళప్రదమే. కనుకనే తరువాతి నామము "సర్వమంగళా” అయి ఉన్నది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 199 🌹
1000 Names of Sri Lalitha Devi 

✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

🌻Sarvaśakti-mayī सर्वशक्ति-मयी (199) 🌻

She is the power of all śaktī-s. There are two different meanings for the word śaktī. Śaktī means power. As far as She is concerned, Her power is the divine power. She uses this divine power for Her acts of creation, sustenance and dissolution.  

Since Her saguṇa (form) is being discussed, it can be said that She has ministers such as Vārāhī, Śyamalā, or even Her ten forms which is popularly known as dasa mahā vidyā, who are Her śaktī-s. In this context śaktī-s mean these goddesses who function under Her control.  

In literal sense, She is in the form of all such goddesses, in view of the omnipresent nature of the Brahman. Since She is the embodiment of all śaktī-s, She is known as Śaktī. This is the reason for addressing Her as Sarvaśakti-mayī.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


04 Feb 2021

No comments:

Post a Comment