వివేక చూడామణి - 12 / Viveka Chudamani - 12
🌹. వివేక చూడామణి - 12 / Viveka Chudamani - 12 🌹
✍️ రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రశ్న, జవాబు - 3 🍀
56. హఠయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము మరియు జ్ఞాన యోగముల ద్వారా బ్రహ్మమును పొందలేము. కేవలము బ్రహ్మమునకు తనకు భేదము లేదని స్వయముగా తెలుసుకొన్నప్పుడే బంధనాల నుండి విముక్తి లభిస్తుంది.
పై యోగాలను యాంత్రికముగా అనుసరించిన బ్రహ్మమును పొందలేమని బంధనాల నుండి విముక్తి లభించదని అద్వైత సిద్ధాంతము తెలుపుచున్నది. సాంఖ్యయోగములో పురుష, ప్రకృతిలోని భేదమును స్వయముగా గ్రహించినప్పుడే విషయముల నుండి విముక్తి లభిస్తుంది.
ప్రకృతిలో ఉన్న పురుష మామూలుగా వ్యక్తము కాదు. కాని పనులన్ని ప్రకృతిలోనే జరుగుచున్నవి. పురుష లేకుండా ప్రకృతి లేదు. ప్రకృతి పురుష నుండి స్వేచ్ఛను పొందియున్నది. ఇంకను సాంఖ్య యోగము వివిధ ఆత్మలను గూర్చి నమ్ముచున్నది.
సాంఖ్య యోగానికి వేదాంత సిద్ధాంతాలకు ఇదే ముఖ్య భేదము. విషయ వాంఛలకు సంబంధించిన యజ్ఞాయాగాదుల వలన స్వర్గ సుఖాలు పొందవచ్చు గాని బ్రహ్మాన్ని చేరలేము. బ్రహ్మాన్ని పొందాలంటే బ్రహ్మాన్ని దర్శించుటయే మార్గము.
57. గిటారు వాయిద్యాలు, శృతులు కొద్ది మందికి సంతోషాన్ని కలిగించగలవే గాని ఆధ్యాత్మిక ఔన్నత్యానికి తోడ్పడవు.
58. వాక్చాతుర్యముతో కూడిన ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక గ్రంధాలలోని విషయ పరిజ్ఞానము వ్యక్తీకరించుట అనునవి కేవలము వ్యక్తిగతమైన ఆనందానికి తోడ్పడునే గాని వాటి వలన ఏ విధమైన సాంసారిక బంధనాల నుండి విముక్తి లభించదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 12 🌹
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj
🌻 Question and Answer - 3 🌻
56. Neither by Yoga, nor by Sankhya, nor by work, nor by learning, but by the realisation of one's identity with Brahman is Liberation possible, and by no other means.
57. The beauty of a guitar’s form and the skill of playing on its chords serve merely to please a few persons; they do not suffice to confer sovereignty.
58. Loud speech consisting of a shower of words, the skill in expounding the Scriptures, and likewise erudition -these merely bring on a little personal enjoyment to the scholar, but are no good for Liberation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
04 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment