భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 225


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 225 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మైత్రేయమహర్షి - 2 🌻


8. ప్రాయశ్చిత్తము అంటే వినూతనమయినటు వంటి ఒక కొత్త చిత్తం కాదు. వినూతనమయిన జ్ఞానసిద్ధి పొంది, తాను చేసిని పాపానికి దుఃఖపడుతూ ఇప్పుడు శాంతిని, పరిశుద్ధతను అవలంబించిన చిత్తము అన్నమాట. దానివల్ల (ఈ విధమైన మనోసంకల్పమువల్ల) నిమిత్తమాత్రంగా చేసిన కర్మ ఫలాన్ని ఇస్తుంది కానీ, కర్మను నశింపచేసే కర్మ అనేది ఒకటి లేదు.

9. భగవంతుడి అవతారాలు ఎందుకొచ్చాయి? త్రిగుణాత్మకములైన ఈ అవతారలను ఆయన ఎందుకు ఎత్తవలసివచ్చింది? ఈ విషయములేమిటి? కర్మ, నామ, రూప, భేదములు ఎలా నిస్దేశించాడు? వీతన్నిటినీ సవిస్తరంగా చెప్పమని విదురుడు మైత్రేయమహర్షిని అడిగాడు.

10. అప్పుడు మైత్రేయుడు విదురుడికి పరమేశ్వరతత్త్వము, విష్ణువు యొక్క బోధిస్తూ, “పరతత్త్వము అనేది ఒకటుంది. పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనకు విష్ణువు అని పేరు. సర్వమూ – సర్వదేవతలు, సమస్త లోకాలు ఆయనలోనే ఉన్నవి. కర్మలు, కర్మఫలాలు ఆ విష్ణువనే పరతత్త్వంలోనే ఉన్నవి” అని చెప్పాడు.

11. సామాన్యంగా ఒక మనుష్యుడెవ్వరయినా సరే, కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి కర్మలో శతాంశంచేస్తే నూరుజన్మలెత్తాలి. కర్మ యొక్క సామాన్యలక్షణం తెలిసేటట్లయితే, కృష్ణుడు చేసిన కర్మ అపరిమితం. ఆయన కర్మ చేసాడు, చేయించాడు. కర్త, కార్యం రెండూకూడా ఫలప్రదాలే! అందులో సందేహంలేదు.

12. ఇంకొకడితో అది చేయించినా అది కర్మే అవుతుంది. ‘మరి ఈ కర్మకు ఎంత ఫలముండాలి? ఏమయ్యాడు ఆ కర్మము, తాను?’ అనే ప్రశ్నలు వస్తాయి. ఆయన యోగీశ్వరేశ్వరుడు. తనకున్న జ్ఞానస్వరూపం తానే అయినాడు; సగుణంగా కనిపించేటటువంటి బ్రహ్మవస్తువు తానే అయినాడుకాబట్టి, అతడు చేసిన కర్మయొక్క పరమార్థం అతడికే తెలుసు.

13. ఏ పరమార్థం తెలిసి ఆయన కర్మ చేసాడో, ఏది తెలుసుకుంటే అంతటి కర్మకూడా జీవుణ్ణి ఫలాన్నిచ్చిబంధించదో, ఆ విషయం ఆయనకే తెలుసు. కృష్ణుడికి ఒక్కడికే తెలుసు. అటువంటి పరమరహస్యాన్ని అంత్యకాలంలో, అంటే తన దేహవిసర్జనకాలంలో మైత్రేయమహర్షికి శ్రీకృష్ణుడు చెప్పాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


04 Feb 2021

No comments:

Post a Comment