దేవాపి మహర్షి బోధనలు - 22
🌹. దేవాపి మహర్షి బోధనలు - 22 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 13. నామ రహస్యము -1 🌻
ప్రతి వ్యక్తి పేరును, ఆ వ్యక్తి స్వభావమునకు సంబంధించిన రహస్యములను విడమరచు తాళము చెవి. ప్రతి వ్యక్తి స్వభావము కాలక్రమమున ప్రత్యేకముగ నేర్పడుచుండును. వ్యక్తి సహజముగ పరమాత్మనుండి వ్యక్తమైన జీవుడే అయినప్పటికి అతని చుట్టు ఏర్పడు స్వభావము అతనికొక ప్రత్యేకత నేర్పరచును.
కాలమును, దేశమును బట్టి జన్మించిన జీవుని నామము కూడ తల్లితండ్రుల కల్పము నుండి దిగివచ్చును. తల్లితండ్రులు తాము కనితిమని, పేరు పెట్టితిమని భావింతురు. కాని జీవుడు, అతని నామము తల్లితండ్రుల నుండి కాక, వారి ద్వారా వ్యక్తమగుచున్నవి.
జీవుడు తనతోపాటు తన స్వభావమును, స్వభావమునకు అనుగుణమగు నామమును తనతోనే తెచ్చుకొనును. అతని నామమున అతనికి సంబంధించిన జీవప్రజ్ఞ స్వరూప స్వభావములు స్పష్టాస్పష్టముగ ఇమిడివున్నవి.
నామ శబ్దమునకు జీవుడు అప్రయత్నముగనే ప్రతిస్పందించును, అంతియే కాదు పిలుచువాడు, పిలువబడువాడు కూడ తద్విషయమున ప్రతిస్పందింతురు. పిలుచువాడు, పిలువబడు వాడు, పిలుచుట అను మూడింటికిని కేంద్రముగ శబ్దమున్నది.
శబ్దము యొక్క ఈ త్రిపుటిని అవగాహన చేసుకొన్న వానికి మంత్రశాస్త్ర రహస్యములు తెలియగలవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment