1) 🌹 శ్రీమద్భగవద్గీత - 613 / Bhagavad-Gita - 613 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 236, 237 / Vishnu Sahasranama Contemplation - 236, 237🌹
3) 🌹 Daily Wisdom - 32🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 166🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 187🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 6 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 183 / Sri Lalita Chaitanya Vijnanam - 183 🌹
9) 🌹. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే? 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀*
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 524 / Bhagavad-Gita - 524🌹
11) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 127🌹
12) 🌹. శివ మహా పురాణము - 327 🌹
13) 🌹 Light On The Path - 80🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 212🌹
15) 🌹 Seeds Of Consciousness - 276 🌹
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 151🌹
17) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 07 / Lalitha Sahasra Namavali - 07🌹
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 07 / Sri Vishnu Sahasranama - 07 🌹
19) 🌹. శ్రీమద్భగవద్గీత - 3 / Bhagavad-Gita - 3🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 613 / Bhagavad-Gita - 613 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 30 🌴*
30. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |
బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధి: సా పార్థ సాత్త్వికీ ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థా! ఏ బుద్ధి ద్వారా మనుజుడు ఏది చేయదగినదో ఏది చేయరానిదో, దేనికి భయపడవలెనో దేనికి భయము నొందరాదో, ఏది బంధకరమో ఏది ముక్తిదాయకమో తెలిసికొనగలుగునో అట్టి బుద్ధి సత్త్వగుణప్రధానమైనది.
🌷. భాష్యము :
శాస్త్రనిర్దేశముల దృష్ట్యా కార్యముల నొనరించుట “ప్రవృత్తి” యనబడును. అదియే చేయదగిన కర్మముల నొనరించుట యగును. నిర్దేశములు కానటువంటి కర్మల నెన్నడును ఒనరింపరాదు. శాస్త్రనిర్దేశములను ఎరుగనివాడు కర్మల యందు మరియు కర్మఫలముల యందు బంధితుడగుచున్నాడు. అట్టి విచక్షణా జ్ఞానమును కలిగించు బుద్ధియే సత్త్వగుణప్రధానమైనదని చెప్పబడును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 613 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 30 🌴*
30. pravṛttiṁ ca nivṛttiṁ ca kāryākārye bhayābhaye
bandhaṁ mokṣaṁ ca yā vetti buddhiḥ sā pārtha sāttvikī
🌷 Translation :
O son of Pṛthā, that understanding by which one knows what ought to be done and what ought not to be done, what is to be feared and what is not to be feared, what is binding and what is liberating, is in the mode of goodness.
🌹 Purport :
Performing actions in terms of the directions of the scriptures is called pravṛtti, or executing actions that deserve to be performed. And actions which are not so directed are not to be performed.
One who does not know the scriptural directions becomes entangled in the actions and reactions of work. Understanding which discriminates by intelligence is situated in the mode of goodness.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 236, 237 / Vishnu Sahasranama Contemplation - 236, 237 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻236. సుప్రసాదః, सुप्रसादः, Suprasādaḥ🌻*
*ఓం సుప్రసాదాయ నమః | ॐ सुप्रसादाय नमः | OM Suprasādāya namaḥ*
సుప్రసాదః, सुप्रसादः, Suprasādaḥ
అపకారవతాం శిశుపాలాదీనామపి మోక్ష ప్రదాతృత్వాత్ శోభనః ప్రసాదః యస్య అపకారులగు శిశుపాలాదులకు సైతము మోక్షప్రదుడగుటవలన శోభనము, శుభకరము అగు ప్రసాదము, దయ ఎవనికి కలదో అట్టివాడు.
:: పోతన భాగవతము దశమ స్కంధము, ఉత్తరభాగము ::
క. కమలాక్షుని నిందించిన, దమఘోషతనూభవుండు దారుణ మల కూ
పమునుం బొందక యే క్రియ, సుమహితమతిఁ గృష్ణునందుఁ జొచ్చే మునీంద్రా! (797)
వ. అనిన శుకయోగి రాజయోగి కిట్లనియె. (798)
మ. మధుదైత్యాంతకుమీఁది మత్సరమునన్ మత్తిల్లి జన్మత్రయా
వధియే ప్రొద్దుఁ దదీయ రూపగుణ దివ్యధ్యానపారీణ ధీ
నిధి యౌటన్ శిశుపాల భూవిభుఁడు తా నిర్ధూత సర్వాఘుఁడై
విధిరుద్రాదుల కందరాని పదవిన్ వే పొందె నుర్వీశ్వరా! (799)
ఓ మునీంద్రా! శ్రీకృష్ణుణ్ణి నిందించిన శిశుపాలుడు భయంకర నరకకూపంలో పడకుండా భగవంతుడైన కృష్ణునిలో ఏ విధంగా ప్రవేశించాడో వివరించు.
ఈ విధంగా ప్రశ్నించిన మహారాజుతో మహర్షి ఇలా అన్నాడు - 'ఓ రాజేంద్రా! మధుసూదనుని మీది మాత్సర్యంతో మదోన్మత్తుడై మూడు జన్మలనుండీ ముకుందుని నిందిస్తూ, ఎల్లప్పుడూ విష్ణుదేవుని రూప గుణాలను ధ్యానిస్తూ వుండడంవల్ల శిశుపాలుడు సమస్త పాపాలనుంచి విముక్తుడై బ్రహ్మరుద్రాదులకు సైతం అందరాని పదవిని పొందాడు.'
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 236🌹*
📚. Prasad Bharadwaj
*🌻236. Suprasādaḥ🌻*
*OM Suprasādāya namaḥ*
Apakāravatāṃ śiśupālādīnāmapi mokṣa pradātr̥tvāt śobhanaḥ prasādaḥ yasya / अपकारवतां शिशुपालादीनामपि मोक्ष प्रदातृत्वात् शोभनः प्रसादः यस्य One whose prasāda or mercy is uniquely wonderful because He bestows salvation even on those like Śiśupāla and others who tried to harm Him.
Śrīmad Bhāgavata - Canto 10, Part II, Chapter 74
Janmatrayānuguṇita vairasaṃrabdhayā dhiyā,
Dhyāyaṃstanmayatāṃ yāto bhāvo hi bhavakāraṇam. (46)
:: श्रीमद्भागवते दशमस्कन्धे उत्तरार्धे चतुःसप्ततितमोऽध्यायः ::
जन्मत्रयानुगुणित वैरसंरब्धया धिया ।
ध्यायंस्तन्मयतां यातो भावो हि भवकारणम् ॥ ४६ ॥
Obsessed with hatred of Lord Kṛṣṇa throughout three lifetimes, Śiśupāla attained the Lord's transcendental nature. Indeed, one's consciousness determines one's future birth.
O lifter of the earth, the earth with its mountains, which You have lifted with Your tusks, is situated as beautifully as a lotus flower with leaves sustained by an infuriated elephant just coming out of the water.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 237 / Vishnu Sahasranama Contemplation - 237🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻237. ప్రసన్నాత్మః, प्रसन्नात्मः, Prasannātmaḥ🌻*
*ఓం ప్రసన్నాత్మనే నమః | ॐ प्रसन्नात्मने नमः | OM Prasannātmane namaḥ*
ప్రసన్నాత్మాః, प्रसन्नात्माः, Prasannātmāḥ
ప్రసన్నః ఆత్మా రజస్తమోభ్యాం అకలుషితం అంతఃకరణం యస్య రజస్తమోగుణములచే కలుషితము కాని అంతః కరణము అనగా ప్రసన్నమగు ఆత్మ ఈతనికి కలదు. లేదా ప్రసన్నః ఆత్మా కరుణార్ద్రః స్వభావః అస్య విద్యతే కరూణార్ద్రమగు స్వభావము ఇతనికి కలదు. లేదా నిర్మలమగు స్వభావము ఇతనికి కలదు. కరుణాశాలి అనియే అర్థము. లేదా అవాప్త సకల కాముడు - పొందబడిన అన్ని కోరికల ఫలములును కలవాడూ, పొందవలసిన ఏ కోరిక ఫలములును లేనివాడును కావున రాగము మొదలగునవి లేని నిర్మలమగు ఆత్మ కలవాడు.
:: శ్రీమద్భగవద్గీత - మోక్షసన్న్యాసయోగము ::
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి ।
సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ॥ 54 ॥
బ్రహ్మైక్యము బొందినవాడు, నిర్మలమైన ప్రశాంతమైన మనస్సుగలవాడునగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు. దేనినీ కోరడు. సమస్త ప్రాణులందును సమబుద్ధిగలవాడై వానిని తనవలెనే చూచుకొనుచు నాయందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 237🌹*
📚. Prasad Bharadwaj
*🌻237. Prasannātmaḥ🌻*
*OM Prasannātmane namaḥ*
Prasannaḥ ātmā rajastamobhyāṃ akaluṣitaṃ aṃtaḥkaraṇaṃ yasya / प्रसन्नः आत्मा रजस्तमोभ्यां अकलुषितं अंतःकरणं यस्य One whose mind is never contaminated by Rājas or Tamas. Prasannaḥ ātmā karuṇārdraḥ svabhāvaḥ asya vidyate / प्रसन्नः आत्मा करुणार्द्रः स्वभावः अस्य विद्यते Or One who is extremely merciful by nature. Or One who is ever satisfied as has realized all His desires.
Śrīmad Bhagavad Gīta - Chapter 18
Brahmabhūtaḥ prasannātmā na śocati na kāṃkṣati,
Samassarveṣu bhūteṣu madbhaktiṃ labhate parām. (54)
:: श्रीमद्भगवद्गीत - मोक्षसन्न्यासयोग ::
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति ।
समस्सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥ ५४ ॥
By becoming engrossed in Brahman, calm souled, neither lamenting nor craving, beholding equality in all beings - he gains supreme devotion towards Me.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 32 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 1. The Absolute is Just Here 🌻*
God is here, and not in the heavens above. The Absolute is just here, under the very nose of ours. The eternity that we are going to experience, the moksha that we are to realise, is not merely an original Archetype that is removed in space.
Again the idea of space comes in, and the notion of time persists in our minds. The Goal is not outside in space, and is not to be reached tomorrow as a future of time experience.
All this is difficult indeed for the human intellect to understand. One becomes giddy when thinking about it. But, God loves you more than you love Him, and you are bound to achieve this glorious consummation of life.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 166 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 96 🌻*
ఎవరి విద్యుక్త ధర్మాన్ని, ఎవరి కర్తవ్యాని వారు సేవకుల వలే, ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, అంతట నిండియున్నటువంటి పురుషుడని గుర్తించడానికి అనువైన సాధనగా - కాలత్రయాబాధితం కానటువంటి పురుషునిగా, కాలాత్రయమునకు నియామకుడైనటువంటి వాడుగా, కాలాతీతమైనటువంటి వాడిగా ఈ మహానుభావుడను ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో,
ఈ స్థితిని ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, అట్టి స్థితిని ఎవరైతే పొందగలుగుతున్నారో, వారు ఎవరి నుంచీ రక్షణ కోరుతారు ఇప్పుడు? ఎవరిని అడుగుతారు? పాహిమాం అని ఎవరిని అడుగుతావు? సాక్షాత్ ఈశ్వరత్వం అంటున్నారు.
ఈశ్వరత్వం స్యాత్.... అంటే నీవే ఈశ్వరుడవై యుండగా, ఈశ్వరా పాహిమాం అని ఎవరిని అడుగుతావు. అంటే ఏ సద్గురుమూర్తో, ఏ అవతారుడో, ఎవరైతే నీకు ఆధారభూతంగా ఉన్నాడో, ఆ మహానుభావుడిని నువ్వు వేడుకోవల్సిందే. వారే నీకు ఈశ్వరుడు. వారే నీకు బ్రహ్మము. వారే నీకు పరబ్రహ్మము.
ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వారే ఈశ్వర స్వరూపులు. వారినే శరణు వేడాలి. వారికే శరణాగతి చేయాలి. వారి ద్వారానే ఈశ్వరుడు లోకకల్యాణార్థం, ధర్మసంస్థాపనార్థం పని చేస్తూ ఉన్నాడు.
కాబట్టి, ఈశ్వరుడు ఆకాశం నుంచీ పిడుగువలె పడుతాడనో, ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే, ఏదో అమృత వృష్ఠి కురుస్తుందనో, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే నాకు ఆరకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు.
సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి, సర్వమును ప్రకాశింప చేస్తున్నటువంటి, సర్వుల హృద్గుహయందు అంగుష్ఠ మాత్ర పురుషునిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో,
ఏదైతే జీవాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా పిలువబడుతూ ఉన్నాడో, క్షర, అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో అట్టి దానిని మాత్రమే నీవు ఆత్మ, స ఆత్మ అని తెలుసుకొన వలయును. ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఇలా తెలుసుకోవాలి అంటే, నీకు అత్యావశ్యకమైనటువంటిది శుద్ధ బుద్ధి. శుద్ధమైన చిత్తము. చింత నుండి దూరమైనటువంటి చిత్తము. వాసనలనుంచి దూరమైనటువంటి చిత్తము. వ్యవహారము నందు రమించనటువంటి చిత్తము. వృత్తులందు రమించనటువంటి చిత్తము.
మనోనిగ్రహోపాయము. మనోజయము. వీటిని సాధించడం సాధకులందరికి అత్యావశ్యకమై యున్నది అని యమధర్మరాజుగారు నచికేతునికి బోధిస్తూఉన్నారు ఆత్మ తత్వము గురించి.- విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 6 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 2. సుదర్శన చక్రము - 3 🌻*
భూమి చుట్టునూ చంద్రుడు తిరుగు చక్రము మూడవది. ఈ చక్రభ్రమణము వలననే భూమిపై జీవుల జనన మరణాదులు కలుగచున్నవి. ఋతువులు మున్నగునవి తెలియ బడుచున్నవి. ఆత్మ, బుద్ధి, మనస్సు అను మూడు వృత్తములుగ శరీరముల రూపమెత్తు నడక ఇది. దీనినే పైథాగరస్ మహాశయుడు వృత్తమున త్రిభుజముగ సంకేతించి తన శిష్యులకు మాత్రము రహస్యముగ ఉపదేశించెడివాడు.
భిన్న వేగములు గల సూర్యుడు, చంద్రుడు ఒకే భాగ (డిగ్రీ) మీద నుండినట్లు భూమికి కనిపించుట ఈ చక్రమున (భ్రాంతి చక్రమున) ఇరువది నాలుగు తావులందు జరుగును. వీనినే పర్వము లందురు. ఈ ఇరవై నాలుగు పర్వముల అండమే గాయత్రీ ఛందస్సు. దీనికి సూర్యుడు కేంద్రము. దీనినాక గానముగ తాళ లయాత్మకముగ కనుగొనగల్గుట గాయత్రి, దాని నడకతో తన కర్తవ్యమును గుర్తెరుగుట దీని యర్థము.
దీని రహస్యమును ఉద్బోధ చేయు 24 అక్షరముల వరుసయే గాయత్రి మంత్రము. ఈ విధముగ ఈ చక్రమునకు 24 కణుపులు (12 పూర్ణిమలు, 12 అమావాస్యలు). 12 అంచులు (12 మాసములు). దీనినే సూర్యుని 12 భావములుగా గుప్తవిద్య
వర్ణించును. 12 భాగములలో ఒక్కొక్క దానిలో 30 చొప్పున 360 అరలు ఈ చక్రమున కట్టబడి వున్నవి.
ఇట్లు చక్రమునకు, అండమునకు గల సంబంధము చర్చించబడినది. ఈ సంబంధము కనిపెట్టుట లోనే సర్వసృష్టి యొక్క కర్మఫల మార్గమున్నది.
ఈ చక్రమును ఆరుగురు కుమారులు త్రిప్పుచుందురట. వారే ఋతువులు. అచ్చట ధాత, విధాత అను రెండు శక్తులు, నల్లని, తెల్లని నూలు పోగులను (వెలుగును, చీకటిని) నేయుచుందురట, ఆవియే రాత్రింబవళ్లు. ఈ చక్ర వర్ణమున ఖగోళ రహస్యములన్నియు వివరింపబడెను.
దానినే జోతిష్ణోమ యజ్ఞమందురు. భారతమున ఉదంకుడు నాగలోకమునకు పోయిన సందర్భమున ఈ చక్రము వర్ణింపబడినది.
దీనినే సుదర్శన చక్రమందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 187 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
179
Now, let’s talk about the python. Everything is determined by time. In this age, desire crosses limits and turns into greed. Just as the proverb (in Telugu) says that greed breeds sorrow, greed brings us a lot of difficulties.
Nobody is able to live within boundaries and limits. The primary reason for that is lack of association with noble souls. Thinking, “I alone am great”, and ignoring noble souls is the root cause of all sorrow.s Great souls will persistently guide and pursue us to enable us to walk the dharmic path.
They enable us to undertake noble tasks and receive the good merit for those tasks. They help us be satisfied with what we receive. They make our lives comfortable. In this context, Avadhoota Swamy told King Yadu what he learned from the python.
“In a forest, there once lived a python with two heads. But, it would never move from its place. It would just stay put in its place. It made no effort whatsoever to gather food. If some food came to it, it would eat and be content. Whether the food was delicious or not, whether its hunger was satisfied or not, it would be content and satisfied.
Similarly, a Yogi too should observe caution regarding food. He should consider whatever food he receives as a blessing from God and be satisfied. In the event he receives no food, he should be content with what he has. He should live courageously. He should be steadfast in his spiritual practice. The mind should be merged in the Absolute”.
Did you see, it is being said here that the spiritual seeker should behave like the python when it comes to his spiritual practice.
Only then will equanimity of mind become a habit. He will realize the state where he views joys and sorrows, heat and cold as equal. Greed will never come close to such a person. Desire will always be within reasonable limits. The spiritual seeker, with the aid of the great soul, will be able to climb up higher steps in spirituality.
Great souls keep the disciples’ desires in check and uplift the disciples while deconstructing the source of all desires and explaining how to get rid of them. A perfect disciple will realize that he is gaining contentment with whatever he has. He realizes that the Guru’s words are full of truth.
What a wonderful lesson we learned now. A perfect disciple will realize that he is gaining contentment from whatever he has, just like a python.
The Guru’s teachings are such. The python would eat whatever would come its way and just stay put. Similarly, we should understand from this that the disciple leads a life of contentment, satisfied with whatever he has.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే? 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀*
📚. ప్రసాద్ భరద్వాజ.
ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
అలాగే మీరు తక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా అనుభూతి చెందుతూ మరింత స్వతంత్రులుగా ఉండేందుకు ప్రయత్నించండి.
గులాబీని చూసినప్పుడు, చందమామని చూసినప్పుడు అందరూ చెప్పినట్లుగానే మీరు కూడా ‘‘ఆహా! ఎంత చక్కగా ఉందో’’అనే చిలక పలుకులు ఎప్పుడూ చెప్పకండి. నిజంగా అలాంటి భావన మీ అంతరంగంలో కలిగితేనే చెప్పండి. లేకపోతే, అలా ఎప్పుడూ చెప్పకండి. ఎందుకంటే, మీరు మీ చిన్నప్పటి నుంచి ఇతరులు గులాబీ గురించి చెప్పిన అభిప్రాయాన్ని మాత్రమే వింటున్నారు.
ఇతరుల నుంచి ఎరువు తెచ్చుకున్న ఎందుకూ పనికిరాని పరమ చెత్త భావాలతో మీ మనసు తొంభైతొమ్మిది శాతం నిండిపోయిందని, మిగిలిన ఆ ఒక్క శాతం ఆ చెట్టులో కూరుకుపోయి ఎందుకూ పనికిరాకుండా పోయిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ చెత్తను వదిలించుకుని, పోగొట్టుకున్న ఆ ఒక్క శాతం అంతరంగాన్ని తిరిగి రాబట్టుకోండి. ఎందుకంటే, దాని ద్వారానే మీకు ‘దేవుడు’ తెలుస్తాడు.
ఇంద్రియాలు ఆరు. వాటిలో పంచేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం బాహ్యప్రపంచాన్ని తెలిపేవి కాగా, అంతర్వాణిని తెలిపే ఆరవ ఇంద్రియం (సిక్స్త్ సెన్స్) ‘జ్ఞానేంద్రియం’. అది మీ గురించి, అనంత దిగంతాల గురించి మీకు చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి, దానిని మీరు కనుక్కోవాలి. దానిని కనుక్కొనే సాధనమే ‘‘ధ్యానం’’.
ఇతరుల అభిప్రాయాలే ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైనవి. మీరు గుంపుకు భయపడని వారైతే గొర్రె కానట్లే, సింహమైనట్లే. అప్పుడు మీరు చాలా గట్టిగా గాండ్రిస్తారు. అది మీరు పొందిన స్వేచ్ఛకు చిహ్నం. దానినే బుద్ధుడు ‘సింహగర్జన’ అన్నాడు.
పరమ నిశ్శబ్దస్థితికి చేరుకున్న వ్యక్తి ఎప్పుడూ సింహంలా గర్జిస్తాడు. ఎందుకంటే, ‘స్వేచ్ఛ’ అంటే ఏమిటో అతడు తొలిసారిగా తెలుసుకున్నాడు. అందుకే అతనిని ఇతరులు ఏమన్నా- సన్యాసి అన్నా, పాపి అన్నా- ఏమాత్రం పట్టించుకోకుండా, ఏమాత్రం భయపడకుండా గట్టిగా గర్జిస్తాడు.
దేవుడే మీకున్న ఏకైక న్యాయమూర్తి. అంతమాత్రాన మీకు ఒక వ్యక్తి ఎదురైనట్లు కాదు. దేవుడు ఒక వ్యక్తికాదు. ఈ మొత్తం విశ్వమే దేవుడు.
చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు- ఇలా మొత్తం విశ్వమంతా మీకు ఎదురవుతుంది. ఈ విశ్వమంతా మనదే. అందులోని భాగమే మనం. దానికి భయపడి మీరు దాక్కోవలసిన పనిలేదు. నిజానికి, ఎంత ప్రయత్నించినా మీరు ఆ పని చెయ్యలేరు. ఎందుకంటే, మీరు ఎక్కడ దాక్కున్నా విశ్వానికి తెలిసి పోతుంది. కాబట్టి, మీ గురించి మీకు తెలిసిన దానికన్నా ఈ విశ్వానికి చాలా తెలుసని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి.
గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్య విషయం ‘‘మీ మరణ శాసనాన్ని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడని. కాబట్టి, అది ఎప్పుడో భవిష్యత్తులో నిర్ణయించే విషయం కాదు. దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడే ఆ నిర్ణయం జరిగిపోయింది. అందుకే మృత్యుభయం తన తాజాదనాన్ని కోల్పోయింది.
కాబట్టి, మరణ శాసనం చివరి క్షణంలో జరుగుతుందనేది ఒక విషయమే కాదు. అందువల్ల దాని గురించి ఆలోచించ వలసిన, భయపడవలసిన పని లేదు. దేవుడికి మీరేమిటో తెలుసు. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. కాబట్టి, మీవల్ల ఏ తప్పు జరిగినా, మీరు దారి తప్పినా దానికి ఆయనే బాధ్యుడు కానీ, మీరు కాదు. ఎందుకంటే, మిమ్మల్ని మీరు సృష్టించుకోలేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 183 / Sri Lalitha Chaitanya Vijnanam - 183 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |*
*నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖*
*🌻 183. 'నిష్పరిగ్రహా'🌻*
పరిగ్రహమను గుణము లేనిది శ్రీమాత అని అర్థము.
పరిపూర్ణులకేమి కావలయును? కావున గ్రహించుట కేమియూ లేనిది శ్రీమాత. ఇచ్చుట, పుచ్చుకొనుట కర్మల రూపమున జీవులను నిర్విరామముగా ఆడించు చుండును. పరిపూర్ణుడు కానివాడు గ్రహించును. పుచ్చుకొనును. పుచ్చుకొను వాడున్నప్పుడు ఇచ్చువాడు ఉండును. ప్రతిజీవి యందు ఇచ్చుట, పుచ్చుకొనుట జరుగుచు నుండును.
కుండ నిండుగ నీరున్నపుడు, ఆ కుండ ఇక నీరు పుచ్చుకొనడు. లోటు లేని చోట పుచ్చుకొనుట యండడు. జీవులయందు అపరిపూర్ణత యుండుటచే, పుచ్చుకొను భావమేర్పడును. పుచ్చుకొనుటకు కోరిక కలుగును. సృష్టి ధర్మములను పరిశీలించినచో, పుచ్చుకొనుట నేర్చినటి పరిపూర్ణత పొందలేమని, యిచ్చుట నేర్చినచో పరిపూర్ణత దిశగా సాగుదుమని తెలియును.
ఇచ్చుచుండుట వలననే సూర్యుడు సూర్య మండలమునకు అధిపతియై యున్నాడు. అన్ని గ్రహములూ అతని చుట్టునూ తిరుగుచునున్నవి. పుచ్చుకొనుటవలన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుచు నున్నాడు. చంద్రునివలె మానవ మనస్సులు కూడ పదార్థమయమైన విషయములను కోరుచూ, తిరుగాడు చుండును.
మనసు ప్రధానముగ కాక బుద్ధి ప్రధానముగ జీవించినచో, బుధునివలె సూర్యుని చుట్టును తిరుగ వచ్చును. దీనినే 'యజ్ఞార్థ జీవన'మందురు. అట్టి జీవనము గావించు యోగులు అపరిగ్రహమను దీక్షను పూనుదురు. ఈ దీక్ష నాచరించుటవలన శ్రీమాతవలె శాశ్వత పరిపూర్ణులై యుండగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 183 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Niṣparigrahā निष्परिग्रहा (183) 🌻*
She does not get anything in return for the actions She perform. This is in conformity of interpretation of the previous nāma. This nāma says that She performs actions (creation, sustenance and dissolution).
The point driven home in the previous nāma is that She does not get involved in Her actions. When She is without actions (even any one of the actions), the universe ceases to exist.
For doing such actions, She does not get anything in return. The appropriate interpretation would be that She does not expect Her devotees to perform ritual worship by offering flowers, food, etc thinking that they are expressing their gratitude to Her.
This nāma reiterates that ritual worship, at the most could only be a stepping stone towards Self-realization. If one is stranded here, it is obvious that he cannot reach Her.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 524 / Bhagavad-Gita - 524 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 07 🌴*
07. మమైవంశో జీవలోకే జీవభూత: సనాతన: |
మన:షష్టానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||
🌷. తాత్పర్యం :
ఈ బద్ధ భౌతిక జగము నందలి జీవులందరు నా శాశ్వతాంశలు. బద్ధజీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను గూడి వారు తీవ్రసంఘర్షణ కావించుచున్నారు.
🌷. భాష్యము :
జీవుని యథార్థరూపము ఈ శ్లోకమునందు స్పష్టముగా ఒసగబడినది.
యథార్థమునకు అతడు శ్రీకృష్ణభగవానుని శాశ్వతాంశము. అనగా అతడు బద్ధజీవితమున వ్యక్తిత్వమును పొంది, ముక్తస్థితిలో ఆ భగవానునితో ఐక్యమగునని కాదు. అతడు శాశ్వతముగా భగవానుని నుండి విడివడియే యుండును. ఈ విషయమే “సనాతన”యను పదము ద్వారా స్పష్టపరుపబడినది.
వేదముల ప్రకారము శ్రీకృష్ణభగవానుడు అసంఖ్యాక రూపములలో వ్యక్తమై విస్తరించియుండును. వానిలో ప్రధానవిస్తారములు విష్ణుతత్త్వములనియు, అప్రధానవిస్తారములు జీవతత్త్వములనియు పిలువబడును.
అనగా విష్ణుతత్త్వములు స్వీయ విస్తారములు కాగా, జీవులు విభక్తమైనట్టి విస్తారములు. ఈ రీతి శ్రీకృష్ణభగవానుడు తన స్వీయ విస్తారముతో రామ, నృసింహ, విష్ణుమూర్తి మరియు పలు వైకుంఠాధి పతుల రూపములందు వ్యక్తమగు చుండును.
విభక్తవిస్తారములైన జీవులు అతని నిత్య సేవకులే. భగవానుని స్వీయ విస్తారములు (విష్ణుతత్త్వములు) శాశ్వతముగా నిలుచునట్లే, భగవానుని విభక్తవిస్తారములైన జీవులు సైతము తమ వ్యక్తిత్వములను కలిగియున్నారు.
దేవదేవుని అంశలుగా వారు అతని లక్షణములను అంశమాత్రము కలిగియున్నారు. దేవదేవుని అంశలుగా వారు అతని లక్షణములను అంశ మాత్రము కలిగియున్నారు. అట్టి లక్షణములలో స్వతంత్రమనునది యొకటి. అనగా ప్రతిజీవియు వ్యక్తిత్వమును మరియు స్వతంత్ర్య యొక్క సుక్ష్మాంశమును కలిగియున్నాడు.
అట్టి సూక్ష్మస్వతంత్రతను దుర్వినియోగపరచుటచే అతడు బద్ధుడగుచుండ, సద్వినియోగముచే ముక్తుడగుచున్నాడు. బంధ, ముక్తస్థితులనెడి రెండింటి యందును అతడు దేవదేవుని వలనే గుణరీతి శాశ్వతుడు. ముక్తస్థితిలో అతడు భౌతికజీవనము నుండి విడివడియుండి శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియుక్తుడై యుండును.
కాని బద్ధస్థితిలో గుణములచే ప్రభావితుడై ఆ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవను మరచియుండును. తత్పలితముగా అతడు భౌతికజగమునందు తన జీవనమునకై తీవ్రసంఘర్షణను కావింపవలసివచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 524 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 15 - Purushothama Yoga - 07 🌴*
07. mamaivāṁśo jīva-loke
jīva-bhūtaḥ sanātanaḥ
manaḥ-ṣaṣṭhānīndriyāṇi
prakṛti-sthāni karṣati
🌷 Translation :
The living entities in this conditioned world are My eternal fragmental parts. Due to conditioned life, they are struggling very hard with the six senses, which include the mind.
🌹 Purport :
In this verse the identity of the living being is clearly given. The living entity is the fragmental part and parcel of the Supreme Lord – eternally.
It is not that he assumes individuality in his conditional life and in his liberated state becomes one with the Supreme Lord. He is eternally fragmented. It is clearly said, sanātanaḥ.
According to the Vedic version, the Supreme Lord manifests and expands Himself in innumerable expansions, of which the primary expansions are called viṣṇu-tattva and the secondary expansions are called the living entities. In other words, the viṣṇu-tattva is the personal expansion, and the living entities are the separated expansions.
By His personal expansion, He is manifested in various forms like Lord Rāma, Nṛsiṁha-deva, Viṣṇumūrti and all the predominating Deities in the Vaikuṇṭha planets. The separated expansions, the living entities, are eternally servitors.
The personal expansions of the Supreme Personality of Godhead, the individual identities of the Godhead, are always present. Similarly, the separated expansions of living entities have their identities.
As fragmental parts and parcels of the Supreme Lord, the living entities also have fragmental portions of His qualities, of which independence is one. Every living entity, as an individual soul, has his personal individuality and a minute form of independence.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
Facebook group....
https://www.facebook.com/groups/1044423582726375/?ref=share
Join and Share శ్రీ లలితా చైతన్య విజ్ఞానం
Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation
www.facebook.com/groups/vishnusahasranamatatwa/
Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita
www.facebook.com/groups/bhagavadgeetha/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -127 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 12
*🍀. 10. నైష్ఠికులు - యోగయుక్తుడై నిష్ఠగ కర్మము నాచరించువాడు శాంతిని పొందును. యోగయుక్తుడు కానివాడు కర్మఫలముల యందాసక్తు డగుటచే, కోరికల రూపమున బంధింపబడు చున్నాడు. కర్మ మనగ కర్తవ్యకర్మ. కర్తవ్యము నిర్వర్తించవలసినదే. నిర్వర్తింప బడకుండుట కుదరదు. కర్తవ్యములు నిర్వర్తించుట, కోరికలను తీర్చుకొనుట ఒకటి కాదు. నిర్వర్తించ వలసినది కర్తవ్యమే గాని కోరికలు కాదు. కర్తవ్యములు కాని కర్మ కేవలము ఫలము లందాసక్తి వలననే చేయవలె ననిపించును. ఫలాసక్తియే కామము. 🍀*
12. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీమ్ |
అయుక్తః కామకారేణ ఫలే సక్ నిబధ్యతే || 12
యోగయుక్తుడై నిష్ఠగ కర్మము నాచరించువాడు శాంతిని పొందును. యోగయుక్తుడు కానివాడు కర్మఫలముల యందాసక్తు డగుటచే, కోరికల రూపమున బంధింపబడు చున్నాడు. దైవము కర్మాచరణము విషయమున అనేక పర్యాయములు విసుగు, విరామము లేక ప్రేమతో, ఆదరణతో, కరుణతో ఒకే సూత్రమును తెలుపుచున్నాడు.
ఇన్నిమార్లు చెప్పిన విషయమునే చెప్పుటయందు అతడెంత ఆత్మీయుడో మన మెరుగవలెను.
ఆత్మ బంధువులనిన యిట్టి వారే. తెలిపినదే మరల మరల తెలుపుచు, శ్రేయోమార్గము గుర్తు చేయుచు నుందురు. కర్మ మనగ కర్తవ్యకర్మ. కర్తవ్యము నిర్వర్తించవలసినదే. నిర్వర్తింప బడకుండుట కుదరదు. దప్పిక కలిగినపుడు నీరు త్రాగవలసినదే, ఆకలి కలిగినపుడు ఆహారము భుజింపవలసినదే. మరియొక మార్గము లేదు.
కర్తవ్యములు నిర్వర్తించుట, కోరికలను తీర్చుకొనుట ఒకటి కాదు. దప్పిక గొన్నపుడు నీరు త్రాగుట. ఆకలి కలిగినపుడు తగు మాత్రము భుజించుట కర్తవ్యము లగును. అవి కోరికలు కావు.
కర్తవ్యము లేవియో, కోరిక లేవియో ఎవరికి వారుగ తెలుసుకొన వచ్చును. ఈ విషయమున పెద్ద విద్య లక్కరలేదు. విచక్షణ చాలును. విచక్షణ లేనివానికి కర్తవ్యములు, కోరికలు కలగాపులగమై కోరికలే కర్తవ్యములుగ భ్రమ గొల్పును. ఇట్టి వారికి ఉప్పు కప్పురము ఒక్క మాదిరిగనే గోచరించును. పేడ-బెల్లము తేడా కూడ తెలియదు.
నిర్వర్తించ వలసినది కర్తవ్యమే గాని కోరికలు కాదు. కర్తవ్యములు కాని కర్మ కేవలము ఫలము లందాసక్తి వలననే చేయవలె ననిపించును. ఫలాసక్తియే కామము. కామము వలన ఫలాసక్తి ఈ రెండును బలిమిగ అల్లుకొని యుండును. ఇట్టివారికి కర్తవ్యమేమో తెలియదు. కర్తవ్యమునకు సౌకర్యము అసౌకర్యము, లాభము నష్టము, జయము అపజయము అనునవి అప్రధానములు.
ఉదాహరణకు గృహము నందెవ్వరికైన తీవ్ర అస్వస్థత ఏర్పడినపుడు నిద్రాహారములు మాని సేవచేయుదురు. సౌకర్యము కాదని మానరు కదా! అట్లే వివాహాది సందర్భములలో రాత్రి పగలు శ్రమపడుదురు.
సౌకర్యము కాదని మానరు కదా! ఎంత ఖర్చెనను, అప్పులు చేసియైనను పిల్లలను చదివింతురు. నష్టమని భావింపరు కదా. బాధ్యతాయుత కార్యములను నిర్వర్తించునపుడు జయాప జయములను చూడరు గదా! వైద్యుడు ఔషధము నిచ్చుట కర్తవ్యము. శస్త్ర చికిత్స చేయుట కూడ కర్తవ్యము. వ్యాధి తగ్గునో తగ్గదో అని భావించుచు మీన మేషములు లెక్క పెట్టడుగదా!
వ్యాధి నివారణముతో సంబంధములేక, వ్యాధి నిర్మూలనమునకు తనకు తెలిసిన విద్యను వినియోగించుటయే కర్తవ్యము. ఇది నిష్ఠ. అర్జునుడు యుద్ధమున గెలుతుమో లేదో అని కూడ పలికినాడు. జయాపజయములతో సంబంధము లేక, క్షత్రియుడు ధర్మరక్షణమునకు యుద్ధము చేయవలెనని దైవము తెలుపుచున్నాడు.
ఇట్లు కర్తవ్యమును నిర్వర్తించువారు దైవముతో యుక్తులై నిర్వర్తించుట వలన శాంతిని బొందుచున్నారు. ఇట్లుకాక కోరికలను ఫలములం దాసక్తితో నిర్వర్తించువారు యోగయుక్తులు కాకపోవుట వలన బంధింపబడు చున్నారు. వారి కర్మలే వారిని బంధించుచున్నవి.
నైష్ఠికులు శాంతిని పొందుదురు. ఇతరులు పొందలేరు. అనగా ఫలాసక్తి యందు తగులుకొనక కర్తవ్య కర్మల నాచరించువారే శాంతిని పొందెదరు. వారు నిష్ఠగలవారగుటచే నైష్ఠికులని తెలుపబడిరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 327 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
82. అధ్యాయము - 37
*🌻. యజ్ఞ విధ్వంసము - 3 🌻*
ఓ మహర్షీ! వత్సా! విష్ణువు యొక్క శార్‌ఙ్గ ధనస్సును ఆ వీరభద్రుడు మూడు బాణములతో కొట్టగా, అది క్షణములో మూడు ముక్కలాయెను(39) అపుడు విష్ణువును నేను, సరస్వతి దేవి హెచ్చిరించితిమి. మహా గణాధీశుడగు వీరభద్రుని పరాక్రమమును సహింపశక్యముకాదని ఎరింగి విష్ణువు అంతర్ధానమగుటకు నిశ్చయించు కొనెను(40)
సతి దేహమును త్యజించుట శివగణములకు సహింప శక్యము కాని ఘటన అనియు, ఈ సర్వనాశనము జరుగబోవుననియు ఎరింగిన దేవగణనాయకులు సర్వలోక ప్రభుడు, స్వతంత్రడునగు శివుని స్మరించి తమ గటనములతో గూడి తమతమలోకములకు వెళ్ళిరి(41).
నేను పుత్రశోకముతో పీడింపబడుతూ సత్యలోకమునకు వెళ్ళి మిక్కిలి దుఃఖముతో కూడినవాడనై 'ఇపుడు నాకర్తవ్యమేమి?' అని చింతిల్లితిని(42) విష్ణువు, నేను మరలిపోగానే మిగిలిన దేవతలను అందరిని, మరుయు యజ్ఞమే జీవనాధారముగాగల మునులను శివగణములు జయించినవి(43).
యజ్ఞపురుషుడు సంప్రాప్తమైన మహావిపత్తును ఎరింగి, మహా యజ్ఞము నాశనమగుటగాంచి, మిక్కిలి భీతిల్లి, మృగరూపముతో పరుగిడెను(44). మృగరూపముతో ఆకసము వైపునకు పరుగిడుతున్న ఆ యజ్ఞపురుషుని వీరభద్రుడు పట్టుకొని తలను నరికి వేసెను(45)
అపుడా వీరుడగు వీరభద్రుడు ధర్మ, కశ్యప్రజాపతులను, అనేక పుత్రులతో అసమర్ధుడై యున్న అరినేమిని(46) అంగిరస మహర్షిని, కృశాశ్వుని, దత్త మహర్షిని పట్టుకొని శిరస్సుపై పాదముతో తన్నెను(47) మహాగణాధ్యక్షడు, ప్రతాపశీలియగు వీరభద్రుడు దేవతలకు తల్లియగు సరస్వతి యొక్క ముక్కుకొనను చేతిలోని కత్తికొనతో కోసివేసెను(48)
ఆ వీరభద్రుడు క్రోథముచే ఎర్రనైన నేత్రములు గలవాడై, దేవతలు మొదలగు ఇతరులను చీల్చి నేల గూల్చెను(49) పగబట్టిన త్రాచుపాము వలె మిక్కిలి కోపమును పొందియున్న వీరభద్రుడు ముఖ్యులగు దేవతలను , మహర్షులను చీల్చి చెండాడిన తరువాతనైననూ శాంతించలేదు(50)
సింహము ఏనుగులను వలె శత్రువులను తరిమివేసిన వీరభద్రుడు 'ఎవడు ఎక్కడ దాగియున్నాడో!' అని ప్రతిక్షణము దిక్కులను పరికించు చుండెను(51) ఇంతలో ప్రతిపశీలియగు మణి భద్రుడు భృగువును నేలపై బడవేసి, కాలితో గండెలపై తొక్కిపెట్టి గెడ్డమును , మీసములను ఊడబెరికెను(52) దక్షుడు శివుని నిందించిన సమయములో పళ్ళుకనబడునట్లు బిగ్గరగా నవ్విన పూషన్ యొక్క దంతములను చండుడు వేగముగా పెరికివేసెను(53)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 80 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 6 - THE 10th RULE
*🌻 10. Desire only that which is beyond you. - It is beyond you, because when you reach it you have lost yourself. - 1 🌻*
321. C.W.L. – “He that findeth his life shall lose it: and he that loseth his life for my sake shall find it.
That happens over and over again at various stages. Consider the man of the world living his ordinary life, which is very largely a life in his emotions – in some cases in quite the lower emotions.
As soon as he begins to understand the higher side of things he realizes that there is something higher and nobler than that. But he finds also that unless he is willing to put aside that lower and coarser life, he cannot really grasp the higher; he must lose the lower in order that he may gain the higher.
322. At the next step the man comes to live in his mind to a large extent. He realizes that to be swept about by tides of passion is, after all, ignoble, and that the mind should select and dominate the emotions and allow only such as it approves, for the sake of progress.
Presently he gets beyond that, and finds that the mind also is not fully satisfactory, but that there is a higher life than that of the mind. So gradually he begins to live in the ego, and to look at everything from that standpoint, which is a very great advance.
But eventually even that is not enough for him. He realizes that there is a unity which lies beyond that stage, and so he begins to have some experience of the buddhic plane, and when he touches that nothing below it will ever again satisfy him.
323. Even that wonderful buddhic consciousness will, in its turn, be transcended. Beyond it is the consciousness of the atmic plane – nirvana. Above and beyond that again is the Monad.
Those who are not yet Adepts see the Monad manifesting as a triple spirit on the plane below its own, but on the attainment of Adeptship the Monad and the ego will have become one, and they will be conscious as the Monad – the Divine Spark.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 212 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. వ్యాసమహర్షి - 4 🌻*
20. విష్ణు ప్రభావంతో ఆది జన్మ ఎత్తినటువంటి వ్యాసుడు, బ్రహ్మ చేత మళ్ళీ నియుక్తుడై, వేదములు అన్నిటినీకూడా నాలుగు విభాగాలుచేసి, మొదటి భాగాన్ని ఋగ్వేదం అనే పేరుతో పైలుడు అనే శిష్యుడికిచ్చాడు.
21. యజుర్వేదం అనే రెండవభాగాన్ని వైశంపాయబుడనేటటువంటి శిష్యుడికిచ్చాడు. మూడవభాగమైన సామవేదాన్ని జైమినికిచ్చాడు. నాలగవభాగమైన అధర్వణవేదాన్ని సుమంతుడికిచ్చాడు. వాటిని వ్యాప్తిచెయ్యమని వాళ్ళందరికీ చెప్పాడాయన. రోమహర్షణుడి కుమారుడైన సూతుడికి పురాణేతిహాసములన్నిటినీ ఇచ్చి, వాటిని వ్యాప్తిచేయమని చెప్పాడు.
22. “ప్రాతఃకాలములో బ్రహ్మముహూర్తములో స్నానంచేయాలి” అని చెప్పాడు వ్యాసుడు. దంతధావన యోగ్యమైన చెట్లపుల్లలతో పళ్ళు తోముకోమని చెప్పాడు. సూర్యోస్థానసంధ్య ప్రతీదినమూ చేసితీరాలని చెప్పాడు. సంధ్యావందనం చేయనిదే పూజాదానవ్రత విధానములు అన్ని నిష్ఫలమవుతాయి.
యద్దదాతి యదశ్నాతి తదేవ ధనినా ధనమ్|
అన్యే మృతస్థ క్రీడంతి దారాఇరపి ధనైరపి||
వంటివి ‘వ్యాసస్మృతి’లోని శ్లోకరత్నాలకు మచ్చుతునకలు.
23. ధనం రెండే రకాలుగా ఉన్నది. నీవు అనుభవించింది, దానం చేసింది. ఈ రెండూ కాకపోతే, మూడోదొకటి. అది వినాశనం. అది నశిస్తుంది. భోగం, దానం, నాశనం అనే మూడేస్థితులు ధనానికి. ఎంత అనుభవిస్తే అంత తరిగిపోతుంది. ఇవాళ అన్నం ఉంది, అది తిన్నాం. అదే మన ధనం. ఎవరికనా ఇచ్చాం. అదే మన ధనం. ఎవరికయినా ఇచ్చిందే మన ధనం. అదే నిజానికి మనం దాచుకున్న ధనం. దాచుకున్నది మాత్రం నశించవచ్చు. అంతేకాదు, ధనం నశ్వరం. దారాధనములన్నీ కూడా శాశ్వతం కాదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 276 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 125. The knowledge 'I am', which appeared in childhood, is a cheat as it has made you believe the illusion is true. 🌻*
See how this knowledge 'I am' is a friend and foe as well. As a friend it can show you the way out, but, as a foe, it has tricked you into believing you are a body.
It has conned you into imagining you are a person born in this world, and that one day you will die. This Janus-like nature of the 'I am' has to be understood, it is the lord of the gates with two opposing faces.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 151 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 30 🌻*
*🌷. ఐక్య అస్తిత్వము - సత్య గోళం - 3 🌷*
601.తజల్లి--ఎల్--జలాలీ:---
ఈ స్థితి ఒక ఆత్మకు నిర్వాణ అనుభవము నిచ్చును."తజల్లీ-ఎల్-జమాలీ" ఆతనికి మరియొక సారి సాధారణ చైతన్యమును ప్రసాదించును. దీనిని సూఫీలు "బకా" అందురు. ఇచ్చట భగవంతుడు ప్రియతముడు, మానవుడు ప్రేమికుడు; తజల్లి-ఎల్-జమాలీ లో భగవంతుడే ప్రేమికుడు; మానవుడు ప్రియుడు.
602.సాధారణముక్తి :--
ఈ ముక్తి మరణాంతరము శరీరము లేకుండా 3 నుండి 5 రోజులలోగా లభించు ముక్తి. భగవంతునియందు భయము, సత్యప్రేమికులు, సజ్జనులు మొదలగు ఎవరికో కొలదిమందికి మాత్రమే లభించును.
ఈ ముక్తిని పొందిన ప్రత్యగాత్మ, అనంత జ్ఞానము, అనంతశక్తియు అచ్చట యున్ననూ ఆనందమును మాత్రమే అనుభవించుచు దానియందే ఎరుక కలిగి యుండును.ఇతనికి సృష్టి లేదు.జనన-మరణముల సంసారచక్రము తిరుగుట నిలిచి పోయినది.
"అహంబ్రహ్మాస్మి" స్థితి యొక్క గాని ద్వైతముయొక్క గాని చైతన్యము లేదు.సృష్టిలో కర్తవ్యము (అధికారము) లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 7 / Sri Lalita Sahasranamavali - Meaning - 7 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 7. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |*
*తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ‖ 7 ‖ 🍀*
19) నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా :
క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది.
20) తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా :
ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 7 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 7. navacampaka-puṣpābha-nāsādaṇḍa-virājitā |*
*tārākānti-tiraskāri-nāsābharaṇa-bhāsurā || 7 || 🌻*
19 ) Nava champaka - pushpabha - nasa dhanda virajitha -
She who has nose like freshly opened flowers of Champaka
20 ) Thara kanthi thiraskari nasabharana bhasura -
She who has a nose ring which shines more than the star.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 7 / Sri Vishnu Sahasra Namavali - 7 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*భరణి నక్షత్ర తృతీయ పాద శ్లోకం*
*🍀 7. అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |*
*ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ ‖ 7 ‖ 🍀*
🍀 55) అగ్రాహ్య: -
ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.
🍀 56) శాశ్వత: -
సర్వ కాలములందున్నవాడు.
🍀 57) కృష్ణ: -
సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.
🍀 58) లోహితాక్ష: -
ఎఱ్ఱని నేత్రములు గలవాడు.
🍀 59) ప్రతర్దన: -
ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.
🍀 60) ప్రభూత: -
జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.
🍀 61) త్రికకుబ్ధామ -
ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.
🍀 62) పవిత్రం -
పరిశుద్ధుడైనవాడు.
🍀 63) పరం మంగళం -
స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 7 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka For Bharani 3rd Padam*
*🌻 7. agrāhyaḥ śāśvataḥ kṛṣṇō lōhitākṣaḥ pratardanaḥ |*
*prabhūtastrikakubdhāma pavitraṁ maṁgalaṁ param || 7 || 🌻*
🌻 55) Agrahya –
The Lord Who is Not Perceived Sensually
🌻 56) Sashwata –
The Lord Who Always Remains the Same
🌻 57) Krishna –
The Lord Whose Complexion is Dark
🌻 58) Lohitaksha –
The Lord Who has Red Eyes
🌻 59) Pratardana –
The Destroyer in Deluge
🌻 60) Prabhoota –
The Lord Who is Full of Wealth and Knowledge
🌻 61) Trika-Kubdhama –
The Lord of all Directions
🌻 62) Pavitram –
The Lord Who Gives Purity to the Heart
🌻 63) Mangalam-Param –
The Supreme Auspiciousness
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 3 / Bhagavad-Gita - 3 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 3 🌴
3. పపశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||
🌷. తాత్పర్యం :
ఓ ఆచార్యా! మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము.
🌷. భాష్యము:
బ్రహ్మణుడును మరియు గొప్ప సైన్యాధిపతి యైనను ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూప నెంచెను. ద్రౌపది (అర్జునిని భార్య) జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగియుండెను. ఆ వైరా కారణమున ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమునాచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండెను.
ద్రోణాచార్యుడు ఈ విషయమున సంపూర్ణముగా ఎరిగియున్నను ద్రుపద తనయుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధవిద్యను నేర్చుటకై తన చెంతకు చేరినపుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధరహస్యములను తెలియజేయుటలో సంకోచము కనబరచలేదు. ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్దరంగమున పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే పాండవసేనా వ్యూహమును సైతము రచించెను.
ద్రోణాచార్యుడు సావదానుడై రాజీధోరణి లేని యుద్ధము చేయవలెనను ఉద్దేశముతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తి చూపెను. ప్రియతమ శిష్యులైన పాండవుల యెడ యుద్ధరంగమున అతడు అదేవిధముగా మృదుస్వభావముతో వర్తించరాదని తెలియజేయుట దుర్యోధనుని ఉద్దేశ్యమై యుండెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడు మరియు తెలివిగలవాడు అయిన శిష్యుడు. యుద్దరంగమున అటువంటి కనికర భావము అపజయమునకు దారితీయుననియు దుర్యోధనుడు హెచ్చరించెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 BhagavadGita As it is - 3 🌹
✍️. Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga - 3 🌴
3. paśyaitāṁ pāṇḍu-putrānām
ācārya mahatīṁ camūm
vyūḍhāṁ drupada-putreṇa
tava śiṣyeṇa dhīmatā
🌷 Translation :
O my teacher, behold the great army of the sons of Pāṇḍu, so expertly arranged by your intelligent disciple the son of Drupada.
🌷 PURPORT :
Duryodhana, a great diplomat, wanted to point out the defects of Droṇācārya, the great brāhmaṇa commander in chief. Droṇācārya had some political quarrel with King Drupada, the father of Draupadī, who was Arjuna’s wife. As a result of this quarrel, Drupada performed a great sacrifice, by which he received the benediction of having a son who would be able to kill Droṇācārya.
Droṇācārya knew this perfectly well, and yet as a liberal brāhmaṇa he did not hesitate to impart all his military secrets when the son of Drupada, Dhṛṣṭadyumna, was entrusted to him for military education. Now, on the Battlefield of Kurukṣetra, Dhṛṣṭadyumna took the side of the Pāṇḍavas, and it was he who arranged for their military phalanx, after having learned the art from Droṇācārya.
Duryodhana pointed out this mistake of Droṇācārya’s so that he might be alert and uncompromising in the fighting.
By this he wanted to point out also that he should not be similarly lenient in battle against the Pāṇḍavas, who were also Droṇācārya’s affectionate students. Arjuna, especially, was his most affectionate and brilliant student. Duryodhana also warned that such leniency in the fight would lead to defeat.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment