🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. వ్యాసమహర్షి - 4 🌻
20. విష్ణు ప్రభావంతో ఆది జన్మ ఎత్తినటువంటి వ్యాసుడు, బ్రహ్మ చేత మళ్ళీ నియుక్తుడై, వేదములు అన్నిటినీకూడా నాలుగు విభాగాలుచేసి, మొదటి భాగాన్ని ఋగ్వేదం అనే పేరుతో పైలుడు అనే శిష్యుడికిచ్చాడు.
21. యజుర్వేదం అనే రెండవభాగాన్ని వైశంపాయబుడనేటటువంటి శిష్యుడికిచ్చాడు. మూడవభాగమైన సామవేదాన్ని జైమినికిచ్చాడు. నాలగవభాగమైన అధర్వణవేదాన్ని సుమంతుడికిచ్చాడు. వాటిని వ్యాప్తిచెయ్యమని వాళ్ళందరికీ చెప్పాడాయన. రోమహర్షణుడి కుమారుడైన సూతుడికి పురాణేతిహాసములన్నిటినీ ఇచ్చి, వాటిని వ్యాప్తిచేయమని చెప్పాడు.
22. “ప్రాతఃకాలములో బ్రహ్మముహూర్తములో స్నానంచేయాలి” అని చెప్పాడు వ్యాసుడు. దంతధావన యోగ్యమైన చెట్లపుల్లలతో పళ్ళు తోముకోమని చెప్పాడు. సూర్యోస్థానసంధ్య ప్రతీదినమూ చేసితీరాలని చెప్పాడు. సంధ్యావందనం చేయనిదే పూజాదానవ్రత విధానములు అన్ని నిష్ఫలమవుతాయి.
యద్దదాతి యదశ్నాతి తదేవ ధనినా ధనమ్|
అన్యే మృతస్థ క్రీడంతి దారాఇరపి ధనైరపి||
వంటివి ‘వ్యాసస్మృతి’లోని శ్లోకరత్నాలకు మచ్చుతునకలు.
23. ధనం రెండే రకాలుగా ఉన్నది. నీవు అనుభవించింది, దానం చేసింది. ఈ రెండూ కాకపోతే, మూడోదొకటి. అది వినాశనం. అది నశిస్తుంది. భోగం, దానం, నాశనం అనే మూడేస్థితులు ధనానికి. ఎంత అనుభవిస్తే అంత తరిగిపోతుంది. ఇవాళ అన్నం ఉంది, అది తిన్నాం. అదే మన ధనం. ఎవరికనా ఇచ్చాం. అదే మన ధనం. ఎవరికయినా ఇచ్చిందే మన ధనం. అదే నిజానికి మనం దాచుకున్న ధనం. దాచుకున్నది మాత్రం నశించవచ్చు. అంతేకాదు, ధనం నశ్వరం. దారాధనములన్నీ కూడా శాశ్వతం కాదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
18 Jan 2021
No comments:
Post a Comment