భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 151


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 151 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 30 🌻

🌷. ఐక్య అస్తిత్వము - సత్య గోళం - 3 🌷

601.తజల్లి--ఎల్--జలాలీ:---


ఈ స్థితి ఒక ఆత్మకు నిర్వాణ అనుభవము నిచ్చును."తజల్లీ-ఎల్-జమాలీ" ఆతనికి మరియొక సారి సాధారణ చైతన్యమును ప్రసాదించును. దీనిని సూఫీలు "బకా" అందురు. ఇచ్చట భగవంతుడు ప్రియతముడు, మానవుడు ప్రేమికుడు; తజల్లి-ఎల్-జమాలీ లో భగవంతుడే ప్రేమికుడు; మానవుడు ప్రియుడు.

602.సాధారణముక్తి :--

ఈ ముక్తి మరణాంతరము శరీరము లేకుండా 3 నుండి 5 రోజులలోగా లభించు ముక్తి. భగవంతునియందు భయము, సత్యప్రేమికులు, సజ్జనులు మొదలగు ఎవరికో కొలదిమందికి మాత్రమే లభించును.

ఈ ముక్తిని పొందిన ప్రత్యగాత్మ, అనంత జ్ఞానము, అనంతశక్తియు అచ్చట యున్ననూ ఆనందమును మాత్రమే అనుభవించుచు దానియందే ఎరుక కలిగి యుండును.ఇతనికి సృష్టి లేదు.జనన-మరణముల సంసారచక్రము తిరుగుట నిలిచి పోయినది.

"అహంబ్రహ్మాస్మి" స్థితి యొక్క గాని ద్వైతముయొక్క గాని చైతన్యము లేదు.సృష్టిలో కర్తవ్యము (అధికారము) లేదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


18 Jan 2021

No comments:

Post a Comment