విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 236, 237 / Vishnu Sahasranama Contemplation - 236, 237
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 236 / Vishnu Sahasranama Contemplation - 236 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻236. సుప్రసాదః, सुप्रसादः, Suprasādaḥ🌻
ఓం సుప్రసాదాయ నమః | ॐ सुप्रसादाय नमः | OM Suprasādāya namaḥ
సుప్రసాదః, सुप्रसादः, Suprasādaḥ
అపకారవతాం శిశుపాలాదీనామపి మోక్ష ప్రదాతృత్వాత్ శోభనః ప్రసాదః యస్య అపకారులగు శిశుపాలాదులకు సైతము మోక్షప్రదుడగుటవలన శోభనము, శుభకరము అగు ప్రసాదము, దయ ఎవనికి కలదో అట్టివాడు.
:: పోతన భాగవతము దశమ స్కంధము, ఉత్తరభాగము ::
క. కమలాక్షుని నిందించిన, దమఘోషతనూభవుండు దారుణ మల కూ
పమునుం బొందక యే క్రియ, సుమహితమతిఁ గృష్ణునందుఁ జొచ్చే మునీంద్రా! (797)
వ. అనిన శుకయోగి రాజయోగి కిట్లనియె. (798)
మ. మధుదైత్యాంతకుమీఁది మత్సరమునన్ మత్తిల్లి జన్మత్రయా
వధియే ప్రొద్దుఁ దదీయ రూపగుణ దివ్యధ్యానపారీణ ధీ
నిధి యౌటన్ శిశుపాల భూవిభుఁడు తా నిర్ధూత సర్వాఘుఁడై
విధిరుద్రాదుల కందరాని పదవిన్ వే పొందె నుర్వీశ్వరా! (799)
ఓ మునీంద్రా! శ్రీకృష్ణుణ్ణి నిందించిన శిశుపాలుడు భయంకర నరకకూపంలో పడకుండా భగవంతుడైన కృష్ణునిలో ఏ విధంగా ప్రవేశించాడో వివరించు.
ఈ విధంగా ప్రశ్నించిన మహారాజుతో మహర్షి ఇలా అన్నాడు - 'ఓ రాజేంద్రా! మధుసూదనుని మీది మాత్సర్యంతో మదోన్మత్తుడై మూడు జన్మలనుండీ ముకుందుని నిందిస్తూ, ఎల్లప్పుడూ విష్ణుదేవుని రూప గుణాలను ధ్యానిస్తూ వుండడంవల్ల శిశుపాలుడు సమస్త పాపాలనుంచి విముక్తుడై బ్రహ్మరుద్రాదులకు సైతం అందరాని పదవిని పొందాడు.'
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 236🌹
📚. Prasad Bharadwaj
🌻236. Suprasādaḥ🌻
OM Suprasādāya namaḥ
Apakāravatāṃ śiśupālādīnāmapi mokṣa pradātr̥tvāt śobhanaḥ prasādaḥ yasya / अपकारवतां शिशुपालादीनामपि मोक्ष प्रदातृत्वात् शोभनः प्रसादः यस्य One whose prasāda or mercy is uniquely wonderful because He bestows salvation even on those like Śiśupāla and others who tried to harm Him.
Śrīmad Bhāgavata - Canto 10, Part II, Chapter 74
Janmatrayānuguṇita vairasaṃrabdhayā dhiyā,
Dhyāyaṃstanmayatāṃ yāto bhāvo hi bhavakāraṇam. (46)
:: श्रीमद्भागवते दशमस्कन्धे उत्तरार्धे चतुःसप्ततितमोऽध्यायः ::
जन्मत्रयानुगुणित वैरसंरब्धया धिया ।
ध्यायंस्तन्मयतां यातो भावो हि भवकारणम् ॥ ४६ ॥
Obsessed with hatred of Lord Kṛṣṇa throughout three lifetimes, Śiśupāla attained the Lord's transcendental nature. Indeed, one's consciousness determines one's future birth.
O lifter of the earth, the earth with its mountains, which You have lifted with Your tusks, is situated as beautifully as a lotus flower with leaves sustained by an infuriated elephant just coming out of the water.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 237 / Vishnu Sahasranama Contemplation - 237🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻237. ప్రసన్నాత్మః, प्रसन्नात्मः, Prasannātmaḥ🌻
ఓం ప్రసన్నాత్మనే నమః | ॐ प्रसन्नात्मने नमः | OM Prasannātmane namaḥ
ప్రసన్నాత్మాః, प्रसन्नात्माः, Prasannātmāḥ
ప్రసన్నః ఆత్మా రజస్తమోభ్యాం అకలుషితం అంతఃకరణం యస్య రజస్తమోగుణములచే కలుషితము కాని అంతః కరణము అనగా ప్రసన్నమగు ఆత్మ ఈతనికి కలదు. లేదా ప్రసన్నః ఆత్మా కరుణార్ద్రః స్వభావః అస్య విద్యతే కరూణార్ద్రమగు స్వభావము ఇతనికి కలదు. లేదా నిర్మలమగు స్వభావము ఇతనికి కలదు. కరుణాశాలి అనియే అర్థము. లేదా అవాప్త సకల కాముడు - పొందబడిన అన్ని కోరికల ఫలములును కలవాడూ, పొందవలసిన ఏ కోరిక ఫలములును లేనివాడును కావున రాగము మొదలగునవి లేని నిర్మలమగు ఆత్మ కలవాడు.
:: శ్రీమద్భగవద్గీత - మోక్షసన్న్యాసయోగము ::
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి ।
సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ॥ 54 ॥
బ్రహ్మైక్యము బొందినవాడు, నిర్మలమైన ప్రశాంతమైన మనస్సుగలవాడునగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు. దేనినీ కోరడు. సమస్త ప్రాణులందును సమబుద్ధిగలవాడై వానిని తనవలెనే చూచుకొనుచు నాయందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 237🌹
📚. Prasad Bharadwaj
🌻237. Prasannātmaḥ🌻
OM Prasannātmane namaḥ
Prasannaḥ ātmā rajastamobhyāṃ akaluṣitaṃ aṃtaḥkaraṇaṃ yasya / प्रसन्नः आत्मा रजस्तमोभ्यां अकलुषितं अंतःकरणं यस्य One whose mind is never contaminated by Rājas or Tamas. Prasannaḥ ātmā karuṇārdraḥ svabhāvaḥ asya vidyate / प्रसन्नः आत्मा करुणार्द्रः स्वभावः अस्य विद्यते Or One who is extremely merciful by nature. Or One who is ever satisfied as has realized all His desires.
Śrīmad Bhagavad Gīta - Chapter 18
Brahmabhūtaḥ prasannātmā na śocati na kāṃkṣati,
Samassarveṣu bhūteṣu madbhaktiṃ labhate parām. (54)
:: श्रीमद्भगवद्गीत - मोक्षसन्न्यासयोग ::
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति ।
समस्सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥ ५४ ॥
By becoming engrossed in Brahman, calm souled, neither lamenting nor craving, beholding equality in all beings - he gains supreme devotion towards Me.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
18 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment