శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 183 / Sri Lalitha Chaitanya Vijnanam - 183
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 183 / Sri Lalitha Chaitanya Vijnanam - 183 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖
🌻 183. 'నిష్పరిగ్రహా'🌻
పరిగ్రహమను గుణము లేనిది శ్రీమాత అని అర్థము.
పరిపూర్ణులకేమి కావలయును? కావున గ్రహించుట కేమియూ లేనిది శ్రీమాత. ఇచ్చుట, పుచ్చుకొనుట కర్మల రూపమున జీవులను నిర్విరామముగా ఆడించు చుండును. పరిపూర్ణుడు కానివాడు గ్రహించును. పుచ్చుకొనును. పుచ్చుకొను వాడున్నప్పుడు ఇచ్చువాడు ఉండును. ప్రతిజీవి యందు ఇచ్చుట, పుచ్చుకొనుట జరుగుచు నుండును.
కుండ నిండుగ నీరున్నపుడు, ఆ కుండ ఇక నీరు పుచ్చుకొనడు. లోటు లేని చోట పుచ్చుకొనుట యండడు. జీవులయందు అపరిపూర్ణత యుండుటచే, పుచ్చుకొను భావమేర్పడును. పుచ్చుకొనుటకు కోరిక కలుగును. సృష్టి ధర్మములను పరిశీలించినచో, పుచ్చుకొనుట నేర్చినటి పరిపూర్ణత పొందలేమని, యిచ్చుట నేర్చినచో పరిపూర్ణత దిశగా సాగుదుమని తెలియును.
ఇచ్చుచుండుట వలననే సూర్యుడు సూర్య మండలమునకు అధిపతియై యున్నాడు. అన్ని గ్రహములూ అతని చుట్టునూ తిరుగుచునున్నవి. పుచ్చుకొనుటవలన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుచు నున్నాడు. చంద్రునివలె మానవ మనస్సులు కూడ పదార్థమయమైన విషయములను కోరుచూ, తిరుగాడు చుండును.
మనసు ప్రధానముగ కాక బుద్ధి ప్రధానముగ జీవించినచో, బుధునివలె సూర్యుని చుట్టును తిరుగ వచ్చును. దీనినే 'యజ్ఞార్థ జీవన'మందురు. అట్టి జీవనము గావించు యోగులు అపరిగ్రహమను దీక్షను పూనుదురు. ఈ దీక్ష నాచరించుటవలన శ్రీమాతవలె శాశ్వత పరిపూర్ణులై యుండగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 183 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Niṣparigrahā निष्परिग्रहा (183) 🌻
She does not get anything in return for the actions She perform. This is in conformity of interpretation of the previous nāma. This nāma says that She performs actions (creation, sustenance and dissolution).
The point driven home in the previous nāma is that She does not get involved in Her actions. When She is without actions (even any one of the actions), the universe ceases to exist.
For doing such actions, She does not get anything in return. The appropriate interpretation would be that She does not expect Her devotees to perform ritual worship by offering flowers, food, etc thinking that they are expressing their gratitude to Her.
This nāma reiterates that ritual worship, at the most could only be a stepping stone towards Self-realization. If one is stranded here, it is obvious that he cannot reach Her.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
18 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment