సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 8

Image result for madame blavatsky secret doctrine
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 8 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 


🍃. సౌర మండలము 🍃

253. 'విశ్వం' మొత్తం అనేక సౌర మండలాలతో నిర్మించబడింది. ఒక సౌర మండలాన్ని గూర్చి తెలుసుకొంటే, పెరుగుదల తరుగుదలలో తప్ప మిగిలిన వాటిలో పెద్ద మార్పు ఉండదు. అపుడు విశ్వం మొత్తాన్ని గురించి తెలుసుకొన్నట్లే అవుతుంది.

254. సౌర కుటుంబ పరిమాణ క్రమము ప్రకృతి యొక్క ఏడు తలాలలో జరుగుతుంది. 1) ఆది స్పందనలు 2)అనుపాదక 3) ఆత్మ 4) బుద్ది 5) మనస్సు 6) కామము 7) స్థూల ప్రపంచము అందలి ప్రాణులు.

255. 1) సత్యలోకము:- ఆది అనగా 'సత్‌'
2) తపోలోకము:- అనుపాదకత - 'చిత్‌'
3) జనాలోకము:- ఆనంద స్థితి - 'ఆత్మ'
4) మహర్‌లోకము:- వివేకము - 'బుద్ది'
5) స్వర్గ లోకము:- రూపరహితము - 'మనస్సు'
6) భువర్లోకము:- కోరికలు - 'కామము'
7) భూలోకము:- 'అతి స్థూల స్థితి'

256. పంచభూతములు:-
1. ఆకాశము - ఆనందమయ కోశము
2. వాయువు - విజ్ఞానమయ కోశము
3. అగ్ని - మనోమయ కోశము
4. జలము - ప్రాణమయ కోశము
5. భూమి - అన్నమయ కోశము.

257. 7 గ్రహాలతో కూడిన లెక్కలేనన్ని ప్రపంచ గోళాలు విశ్వములో రూపొందినవి.

258. ప్రపంచ నిర్మాణములో క్రింది తలాలలోని 4 లోకాలు స్థూల, కామ, మనో, బుద్ది స్థితులలో వికాసము చెందాయి.

259. పై మూడు స్థాయిలు అనగా ఆత్మ, అనుపాదకత, ఆదిలోకాల వికాసము మనకు తెలియని స్థితిలో ఉంటుంది.

260. 7 గ్రహాములలో మనము నివసించే భూమి అత్యధిక భౌతిక తత్వము కలిగి ఇంద్రియాలకు కనిపించేటట్లు ఉండగా మిగిలిన 6 గ్రహాలు దృగ్గోచరము కాని దూర తలాలలో ఉంటాయి.

261. మనకు 'భూమి' వలె బుదుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని మొదలగు గ్రహాలు కంటికి కనిపిస్తున్నాయి. కారణము ఇవి ఒకే తలములో అనగా ఇదే సూర్య కుటుంబములోని గ్రహాలు. మిగిలినవి ఉచ్చస్థాయిలోని ఇతర గ్రహాలు, మన భౌతిక ఇంద్రియాలకు అందుబాటులో లేవు. కాని వాటి ప్రభావము మనలోని ఏడు స్వభావాలపై ఉంటుంది.

262. ప్రతి గ్రహ కుటుంబములోనూ ఉన్న ఒక గ్రహము దాని కంటే సూక్ష్మ కణాలు గల సహచర గ్రహము, దాని పై లోకాలలో ఉంటుంది.

263. ఈ సహచర గ్రహాలు వేరే చోట్లో స్థలమును ఆక్రమించవు. ఒక గ్రహాము ఆకాశములో ఏ స్థలాన్ని ఆక్రమిస్తుందో అదే స్థలములో తక్కిన సహచర గ్రహములు వాటి స్పందన, అవధిని బట్టి విస్తరించి ఉంటాయి. ప్రతి ఉచ్చ స్థాయిలో ఉన్న గ్రహము క్రింది స్థాయిలోని గ్రహములను తనలో ఇముడ్చుకుంటుంది. ఉదాహరణకు:- సూక్ష్మలోకములోని ఆత్మలు (దయ్యాలు) భూలోకములో స్వేచ్చగా సరచరించగలుగుతాయి. భూమి మీద పదార్థము వాటి చలనానికి అడ్డంకి కాదు. అవి మన ఇంటి గోడలు, తలుపులోంచి కూడా ప్రయాణించగలవు. కారణము పదార్థము పంచభూతాలతో నిర్మించబడగా సూక్షలోక జీవులు (దయ్యాలు) 3 భూతములే కలిగి ఉంటాయి. (అగ్ని, వాయువు, ఆకాశము). అలానే గ్రహాలు ఒకే ప్రదేశములో తమ క్రింది తలాలలో సంచరించగలుగుతాయి. మనం కలలుకనే టపుడు మన శరీరము స్థూల స్థితిలో అచటనే ఉంటుంది. కాని మన సూక్ష్మ శరీరము సూక్ష్మలోకములో విహరించగల్గుతుంది.

264. మన శరీరములో 5 భూతాలు వున్నాయి. భౌతికముగా కనిపిస్తున్న ఈ శరీరములో నీరు, అగ్ని, వాయువు, ఆకాశము కూడా ఉన్నవి కదా! అలానే ఆకాశములో అణువులు, పరిమాణువులు కలాపములు, అష్టకలాపములు, ఆత్మ, పరమాత్మ కూడా ఈ శరీరములోనే ఉన్నవి కదా! అనగా ఈ శరీరము మొత్తములో 26 తత్వాలు ఇమిడి ఉన్నాయి.

265. ఊర్ధ్వలోకాలున్నట్లే, మన శరీరములో అధో లోకాలు కూడా ఉన్నాయి.

ఊర్ధ్వలోకాలు అధో లోకాలు
1. సత్యలోకము పాతాళలోకము
2. తపోలోకము మహాతలము
3. జనలోకము తలాతలము
4. మహర్లోకము రసాతలము
5. సువర్లోకము సుతలము
6. భువర్లోకము వితలము
7. భూలోకము అతలము

266. భూగోళములో గల పాతాళ లోకములో శేషుడు చుట్టలు చుట్టుకొని వ్యాపించి ఉండును. అదే క్షీరసాగరములో నారాయణుడు శేష తల్పముపై యోగ నిద్రలో ఉండి లోకపాలన చేస్తుంటాడు. అలానే ఉప్పు సముద్రము, సురా సముద్రము, నేతి సముద్రము మొదలగునవి. 

267. సాధారణముగా ఒక సూర్య కుటుంబములో 7 గ్రహములు వున్నా, వాటిలో ఒకటి మాత్రమే సక్రియగా ఉండి మిగిలినవి నిద్రాణ స్థితిలో ఉంటాయి. మొదట ఒక గ్రహము జాగృతమైన తన పరిధిలో జీవిత పరిణామానికి తన వంతు పని పూర్తి చేస్తుంది. అది లయమవుతుంది. తరువాత రెండవ గ్రహానికి తన చైతన్యాన్ని అందజేసి అది చైతన్యమగుటకు తోడ్పడుతుంది. అలానే రెండవది తన పని పూర్తిచేసి మూడవ గ్రహానికి ఇలా ఒక్కొక్కపుడు ఒక్కొక్క గ్రహము మాత్రమే చైతన్య వంతమై మిగిలినవి నిద్రాణ స్థితిలో ఉంటాయి.

268. మనం యోగ సాధన చేసేటపుడు మొదట మన భౌతిక శరీరము చైతన్యవంతమై అది మనలోని జలతత్వాన్ని మేల్కొపుతుంది. అపుడు జలతత్వము చైతన్యవంతమై అగ్నితత్వాన్ని అలాగే వాయువు ఆకాశ తత్వాలు ఒకదాని తరువాత ఒకటి చైతన్య మవుతాయి. ఆకాశములోని అణువులు చైతన్యవంతమైన తరువాత అవి పరమాణువులను, క్రమముగా కలాపములు, అష్ట కలాపములను చైతన్యవంతము చేసి చివరికి తమతమ చైతన్యములను బ్రహ్మములో విలీనము చేయును. అదియే మోక్షము.

269. మొదటి మూడు స్థాయిలు ఆత్మ స్థాయి శృంఖలాలలో పూర్తి భౌతిక స్థాయిని సాధించి తదుపరి ఆత్మ స్థాయికి చేరుకుంటుంది

270. ఆత్మ '0' '0'
బుద్ది '1' 7
అరూప '2' '6'
సరూప '3' '5'
కామ '4'
స్థూల శరీరము

271. పైవాటిలో '1', '7' ఆత్మ పదార్థము.
|| '2', '6' బుద్ది పదార్థము.
|| '3', '5' అరూప మనోపదార్థము
|| '4' సరూప పదార్థము
ఈవిధముగా 7 గ్రహాలు ఏర్పడతాయి.

272. ఆత్మ స్థితిలో మొదలై శృంఖలాలు క్రమముగా మార్పు చెందుతూ చివరికి ఆత్మ స్థితిలోకి చేరవలసిందే. అని గ్రహించాలి.

273. ఒకటి నుండి ఐదు తలములలో బుద్ధి, మనస్సు, కామ, స్థూల మొత్తం 49 గ్రహకాలములలో 24 గ్రహములలో మానసిక స్థాయిలో వికాసము క్రమముగా జరుగుతుంది. ఈ మనోమయ తలము రెండు భాగములుగా విభజింపబడింది.

274. 7 గ్రహాల కాలము ఒక పరిభ్రమణము. 49 గ్రహాల కాలము 49 పరిభ్రమణములు.

275. మొదటి మూడు శృంఖలలో ఆత్మ లేక జీవితము పదార్థములోని క్రిందికి దిగుతుంది. ఈ కాలములో పదార్థము మీద తన ఆధిక్యతను చూపిస్తుంది.

276. నాల్గవ శృంఖలలో ఆత్మ - పదార్థము సంతులనము చెంది అనేక రకాలుగా విభిన్న రూపాలు ధరిస్తుంది. ప్రతి మానవ శరీరములో ఇది జరుగుట గమనించాలి.

277. చివరి మూడు శృంఖలాలలో 5, 6, 7 ఆత్మ ఆరోహణ మార్గములో తన ఆధిక్యతను పదార్థము మీద స్థాపించుకుంటుంది.

278. ఇటువంటి 10 పరిణామ క్రమ పధకాలు ఒక సౌరకుటుంబాన్ని నిర్మిస్తాయి.

279. ఒక పరిణామ క్రమములో 49 గ్రహాలు ఉన్న 7 గ్రహాలు మాత్రమే సక్రియగా ఉంటాయి.

280. మన ప్రస్తుత సౌరకుటుంబములో 10 పరిణామ క్రమ పధకాలు వాటికి భౌతిక స్థాయిలో ఉన్న గ్రహాలు.
1. వల్కస్‌ 2. శుక్ర 3. పృధ్వీ 4. గురు 5. శని 6. యురేనస్‌ 7. నెఫ్టూన్‌
మొత్తం సౌరకుటుంబమును తన పరిణామ క్రమములో 70 గ్రహాలతో కలిపి చూస్తే ఒక విచ్చుకున్న పద్మము వలె కనిపిస్తుంది.

281. ప్రకృతిలో నాల్గవ స్థాయిలో నాగరికత, జ్ఞానము అతి ఉచ్ఛస్థితిలో ఉన్నది. మానవ జాతి రెండు విపరీత దిశలలో విభజింపబడింది. 1) సవ్యమార్గము, 2) అపసవ్య మార్గము.

282. అధోస్థితిలో ఉన్న గ్రహాలు ఉచ్ఛస్థితికి, ఉచ్ఛస్థితిలోని గ్రహాలు అధోస్థితికి మారుతూనే ఉన్నాయి.

283. శబ్దము ఆకాశము యొక్క లక్షణము. అది వాయువును సృష్టిస్తుంది. దాని లక్షణము స్పర్శ. అది ఘర్షణ వల్ల కాంతిని, రంగును సృష్టిస్తుంది. అదే అగ్ని. అగ్ని చల్లబడి నీరుగా నీరు ఇంకా చల్లబడి పదార్థముగా, అలా పంచభూతాలు ఏర్పడినాయి.

284. మనము ప్రస్తుతము నాల్గవ స్థితిలో నాల్గవ పరిభ్రమణములో ఉన్నాము. తరువాత ఇంకా మూడు పరిభ్రమణలు సాధించాలి. ఆ స్థితిలో భూత, భవిషత్తు, వర్తమాన కాలాలను తెలుసుకొంటారు. 5వ స్థితిలో అచట గల యోగికి 6,7వ స్థితిల్లోకి చేరగల స్థితి లభిస్తుంది. అప్పటికి ఈ మన్వంతరము పూర్తవుతుంది.

285. ఒకే మహా గురువు యొక్క ఆధ్వర్యములో అనేక మంది గురువులు, శిక్షకులు మానవ జాతికి మార్గదర్శకులయ్యారు. మహాగురువు స్వయముగా పొందవలసినది ఏమీలేదు. అయినప్పటికి తాను ఎన్నుకోబడ్డ కొందరికి సహాయపడుటకు 'మహాయజ్ఞము' ఈ మన్వంతరము వరకు కొనసాగించవలసి ఉంటుంది. మహా గురువుకు ఈ మూడు లోకాలలో చేయవలసింది, తనకు చెందినది, ఆసించునది ఏదీలేదు. అయినప్పటికి తాను ఎల్లప్పడు కర్మ ఆచరిస్తూనే ఉంటాడు.

286. ఈ విశ్వములో మానవ శరీరం కంటే పవిత్రమైన, సాధన పూర్వకమైన స్వరూపము ఇంకొకటి లేదు. దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment