🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 7 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃. ఆరవ స్థితి 🍃
231. ఆరవ స్థితి ప్రపంచ నిర్మాణము యొక్క తదుపరి స్థాయిలను పరిణామ క్రమములో ప్రపంచం తన నాల్గవ కాలానికి ఎలా వచ్చిందో తెలుపును. మనము ప్రస్తుతమున్న కాలాన్ని ఇది వివరిస్తుంది.
232. కరుణ, జ్ఞానము అనే తల్లి యొక్క శక్తి వల్ల బ్రహ్మ శక్తి ఉద్భవిస్తుంది. అనగా తల్లి, తండ్రి, కూతురు వారి వంశాంకురముల యొక్క శ్వాస, వారి పుత్రులను అనంత లోయలలో నుండి బయటకు పిలిచి, మన ప్రపంచపు భౌతిక స్వరూపాన్ని తయారుచేస్తారు. ప్రపంచపు మాయను, స్వరూపాన్ని, 7 భూతములను తయారు చేస్తారు.
233. వాక్ శక్తి పేరుతో వాక్ వైఖరీ, మధ్యమ, పశ్యంతి, పరా స్థితిలో ఉంటుంది. ఈ నాలుగు తత్త్వాలు విశ్వములోని నాలుగు తత్త్వాలతో సరిపోతాయి.
234. దృశ్యమాన విశ్వము పరబ్రహ్మము యొక్క వైఖరి వాక్కు. సూక్ష్మ జాగత్తులో ఇది పరబ్రహ్మం యొక్క కాంతిలో ఉంటుంది. ఇది ప్రపంచము యొక్క మధ్యమ వాక్కు, శబ్ధ రూపము. పరబ్రహ్మం పశ్యంతి అయితే పరబ్రహ్మం విశ్వం యొక్క పరిస్థితి. 'Cosmos' అనే పదానికి అర్థం దివ్య చేతనత్వము గల శక్తి అని గుర్తించాలి (అదే విష్ణువు).
235. వేగంగా చలించే కాంతి గలవాడు 7 లయ కేంద్రాలను ఉత్పత్తి చేస్తాడు. 7 లయ కేంద్రాలు, 7 శూన్య బిందువులుగా అనుకోవచ్చు. 'Cosmos' అనేక అర్థాలు వున్న రహస్య వాదుల ప్రకారము జీవితము నియమము అను రెండు కూడా 'Cosmos' యొక్క దిశా నిర్దేశములో ఉంటాయి.
236. మౌలిక విత్తనాలు సృష్ట్యారంభములో లయ స్థితిలో ఉన్నపుడు, తాను గతించిన భౌతిక జగత్తులో ఉన్నపుడు జీవాత్మ యొక్క అనేక జన్మల అతి తీవ్ర విషయములను విమర్శనాత్మక దృష్టితో పరిశీలిస్తుంది. ప్రపంచములో తనకున్న అనేక సంబంధ బాంధవ్యాలను, విశ్వ ప్రణాళికకు ఎలా ఉపయోగించుకోవాలో గమనిస్తుంది.
237. మొదట లయ స్థితి నుండి శక్తి బహిర్గతమైనపుడు అది అరూప స్థితిలో ఉండును. అనగా 'ం' స్థితిలో ఉంటుంది. తరువాత ఆ అరూప స్థితి రెండుగా విడిపోయి శక్తి బహిర్గతమవుతుంది.
238. అటు తరువాత మూడవ శక్తి '2' నుండి '4' గా విడిపోయి క్రమముగా '8' '16' ఈ విధంగా శివత్వము నుండి శక్తి ప్రవాహము వ్యాపించి క్రమముగా 7 లోకాలలో అక్కడ అవసరమైన మూల కణాలు నిర్మితమవుతాయి. ముడి సరుకు తయారవుతుంది. అపుడు ఆత్మ మరుగున పడుతుంది.
239. ఈ విధముగా భూతములు సృష్టింపబడి వాటికి నాయకుడిగా భూతనాధుడు ఉపాసింపబడతాడు.
240. పై విధముగా నిర్మింపబడిన ముడి పదార్థాలతో రెండవ శక్తి ప్రవాహమైన మనస్సు ఏర్పడి మాయను కలుగజేస్తుంది.
241. విష్ణు తత్వము మూడవ శక్తిగా అన్ని తత్వాలలో నిర్మాణ దేవతలకు తోడ్పడి సృష్టికి దోహదము చేస్తుంది. అపుడే మత్య, కూర్మ, వరాహ అవతారములు, సముద్ర మదనము జరుగుతుంది. తదుపరి శివ శక్తి రూపొంది, ఖనిజములు భూమిగా వ్యక్తమవుతుంది. ఖనిజములు వాటి సంయోగ వియోగము ద్వారా 'క2ం' హైడ్రోజన్, ఆక్సిజను సంయోగము ద్వారా నీరు, అలానే ఆ కలయికలు విడిపోవుట ద్వారా వృక్ష జగత్తు రూపొందింది. ఈ వృక్షములలో ప్రాణము
242. వృక్ష జగత్తు నుండి ఇంకొక మెట్టు ఎదిగి జంతు జగత్తు ఏర్పడింది. వృక్షములు స్థావరములు. అనగా ఉన్న చోట నుండి కదలని స్థితి. జంతువులు అలా కాక భౌతిక శరీరము అదుపులోనికి వచ్చి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగిన స్థితి. మానసిక అభివృద్ధి కొంచెం కొంచెము నేర్చుకొంటుంది. ఎఱుక స్థితి. అభివృద్ధి పర్చుకొంటుంది.
243. మానవ జగత్తులో అన్నమయ కోశము ఏర్పడి ఉచ్చ స్థితి నుండి నీచ స్థితిలోనికి స్పందనలకు మరియు మనోమయ జగత్తులో కూడా స్పందనలు రూపొంది, ఆ స్థితిలో కారణ శరీరములతో పునర్జన్మము తీసుకోగలిగే స్థాయిలో అహంకారము ఏర్పడుతుంది. క్రమముగా మానవ జన్మలో శక్తి ధార దిగువ స్థాయికి, అచటి నుండి పై స్థాయికి కూడా ఎదగగల బుద్ధితో కూడిన మనస్సు రూపొందింది.
244. కోరికలతో(కామ) కూడిన మానవుడు దిగువ స్థాయిలోను; ఆలోచనలు కోరికలు లేని స్థితిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంశాలతో కూడిన పుత్రుడు దత్తాత్రేయ అవతారము ఈ స్థితి వల్ల ఏర్పడింది. అందుకు ప్రతి రూపముగా 'సాయి' తత్వము ప్రచారములోకి వచ్చింది. శ్రీ శంకరులు, సక్రియ సాధన ద్వారా; శ్రీ అరవిందులు నిష్ట్రియ సాధన ద్వారా, రామకృష్ణ పరమ హంస సకల దేవతా శక్తులను సాధన చేసి అతి సమీపముగా అందుబాటులో ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చాడు.
245. వివేకానంద ఇంకా ఉన్నత స్థాయికి చేరి అద్వైత ప్రతిపాదన చేస్తూ, కర్మ యోగానికి ప్రాధాన్యత నిచ్చి 'మానవ సేవే మాధవ సేవ' అనే మార్గము తెలియజేసాడు.
246. అటు తరువాత స్వామి దయానంద సరస్వతి గాయత్రి తరంగాల ద్వారా అగ్నిని ఉపయోగించి సంపూర్ణ మానసిక స్థలాన్ని మార్చే ప్రయత్నాలు చేసారు.
247. గాయత్రి మంత్రోపాసకులు గాయత్రి ఉపాసన ద్వారా విశ్వ కుండలి జాగృత పర్చి క్రిందికి దింపారు. తదుపరి 'సాయి' పద్దతిలోని 'ధుని', 'భస్మం' కూడా అదే విధముగా అగ్ని స్పర్శ పొందిన పదార్థములు. కనుకనే 'సాయి' విభూది రోగ నివారణకు ఉపయోగపడుతుంది.
248. ఈ విధముగా గురువులందరు వారి వారి స్థాయిలలో, ఆ నాటి దేశ కాల పరిస్థితులకు అనుగుణముగా మిగిలిన వారి ప్రయత్నాలకు తోడ్పడినారు.
249. శిష్యులు వారివారి గురువుల స్వభావమునకు అనుగుణముగా నడుచుకుంటూ, ఏ కార్యాన్ని చేపట్టినా గుడ్డిగా అనుసరించకుండా తమ సాధనలో ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారో లేదో గమనిస్తుండాలి.
250. నేడు 'human race' అందరి గురువుల పనిని అర్థం చేసుకొని శక్తిని పొంది, గురువుల కార్యక్రమములకు చేయూత నివ్వగలిగే స్థాయికి చేరింది.
251. సృష్టిలో గడ్డిపోచలో జీవిస్తున్న మిణుగురు పురుగైన, సూర్యునికైన పుట్టటము, పెరగటము, గిట్టడము ఒకే నియమము ప్రకారము జరుగుతాయి. పదార్థము శక్తులు మారవు. పరిపూర్ణత వైపుకు సాగే ప్రయత్నము ప్రతి కొత్త అవతారము లోనూ జరుగుతుంది.
252. మహా ప్రళయములో విభజన వున్న ప్రతిదీ గడ్డిపోచ నుండి దేవతల వరకు పూర్తిగా కొట్టుకు పోయారు. ఒకటే మిగిలింది. ఒక రాబోయే స్థితిలో మన పృధ్వి యొక్క పరిణామ క్రమము, మన 'గుప్త విద్యలో ' తెలుపబడుతుంది. ఇది ఆధునికులకు విచిత్రంగా అనిపించినా తెలుసుకొవలసినదే
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment