🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 220 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దేవుడు సమగ్రుడయితే మనమూ సమగ్రులమే. కాబట్టి సమగ్రంగా మారాలన్న మాటే అసంబద్ధం. సమగ్రంగా మారాల్సిన పన్లేదు. ప్రతి మనిషి జన్మతోనే సమగ్రుడు. కానీ మనం ఆ సమగ్రతలో సంపూర్ణంగా జీవించం. 🍀
ఎవరిలోనూ అసమగ్రత లేదు. అందువల్ల ఎవరూ సమగ్రంగా వుండవలసిన అవసరం లేదు. నీకు కావలిసినదల్లా నీ జీవితాన్ని సమగ్రంగా జీవించడం. అక్కడ అప్పటికే సమగ్రత ఉంది. మనం సమగ్రత నించే వచ్చాం. అందువల్ల మనం సమగ్రతగా మారాల్సిన పన్లేదు. మనం కేవలం నుంచీ పుట్టాం. మనం దేవుడనే సముద్రంలో కెరటం. దేవుడి లక్షణమేదో కెరటాల లక్షణం కూడా అదే. దేవుడు సమగ్రుడయితే మనమూ సమగ్రులమే. కాబట్టి సమగ్రంగా మారాలన్న మాటే అసంబద్ధం. సమగ్రంగా మారాల్సిన పన్లేదు. ప్రతి మనిషి జన్మతోనే సమగ్రుడు. కానీ మనం ఆ సమగ్రతలో సంపూర్ణంగా జీవించం.
మనం కొంత భాగమే జీవిస్తాం. మన శక్తిని పూర్తిగా వుపయోగించం. కొద్ది భాగమే వుపయోగిస్తాం. మనం మన శక్తిలో ఏడు శాతం మాత్రమే ఉపయోగిస్తామని శాస్త్రవేత్తలు అంటారు. తొంభయి మూడు శాతం వ్యర్థమవుతుంది. అదక్కడ వుంది. దాన్ని వుపయోగించం. వందశాతం జీవిస్తే వందశాతం రూపాంతరం సంభవం. కాబట్టి నా ప్రయత్న మీరు జీవితాన్ని గాఢంగా అనుభవించాలి. ప్రతిక్షణాన్ని పరిపూర్ణంగా అనుభవించేందుకు సహకరించడం. అప్పుడు మీలో ఏదో వికసిస్తుంది. రేకుల్ని విప్పుకుంటుంది. అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నిన్ను నువ్వు గ్రహిస్తావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
04 Aug 2022
No comments:
Post a Comment