1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 04, ఆగస్టు 2022 గురువారం, బృహస్పతి వాసరే Thursday🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 242 / Bhagavad-Gita - 242 -6-09 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 641 / Vishnu Sahasranama Contemplation - 641 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 320 / DAILY WISDOM - 320 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 220 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹04, August 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : తులసిదాసు జయంతి, Tulsidas Jayanti🌻*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 5 🍀*
*5. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం*
*దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀.
నేటి సూక్తి : ఇంద్రధనుస్సులోని ఏడింటి వర్ణముల వలె మేళవించి ఒకే
పరమానుబంధం భగవానునితో నీవు కల్పించు కోగలిగితే, అద్వైతుల మోక్షసుఖాన్ని
సైతం నీవు అతిక్రమించ గలవు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: శుక్ల-సప్తమి 29:07:16 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: చిత్ర 18:48:24 వరకు
తదుపరి స్వాతి
యోగం: సద్య 16:34:39 వరకు
తదుపరి శుభ
కరణం: గార 17:23:48 వరకు
వర్జ్యం: 02:32:40 - 04:10:12
మరియు 24:21:40 - 25:57:00
దుర్ముహూర్తం: 10:13:27 - 11:04:55
మరియు 15:22:12 - 16:13:40
రాహు కాలం: 13:58:35 - 15:35:04
గుళిక కాలం: 09:09:08 - 10:45:37
యమ గండం: 05:56:10 - 07:32:39
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 12:17:52 - 13:55:24
సూర్యోదయం: 05:56:10
సూర్యాస్తమయం: 18:48:02
చంద్రోదయం: 11:18:04
చంద్రాస్తమయం: 23:14:07
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కన్య
చర యోగం - దుర్వార్త శ్రవణం 18:48:24
వరకు తదుపరి స్థిర యోగం - శుభాశుభ
మిశ్రమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 242 / Bhagavad-Gita - 242 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 09 🌴*
*09. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబన్దుషు |*
*సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ||*
🌷. తాత్పర్యం :
*శ్రేయోభిలాషులను,
ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించువారలను,
శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ది
నొందినవానిగా పరిగణింపబడును.*
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 242 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 09 🌴*
*09. suhṛn-mitrāry-udāsīna- madhyastha-dveṣya-bandhuṣu*
*sādhuṣv api ca pāpeṣu sama-buddhir viśiṣyate*
🌷 Translation :
*A
person is considered still further advanced when he regards honest
well-wishers, affectionate benefactors, the neutral, mediators, the
envious, friends and enemies, the pious and the sinners all with an
equal mind.*
🌹 Purport :
----
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 641/ Vishnu Sahasranama Contemplation - 641🌹*
*🌻641. అమితవిక్రమః, अमितविक्रमः, Amitavikramaḥ🌻*
*ఓం అమితవిక్రమాయ నమః | ॐ अमितविक्रमाय नमः | OM Amitavikramāya namaḥ*
*అమితోఽతులితో యస్య విక్రమస్స జనార్ధనః ।*
*అవిహింసిత విక్రమోఽమిత్ విక్రమ ఈర్యతే ॥*
*పరిమితము
కాని అమితము అయిన విక్రమము, శక్తి లేదా పాదన్యాసము గలవాడు అమితవిక్రమః.
లేదా ఎవరి చేతను బాధించ బడనిదియగు విక్రమము కలవాడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 641🌹*
*🌻641. Amitavikramaḥ🌻*
*OM Amitavikramāya namaḥ*
अमितोऽतुलितो यस्य विक्रमस्स जनार्धनः ।
अविहिंसित विक्रमोऽमित् विक्रम ईर्यते ॥
*Amito’tulito yasya vikramassa janārdhanaḥ,*
*Avihiṃsita vikramo’mit vikrama īryate.*
*The One with unlimited, incomparable valor. Or He whose valor has not been impaired is Amitavikramaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥
అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 320 / DAILY WISDOM - 320 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 15. గురువు యొక్క ఆవశ్యకత 🌻*
*ప్రతి
సాధకునికి తప్పనిసరిగా గురువు ఉండాలి. పూర్తిగా స్వతంత్ర ప్రయాణం సాధ్యం
కాదు. గురువు లేనిదే మీరు విమానాన్ని కూడా నడపలేరు, ఎక్కడో తప్పు చేస్తారు.
ప్రతి దానికీ గురువు అవసరం. ముఖ్యంగా భవిష్యత్తు మనకు పూర్తిగా తెలియని ఈ
మార్గంలో గురువు చాలా అవసరం. మనం ప్రయాణించే మార్గం ఏంటో మనకు తెలీదు.
మున్ముందు ఏముందో తెలీదు.*
*కాబట్టి, గురువు
యొక్క మార్గద్శకత్వమే మనకు రక్ష. మీకు సమర్ధుడైన గురువు దొరికినప్పుడు,
మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రతిరోజు గురువు దగ్గరకు వెళ్లి ప్రశ్నలు
వేయాలని కాదు, కానీ ఏదైనా విషయం, మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ మిమ్మల్ని
చాలా ఇబ్బందికి గురి చేస్తున్నప్పుడు, దానిని మాత్రమే మీ గురువుకి
విన్నవించుకోవాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 320 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻 15. The Necessity for a Guru 🌻*
*Every
student must have a Guru. Totally independent marching is not possible.
You cannot even pilot an airplane of your own accord without training
under some Guru; otherwise, somewhere wrong you will go. For everything a
Guru is necessary. A teacher is absolutely essential, especially in
this path where the future is totally unknown to us. We are passing
through some track, of which we have no idea at all, and we do not know
what is ahead of us.*
*And so, we have to be
guarded by the caution of the Guru only, and when you have got a
competent Guru, you should have no problems. It is not that every day
you should go to the Guru and put questions, but whenever you have a
difficulty which is genuine, poignant, and eating your vitals
practically, and you are in distress, at that time only you can tell him
that this is the difficulty.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 220 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀.
దేవుడు సమగ్రుడయితే మనమూ సమగ్రులమే. కాబట్టి సమగ్రంగా మారాలన్న మాటే
అసంబద్ధం. సమగ్రంగా మారాల్సిన పన్లేదు. ప్రతి మనిషి జన్మతోనే సమగ్రుడు.
కానీ మనం ఆ సమగ్రతలో సంపూర్ణంగా జీవించం. 🍀*
*ఎవరిలోనూ
అసమగ్రత లేదు. అందువల్ల ఎవరూ సమగ్రంగా వుండవలసిన అవసరం లేదు. నీకు
కావలిసినదల్లా నీ జీవితాన్ని సమగ్రంగా జీవించడం. అక్కడ అప్పటికే సమగ్రత
ఉంది. మనం సమగ్రత నించే వచ్చాం. అందువల్ల మనం సమగ్రతగా మారాల్సిన పన్లేదు.
మనం కేవలం నుంచీ పుట్టాం. మనం దేవుడనే సముద్రంలో కెరటం. దేవుడి లక్షణమేదో
కెరటాల లక్షణం కూడా అదే. దేవుడు సమగ్రుడయితే మనమూ సమగ్రులమే. కాబట్టి
సమగ్రంగా మారాలన్న మాటే అసంబద్ధం. సమగ్రంగా మారాల్సిన పన్లేదు. ప్రతి మనిషి
జన్మతోనే సమగ్రుడు. కానీ మనం ఆ సమగ్రతలో సంపూర్ణంగా జీవించం.*
*మనం
కొంత భాగమే జీవిస్తాం. మన శక్తిని పూర్తిగా వుపయోగించం. కొద్ది భాగమే
వుపయోగిస్తాం. మనం మన శక్తిలో ఏడు శాతం మాత్రమే ఉపయోగిస్తామని
శాస్త్రవేత్తలు అంటారు. తొంభయి మూడు శాతం వ్యర్థమవుతుంది. అదక్కడ వుంది.
దాన్ని వుపయోగించం. వందశాతం జీవిస్తే వందశాతం రూపాంతరం సంభవం. కాబట్టి నా
ప్రయత్న మీరు జీవితాన్ని గాఢంగా అనుభవించాలి. ప్రతిక్షణాన్ని పరిపూర్ణంగా
అనుభవించేందుకు సహకరించడం. అప్పుడు మీలో ఏదో వికసిస్తుంది. రేకుల్ని
విప్పుకుంటుంది. అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నిన్ను నువ్వు
గ్రహిస్తావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment